నీరు కరువు.. బతుకు బరువు
-కళావిహీనమైన శింగనమల చెరువు
జిల్లాలో కరువు కరాళనృత్యం చేస్తోంది. భూగర్భ జలాలు అడుగంటి బోరు బావులు ఎండిపోయి పంటలు మాడిపోతున్నాయి. ప్రకృతి ప్రకోపం, పాలకుల నిర్లక్ష్యం వెరసి జిల్లా కరువుకు చిరునామాగా మారింది. నీటి పంపిణీలోనూ స్వార్థ రాజకీయాలు చోటుచేసుకోవడంతో వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులు పంట నష్టాలతో హాహాకారాలు చేస్తున్నారు. జిల్లాలోని అతి పెద్ద చెరువుల్లో శింగనమల చెరువు రెండవది. దీని విస్తీర్ణం 2,600 ఎకరాలు.
చెరువులోకి నీరు చేరితో దాదాపు 14 గ్రామాల్లో పచ్చదనంతో కళకళలాడతాయి. అలాంటిది తీవ్ర వర్షాభావం కారణంగా చుక్కునీరు లేక చెరువు కళావీహీనంగా మారింది. చెరువుపై ఆధారపడి జీవిస్తున్న పక్షులు కూడా ఆహారం కోసం అల్లాడుతున్న దృశ్యాలు ప్రకృతి ప్రేమికులను ఆవేదనకు గురిచేస్తున్నాయి.
-ఫొటోలు: వీరేష్, సాక్షి ఫొటోగ్రాఫర్