beautification
-
మూసీ ప్రక్షాళన.. కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి..?
-
మూసీ మురికి అంతా మీ నోట్లోనే: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో మూసీ సుందరీకరణ రాజకీయ మంటలు రేపుతోంది. సుందరీకరణ చేసి తీరుతామని అధికార కాంగ్రెస్ కుండబద్ధలు కొట్టి చెప్తుంటే.. పేద, మధ్య తరగతి ప్రజల ఇళ్లు కూల్చి ఎలా ముందుకు వెళ్తారో తాము చూస్తామంటూ విపక్ష బీఆర్ఎస్ సవాల్ విసురుతోందిఈ తరుణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మూసీ సుందరీకరణపై మరోసారి ట్వీట్ చేశారు. ‘మూసి మురికి అంతా వాళ్ల నోట్లోనే...ఇంకా శుద్ధి ఎందుకు.. లక్షన్నర కోట్లు ఖర్చు ఎందుకు? మంత్రికి లీగల్ నోటీసులు పంపాము.కాంగ్రెస్ అసహ్యకరమైన, విసుగు పుటించే రాజకీయాలు చేస్తోంది. మంత్రిని, సీఎంని మానసిక ఆరోగ్య నిపుణుడి వద్దకు లేదా రీహాబిటేషన్ సెంటర్లకు ట్రీట్మెంట్కు పంపించాలని రాహుల్ గాంధీకి అభ్యర్థన’ అంటూ కేటీఆర్ ట్విటర్లో పేర్కొన్నారు.మూసి మురికి అంతా వాళ్ల నోట్లోనే...ఇంకా శుద్ధి ఎందుకు.. లక్షన్నర కోట్లు ఖర్చు ఎందుకు? Served legal notices to the Minister; Disgusting & Nauseating politics by Congress Request @RahulGandhi to send your Minister & CM to a mental health specialist or a rehabilitation… pic.twitter.com/cL8AI1RqHk— KTR (@KTRBRS) October 2, 2024👉చదవండి : అక్కా.. ఎందుకీ దొంగ ఏడుపులు -
మూసీ సుందరీకరణకు రూ.60 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: మూసీ సుందరీకరణ ప్రాజెక్టు అంచనా వ్యయం అక్షరాలా రూ.60 వేల కోట్లు. దశల వారీగా మూసీని ప్రక్షాళన చేయాలని నిర్ణయించిన సర్కారు.. నది సుందరీకరణ, నిర్వహణ కోసం నిధుల సమీకరణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. 2050 మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా నది పరిసరాలను జోన్ల వారీగా విభజించి వాణిజ్య కార్యకలాపాలను అనుమతించడం ద్వారా నిధులను సమీకరించాలని భావిస్తోంది. దీనికి అనుగుణంగా మూసీ వెంట రవాణా కారిడార్లు, లాజిస్టిక్ హబ్‌లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. నదీ గర్భం నుంచి ఇరువైపులా కిలోమీటరు మేర ఇంపాక్ట్ ఏరియాగా ప్రకటించాలని సూత్రప్రాయంగా నిర్ణయించిన మూసీ సుందరీకరణ ప్రాజెక్టు యంత్రాంగం.. ఇప్పటికే నది హద్దులు, ఆక్రమణలపై ప్రాథమికంగా సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఆధారంగా జీఐఎస్ మ్యాపింగ్‌ను చేసింది. ఆక్రమణలే అడ్డంకి.. మూసీ రివర్ ఫ్రంట్‌ను పునరాభివృద్ధి చేయాలనే ఆలోచన తొలుత 1908లోనే వచ్చింది. 1990లో కాస్త ముందుకు కదిలినా.. పూర్తిస్థాయిలో పురోగతి సాధించలేదు. మురుగునీరు, ఆక్రమణలే మూసీ పునరుజ్జీవానికి ప్రధాన అడ్డకుంలుగా నిలిచాయి. 55 కి.మీ మేర నదీ మార్గంలో ఉన్న ఆక్రమణలను తొలగించడం ప్రభుత్వానికి కష్టతరమైన పనే అని అంటున్నారు. నది పునరుజ్జీవం కావడానికి 15–20 ఏళ్ల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆక్రమణలు సుమారు 2వేల మేర ఉంటాయని అంచనా వేసిన యంత్రాంగం.. వీటిని తొలగించేందుకు ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు లేనప్పటికీ, కొన్నిచోట్ల పట్టా భూముల్లో వెలిసిన నిర్మాణాల విషయంలో మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. ఇలాంటి కట్టడాలు 10వేల వరకు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించింది. భూ సేకరణ చట్టం కింద వీరికి పరిహారం చెల్లించడమా? ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించడమా? ఇతర మార్గాలేమిటనే కోణంలో అధ్యయనం చేస్తోంది. పాతబస్తీలో మూసీ కుచించుపోయిందున ఇక్కడ ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించే ఆలోచన కూడా చేస్తోంది. జంట జలాశయాల నుంచి రోజూ నీరు గుజరాత్లో నర్మదా నది నీటిని సబర్మతికి తీసుకెళ్లిన మాదిరే గోదావరిని ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలకు అనుసంధానం చేయాలనేది ప్రణాళిక. మురుగునీటితో నిండి ఉన్న మూసీ నదికి ఈ జంట జలాశయాల నుంచి నీటిని విడుదల చేస్తారు. ఇలా రోజుకు 1–2 టీఎంసీల జలాల విడుదలతో మురుగు శుద్ధి జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. వరద నీరు, మురుగు నీరు కూడా నదిలో కలుస్తున్నందున మూసీ కలుషితం అవుతుందని తేలడంతో అమృత్ పథకం కింద 39 మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ (ఎస్టీపీ)లను నిర్మిస్తోంది. వీటిద్వారా వందశాతం శుద్ధి చేసిన నీటిని నదిలోకి విడుదల చేస్తారు. వీటికి అనుబంధంగా ప్రతి రోజు జంట జలాశయాల నుంచి నీటిని వదలడం ద్వారా నదీలో స్వచ్ఛమైన నీరు ప్రవహించేలా.. సందర్శకులను ఆకర్షించేలా రూపొందిస్తారు. మార్గమధ్యంలో పార్కులు, బోటింగ్ కూడా ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. సబర్మతి.. మూసీ కృష్ణా నదికి ఉపనది అయిన మూసీ వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండలో పుట్టి.. నార్సింగి ఔటర్ రింగ్‌రోడ్డు నుంచి గౌరెల్లి ఓఆర్ఆర్ వరకు 55 కి.మీ. మేర ప్రవహిస్తుంది. దేశంలోనే నది పునరాభివృద్ధి ప్రాజెక్ట్‌ల్లో మూసీ రివర్ ఫ్రంట్ అత్యంత ప్రతిష్టాత్మకం. నీటి నిర్వహణ, ప్రణాళిక, రవాణా, పునరావాసం, పట్టణ పునరుజ్జీవం తదితరాల కోసం రూ.60 వేల కోట్ల వ్యయం, సుమారు 36 నెలల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గుజరాత్‌లోని సబర్మతి నది పునరాభివృద్ధికి మూసీకి దగ్గరి పోలికలున్నాయి, కాకపోతే సబర్మతి అహ్మదాబాద్ నగరంలో 11 కి.మీ. మేర మాత్రమే విస్తరించి ఉండగా.. మూసీ నది హైదరాబాద్‌లో 55 కి.మీ. మేర ప్రవహిస్తుంది. అదీగాక సబర్మతి కంటే మూసీ పరీవాహక ప్రాంతాలు ఎక్కువ ఆక్రమణకు గురవడంతోపాటు జనసాంద్రత కలిగిన ప్రాంతాలు కావడం గమనార్హం. ప్రాజెక్టు తొలి దశ అంచనా వ్యయమిలా వెస్ట్ కారిడార్– ఈస్ట్ కారిడార్ వరకు రోడ్డు నిర్మాణానికి రూ.15,000 కోట్లు ట్రంక్ లైన్‌కు రూ.3,000 కోట్లు రివర్ లింకేజీకి రూ.3,000 కోట్లు మూసీ మొత్తం పరీవాహక ప్రాంతం: 110 చ.కి.మీ. ఆక్రమణలున్న ప్రాంతం: 55 చ.కి.మీ. -
ఆక్రమణలే అడ్డంకులు!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరికి వడ్డాణంలో వంకెలు తిరుగుతూ వయ్యారంగా ఉండే మూసీ నదిని సుందరీకరించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. అయితే, ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రధాన అడ్డంకులు మూసీ చుట్టూ ఉన్న ఆక్రమణలే. మూసీ నది పరివాహకం వెంబడి 8,500 ఆక్రమణలు ఉన్నట్లు తేలింది. చారిత్రక మూసీ నదికి ఇరువైపులా బఫర్ జోన్లో, నదీగర్భంలో కూడా భవన నిర్మాణాలు, ప్రార్థనా స్థలాలు ఉన్నాయి. ఐదేళ్ల క్రితం గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ), రెవెన్యూ, నీటి పారుదల శాఖ సంయుక్తంగా డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (డీజీపీఎస్) సాంకేతికతను ఉపయోగించి మూసీ నది వెంట విస్తృత సర్వే చేశారు. మూసీ వెంబడి ఉన్న గ్రామ పటాలపై ఆ చిత్రాలను స్పష్టంగా కనిపించేలా (సూపర్ఇంపోజ్) చేశారు. ఆక్రమణలే పెద్ద సవాల్.. మూసీని శుభ్రం చేయడం ఎంత పెద్ద సవాలో అంతకు రెట్టింపు మూసీ నదికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించడమని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. నది పరివాహకం వెంబడి చాలా చోట్ల చిన్న గుడిసెలు, బస్తీలతో పాటు భవన నిర్మాణాలు ఉన్నాయి. నది గర్భంలో 1,700, బఫర్ జోన్లో 6,800 నిర్మాణాలు ఉన్నాయి. అన్ని వర్గాలకు చెందిన దాదాపు 60 నుంచి 70 వరకు మతపరమైన కట్టడాలున్నాయి. వీటిలో చాలా వరకు గత రెండు దశాబ్ధాల కాలంలోనే నిర్మితమయ్యాయి. ముఖ్యంగా హైకోర్టు నుంచి చాదర్‌ఘాట్ మధ్య ఇవి విస్తరించి ఉన్నాయి. ప్రజల విశ్వాసాలకు సంబంధించిన ఈ మతపరమైన కట్టడాలను తొలగించడం చాలా అంత సులభం కాదని అభిప్రాయపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీ పరివాహక ప్రాంత నివాసితులకు 2 బీహెచ్‌కే గృహాలను కేటాయించి ఆక్రమణలను తొలగించాలని భావించింది. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. భన్వర్‌లాల్ హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా వ్యవహరించిన తరుణంలో మూసీ ఒడ్డున నివసిస్తున్న కాలనీ వాసుల కోసం నందనవనంలో ప్రత్యేకంగా గృహా సముదాయం కట్టించి ఇచ్చినా.. నదీ గర్భంలో ఆక్రమణలు మాత్రం ఆగలేదు. మూసీకి మాస్టర్ ప్లాన్.. ఇప్పటికే మూసీ రివర్ ఫ్రంట్ భూ వినియోగం, ఇతర వివరాలు హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఉన్నాయి. తాజాగా మూసీ నదిలో వరద స్థాయి, సరిహద్దులను గుర్తించేందుకు 55 కిలోమీటర్ల మేర డ్రోన్లతో సర్వే చేయాలని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్డీసీఎల్) నిర్ణయించింది. హద్దుల లెక్క తేలిన తర్వాత గ్లోబల్ కన్సల్టెంట్ల సహాయంతో మూసీ నదీ గర్భంలో రిక్రియేషనల్ జోన్, ల్యాండ్ స్కేపింగ్, కమర్షియల్ జోన్లతో సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను అభివృద్ధి చేయనున్నారు. మూసీని సుందరీకరించడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, వ్యాపార కేంద్రాలకు నిలయంగా గ్లోబల్ సిటీ రివర్ ఫ్రంట్‌గా అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి కల. మూసీ అభివృద్ధికి అయ్యే వ్యయంలో కొంత బ్యాంకు నుంచి రుణం, మరికొంత పీపీపీ పద్ధతిలో చేయాలని, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే అవకాశాలను పరిశీలించాలని సీఎం మున్సిపల్ అధికారులను ఆదేశించారు. -
