కీచక టీచర్ | she got pregnant due to her PET teacher | Sakshi
Sakshi News home page

కీచక టీచర్

Published Wed, Jan 22 2014 2:10 AM | Last Updated on Sat, Sep 2 2017 2:51 AM

she got pregnant due to her PET teacher

ఏలూరు నడిబొడ్డున గల హాస్టల్‌లో ఓ విద్యార్థినిపై నైట్ వాచ్‌మన్ అత్యాచారానికి ఒడిగట్టి గర్భవతిని చేసిన విషయం మరువక ముందే గిరిజన ప్రాంతంలో అలాంటి  అకృత్యమే వెలుగు చూసింది. వ్యాయూమ విద్య నేర్పించాల్సిన గురువే అన్నెంపున్నెం ఎరుగని విద్యార్థినిపై కన్నేశాడు. మాయమాటలతో ఆమెను చెరబట్టి గర్భవతిని చేశాడు.

పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి మాయమచ్చ తెచ్చాడు. విద్యార్థులకు ఏఎన్‌ఎం నెలవారీ పరీక్షలు నిర్వహించడంతో ఈ అఘాయిత్యం వెలుగులోకి రాగా, ఆ ఉపాధ్యాయుడు పలాయనం చిత్తగించాడు.
 
 బుట్టాయగూడెం, న్యూస్‌లైన్ : బుట్టాయగూడెం మండలం నూ తిరామన్నపాలెం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై అదే పాఠశాలలో వ్యాయూమ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కుంజా సోమరాజు కన్నేశాడు. ఉపాధ్యాయులంతా సమైక్యాంధ్ర ఉద్య మం కోసం సామూహిక సెలవులు పెట్టగా, సోమరాజు మాత్రం యథావిధిగా విధులకు హాజరయ్యూడు.

ఓ రోజు ఆ బాలికకు మాయమాటలు చెప్పి ఆశ్రమ పాఠశాలలోని స్టోర్ రూమ్‌కు తీసుకెళ్లాడు. వ్యాయూమం అంటూ అన్నెంపున్నెం ఎరుగని ఆ మైనర్ బాలికపై కీచకపర్వానికి తెగబడ్డాడు. మండలంలోని అచ్చియ్యపాలెంకు చెందిన ఆ బాలిక రోజూ ఇంటినుంచి పాఠశాలకు వెళ్లొచ్చేది. తనకేం జరిగిందో కూడా తెలుసుకోలేని దుస్థితిలో ఆ బాలిక ఉండగా, నెలనెలా ఆశ్రమ పాఠశాల లోని విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించే ఏఎన్‌ఎం ఈనెల 12న అక్కడకు వెళ్లింది.

అందరితోపాటు ఆ బాలికను కూడా పరీక్షించింది. బాలిక గర్భం ధరించినట్టు గుర్తించింది. ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయిoచగా, ఆమెకు 4నెలల 14 రోజులు నిండాయ ని వైద్యులు తేల్చారు. ఏఎన్‌ఎం ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎ.రంగరాజు దృష్టికి తీసుకెళ్లింది. ప్రధానోపాధ్యాయుడు ఆరా తీయగా, వ్యాయామ ఉపాధ్యాయుడే ఇందుకు కారణమని తేలింది.
 
 ఆలస్యంగా కళ్లు తెరిచిన అధికారులు
 ఈ విషయం ఆలస్యంగా బయటకు పొక్కడంతో అధికారులు రంగంలోకి దిగి మంగళవారం విచారణ చేపట్టా రు. తహసిల్దార్ ఎన్.నరసింహమూర్తి, బుట్టాయగూడెం ఏటీడబ్ల్యూవో విజయశాంతి, డీవైఈవో తిరుమలదాసు ఆశ్రమ పాఠశాలకు చేరుకుని ఏఎన్‌ఎంను, ఉపాధ్యాయులను, విద్యార్థులను విచారణ జరి పారు. ఈ దుర్ఘటనపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని చెప్పారు.

 ఇదిలావుండగా ఈ ఘటనపై మంగళవారం సాయంత్రం విద్యార్థిని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జంగారెడ్డిగూడెం సీఐ మురళీరామకృష్ణారావు ఇక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి పంపించారు.

 పరారీలో ఉపాధ్యాయుడు
 బాలిక గర్భం దాల్చిన విషయం తెలిసి వ్యాయూమ ఉపాధ్యాయుడు కుంజా సోమరాజు వారం రోజుల క్రితమే పరారయ్యూడని తెలిసింది. ఈనెల 12వ తేదీనే ఈ అఘారుుత్యం బయటపడినా.. ప్రధానోపాధ్యాయుడు, ఇతర ఉపాధ్యాయులు ఈ విషయూన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకపోవడం చర్చనీయూంశమైంది.

 బుట్టాయగూడెం మండలం కొవ్వాడ గ్రామానికి చెందిన సోమరాజు రెండేళ్ల క్రితం డీఎస్సీ ద్వారా వ్యాయూమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యూడు. అప్పటినుంచి నూతిరామన్నపాలెం ఆశ్రమ పాఠశాలలోనే పనిచేస్తున్నాడు. ఈ పాఠశాలలో బాలురకు మాత్రమే హాస్టల్ వసతి ఉండగా, ఇందులో చదివే బాలికలంతా రోజూ ఇంటినుంచే పాఠశాలకు వస్తుంటారు.

 నిందితుడి భార్య  ఆత్మహత్యాయత్నం!
 నిందితుడు సోమరాజుకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తన భర్త ఓ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడని తెలిసి అతని భార్య పోల వరం మండలం ఇటటికలకోటలోని తన పుట్టింట్లో పురుగుమందు తాగి నట్లు ఇక్కడకు సమాచారం అందింది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు.

 విద్యార్థుల ధర్నా
 కీచకపర్వానికి ఒడిగట్టున వ్యాయూమ ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులు మంగళవారం గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు. అంతకుముందు ఆశ్రమ పాఠశాల ఎదుట ధర్నా చేశారు.

 నిందితుణ్ణి తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు భాస్కర్, పీడీఎస్‌యూ నాయకుడు ఎస్.రామ్మోహన్ డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement