tribal welfare residential school
-
చన్నీటి స్నానం.. చిన్నారుల దైన్యం
అసలే చలికాలం. వేకువజామున మంచు కురుస్తూ గజగజ వణికిస్తోంది. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రత రోజురోజుకూ పడిపోతోంది. ఇంతటి చలిలోనూ విద్యార్థులు చన్నీటి స్నానం చేస్తూ అవస్థలు పడుతున్నారు. జిల్లా కేంద్రం ఆదిలాబాద్‌లోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న గిరిజన సంక్షేమ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో ఒకే నల్లా ఉంది. ఈ నల్లా వద్ద శుక్రవారం ఉదయం పదుల సంఖ్యలో విద్యార్థులు చలిలో స్నానాలు చేస్తూ కనిపించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
తల్లైన తొమ్మిదో తరగతి విద్యార్థిని.. బిడ్డతో కలిపి ఆమెను..
సాక్షి, బొబ్బిలి(విజయనగరం): బొబ్బిలి పట్టణంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక గురువారం రాత్రి మగబిడ్డకు జన్మనిచ్చినట్టు తెలిసింది. దీనిపై గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పాఠశాలకు శుక్రవారం వచ్చి ఆరా తీసినట్టు సమాచారం. విద్యార్థిని ప్రసవించేంత వరకూ ఆమె కదలికలు, శరీరాకృతిని సిబ్బంది గుర్తించలేకపోవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బిడ్డతో కలిపి బాలికను కొమరాడ మండలంలోని స్వగ్రామానికి ఆటోలో పంపించినట్టు భోగట్టా. ఈ విషయాన్ని ఆశ్రమ పాఠశాల పీడీ ఎస్బీఎస్ రత్నం వద్ద ప్రస్తావించగా అలాంటిదేమీ లేదని చెప్పారు. వసతి గృహంలో హాజరు పట్టీని, విద్యార్థినులను విచారించి శనివారం చెప్పగలనన్నారు. -
తిరియాటి.. సదవాటి.. రాసాటి!
కేంజాతి (వినండి).. తిరియాటి (మాట్లాడండి).. సదవాటి (చదవండి).. రాసాటి (రాయండి).. లిపిలేని కోయ భాషలోని పదాలివి. ప్రాథమిక పాఠశాలల్లో చేరే గిరిజన విద్యార్థులకు మాతృభాషలో తప్ప తెలుగు, ఇతర భాషల్లో ఏ మాత్రం ప్రావీణ్యం ఉండదు. దీంతో వారికి విద్యాబోధన ప్రతిబంధకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో గిరిజన గూడేల్లోని అడవి బిడ్డలకు వారి మాతృభాష ఆధారిత బహుళ భాషా విద్యాబోధనను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వశిక్షా అభియాన్ ద్వారా ఇకపై గిరిజన పాఠశాలల్లో కోయ భాషలోని పదాలను తెలుగు అక్షరాలతో రాసేలా బోధన చేస్తూ.. లిపి లేని ఆ భాషలకు ఊపిరి పోయాలని సంకల్పించింది. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: కొండకోనల్లో అంతరించిపోతున్న అరుదైన కోయ భాషలకు రాష్ట్ర ప్రభుత్వం ఊపిరిలూదుతోంది. లిపి కూడా లేని వివిధ కోయ భాషలకు తెలుగులోనే అక్షర రూపం ఇచ్చి.. గిరిపుత్రులకు విద్యాబుద్ధులు నేర్పే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సహజంగా గిరిజన తండాల్లో మూడొంతుల మంది గిరిజనులకు మాతృభాష తప్ప మరో భాష రాదు. ఈ కారణంగా వారు విద్యకు దూరమై సమాజంలో వెనుకబాటుకు గురవుతున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటకు తీసుకువచ్చి, వారి జీవితాల్లో విద్యా సుగంధాలు నింపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గిరిజనులు మాతృభాషను కొనసాగిస్తూనే తెలుగు భాషను అభ్యసించేలా వినూత్న ఆలోచనకు కార్యరూపం ఇచ్చి వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దేలా కార్యక్రమాన్ని చేపట్టింది. 6 భాషలు.. 920 పాఠశాలల్లో అమలు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో 8 జిల్లాల్లోని 920 పాఠశాలల్లో ఆరు రకాల కోయ భాషల్లో అమలు చేయనున్నారు. ఈ విధానాన్ని ‘కోయ భారతి’ పేరిట ఉభయ గోదావరి జిల్లాల్లో ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రారంభించారు. అయితే, గత పాలకులకు దీనిపై చిత్తశుద్ధి లేకపోవడంతో ఏడాది తిరగకుండానే ‘కోయ భారతి’ కార్యక్రమం అటకెక్కింది. అయితే, ప్రస్తుత ప్రభుత్వం గిరిజనులకు వారి మాతృభాషలో తెలుగును సులువైన విధానంలో అలవాటు చేసేందుకు ప్రత్యేకంగా పాఠ్య పుస్తకాలు రూపొందించింది. తొలి దశలో ఒకటి నుంచి మూడో తరగతి వరకూ గిరిజన విద్యార్థుల కోసం ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ప్రారంభించింది. పాఠ్య పుస్తకాలు, మెటీరియల్‌ను గిరిజన భాషలోనే రూపొందించి పంపిణీ చేసింది. చింతూరు మండలం చట్టి పాఠశాలలో కోయ భాషలో పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయుడు ఉభయ గోదావరి జిల్లాల్లో (కోయ), శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో (సవర), విశాఖపట్నం జిల్లాలో (కొండ, కువి, ఆదివాసీ), కర్నూలు, అనంతపురం జిల్లాల్లో (సుగాలి) భాషలకు అనుగుణంగా ప్రత్యేక పాఠ్య పుస్తకాలను తీసుకొచ్చింది. సర్వశిక్షా అభియాన్ సూచనల మేరకు ఐటీడీఏల్లో ఆరు భాషలపై పట్టున్న నిపుణుల తోడ్పాటు తీసుకున్నారు. వారి ఆలోచనల మేరకు 1 నుంచి 3వ తరగతి వరకూ తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం పుస్తకాలను సిద్ధం చేశారు. రూ.60 లక్షల వ్యయంతో పాఠ్యాంశాలు రూపొందించారు. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా 920 పాఠశాలల్లో 18,795 మంది గిరిజన విద్యార్థులకు తెలుగు, ఇతర సబ్జెక్టులను గిరిజన భాషలోనే బోధిస్తారు. ఇందుకోసం గిరిజన ఉపాధ్యాయులతో పాటు వారు లేనిచోట ఆ భాషపై కాస్తోకూస్తో పట్టున్న విద్యా వలంటీర్లను నియమించి, శిక్షణ ఇచ్చి నియామక పత్రాలు అందజేశారు. యవ్వ.. ఇయ్య భాషలోనే.. కోయ భాషలో అమ్మను యవ్వ అని.. నాన్నను ఇయ్య అంటారు. అన్నను దాదా.. అక్కను యక్క అంటారు. చెట్టును మరం అని.. ఈగను వీసి అని.. కోడి పుంజును గొగ్గోడు అని.. పిల్లిని వెరకాడు అని పిలుస్తారు. కూడికేకు (కూడిక), తీసివేతాకు (తీసివేత), బెచ్చోటి (ఎంత పరిమాణం), దోడ తిత్తినే (అన్నం తిన్నావా), బాత్ కుసిరి (ఏం కూర), దెమ్ము (పడుకో), ఏరు వాట (నీరు ఇవ్వు, పెట్టు), మీ పెదేరు బాత (నీ పేరు ఏమిటి) వంటి పదాలు ఇకపై గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఈ పదాలు వాడుకలోకి రానున్నాయి. ప్రాథమిక విద్యార్థులకు వారు మాట్లాడే మాతృ భాషలోనే బోధన చేయడం వల్ల వారిలో అభ్యసన స్థాయిని పెంచడంతోపాటు వారి భాష, సంస్కృతి, సంప్రదాయాలను చెక్కు చెదరకుండా కాపాడాలనేది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. ఇతర భాషలపై పట్టు సాధించేందుకే.. ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధించడమనేది ఇతర భాషలపై పట్టు సాధించేందుకు ఎంతో దోహదపడుతుంది. తొలి దశలో ఒకటి నుంచి మూడో తరగతి వరకూ తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం పుస్తకాలను రూపొందించారు. మాతృభాషలో బోధన వలన డ్రాపౌట్లు కూడా తగ్గుతాయి. – ఆకుల వెంకటరమణ, పీవో, ఐటీడీఏ, చింతూరు మాతృభాషా బోధన మంచి నిర్ణయం మాతృభాషలో బోధనకు ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక స్థాయిలో గిరిజన విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అక్షరం ముక్కలు రాక అన్ని రకాలుగా వెనుకబాటుకు గురవుతున్న గిరిజనులకు ఇది సువర్ణావకాశమనే చెప్పాలి. – ముర్రం దూలయ్య, ఉపాధ్యాయుడు, జీపీఎస్ పాఠశాల, చట్టి, చింతూరు మండలం కోయభాషలో బోధన ఎంతో అవసరం కొత్తగా పాఠశాలలకు వెళ్లే పిల్లలకు వాడుకలో ఉన్న కోయభాషలో బోధన ఎంతో అవసరం. ఇతర భాషలు నేర్చుకోవాలంటే వాళ్లు ఇబ్బంది పడుతున్నారు. కోయభాషలో పాఠాలు చెబుతుంటే మా పిల్లలకు సులువుగా అర్థమవుతుంది. కోయభాషతో పాటు తెలుగులో కూడా చెబుతుండటం బాగుంది. – తుర్రం బాయమ్మ, గిరిజన విద్యార్థి తల్లి, చింతూరు -
ఆదిమ జాతి బిడ్డలకు అక్షరయోగం
సాక్షి, అమరావతి: వారెప్పుడు పుట్టారో తెలీదు. ఎందుకంటే వారికి పుట్టిన తేదీ ధృవపత్రం లేదు. జనాభా లెక్కల్లో ఉన్నారు. కానీ ఆధార్ కార్డు లేక పాఠశాల అడ్మిషన్ దక్కని దుస్థితి వారిది. గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం నెల్లూరు జిల్లాలోని గిరిజన గూడెంలలో పర్యటించిన అధికారులను విస్తుపోయేలా చేసిన విషయాలివి. ఆదిమ జాతుల బిడ్డలకు అక్షర యోగం కల్పించాలనే మహోన్నత యజ్ఞాన్ని చేపట్టిన ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థకు చెందిన ప్రత్యేక బృందాలు శని, ఆదివారాలు నెల్లూరు జిల్లాలో పర్యటించాయి. రెండు రోజులపాటు సోమశిల, బుచ్చిరెడ్డిపాలెం, కావలి, సర్వేపల్లి, చేజర్లలోని యానాది (ఎస్టీ) గూడెంలను సందర్శించి అక్కడి పిల్లలు, వారి తల్లిదండ్రులు, కుల పెద్దలతో సమావేశాలు నిర్వహించాయి. పిల్లల్ని బడిలో చేర్పించేలా వారికి అవగాహన కల్పించాయి. క్షేత్రస్థాయి పరిశీలన అత్యంత వెనుకబడిన గిరిజన తెగలు (పీవీటీజీ)కి చెందిన పిల్లల్ని బడిలో చేర్పించడం ద్వారా గిరిజన గురుకుల పాఠశాలల్లో 100 శాతం అడ్మిషన్లు సాధించేందుకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమానికి నెల్లూరు జిల్లా నుంచి శ్రీకారం చుట్టారు. నేరుగా రంగంలోకి దిగిన ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి కె.శ్రీకాంత్ ప్రభాకర్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. పలు తండాలు, గూడెంలలోని పిల్లలకు కనీసం ఆధార్, పుట్టిన తేదీ ధృవపత్రాలు లేక గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లకు అవరోధం కలగడాన్ని గుర్తించారు. దీంతో ఆధార్ కార్డు నమోదు, పుట్టిన రోజు, కుల ధృవపత్రాలు ఇప్పించి గురుకులాల్లో చేర్పించే చర్యలు చేపట్టారు. అత్యంత వెనుకబడిన యానాది, చెంచు, కొండరెడ్డి, గోండు తదితర ఆదిమ జాతి పిల్లలను గురుకులాల బాట పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. 10 పీవీజీటీలు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో గురుకుల పాఠశాలలు, కళాశాలలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు, మినీ గురుకుల పాఠశాలలు మొత్తం 199 ఉన్నాయి. వాటిలో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు విద్యా బోధన జరుగుతోంది. దాదాపు 32 తెగలకు చెందిన 67 వేల మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు చెబుతున్నారు. కాగా, వాటిలో 10 గురుకుల పాఠశాలలు అత్యంత వెనుకబడిన ఆదిమ జాతి గిరిజన తెగలు (పీవీటీజీ) పిల్లలకు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మల్లి, విజయనగరం జిల్లా భద్రగిరి, విశాఖ అరకు, తూర్పుగోదావరిలో మారేడుమిల్లి, చింతూరు, గుంటూరులో నాగార్జునసాగర్, ప్రకాశంలో యర్రగొండపాలెం, నెల్లూరులో చిట్టేడు, సోమశిల, కర్నూలులో మహానందిలలో ప్రత్యేక గురుకుల పాఠశాలలున్నాయి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ఒక్కో పాఠశాలలో 640 సీట్లకు గానూ నేటివరకూ 120 నుంచి 130 సీట్లు కూడా భర్తీ కావటం లేదు. 100 శాతం సీట్ల భర్తీయే లక్ష్యం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో చదువుల విప్లవం తెచ్చారు. చదువులను ప్రోత్సహించేలా నాడు–నేడు వంటి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఆగష్టు 14 నాటికి 100 శాతం అడ్మిషన్లు సాధించడం కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాం. ఇందుకోసం ప్రత్యేక బృందాలు గిరిజన తండాలు, గూడెంలలో పర్యటిస్తున్నాయి. జగనన్న విద్యా కానుక కిట్లు, అమ్మ ఒడి, కాస్మొటిక్ కిట్లు తదితర ప్రోత్సాహకాల గురించి అక్కడి వారికి వివరిస్తున్నాం. గురుకులాల్లో విద్యతోపాటు నైపుణ్యాభివృద్ధి, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, స్వీయ రక్షణకు శిక్షణ, యోగా, అటల్ థింకరింగ్ ల్యాబ్‌లు వంటి కార్యక్రమాల గురించి అవగాహన కల్పించి పిల్లల్ని బడికి పంపేలా ప్రోత్సహిస్తున్నాం. – కె. శ్రీకాంత్ ప్రభాకర్,ఏపీ గిరిజన గురుకుల సంక్షేమ విద్యాలయాల సంస్థ కార్యదర్శి -
అడవి బిడ్డలకు అక్షర యజ్ఞం
సాక్షి, అమరావతి: అడవి బిడ్డల్లో అక్షరాస్యత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అక్షర యజ్ఞం చేస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం గిరిజనుల్లో నూరు శాతం అక్షరాస్యత సాధించేందుకు అడుగులు ముందుకు వేస్తోంది. విద్యకు ఎంత ఖర్చయినా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే పలుసార్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ద్వారా పలు కార్యక్రమాల్ని వేగవంతం చేసింది. రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 27,39,920 మంది గిరిజన జనాభా ఉన్నారు. వీరిలో ప్రస్తుతం 48.98% మాత్రమే అక్షరాస్యులు. వీరిలో అక్షరాస్యత పెంచేందుకు గిరిజన గ్రామాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా స్కూళ్లు, కాలేజీలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. రోడ్లు కూడా సరిగా లేని మారుమూల పల్లెల్లోనూ ఏకోపాధ్యాయ పాఠశాలను నడుపుతోంది. ఇటీవలే మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల నిర్మాణాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. త్వరలోనే గిరిజన యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ► గిరిజన గ్రామాల్లో ప్రత్యేకంగా 2,678 విద్యాలయాలు ఉన్నాయి. వీటిల్లో 2,05,887 మంది విద్యార్థినీ విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. స్కూళ్లు, కాలేజీల్లో సకల సౌకర్యాలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. గిరిజన సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న 189 గిరిజన సంక్షేమ గురుకులాల్లోనూ తగిన వసతులు ఉన్నాయి. ► 184 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, 53 గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాలు కలిపి మొత్తం 237 పాఠశాలల్లో వృత్తి విద్యను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పాఠశాలల్లో 80,091 మంది చదువుతున్నారు. ఇందుకు అవసరమైన సామగ్రిని నైపుణ్యాభివృద్ధి సంస్థ సమకూర్చింది. ► జగనన్న విద్యా కానుక పథకం ద్వారా విద్యార్థులకు స్కూలు బ్యాగుతో పాటు పుస్తకాలు, దుస్తులు, బూట్లు వంటివి సమకూర్చింది. వీటిని ఇటీవలే విద్యార్థులకు ప్రభుత్వం పంపిణీ చేసింది. ఒక సెట్ బెడ్డింగ్ మెటీరియల్ సరఫరా చేసింది. హాస్టళ్లు, ఆశ్రమ స్కూళ్లకు ప్లేట్లు, గ్లాసులు, ట్రంకు పెట్టెలు అందజేశారు. ఇక హాస్టళ్లు, గురుకుల స్కూళ్లలో చదువుకునే వారికి కాస్మొటిక్ చార్జీలను ప్రభుత్వం ప్రత్యేకంగా ఇస్తోంది. -
బాత్రూమ్లో ముద్దు ఇవ్వాలని బెదిరింపు..