విశాఖకు కొత్త విశేషాలు..సీఎం జగన్ ఆలోచనల మేరకు కొత్త హంగులు
-
భీమవరానికి కొత్త శోభ.. 2 కోట్లతో సుందరీకరణ పనులు
భీమవరం(ప్రకాశం చౌక్): నూతన పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరం కొత్త శోభ సంతరించుకోనుంది. పట్టణ సుందరీకరణ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఇటీవల పట్టణ సుందరీకరణపై అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వ హించారు. మున్సిపల్ అధికారులకు సృష్టమైన ఆదేశాలు జారీచేశారు. దాంతో పట్టణ సుందరీకణ పనులపై ఆగమేఘాలపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ పనులకు సంబంధించి డ్రాయింగ్స్, నమూనాలు, నిధులు, అంచనాలు తదితర వాటితో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇప్పటికే భీమవరంలో మల్టీప్లెక్స్‌లు, షాపింగ్ మాల్స్, హోటల్స్, పెద్ద పెద్ద బట్టల దుకాణాలు, బంగారం షాపులు ఉన్నాయి. అలాగే ఆకర్షణీయమైన లైటింగ్స్, డైకరేషన్‌తో భీమవరం కళకళలాడుతోంది. చిన్న సైజు నగరాన్ని తలపిస్తోంది. పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసి ఆకర్షణీయంగా చేసేందుకు వాటర్ ఫౌంటెన్లు, వాల్ బ్యాక్‌గ్రౌండ్ ఫౌంటెన్స్, పచ్చదనం, వెల్కమ్ ఆర్చ్‌లు ఏర్పాటు చేసి మరింత అందంగా తీర్చిదిద్దనున్నారు. వాటర్ ఫౌంటెన్లకు రూ. 45 లక్షల ఖర్చు పట్టణ సుందరీకరణ పనులకు పలు రకాల నిధులు వాడేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. మున్సిపల్ సాధారణ నిధులు, సీడిఎంఏ, సీఎస్ఆర్ నిధులు ఉపయోగించుకుని అభివృద్ధి పనులు చేస్తారు. పట్టణంలోని ప్రకాశం చౌక్ సెంటర్, పోట్టి శ్రీరాములు విగ్రహం సెంటర్, బీవీ రాజు విగ్రహం సెంటర్లలో లైటింగ్ విత్ వాటర్ ఫౌంటెన్లును ఏర్పాటు చేస్తారు. ఇందుకు సీఎస్ఆర్ నిధులు రూ.45 లక్షలు వెచ్చిస్తారు. ఒక్కొక్క ఫౌంటెన్‌కు రూ.15 లక్షలు ఖర్చు చేయనున్నారు. త్వరలోనే ఈ పనులు చేపడతారు. 6 చోట్ల స్వాగత ఆర్చ్‌లు భీమవరం పట్టణానికి ఇతర ప్రాంతాల నుంచి ప్రవేశించే ప్రధాన రోడ్లపై ఆర్చ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఉండి రోడ్డు, బీవీ రాజు రోడ్డు, గొల్లవానితిప్ప, పాలకొల్లు, జువ్వలపాలెం రోడ్డు, తణుకు రోడ్డులో ఈ ఆర్చ్‌లు ఏర్పాటు చేస్తుండగా.. వాటి నిర్మాణం కోసం మున్సి పల్ నిధులు రూ.90 లక్షలు ఖర్చు చేయనున్నారు. ఒక్కొక్క ఆర్చ్‌కు రూ.15 లక్షలు ఖర్చు చేస్తారు. పచ్చదనం కోసం రూ. 54 లక్షలు పట్టణంలో పచ్చదనం (గ్రీనరీ) కోసం సీడీఎంఏ నిధులు రూ.54 లక్షలు ఉపయోగించుకోనున్నారు. పట్టణంలో ప్రధాన రహదారుల వెంట ప్రత్యేకమైన, అందమైన మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతు న్నారు. పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో యమనదుర్రు వంతెనకు అనుకుని గోడకు అందమైన చిత్రాలు వేయనున్నారు. అలాగే వాల్ ఫౌంటెన్ లేదా లైటింగ్ విత్ భీమవరం అని బోర్డు ఏర్పాటు చేస్తారు. ఇందుకు రూ.20 లక్షలు మున్సిపల్ నిధులు ఖర్చు చేస్తారు. స్థానిక ప్రకాశం చౌక్ సెంటర్ నుంచి పోలీసు బొమ్మ సెంటర్ వరకు పీపీ రోడ్డు మధ్యలో రూ.15 లక్షల ఖర్చుతో డివైడర్ నిర్మించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటారు. ఎల్ఈడీ స్క్రీన్ల ఏర్పాటు ప్రకాశం చౌక్ సెంటర్, అంబేద్కర్ సెంటర్లో భీమవరానికి సంబంధించి విషయాలు తెలియచెప్పేలా ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సీఎస్ఆర్ నిధులు రూ.15 లక్షలు ఖర్చు చేస్తారు. (క్లిక్: పోలీసుల అదుపులో కోనసీమ అల్లర్ల కేసు అనుమానితుడు?) సుందరీకరణ పనులకు ప్రతిపాదనలు పంపాం కలెక్టర్ అదేశాలతో భీమవరం పట్టణం సుందరీకరణ పనులకు సంబంధించి అన్నీ సిద్ధం చేసి ప్రతిపాదనలు ప్రభుత్వానికి, మున్సిపల్ శాఖకు, భీమవరం ప్రత్యేక అధికారికి పంపాం. పట్టణంలో మూడు చోట్ల ఫౌంటెన్స్ నిర్మాణం పనులు ప్రారంభించడానికి చర్యలు తీసుకున్నాం. మిగిలిన పనులకు సంబంధించి ప్రణాళికలను రూపొందించి వాటి నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటాము. – పి.శ్రీకాంత్, భీమవరం మున్సిపల్ ఇంజనీర్ -
మది దోచే మల్కంచెరువు.. మన హైదరాబాద్‌లో..
సాక్షి, హైదరాబాద్: అహ్లాదపూరిత వాతావరణం.. రంగురంగుల పూలు.. ఆకర్షణీయమైన మొక్కల మధ్య వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ చేస్తూ ప్రజలు ఎంజాయ్ చేసేలా రాయదుర్గంలోని పురాతన మల్కం చెరువు ఇక పూర్తి స్థాయిలో సిద్ధమైంది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో సేద తీరేందుకు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్, హైదరాబాద్ నాలెడ్జిసిటీకి చేరువలో, పురాతన జాతీయ రహదారికి పక్కనే ‘రోడ్ సైడ్ లేక్’ కావడంతో మల్కంచెరువుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ సుందరీకరించారు. దీన్ని మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. ఆహ్లాదకరంగా పగలు.. విద్యుత్ వెలుగుల్లో రాత్రి వేళ ఈ చెరువు ప్రాంతం చూపరులను కట్టిపడేస్తోంది. (క్లిక్: మెడికల్ టూరిజానికి హబ్‌గా మారిన హైదరాబాద్) -
మూసీ బుగ్గపై బ్యూటీ స్పాట్
సాక్షి, సిటీబ్యూరో: మూసీ నది ఈ పేరు వినగానే కంపు కొట్టే వాసనే గుర్తుకొస్తుంది. ఈ ఇబ్బందికర వాతావరణాన్ని మార్చేందుకు నాగోల్ బ్రిడ్జ్ నుంచి ఉప్పల్ భగాయత్ లే అవుట్ డౌన్ బ్రిడ్జ్ వరకు సుందరీకరణ పనులు చేపట్టారు. ఏకో ఫ్రెండ్లీ వాతావరణం తలపించేలా పాత్‌వేస్, షోర్లైన్ ఇంప్రూవ్మెంట్, ల్యాండ్‌స్కేప్ పనులు ఆ ప్రాంతంలో శరవేగంగా సాగుతున్నాయి. హెచ్ఎండీఏ ఇంజనీరింగ్ విభాగంతో పాటు అర్బన్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ అధికారులు సంయుక్తంగా ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. సాధ్యమైనంత తొందర్లోనే అన్ని పనులు పూర్తవుతాయని చెబుతున్నారు. నది పక్కనే వాకింగ్ ట్రాక్‌లు మూసీ నది అనగానే వామ్మో అక్కడికెళ్లాలా అని ఉలిక్కిపడే నగరవాసులను అక్కడికి రప్పించేలా విలేజ్ కల్చర్ వాతావరణాన్ని నెలకొల్పుతున్నారు. నగరంలోని ఒక పార్కు వెళితే కనిపించే దృశ్యాలన్నీ ఇక్కడ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బఫర్‌జోన్ గా పిలిచే ఈ రెండు కిలోమీటర్ల ప్రాంతంలో 100 ఫీట్ల రోడ్డును వేశారు. పార్కుల్లో సందర్శకులు నడిచేందుకు వాకింగ్ ట్రాక్‌లను కూడా నిర్మించారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర నడిచేలా అన్ని సౌకర్యాలను కల్పించారు. మధ్యలో సేదతీరేందుకు ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన బెంచ్‌ల మాదిరిగానే ఇక్కడా బెంచ్‌లు తెప్పిస్తున్నారు. రోడ్డువైపున గ్రిల్స్ బిగించారు. దాదాపు 1.5 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న రాతి విగ్రహాలు, లోహ విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. దోమలకు చెక్ పెట్టే మొక్కలు.. మూసీ నది ఒడ్డుకు వెళితే దోమలు వెంటబడి తరుముతాయి. దుర్వాసనకు అడుగు పడదు. ఆరోగ్య ఇబ్బందులు ఎదురవుతాయి. ఇకపై ఇటువంటి మాటలకు తావుండదు. హెచ్ఎండీఏ అధికారులు సువాసన వెదజల్లే మొక్కలు నాటుతున్నారు. తాగునీటి సౌకర్యం కోసం నల్లాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దోమల నివారణకు మెడిసినల్ ప్లాంట్లు నాటుతున్నారు. నక్షత్రవనం, తులసి మొక్కలు, వివిధ రకాల పూల మొక్కలు, లెమన్ గ్రాస్, లావెండర్, వాము తదితర మొక్కలను వరుస క్రమంలో పెడుతున్నారు. పాదచారులు మధ్యమధ్యలో సేదతీరేందుకు నీడనిచ్చే మొక్కలను కూడా నాటారు. ఇలా దాదాపు ఐదు లక్షల వరకు మొక్కలు నాటుతున్నట్టు అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ కె.సత్యనారాయణ తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా తలపెట్టిన ఈ బ్యూటిఫికేషన్ పనులకు దాదాపు రూ.ఐదు కోట్ల వరకు వ్యయం చేస్తున్నారు. తొమ్మిది నెలల క్రితం ప్రారంభమైన ఈ పనులు మరో నెలరోజుల్లో పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. -
నగరాన్ని సుందరీకరించండి
నగరపాలక సంస్థ అధికారులతో సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ విజయవాడ బ్యూరో : విజయవాడ-గుంటూరు నగరాల్లో సుందరీకరణ పనులను వెంటనే చేపట్టి సంక్రాంతి పండుగలోపు పూర్తిచేయాలని సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ రెండు నగరపాలక సంస్థల అధికారులకు సూచించారు. నగరంలోని సీఆర్డీఏ కార్యాలయంలో ఆయన శనివారం విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ సి.హరికిరణ్, గుంటూరు కార్పొరేషన్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు నగరాల్లో జరుగుతున్న అభివృద్ధి, సుందరీకరణ పనులపై చర్చించారు. ఈ రెండు నగరాల మధ్యే రాజధాని నిర్మిస్తున్న నేపథ్యంలో వాటికి విశేషమైన ప్రాధాన్యం వచ్చిందని, రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తున్నారని తెలిపారు. ఈ సమయంలో రెండు నగరాలకు సాధ్యమైనంత త్వరలో రాజధాని శోభను తీసుకురావాలని ముఖ్యమంత్రి పదేపదే చెబుతున్నారని పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా రెండు నగరాల్లోని ప్రధాన రోడ్లను శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని, గ్రీనరీని అభివృద్ధి చేయాలని సూచించారు. విద్యుత్ దీపాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. రాజధాని నగరానికి వచ్చిన ప్రజలకు ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా ఏర్పాట్లు చేయాలని, వారికి రాజధానికి వచ్చిన అనుభూతి కలిగేలా ఏర్పాట్లు చేసే బాధ్యత అందరిపైనా ఉందని శ్రీకాంత్ చెప్పారు.