![BN Reddy Raidurgam Robbery Case Nepal Gang Arrested - Sakshi](/styles/webp/s3/article_images/2020/10/12/cp-sajjanar.jpg.webp?itok=QrZqViwF)
సాక్షి, హైదరాబాద్: నగరంలోని రాయదుర్గం కాంట్రాక్టర్ మధుసూదన్ రెడ్డి ఇంట్లో జరిగిన దోపిడీ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పనిమనుషులుగా చేరి.. భారీగా నగదు, బంగారం దోచుకెళ్లిన నేపాల్ గ్యాంగ్‌ని రాష్ట్ర పోలీసులు యూపీ సరిహద్దులో అరెస్ట్ చేశారు. వీరు రాయదుర్గంలో ఈనెల 6న మధునూదన్‌రెడ్డి భార్యకి మత్తు మందు ఇచ్చి.. 15 లక్షల రూపాయల నగదు, బంగారం చోరీ చేశారు. వీరు వాచ్‌మెన్, పనిమనుషులుగా ఇళ్లలోకి చేరి చోరీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు వీరి వద్ద నుంచి 5 లక్షల రూపాయల నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. ‘రాయదుర్గం పీఎస్ పరిధిలో జరిగిన చోరికి సంబంధించి నేపాల్ గ్యాంగ్‌కి చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశాం. ఇంకా ఐదురుగు పరారీలో ఉన్నారు. కాంట్రాక్టర్ మధుసూదన్ రెడ్డి ఇంట్లో పనిమనిషిగా చేరిన ఈ గ్యాంగ్ సభ్యురాలు ఇంట్లో ఉన్నవారికి ఆహారం, టీలో మత్తు మందు ఇచ్చింది. ఈ గ్యాంగ్ లీడర్ నేత్ర నేపాల్‌కి చెందిన వారందరినీ కూడగట్టుకొని దోపిడీ చేస్తున్నాడు. గతంలో బెంగుళూరు లో కూడా ఇలాగే దోపిడీ చేశాడు. రాబరీ చేశాక తలో దారిలో నేపాల్‌కి వెళ్లి అక్కడ డబ్బులు, నగలు పంచుకుంటారు. 10 టీమ్స్ ద్వారా ఈ గ్యాంగ్ ని పట్టుకున్నాం. పరారీలో ఉన్నవారిని పట్టుకోవడానికి మరిన్ని టీమ్స్ రాజస్థాన్, ఢిల్లీలోకి వెళ్లాయి. ఈ గ్యాంగ్ మెంబర్స్‌ని అరెస్ట్ చేయడానికి ఇతర రాష్ట్రాల పోలీసులు పూర్తిగా సహకరించారు. ఎవరైనా కొత్తవాళ్లను పనిలో పెట్టుకోవాలంటే వారి బ్యాగ్రౌండ్ చెక్ చేసుకోవాలి’ అని సూచించారు. (చదవండి: డిన్నర్‌లో మత్తు మందు ఇచ్చి.. భారీ చోరీ)
రెండు రోజుల కస్టడీకి నరసిహ రెడ్డి బినామీలు
మల్కాజ్‌గిరి మాజీ ఏసీపీ నర్సింహారెడ్డి కేసుకు సంబంధించి 8 మంది బినామీలను 2రోజులపాటు కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. రేపటి నుంచి రెండు రోజులపాటు వీరిని ఏసీబీ అధికారులు విచారించనున్నారు. అలానే నర్సింహారెడ్డి ఆస్తులు, భూ దందాలపై ఆరా తీయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment