సాక్షి, హైదరాబాద్: అహ్లాదపూరిత వాతావరణం.. రంగురంగుల పూలు.. ఆకర్షణీయమైన మొక్కల మధ్య వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ చేస్తూ ప్రజలు ఎంజాయ్ చేసేలా రాయదుర్గంలోని పురాతన మల్కం చెరువు ఇక పూర్తి స్థాయిలో సిద్ధమైంది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో సేద తీరేందుకు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్, హైదరాబాద్ నాలెడ్జిసిటీకి చేరువలో, పురాతన జాతీయ రహదారికి పక్కనే ‘రోడ్ సైడ్ లేక్’ కావడంతో మల్కంచెరువుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ సుందరీకరించారు. దీన్ని మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. ఆహ్లాదకరంగా పగలు.. విద్యుత్ వెలుగుల్లో రాత్రి వేళ ఈ చెరువు ప్రాంతం చూపరులను కట్టిపడేస్తోంది. (క్లిక్: మెడికల్ టూరిజానికి హబ్‌గా మారిన హైదరాబాద్)
Comments
Please login to add a commentAdd a comment