
అసలే చలికాలం. వేకువజామున మంచు కురుస్తూ గజగజ వణికిస్తోంది. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రత రోజురోజుకూ పడిపోతోంది. ఇంతటి చలిలోనూ విద్యార్థులు చన్నీటి స్నానం చేస్తూ అవస్థలు పడుతున్నారు. జిల్లా కేంద్రం ఆదిలాబాద్‌లోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న గిరిజన సంక్షేమ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో ఒకే నల్లా ఉంది. ఈ నల్లా వద్ద శుక్రవారం ఉదయం పదుల సంఖ్యలో విద్యార్థులు చలిలో స్నానాలు చేస్తూ కనిపించారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment