బాత్రూమ్‌లో ముద్దు ఇవ్వాలని బెదిరింపు.. | Hostel Warden Harassed Student In Bath | Sakshi
Sakshi News home page

బాత్రూమ్‌లో ముద్దు ఇవ్వాలని బెదిరింపు.. చివరికీ

Published Mon, Jan 6 2020 2:20 PM | Last Updated on Mon, Jan 6 2020 2:51 PM

Hostel Warden Harassed Student In Bath - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌ : గిరిజన సంక్షేమ హాస్టల్ వార్డెన్‌ను విద్యార్థిని కుటుంబ సభ్యులు సోమవారం చితకబాదారు. బోథ్‌ హాస్టల్‌లో ఉంటున్న 10వ తరగతి విద్యార్థినిపై వార్డెన్‌ అసభ్యంగా ప్రవర్తించిన కారణంగా దాడికి దిగారు. బాత్రూమ్‌లోకి వచ్చి ముద్దు ఇవ్వాలని విద్యార్థినిని హాస్టల్‌ వార్డెన్‌ బెదిరించాడు. ఈ క్రమంలో విద్యార్థిని కుటుంబ సభ్యులు బంధువులతో వచ్చి వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. అదే సమయంలో వార్డెన్‌ అటువైపు రావడంతో ఒక్కసారిగా విద్యార్థిని బంధువులు అతనిపై  దాడి చేయడంతో వార్డెన్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement