raidurgam
-
ఉచ్చు బిగుసుకుంటుంది
-
HYD: రాయదుర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను తప్పించబోయి పక్కనే ఉన్న కారును ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఒక మహిళ మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్‌కి తీవ్ర గాయాలయ్యాయి.మృతి చెందిన మహిళ రత్న బాయ్ (43)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని ఉస్మానియాకు పోలీసులు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: గుళికల ప్యాకెట్‌ను తెచ్చిన కోతి.. టీ పొడి అనుకుని.. -
Hyderabad: రాయదుర్గంలో భారీగా డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్: హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. 650 గ్రాముల హెరాయిన్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఎస్ఓటీ, రాయదుర్గం పోలీసులు చేపట్టిన జాయింట్ ఆపరేషన్‌లో ఏడుగురిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన నిందితులు రాజస్థాన్‌కు వాసులుగా పోలీసులు గుర్తించారు. రాజస్థాన్ గ్యాంగ్‌లో ముగ్గురు పెడ్లర్స్, నలుగురు కంజూమర్స్గా పోలీసులు గుర్తించారు. -
హైదరాబాద్ మల్కమ్ చెరువు వద్ద రోడ్డు ప్రమాదం
-
రాయదుర్గం: కారు నుజ్జునుజ్జు.. స్టూడెంట్ మృతి
సాక్షి, హైదరాబాద్: రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో గత రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మల్కంచెరువు సమీపంలో వేగంగా వచ్చిన కారు ఫ్లై ఓవర్ గోడను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయ్యి.. అందులోని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ యాక్సిడెంట్‌తో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. మృతుడ్ని ఐసీఎఫ్ఏఐ యూనివర్సిటీలో బీబీఏ చదువుతున్న చరణ్(19)గా పోలీసులు గుర్తించారు. బీఎన్ఆర్ హిల్స్ నుంచి చరణ్ మెహదీపట్నంలోని తన ఇంటికి వెళ్తున్నాడు. ఆ సమయంలో ఫ్లై ఓవర్ ఫిల్లర్‌ను ఢీ కొట్టడంతో కారు ప్రమాదానికి గురైంది. కారు నుజ్జు అయ్యి స్పాట్లోనే చరణ్ చనిపోయాడని, ఇరుక్కుపోయిన ఆ మృతదేహాన్ని కష్టం మీద బయటకు తీసినట్లు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలిపిన పోలీసులు, మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
HYD: రాయదుర్గంలో హిట్ అండ్ రన్..! వ్యక్తి మృతి
సాక్షి,హైదరాబాద్: రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై సోమవారం(జులై 15) హిట్ అండ్ రన్ ఘటన చోటు చేసున్నట్లు తెలుస్తోంది. టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఫ్లైఓవర్ పైనుంచి కింద పడి ఎక్సెల్ వాహనంపై ఉన్న వ్యక్తి మృతి చెందాడు. మృతుడు కాకినాడకు చెందిన సోము సుబ్బు (35) గా పోలీసులు గుర్తించారు. సుబ్బు టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై టిఫిన్స్ అమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఉదయం 5:30గంటలకు ఇంటి నుంచి బయలు దేరిన సుబ్బు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అతడి కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో ప్రమాదం జరిగిన తీరుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిజంగానే ఏదైనా వాహనం ఢీ కొట్టిందా లేదంటే సెల్ఫ్ స్కిడ్ అయి పడ్డాడా అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్: రోడ్లపై స్టంట్లు.. రేసర్ల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఐటీ హబ్‌లో బైక్ రేసింగ్స్తో యువకులు వీరంగం సృష్టిస్తున్నారు. టీ హబ్, ఐటీసీ కొహినూర్, నాలెడ్జ్ పార్క్, సాత్వా బిల్డింగ్ ప్రాంతాలో బైక్ రేసింగ్స్తో యువకులు హచ్‌చల్ చేస్తున్నారు. దీంతో రాయదుర్గం పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టి.. రేసింగ్స్కి పాల్పడిన 50మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బైకులను స్వాధీనం చేసుకొని.. ఆర్టీఏ అధికారులకు అప్పగించారు. రేసింగ్‌తో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న యువకులపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. -
HYD: ఈ-సిగరెట్ల కలకలం.. విద్యార్థులే టార్గెట్
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఈ-సిగరెట్ల ముఠా గుట్టు రట్టయ్యింది. రాయదుర్గం పరిధిలో ఎస్వోటీ(Special Operation Team) భారీగా ఈ-సిగరెట్లను పట్టుకుంది. వాటిని అమ్ముతున్న, కొంటున్న విద్యార్థులనూ అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని ఇంటర్నేషన్ స్కూల్స్‌ను టార్గెట్‌గా చేసుకున్నారు కేటుగాళ్లు. అందులోని నికోటిక్‌కు బానిసలవుతున్నారు. ఈ క్రమంలో వాట్సాప్ ద్వారా ఈ-సిగరెట్ల క్రయవిక్రయాలు జరుగుతున్నట్లు ఎస్వోటీ గుర్తించింది. నిఘా వేసి.. భారీగా ఈ సిగరెట్లను స్వాధీనం చేసుకుని పలువురిని అదుపులోకి తీసుకుంది. వీటి విలువ సుమారు మూడు లక్షల విలువ దాకా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ-సిగరెట్ల విక్రయానికి పాల్పడుతున్న ఇండియన్ బిజినెస్ స్కూల్ విద్యార్థి మాధవను (19) పోలీసులు అరెస్ట్ చేశారు. ICFAi, IBS స్కూళ్లలో పదిమంది విద్యార్థులు, మహీంద్రా యూనివర్సిటీ, సంస్కృతి డిగ్రీ కాలేజ్, ఆకాష్ ఇన్స్టిట్యూట్, గీతం కాలేజ్ , అమిటీ కాలేజ్ విద్యార్థులకు ఈ సిగరెట్లు అమ్మినట్లు గుర్తించారు. మాధవ్ నుంచి 22 ఈ-సిగరెట్ల తో పాటు రెండు మొబైల్స్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే.. అమిటి కాలేజీలో చదువుతున్న అచ్యుత్.. 71 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఈ-సిగరెట్లు అమ్మినట్లు గుర్తించారు. వీళ్లిద్దరితో పాటు మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
Hyderabad Metro: సాంకేతిక లోపంతో నిలిచిన హైదరాబాద్ మెట్రో రైలు
సాక్షి, సిటీబ్యూరో: సాంకేతిక సమస్యలు నగర మెట్రో రైళ్లకు తరచూ బ్రేకులు వేస్తున్నాయి. మంగళవారం ఉదయం అమీర్‌పేట్– రాయదుర్గం రూట్లో సాంకేతిక సమస్యల కారణంగా ఓ రైలు పట్టాలపై నిలిచిపోయింది. దీంతో ఒకేవైపు మార్గంలోనే రైళ్ల రాకపోకలను కొనసాగించారు. రైళ్లు ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు అవస్థలకు గురయ్యారు. సమయానికి గమ్యం చేరుకోలేకపోయారు. మెట్రో అధికారులు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్లో రద్దీ భారీగా పెరగడంతో సుమారు రెండు గంటల పాటు గందరగోళం నెలకొంది. అనంతరం అధికారులు సాంకేతిక సమస్యను పరిష్కరించడంతో అమీర్‌పేట్–రాయదుర్గం మార్గంలో రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. -
అనంతపురం జిల్లా: రాయదుర్గం పీఎస్ లో దొంగ ఆత్మహత్య
-
విధిపై యుద్ధం! గద్దించాలనుంది.. కానీ గొంతు పెగలడంలేదు
ఉమ్మడి కుటుంబం.. ఇంటినిండా జనం.. అనుబంధాల గుమ్మం..అనురాగాల కాపురం.. విధి వికృతం..మేనరికం శాపమో..పేదరికం పాపమో.. విధిపై యుద్ధం చేయాలనుంది.. వైకల్యం వెక్కిరిస్తోంది..గద్దించాలనుంది..గొంతు ఉన్నా పెగలడంలేదు. కష్టాలను ఎదురీదుతామని విన్నవించుకోవడం తప్పా..వినలేని దైన్యం వారిది. రాయదుర్గంలోని నేసేపేటలో నివాసముంటున్న దొడగట్ట గంగమ్మ కుటుంబాన్ని చూస్తే గుండె తరుక్కుపోతుంది. శ్రమను నమ్ముకున్న ఈ కుటుంబంలో ఏకంగా నలుగురు బధిరులు ఉన్నారు. జీవన పోరాటం సాగిస్తూ కుటీర పరిశ్రమ కోసం చేయూత కోరుకుంటున్నారు. రాయదుర్గం: రాయదుర్గంలోని నేసేపేటలో నివాసముంటున్న దొడగట్ట గంగమ్మ కుటుంబంపై విధి చిన్నచూపు చూసింది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. అందులో ఒక కుమారుడు దేవేంద్ర, కుమార్తె తిప్పక్క పుట్టుకతోనే మూగవారు. ఎదిగే కొద్దీ వినికిడి శక్తినీ కోల్పోయారు. దేవేంద్రకు సమీప బంధువైన నాగవేణితో వివాహమైంది. వీరికి రాధ, సంజయ్, పల్లవి సంతానం. వీరిలో సంజయ్‌కు మూగ, చెవుడు, అవయవలోపం ఉంది. పల్లవి కూడా మూగ, చెవుడుతో బాధపడుతోంది. వీరు పదో తరగతి వరకు చదువుకున్నారు. తిప్పక్కకు వివాహమైనప్పటికీ భర్తతో మనస్పర్థల నేపథ్యంలో తల్లి వద్దే ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది. గంగమ్మ మరో కుమార్తె వివాహమై మెట్టినింటికి వెళ్లిపోయారు. మొత్తం మీద తొమ్మిది మంది సభ్యులు గల ఈ ఉమ్మడి కుటుంబంలో నలుగురు మూగ, చెవుడు, వైకల్యంతో బాధపడుతున్నారు. సైగలతోనే సంభాషణ.. గంగమ్మ కుమారుడు దేవేంద్ర, కుమార్తె తిప్పక్క, మనవడు సంజయ్, మనవరాలు పల్లవి సైగలతోనే సంభాషిస్తుంటారు. అవతలి వారికి వీరి భాష అర్థం కాకపోతే కాగితంపై రాసి చూపుతారు. కుటుంబ సభ్యులు, బంధువులు వేరేచోట ఉన్నపుడు వారితో అవసరం ఉంటే వాట్సాప్ వీడియో కాల్‌ను ఉపయోగించుకుంటున్నారు. కుటీర పరిశ్రమ కోసం వినతి.. దేవేంద్ర తన భార్య నాగవేణితో కలిసి ఇంట్లోనే కుట్టుమిషన్ పెట్టుకుని పీస్ వర్క్‌పై జీన్స్‌ప్యాంట్లు కుడుతూ జీవనం సాగిస్తున్నారు. ఈ మధ్యనే కుమార్తె పల్లవికి కూడా కుట్టుమిషన్‌లో శిక్షణ ఇస్తున్నాడు. కుమారుడు సంజయ్ తనకు చేతనైన మేరకు తల్లిదండ్రులకు సహకారం అందిస్తున్నాడు. తల్లికి వృద్ధాప్య పింఛన్, దేవేంద్రకు వికలాంగుల పింఛన్ అందుతోంది. దేవేంద్ర సోదరి తిప్పక్కకు సెపరేట్ రేషన్‌కార్డు ఉన్నందున ఆమెకు పింఛన్ వస్తోంది. దీనితోనే అందరూ బతుకుబండి లాగుతున్నారు. అరకొర సంపాదనతో అవసరాలు పూర్తిస్థాయిలో తీరడం లేదు. పీస్ వర్క్ కాకుండా సొంతంగా వర్క్ ఆర్డర్ తెచ్చుకుని కుట్టివ్వడం ద్వారా సంపాదనను మరింత పెంచుకోవడానికి కుటీర పరిశ్రమ ఏర్పాటు కోసం తమకు బ్యాంకు ద్వారా రుణం ఇప్పించాలని దేవేంద్ర దంపతులు కోరుతున్నారు. ప్రతి క్షణం కుంగిపోతున్నాం నాకు ముగ్గురు సంతానం. అందులో ఇద్దరు మూగ వారిగా జన్మించారు. కుమారుడికి కూడా ఇద్దరు పిల్లలు మూగ, చెవుడు, వైకల్య లోపంతో జన్మించడం బాధేస్తోంది. ఆ దేవుడు మాకే ఎందుకు ఇలా చేశాడని ప్రతిక్షణం కుంగిపోతున్నాం. అయినా బతుకుపోరాటం కొనసాగిస్తున్నాం. ఇంటి నిండా జనం. అయినా నిశ్శబ్దం. సైగలతోనే సహజీవనం. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదని కోరుకుంటాం. – గంగమ్మ, కుటుంబ పెద్ద (చదవండి: పులినే చంపగల శునకం.. ఖరీదులో కనకం...) -
రాయదుర్గం భూములపై సర్కార్‌కు ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్: రాయదుర్గం భూములపై సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ప్రైవేట్ వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి.. కోర్టును తప్పుదోవ పట్టించారని ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయ్‌దుర్గం గ్రామంలోని సర్వే నంబర్ 46లోని 84 ఎకరాల 30 గుంటల భూమిపై ప్రైవేట్ వ్యక్తులు తప్పుడు పత్రాలతో హక్కులు పొందారని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వాదనలు వినిపించింది. ఈ భూ ములకు సంబంధించి ఏప్రిల్‌లో ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వం పిటిషన్దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ శ్రీదేవి, జస్టిస్ ప్రియదర్శిని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయ వాది సీఎస్ వైద్యనాథన్‌వాదనలు వినిపించారు. విచారణ అర్హతను మాత్రమే సమీక్షిస్తా మని చెప్పిన హైకోర్టు 84 ఎకరాల భూమిపై హక్కులు ఇస్తూ తీర్పునిచి్చందన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ వాదనను వినాల్సి ఉండ గా, ఆ అవకాశం ఇవ్వలేదని చెప్పారు. ప్రైవేట్ వ్యక్తులు తప్పుడు పత్రాలను కోర్టుకు సమ ర్పించారని వెల్లడించారు. ప్రైవేట్ వ్యక్తులు లింగయ్య, మరికొందరి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రీకాల్ పిటిషన్‌పై విచారణ సరికాదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసింది. కాగా, దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ పేర్కొన్నారు. చదవండి: సీఎం ఫాంహౌస్ కోసమే ‘రీజినల్’ అలైన్మెంట్ మార్పు -
హైదరాబాద్: మెట్రో ప్రయాణికులకు శుభవార్త..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణికులకు మరో సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇంటి నుంచి మెట్రో స్టేషన్‌కు, మెట్రో స్టేషన్ నుంచి ఇంటికి చేరుకునేందుకు మెట్రో రైడ్ పేరుతో ఈ– ఆటో సేవలు ప్రారంభమయ్యాయి. గురువారం పరేడ్‌గ్రౌండ్ స్టేషన్ పార్కింగ్‌లో హెచ్ఎం ఆర్ఎల్ మేనేజింగ్ డైరక్టర్ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్అండ్టీ మెట్రో రైల్ సీఈవో ఎండీ కేవీబీ రెడ్డి, మెట్రోరైడ్ కో–ఫౌండర్ గిరిష్ నాగ్‌పాల్, షెల్ ఫౌండేషన్ ప్రతినిధి తహసీన్ ఆలమ్, డబ్ల్యూ ఆర్ ఐ ఇండియా డైరెక్టర్ పవన్ ములుకుట్లలతో కలిసి ఈ– ఆటోలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. మెట్రో స్టేషన్ చేరుకోవాలంటే ప్రైవేటు ఆటోల కంటే మెట్రో ఆటోల్లో చార్జీలు తక్కువ అని అన్నారు. మొదటి కిలోమీటర్‌కు పది రూపాయలు తర్వాత ప్రతి కిలో మీటరుకు ఆరు రూపాయల చొప్పున చార్జీలు ఉంటాయని చెప్పారు. ఆటోను బుక్ చేసుకునేందుకు మెట్రోరైడ్ ఇండియా యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. పరేడ్ గ్రౌండ్స్, రాయదుర్గం మెట్రో స్టేషన్ల వద్ద 50 ఎలక్ట్రికల్ ఆటలతో ప్రారంభిస్తున్నామని, దశలవారీగా అన్ని మెట్రో స్టేషన్లకు ఈ సేవలు విస్తరిస్తామని చెప్పారు. మెట్రో సంస్థపై కొందరు పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నారని, ఫేజ్– 2లో భాగంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలు సేవలను రూ.5 కోట్ల వ్యయంతో చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. -
మది దోచే మల్కంచెరువు.. మన హైదరాబాద్‌లో..
సాక్షి, హైదరాబాద్: అహ్లాదపూరిత వాతావరణం.. రంగురంగుల పూలు.. ఆకర్షణీయమైన మొక్కల మధ్య వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ చేస్తూ ప్రజలు ఎంజాయ్ చేసేలా రాయదుర్గంలోని పురాతన మల్కం చెరువు ఇక పూర్తి స్థాయిలో సిద్ధమైంది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో సేద తీరేందుకు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్, హైదరాబాద్ నాలెడ్జిసిటీకి చేరువలో, పురాతన జాతీయ రహదారికి పక్కనే ‘రోడ్ సైడ్ లేక్’ కావడంతో మల్కంచెరువుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ సుందరీకరించారు. దీన్ని మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. ఆహ్లాదకరంగా పగలు.. విద్యుత్ వెలుగుల్లో రాత్రి వేళ ఈ చెరువు ప్రాంతం చూపరులను కట్టిపడేస్తోంది. (క్లిక్: మెడికల్ టూరిజానికి హబ్‌గా మారిన హైదరాబాద్) -
విషాదం: కరోనా వ్యాక్సిన్‌కు భయపడి యువకుడు..
సాక్షి, హైదరాబాద్: మహమ్మారి కరోనా వైరస్ నుంచి రక్షణ పొందేందుకు వేస్తున్న టీకాపై ఇంకా ప్రజల్లో భయాలు తొలగడం లేదు. తాజాగా ఓ యువకుడు వ్యాక్సిన్ భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యాక్సిన్ వేసుకోవాలని కుటుంబసభ్యులు ఒత్తిడి చేయడంతో ఆ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మణికొండ ప్రాంతంలో జరిగింది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మణికొండ ప్రాంతంలో కుటుంబీకులతో కలిసి శివప్రకాశ్ (21) నివసిస్తున్నాడు. కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని కొద్దిరోజులుగా శివప్రకాశ్కు కుటుంబసభ్యులు చెబుతున్నారు. అయితే వ్యాక్సిన్ తీసుకోవడానికి శివప్రకాశ్ జంకుతున్నాడు. ఈ క్రమంలోనే కుటుంబీకులు కొద్దిగా ఒత్తిడి చేశారు. వ్యాక్సిన్ తీసుకోవడం ఇష్టంలేని శివ ప్రకాశ్ జూన్ 12వ తేదీన విషం సేవించి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు పోలీసులు అప్పగించారు. -
కానిస్టేబుల్ రాసలీలలు
-
హోటల్ గదిలో కానిస్టేబుల్ రాసలీలలు
సాక్షి, అనంతపూర్: హోటల్ గదిలో ఏఆర్ కానిస్టేబుల్ బాగోతం బయటపడింది. ఏఆర్ కానిస్టేబుల్ మరో మహిళతో హోటల్ గదిలో ఉండగా.. సదరు మహిళ భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఈ వ్యవహారం వెలుగు చూసింది. బ్యూటిషిషన్గా పనిచేస్తున్నానంటూ తన భార్య ఏఆర్ కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని మహిళ భర్త ఆరోపించాడు. భార్య ప్రవర్తనపై పోలీసుల వద్ద వాపోయాడు. ఏర్ కానిస్టేబుల్ని, మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించారు. (చదవండి: క్యాంపస్‌లోనే మహిళపై లైంగిక దాడి) (function(w,d,s,u,n,i,f,g,e,c){w.WDMObject=n;w[n]=w[n]||function(){(w[n].q=w[n].q||[]).push(arguments);};w[n].l=1*new Date();w[n].i=i;w[n].f=f;w[n].g=g;e=d.createElement(s);e.async=1;e.src=u;c=d.getElementsByTagName(s)[0];c.parentNode.insertBefore(e,c);})(window,document,"script","//api.dmcdn.net/pxl/cpe/client.min.js","cpe","5f686da28ba2a6d8cbff0ede",{scroll_to_pause: true}); -
రాయదుర్గంలో దోపిడీ.. నేపాల్ గ్యాంగ్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని రాయదుర్గం కాంట్రాక్టర్ మధుసూదన్ రెడ్డి ఇంట్లో జరిగిన దోపిడీ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పనిమనుషులుగా చేరి.. భారీగా నగదు, బంగారం దోచుకెళ్లిన నేపాల్ గ్యాంగ్‌ని రాష్ట్ర పోలీసులు యూపీ సరిహద్దులో అరెస్ట్ చేశారు. వీరు రాయదుర్గంలో ఈనెల 6న మధునూదన్‌రెడ్డి భార్యకి మత్తు మందు ఇచ్చి.. 15 లక్షల రూపాయల నగదు, బంగారం చోరీ చేశారు. వీరు వాచ్మెన్, పనిమనుషులుగా ఇళ్లలోకి చేరి చోరీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు వీరి వద్ద నుంచి 5 లక్షల రూపాయల నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. ‘రాయదుర్గం పీఎస్ పరిధిలో జరిగిన చోరికి సంబంధించి నేపాల్ గ్యాంగ్‌కి చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశాం. ఇంకా ఐదురుగు పరారీలో ఉన్నారు. కాంట్రాక్టర్ మధుసూదన్ రెడ్డి ఇంట్లో పనిమనిషిగా చేరిన ఈ గ్యాంగ్ సభ్యురాలు ఇంట్లో ఉన్నవారికి ఆహారం, టీలో మత్తు మందు ఇచ్చింది. ఈ గ్యాంగ్ లీడర్ నేత్ర నేపాల్‌కి చెందిన వారందరినీ కూడగట్టుకొని దోపిడీ చేస్తున్నాడు. గతంలో బెంగుళూరు లో కూడా ఇలాగే దోపిడీ చేశాడు. రాబరీ చేశాక తలో దారిలో నేపాల్‌కి వెళ్లి అక్కడ డబ్బులు, నగలు పంచుకుంటారు. 10 టీమ్స్ ద్వారా ఈ గ్యాంగ్ ని పట్టుకున్నాం. పరారీలో ఉన్నవారిని పట్టుకోవడానికి మరిన్ని టీమ్స్ రాజస్థాన్, ఢిల్లీలోకి వెళ్లాయి. ఈ గ్యాంగ్ మెంబర్స్‌ని అరెస్ట్ చేయడానికి ఇతర రాష్ట్రాల పోలీసులు పూర్తిగా సహకరించారు. ఎవరైనా కొత్తవాళ్లను పనిలో పెట్టుకోవాలంటే వారి బ్యాగ్రౌండ్ చెక్ చేసుకోవాలి’ అని సూచించారు. (చదవండి: డిన్నర్లో మత్తు మందు ఇచ్చి.. భారీ చోరీ) రెండు రోజుల కస్టడీకి నరసిహ రెడ్డి బినామీలు మల్కాజ్గిరి మాజీ ఏసీపీ నర్సింహారెడ్డి కేసుకు సంబంధించి 8 మంది బినామీలను 2రోజులపాటు కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. రేపటి నుంచి రెండు రోజులపాటు వీరిని ఏసీబీ అధికారులు విచారించనున్నారు. అలానే నర్సింహారెడ్డి ఆస్తులు, భూ దందాలపై ఆరా తీయనున్నారు. -
మంత్రి కాల్వ నామినేషన్‌పై హై డ్రామా!
సాక్షి, అనంతపురం : మంత్రి కాల్వ శ్రీనివాస్ నామినేషన్‌పై హై డ్రామా నెలకొంది. రాయదుర్గం టీడీపీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన కాలువ శ్రీనివాస్.. ఒక పేజీలో కొట్టివేతలతోపాటు అసంపూర్తిగా సమాచారం ఇచ్చారు. దీంతో కాలువ శ్రీనివాస్ నామినేషన్‌ను తిరస్కరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాపు రామచంద్రా రెడ్డి ఎన్నికల అధికారిని కోరారు. ఈ సందర్భంగా తీవ్ర అసహనానికి గురైన మంత్రి కాలువ రాయదుర్గం రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో హల్చల్ చేశారు. వైఎస్సార్సీపీ అభ్యర్థిపైకి దౌర్జన్యానికి దిగారు. అభ్యంతరాలపై సమాధానం దాటవేస్తూ సాక్షి మీడియాపై అక్కసును వెళ్లగక్కారు. నామినేషన్ పరీశీలన కేంద్రం నుంచి బయటకు వచ్చిన ఆయన.. నామినేషన్ ఆమోదించేలా ఉన్నతాధికారులపై ఒత్తిళ్లకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక జిల్లాలోని వైఎస్సార్సీపీ అభ్యర్థులను నామినేషన్లను ఎన్నికల అధికారులు ఆమోదించారు. గుంతకల్లు వైఎస్సార్సీపీ అభ్యర్థి వై.వెంకట్రామి రెడ్డి , కళ్యాణ దుర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి శ్రీమతి ఉష శ్రీచరణ్, మడకశిర అభ్యర్థి తిప్పేస్వామి, తాడిపత్రి అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి, హిందూపురం అభ్యర్థి మహ్మద్ ఇక్బాల్‌ల నామినేషన్లు ఆమోదం పొందాయి. -
రాయదుర్గం బహిరంగ సభలో వైఎస్ జగన్
-
ప్రతి పేదవాడికి నేను అండగా ఉంటా
-
‘అన్నకు అవకాశం ఇద్దాం.. సీఎం చేద్దాం’
సాక్షి, రాయదుర్గం : ‘చంద్రబాబు ఐదేళ్ల దుర్మార్గ పాలనలో మీరు పడ్డ కష్టాలను నా పాదయాత్రతో స్వయంగా చూశాను.. మీ బాధలను విన్నాను. ఇవన్నీ వినీ మీకు ఓ మాట ఇస్తున్నాను.. నేనున్నానని. ప్రతి పేదవాడికి నేను అండగా ఉంటానని భరోసా ఇస్తున్నాను’ అని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ సమస్యల పరిష్కారానికి మనం నవరత్నాలను ప్రకటించుకున్నామని, ఈ నవరత్నాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని.. ‘చంద్రబాబు ఇచ్చే డబ్బులతో మోసపోవద్దు.. 20 రోజులు ఓపిక పట్టి అన్నకు ఒకసారి అవకాశం ఇద్దాం. అన్నను సీఎం చేసుకుందాం.. మన సమస్యలను పరిష్కరించుకుందాం’ అని ప్రతి అక్కకు.. ప్రతి అవ్వకు.. ప్రతి తాతాకు చెప్పండి’ అని వైఎస్ జగన్ కార్యకర్తలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం అనంతపురం జిల్లా రాయదుర్గం బహిరంగ సభలో ప్రసంగించారు. ఇంకా ఈ సభలో ఆయన ఏమన్నారంటే.. మీ అందరి ఉత్సాహం చూస్తుంటే... ‘ఇక్కడికి వచ్చిన మీ అందరి ఉత్సాహం చూస్తుంటే నాకో సన్నివేశం గుర్తుకు వస్తుంది. బ్రిటీష్ సామ్రాజ్యం అంతరించిపోతుందని, రేపటి నుంచి మన సొంత పరిపాలన ప్రారంభమవుతుందని అప్పటి ప్రజల్లో ఉన్న ఉత్సాహం నాకు ఇప్పుడు మీలో కనిపిస్తోంది. రాయదుర్గంలోని మీ ఉత్సహం చూస్తుంటే మరో 20 రోజుల్లో మన పాలన ప్రారంభంకాబోతుందనే ధీమా కలుగుతోంది. ఐదేళ్ల చంద్రబాబు పాలన చూశారు.. ఈ ఐదేళ్లలో ఆయన చేసిన మోసాలు, అన్యాయాలు మనమంతా చూశాం. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి మళ్లీ అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టారు. ఈ రాష్ట్ర ప్రజలకు భద్రతకు తాను భరోసా ఇస్తాడట. చంద్రబాబు నాయుడిని నిలదీస్తు అడుగుతున్నా.. 2014 ఎన్నికల తర్వాత ప్రమాణం చేస్తూ ఆయన కొన్ని సంతకాలు చేశారు. భవిష్యత్తుకు భరోసా అయితే ఇలా చేసేవాడా? ఆ సంతకాలేంటంటే.. రైతుల రుణాలు మాఫీ చేస్తానన్నారు.. అయ్యాయా అని అడుగుతున్నా? డ్వాక్రా మహిళల రుణమాఫీ అని రెండో సంతకం చేశారు.. చేనేత కార్మీకుల రుణాలు.. ప్రతిగ్రామానికి మినరల్ వాటర్, బెల్ట్ షాపుల రద్దని ఇలా సంతకాలు చేశారు. ఐదేళ్ల పాలన తర్వాత నేను అడుగుతున్న వీటిలో ఏ ఒక్కటి అయినా చేశాడా?. ఇలాంటి చంద్రబాబు ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇస్తాడట. ప్రజల భవిష్యత్తు భరోసా ఇచ్చేవాడే అయితే ప్రత్యేక హోదా తాకట్టు పెట్టేవాడా? రూ. 