సాక్షి, ఆదిలాబాద్ : గిరిజన సంక్షేమ హాస్టల్ వార్డెన్‌ను విద్యార్థిని కుటుంబ సభ్యులు సోమవారం చితకబాదారు. బోథ్ హాస్టల్లో ఉంటున్న 10వ తరగతి విద్యార్థినిపై వార్డెన్ అసభ్యంగా ప్రవర్తించిన కారణంగా దాడికి దిగారు. బాత్రూమ్లోకి వచ్చి ముద్దు ఇవ్వాలని విద్యార్థినిని హాస్టల్ వార్డెన్ బెదిరించాడు. ఈ క్రమంలో విద్యార్థిని కుటుంబ సభ్యులు బంధువులతో వచ్చి వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. అదే సమయంలో వార్డెన్ అటువైపు రావడంతో ఒక్కసారిగా విద్యార్థిని బంధువులు అతనిపై దాడి చేయడంతో వార్డెన్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
‘విద్యార్థుల ప్రగతే టీచర్లకు అవార్డులు’
సాక్షి, విజయవాడ: ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా ఉత్తమ ఉపాధ్యాయులను గురువారం ఏపీ ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి సన్మానించారు. ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ లెక్చరర్ల సుదీర్ఘ సమస్యను పరిష్కరించి ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించిన సందర్బంగా మంత్రి శ్రీవాణిని జూనియర్ కళాశాలల అధ్యాపకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి గిరిజన విద్యా సంస్థల్లో వర్చువల్ క్లాస్ రూములను, కేంద్రీకృత సీసీ కెమెరాల వ్యవస్థను ప్రారంభించారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 105 గిరిజన విద్యాసంస్థల్లో వర్చువల్ క్లాస్ రూములు ప్రారంభమైయ్యాయి. విద్యకు, ఉపాధ్యాయులకు జగన్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. తొమ్మిది ప్రమాణాలకు అనుగుణంగా గిరిజన విద్యాసంస్థల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. పిల్లలు సాధించిన ప్రగతినే టీచర్లు తమ అవార్డులుగా భావించాలని, మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. -
మీరైతే ఇలాంటి భోజనం చేస్తారా?
నిరుపేదలు... మధ్యాహ్న భోజనం దొరుకుతుందనే ఆశతో సర్కారు బడులకు వెళ్తున్నవారు... ఉన్న ఊళ్లో ఉన్నత విద్య లేక చదువుకోసం పట్టణాల్లోని హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్నవారు... అధికారుల నిర్లక్ష్యంతో అవస్థలు పడుతున్నారు. ఓ వైపు రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్షేమ పాలన అందించాలని ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంటే... జిల్లాలోని కొందరు అధికారులు తమ చర్యలతో సర్కారుకు చెడ్డపేరు తీసుకువస్తున్నారు. పురుగులతో ఉన్న బియ్యం, పప్పు శుభ్రపరచకుండానే అలాగే వండేస్తూ పిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. ఆ భోజనం తినలేక ఎంతోమంది ఇళ్లకు వెళ్లిపోతున్నారు. గత సర్కారు నాణ్యతలేని సరకులు అందించడంతో వాటినే ఇంకా వినియోగిస్తూ పిల్లలపై తమ అక్కసు తీర్చుకుంటున్నారు. సాక్షి, విజయనగరం : జిల్లాలోని వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ, సాంఘిక సంక్షేమశాఖ, గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాల్లో 25,035 మంది విద్యార్థులున్నారు. నిజానికి జిల్లాలోని అనేక సంక్షేమ వసతి గృహాల్లోనూ, మధ్యాహ్న భోజన పథకంలోనూ విద్యార్థులకు పురుగులతో కూడిన అన్నమే పెడుతున్నారు. కొద్ది రోజులుగా జిల్లాలో మధ్యాహ్న భోజనం, వసతి గృహాల్లో భోజనం అధ్వానంగా ఉంటోంది. జిల్లాలో ఈ పరిస్థితి రావడానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. అప్పట్లో అవసరానికి మించి సరఫరా చేసిన నాణ్యత లేని బియ్యం, కందిపప్పునే ఇంకా వాడుతున్నారు. అవి పాడై పురుగులు పట్టాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆశయానికి తూట్లు పేదింట పుట్టి చదువుల కోసం ప్రభుత్వ పాఠశాలకు వెళుతూ, ఉన్నత విద్య కోసం సంక్షేమ హాస్టళ్లలో తలదాచుకుంటున్న విద్యార్థుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచిస్తోంది. హాస్టళ్లలో వసతుల కల్పనకు ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. అడిగిన వెంటనే నిధులు మంజూరు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించింది. హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేసి, అక్కడే రాత్రి నిద్రచేయాలని కూడా అధికారులను సీఎం ఆదేశించారు. కనీసం ఆ పనిచేసినా కొంతవరకైనా హాస్టళ్ల దుస్థితిలో మార్పు వచ్చుండేది. కానీ దీనిపై అధికారులు ఇంత వరకూ పూర్తి స్థాయిలో దృష్టిసారించలేదు. అవసరానికి మించి నాసిరకం సరకుల సరఫరా జిల్లాలోని 2,701 ప్రభుత్వ, ఎయిడెడ్, మోడల్ స్కూళ్లలో మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. 1,84,184 మంది విద్యార్థినీ విద్యార్థులు ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. ఒక్కో స్కూల్‌కు ఒక ఏజెన్సీ చొప్పున నిర్వహణ బాధ్యత అప్పగించారు. భోజన నిర్వాహక ఏజెన్సీలలో 5,024 మంది నిర్వహణ సిబ్బందికి ఉపాధి లభిస్తోంది. జిల్లాలో వీరి కోసం సరాసరిన నెలకు రూ. 3 కోట్ల వరకు నిధులు ఖర్చవుతోంది. పౌర సరఫరాల శాఖ ద్వారా మధ్యాహ్న భోజన నిర్వాహకులకు బియ్యం పంపణీ చేస్తున్నారు. గత ఏప్రిల్ వరకు పప్పు రాష్ట్ర స్థాయిలో ప్రైవేటు ఏజెన్సీ పంపిణీ చేసేది. విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి పాఠశాల స్థాయిలోని భోజన నిర్వాహక ఏజెన్సీలే పప్పును కొనుగోలు చేసి బిల్లు పెడుతున్నాయి. అప్పుడు ఇచ్చిన పప్పు నిల్వలే ఇంకా ఉన్నాయి. అవి పురుగులు పట్టాయి. దీంతో ఆ పప్పును వేడినీళ్లల్లో ఉడికించి ఎండబెట్టి భద్రపరిచి మరలా దానినే వండి పిల్లలకు పెడుతున్నారు. ఆ పప్పులో మళ్లీ పురుగులు పట్టేయడంతో పిల్లలకు పెట్టే భోజనంలో అవి కనిపిస్తున్నాయి. ప్రైవేటు ఏజెన్సీ నిర్వాకం విజయనగరం, డెంకాడ, నెల్లిమర్ల మండలాల పరిధిలోని 240 పాఠశాలలకు నెల్లిమర్ల క్లస్టర్‌గా ఏర్పరచి ప్రైవేటు ఏజెన్సీ ద్వారా భోజన పంపిణీ చేసే విధానాన్ని గత ఏడాది డిసెంబర్లో ప్రారంభించారు. మూడు మండలాలకు పంపిణీ చేయలేకపోవడం వల్ల కొద్ది రోజులకే డెంకాడ మండల పాఠశాలలకు మినహాయించారు. ప్రస్తుతం 189 స్కూళ్లలోని 21,703 మంది విద్యార్థులకు ప్రైవేటు సంస్థ భోజనం పంపిణీ చేస్తోంది. ఉదయమే వంట పూర్తి చేసి బాక్సుల్లో పెట్టి స్కూళ్లకు తరలిస్తుండటంవల్ల ఆ భోజనం పాడైపోయి వాసన వస్తూ తినలేని విధంగా మారుతోంది. పార్వతీపురంలో విద్యార్థుల ఆందోళన పార్వతీపురం: పార్వతీపురం గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహంలో పురుగుల అన్నం పెడుతున్నారంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మంగళవారం మధ్యాహ్నం అన్నంలో పురుగులు రావడంతో వారు నిరసన తెలియజేశారు. వంట చేసే సమయంలో బియ్యాన్ని కడగకుండా అన్నం ఎసరులో ఉన్నపళంగా పోయడంతో సుంకి పురుగులు అన్నంలో అధిక సంఖ్యలో కనిపించడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఎస్ఎఫ్ఐ సభ్యులు వసతి గృహం వద్దకు చేరుకుని వారికి మద్దతు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ జయంతి వసతి గృహాన్ని సందర్శంచి వంటకా లను పరిశీలించారు. అన్నంలో ఉన్న పురుగులను పరిశీలించారు. -
టీజీటీ నియామకాలు పూర్తి
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ) నియామకాల ప్రక్రియ పూర్తయింది. టీజీటీకి ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను గురుకుల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) వెబ్సైట్లో పొందుపర్చింది. ఇంగ్లిష్, తెలుగు సబ్జెక్టులకు సంబంధించి పక్షం క్రితమే తుది జాబితా విడుదల చేయగా.. గతవారం ఫిజికల్ సైన్స్, బయోసైన్స్ ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను వెబ్సైట్లో చేర్చింది. తాజాగా మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్ ఉద్యోగాలకు ఎంపికైన వారి వివరాలనూ వెబ్సైట్లో ఉంచింది. ఇప్పటికే నియమితులైన అర్హుల జాబితాలను సంబంధిత సొసై టీలకు పంపింది. ఆయా సొసైటీ కార్యదర్శులు పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి ఈనెల 10లోగా నియామక పత్రాలు అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ఇప్పటికి 960 టీజీటీ, 1,972 పీజీటీ పోస్టుల భర్తీ పూర్తయినట్లే. నెలాఖరులోగా డీఎల్, జేఎల్ భర్తీ గురుకుల కాలేజీల్లో జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ భర్తీ సైతం వేగవంతమైంది. గురుకుల నియామకాల బోర్డు ఇటీవలే 466 డిగ్రీ లెక్చరర్ల ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. వీరి ధ్రువపత్రాలు పరిశీలించాక తుది జాబితా ఖరారు చేయనుంది. వారంలోగా 281 జూనియర్ లెక్చరర్ల ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన వారి జాబితాను ఖరారు చేయనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ నెలాఖరుకి ఈ ప్రక్రియ పూర్తి చేయనుంది. దీంతో గురుకుల నియామకాల బోర్డుకు అప్పగించిన రిక్రూట్మెంట్ బాధ్యతలు పూర్తి కానున్నాయి. కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలంటే జోన్ల వ్యవస్థపై స్పష్టత రావాల్సి ఉంటుందని, పోస్టుల విభజన పూర్తయితేనే భర్తీ చేపట్టే వీలుందని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. -
విద్యార్థుల మధ్య ఘర్షణ.. నాలుగో తరగతి విద్యార్థి మృతి
సాక్షి, ఖమ్మం : ఇద్దరు విద్యార్థుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ ఓ విద్యార్థి ప్రాణం తీసింది. ఈ ఘటన ఖమ్మం ప్రభుత్వ గిరిజన పాఠశాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..గిరిజన పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థికి, అదే పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న జోసెఫ్‌కు మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన పదో తరగతి విద్యార్ధి మంగళవారం మధ్యాహ్నం జోసెఫ్‌ను కొట్టడంతో.. అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని మిగిలిన విద్యార్థులు హెడ్ మాస్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన దీనిపై పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. అలాగే ఈ ఘటనపై విచారణ చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు అక్కడికి చేరుకుని పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహించాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్ధుల మధ్య ఈ స్థాయిలో ఘర్షణ జరుగుతుంటే అధ్యాపకులు, సిబ్బంది ఎం చేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
కీచక టీచర్
ఏలూరు నడిబొడ్డున గల హాస్టల్లో ఓ విద్యార్థినిపై నైట్ వాచ్‌మన్ అత్యాచారానికి ఒడిగట్టి గర్భవతిని చేసిన విషయం మరువక ముందే గిరిజన ప్రాంతంలో అలాంటి అకృత్యమే వెలుగు చూసింది. వ్యాయూమ విద్య నేర్పించాల్సిన గురువే అన్నెంపున్నెం ఎరుగని విద్యార్థినిపై కన్నేశాడు. మాయమాటలతో ఆమెను చెరబట్టి గర్భవతిని చేశాడు. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి మాయమచ్చ తెచ్చాడు. విద్యార్థులకు ఏఎన్ఎం నెలవారీ పరీక్షలు నిర్వహించడంతో ఈ అఘాయిత్యం వెలుగులోకి రాగా, ఆ ఉపాధ్యాయుడు పలాయనం చిత్తగించాడు. బుట్టాయగూడెం, న్యూస్‌లైన్ : బుట్టాయగూడెం మండలం నూ తిరామన్నపాలెం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై అదే పాఠశాలలో వ్యాయూమ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కుంజా సోమరాజు కన్నేశాడు. ఉపాధ్యాయులంతా సమైక్యాంధ్ర ఉద్య మం కోసం సామూహిక సెలవులు పెట్టగా, సోమరాజు మాత్రం యథావిధిగా విధులకు హాజరయ్యూడు. ఓ రోజు ఆ బాలికకు మాయమాటలు చెప్పి ఆశ్రమ పాఠశాలలోని స్టోర్ రూమ్‌కు తీసుకెళ్లాడు. వ్యాయూమం అంటూ అన్నెంపున్నెం ఎరుగని ఆ మైనర్ బాలికపై కీచకపర్వానికి తెగబడ్డాడు. మండలంలోని అచ్చియ్యపాలెంకు చెందిన ఆ బాలిక రోజూ ఇంటినుంచి పాఠశాలకు వెళ్లొచ్చేది. తనకేం జరిగిందో కూడా తెలుసుకోలేని దుస్థితిలో ఆ బాలిక ఉండగా, నెలనెలా ఆశ్రమ పాఠశాల లోని విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించే ఏఎన్ఎం ఈనెల 12న అక్కడకు వెళ్లింది. అందరితోపాటు ఆ బాలికను కూడా పరీక్షించింది. బాలిక గర్భం ధరించినట్టు గుర్తించింది. ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయిoచగా, ఆమెకు 4నెలల 14 రోజులు నిండాయ ని వైద్యులు తేల్చారు. ఏఎన్ఎం ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎ.రంగరాజు దృష్టికి తీసుకెళ్లింది. ప్రధానోపాధ్యాయుడు ఆరా తీయగా, వ్యాయామ ఉపాధ్యాయుడే ఇందుకు కారణమని తేలింది. ఆలస్యంగా కళ్లు తెరిచిన అధికారులు ఈ విషయం ఆలస్యంగా బయటకు పొక్కడంతో అధికారులు రంగంలోకి దిగి మంగళవారం విచారణ చేపట్టా రు. తహసిల్దార్ ఎన్.నరసింహమూర్తి, బుట్టాయగూడెం ఏటీడబ్ల్యూవో విజయశాంతి, డీవైఈవో తిరుమలదాసు ఆశ్రమ పాఠశాలకు చేరుకుని ఏఎన్ఎంను, ఉపాధ్యాయులను, విద్యార్థులను విచారణ జరి పారు. ఈ దుర్ఘటనపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని చెప్పారు. ఇదిలావుండగా ఈ ఘటనపై మంగళవారం సాయంత్రం విద్యార్థిని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జంగారెడ్డిగూడెం సీఐ మురళీరామకృష్ణారావు ఇక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి పంపించారు. పరారీలో ఉపాధ్యాయుడు బాలిక గర్భం దాల్చిన విషయం తెలిసి వ్యాయూమ ఉపాధ్యాయుడు కుంజా సోమరాజు వారం రోజుల క్రితమే పరారయ్యూడని తెలిసింది. ఈనెల 12వ తేదీనే ఈ అఘారుుత్యం బయటపడినా.. ప్రధానోపాధ్యాయుడు, ఇతర ఉపాధ్యాయులు ఈ విషయూన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకపోవడం చర్చనీయూంశమైంది. బుట్టాయగూడెం మండలం కొవ్వాడ గ్రామానికి చెందిన సోమరాజు రెండేళ్ల క్రితం డీఎస్సీ ద్వారా వ్యాయూమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యూడు. అప్పటినుంచి నూతిరామన్నపాలెం ఆశ్రమ పాఠశాలలోనే పనిచేస్తున్నాడు. ఈ పాఠశాలలో బాలురకు మాత్రమే హాస్టల్ వసతి ఉండగా, ఇందులో చదివే బాలికలంతా రోజూ ఇంటినుంచే పాఠశాలకు వస్తుంటారు. నిందితుడి భార్య ఆత్మహత్యాయత్నం! నిందితుడు సోమరాజుకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తన భర్త ఓ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడని తెలిసి అతని భార్య పోల వరం మండలం ఇటటికలకోటలోని తన పుట్టింట్లో పురుగుమందు తాగి నట్లు ఇక్కడకు సమాచారం అందింది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. విద్యార్థుల ధర్నా కీచకపర్వానికి ఒడిగట్టున వ్యాయూమ ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులు మంగళవారం గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు. అంతకుముందు ఆశ్రమ పాఠశాల ఎదుట ధర్నా చేశారు. నిందితుణ్ణి తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఎస్ఎఫ్ఐ నాయకుడు భాస్కర్, పీడీఎస్‌యూ నాయకుడు ఎస్.రామ్మోహన్ డిమాండ్ చేశారు.