20 కోట్లతో ఫిరాయింపులకు పాల్పడేవాడా? కమిషన్ల కోసం కక్కుర్తి పడి కేంద్ర ప్రభుత్వం పొలవరం ప్రాజెక్ట్ కడతానంటే.. నేనే కడుతానని లాక్కునేవాడా? ఇసుక దగ్గర నుంచి మట్టి, బొగ్గు, కరెంట్ కొనుగోలు దాకా, విశాఖ భూములు, దళితుల భూములు గుడి భూములు దోచేవాడా? అని అడుగుతున్నా. పేదల గురించే ఆలోచించేవాడైతే 108 పరిస్థితి ఇంత దారుణంగా ఉండేదా? 108 కొడితే కుయ్ కుయ్ అనే అంబులేన్స్ వస్తుందా? ఆరోగ్యశ్రీ నీరుగార్చేవాడా? పిల్లల చదువుల కోసం అప్పులు చేసే పరిస్థితి ఉండేదా? విద్యాలయాలు, ఆరోగ్య కేంద్రాలు బినామీల పరం చేసేవాడా? నారాయణ స్కూల్ మాత్రమే నడిచేలా ప్రభుత్వ స్కూళ్లను మూసివేసేవాడా? ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి వ్యక్తిగత వివరాలు, చివరకు మహిళల నెంబర్లు జన్మభూమి కమిటీలకు ఇచ్చేవాడా? అని అడుగుతున్నా. నేను విన్నాను.. నేను చూశాను.. నేను ఉన్నాను.. ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం.. ఇవ్వలేకపోతే రెండువేల రూపాయలు ఇస్తానన్నాడు. ఇదా భరోసా ఇవ్వడం అంటే? మోసం చేయాలనే ఆరాటంతో ఓ మేనిఫెస్టో.. ఎన్నికల ప్రణాళికా అని విడుదల చేశారు. ఏయే కులాన్ని ఎలా మోసం చేయాలో అలా చేశాడు. ఇంతటి దారుణమైన పాలన మధ్య నా పాదయాత్ర సాగింది. అక్షరాల 3,648 కిలోమీటర్లు ఆ దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో పూర్తి చేయడం జరిగింది. రాష్ట్రంలో ప్రతి మూల, అంగుళం తిరుగుతూ మీ కష్టాలు చూశాను. ప్రతి కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యను విన్నాను. చంద్రబాబు చేతిలో మోసపోయి.. ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్న ప్రతి కుటుంబానికి ఓ మాట ఇవ్వదల్చుకున్నా. మీ సమస్యలను నేను విన్నాను. మీ సమస్యలను నేను చూశాను.. మీ అందరికి నేను ఉన్నాను. అని మాట ఇస్తున్నాను. ఎస్సీ, ఎస్టీలు, బీసీ పేదల ఆవేదన చూశాను. వారు పడుతున్న బాధలు విన్నాను. ఫీజు రీయింబర్స్మెంట్ రాకా.. పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితిని నా పాదయాత్రలో చూశాను. 108 రాకా.. ఆరోగ్యశ్రీ సరిగ్గా అమలు కాకా బాధపడ్డ కుటుంబాల సమస్యల విన్నాను. దీర్ఘకాలికి వ్యాధులతో బాధపడుతున్నవారి గాధలు కూడా విన్నాను. మద్యం షాపులు రద్దు చేస్తానని మొదటి సంతకం పెట్టి.. ప్రతి గ్రామంలో మూడు, నాలుగు బెల్ట్ షాప్‌లు నడుపుతుంటే వాటి బారిన పడి బాధపడుతున్న అక్కాచెల్లేమ్మలు చెప్పిన మాటలు విన్నాను. ప్రభుత్వ ఉద్యోగాలు ఖాలీగా ఉన్నా.. నోటీపికేషన్ ఇవ్వని ప్రభుత్వాన్ని నిరుద్యోగ యువకులు తిట్టిన మాటలు విన్నాను. చదువుకున్న ఉద్యోగాలు రాకా పక్క రాష్ట్రాలకు వెళ్తున్నా నిరుద్యోగులను చూశాను. ఇవన్నీ చూశాను.. ఇవన్నీ విన్నాను.. ఇవన్నీ వినీ మీకు మాట ఇస్తున్నాను.. నేనున్నానని. నవరత్నాలతో ప్రతి ఒక్కరి సమస్య తీరుతుందని మనం ప్రకటించాం. ఆ నవరత్నాలను ప్రతి ఒక్కరి ఇంటికి తీసుకెళ్లండి. అన్యాయంగా దోచుకున్న డబ్బును చంద్రబాబు మీ ఇంటికి పంపిస్తాడు. మీ ఊరిలో ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి.. చంద్రబాబు ఇచ్చే రూ.3వేలతో మోసపోవద్దు అక్కా.. 20 రోజులు ఓపిక పట్టండి.. అన్న ముఖ్యమంత్రి అవుతాడు.. అన్న సీఎం అయిన తర్వాత పిల్లలకు పాఠశాలకు పంపించే ప్రతి ఒక్కరికి రూ.15 వేలు ఇస్తాడని చెప్పండి. 20 రోజులు ఓపిక పట్టా అక్కా.. అన్నను సీఎం చేసుకుందాం. ఎన్ని లక్షలు ఖర్చైనా అన్న చదివిస్తాడని చెప్పండి. ఐదేళ్లు చంద్రబాబును నమ్మాం. అన్ని విషయాల్లో మోసం చేశాడు. ఒక్కసారి అన్నకు అవకాశం ఇద్దాం. అన్నను సీఎం చేద్దాం. ఆ తర్వాత ప్రతి రైతన్నకు రూ. 12500 చేతుల్లో పెడ్తాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల వద్దకు వెళ్లి చంద్రబాబు.. ఇచ్చే డబ్బులతో మోసపోకండి.. అన్న సీఎం అయిన తర్వాత చేయూత ద్వారా రూ.75 వేలు ఇస్తాడని చెప్పండి. పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తాడని చెప్పండి. ధర్మానికి, అధర్మానికి యుద్దం.. ప్రతి అవ్వ, తాతా దగ్గరకు వెళ్లండి.. అవ్వా రెండు నెలల కింద మీ పెన్షన్ ఎంత వచ్చేదని అడగండి.. ఆ అవ్వతాతలు పెన్షన్ రాలేదని, లేకుంటే వెయ్యి అని చెబుతారు. అప్పుడు.. ఎన్నికలు రాకుంటే చంద్రబాబు నాయుడు ఇచ్చేవాడా? అని అడగండి. అన్న ముఖ్యమంత్రి అయినా తర్వాత పెన్షన్ రూ. 3 వేలిస్తాడని చెప్పండి. ఇవ్వాల యుద్దం చేస్తున్నది ఒక్క చంద్రబాబుతోనే కాదు.. ఈనాడు.. ఆంధ్రజ్యోతిలతో కూడా చేస్తున్నాం. వీళ్లంతా ఇంకా 20 రోజుల్లో ఎన్నో డ్రామాలు చేస్తారు. ఇలాంటి ఎన్నో అన్యాయాల మధ్య.. ధర్మానికి, అధర్మానికి యుద్దం జరుగుతోందని మరిచిపోవద్దు. రాయదుర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాపు రాంచంద్రారెడ్డి, అనంతపురం ఎంపీ అభ్యర్థి తలారి రంగయ్యకు మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు కావాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు వేయండి. వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి’ అని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. -
ఫర్నీచర్ షాపులో అగ్నిప్రమాదం
-
ఫర్నీచర్ షాపులో అగ్నిప్రమాదం
హైదరాబాద్ : రాయదుర్గంలోని ఓ ఫర్నీచర్ షాపులో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. స్థానికులు వెంటనే స్పందించి... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. -
కూలీలే బలి పశువులు!
రాయదుర్గం : ఇసుక దందాల్లో అధికార పార్టీ నేతలు లాభపడుతుండగా... బలవుతోంది మాత్రం పొట్ట కూటి కోసం కూలికి వెళ్తున్న బడుగు జీవులు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగా అసలు దొంగలు దొరల్లా తిరుగుతున్నారు. కూలీలు మాత్రం కేసుల్లో ఇరుక్కొంటున్నారు. దీనివల్ల వారి కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఆదివారం రాయదుర్గం నియోజకవర్గంలోని కణేకల్లు మండలం రచ్చుమర్రి వద్ద వేదావతి హగరి నది నుంచి ఇసుకను అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను పోలీసులు పట్టుకుని.. 15 మందిని అరెస్టు చేసిన విషయం విదితమే. వీరందరూ కర్ణాటక ప్రాంతానికి చెందిన కూలీలే. ఇంతటితో పోలీసులు చేతులు దులుపుకున్నారు. కీలక పాత్రధారి అయిన కర్ణాటకకు చెందిన మంజును ఇంత వరకు పట్టుకోలేదు. ఓ అధికార పార్టీ ముఖ్యనేత జోక్యం వల్ల ఈ కేసు విచారణలో పురోగతి కన్పించలేదన్న విమర్శలున్నాయి. ఈ సంఘటన వెలుగులోకి వచ్చి 48 గంటలు కాకముందే ఇదే నియోజకవర్గంలోని గుమ్మఘట్ట మండలంలో టీడీపీ ఎమ్పీటీసీ సభ్యుడి పొలంలో 50 ట్రిప్పుల ఇసుక డంపింగ్ బయటపడింది. ఇక్కడ ఇసుకను ఇతరులు డంపింగ్ చేశారంటూ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కేసులను నిష్పక్షపాతంగా విచారించాల్సిన పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి తూతూమంత్రంగా విచారణ చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులే నిందితుల పేర్లు వెల్లడించి, ఆ వ్యక్తులను సైతం పట్టుకోకపోవడం ఈ విమర్శలకు బలం చేకూర్చుతోంది. రచ్చుమర్రి ఇసుక కుంభకోణంలో కణేకల్లు మండలానికి చెందిన ముఖ్య నేతల హస్తం ఉందని ఆ మండల ప్రజలు కోడై కూస్తున్నా.. పోలీసు, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. వారితో సత్సంబంధాలు ఉన్న ఓ వ్యక్తి ద్వారా కేసును నీరుగార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. బొమ్మనహాళ్ మండలంలో కూడా కర్ణాటక సరిహద్దున కొంత మంది టీడీపీ నేతలు ఇసుక డంపింగ్ చేశారు. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోలేదు. రాయదుర్గం మండలంలోనూ ఇదే పరిస్థితి. నేతలకు చీవాట్లు పెట్టిన ఎమ్మెల్యే! తాను ముఖ్యమంత్రి చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా ఉన్నానని, ఇసుక దందాను బట్టబయలు చేసి పరువుతీశారంటూ ఆయా మండలాల నేతలకు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు చీవాట్లు పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో అవాక్కైన నేతలు కేసులను నీరుగార్చే ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.