gang thieves
-
రైల్వేస్టేషన్లలో లేడీ కిలాడీ గ్యాంగ్.. ఒక్కో స్టేషన్లో ఒక్కో పేరుతో ప్రత్యక్షం
తిరుపతి అర్బన్: రైల్వే స్టేషన్లను టార్గెట్ చేసుకుని.. ప్రయాణికుల జేబులను కొల్లగొట్టడమే వృత్తిగా జీవనం సాగిస్తున్న ముగ్గురు లేడీ కిలాడీలను తిరుపతి రైల్వే స్టేషన్లో శనివారం పోలీసులు అరెస్టు చేసి 3 సెల్ఫోన్లతోపాటు రూ.34,500 స్వాదీనం చేసుకున్నారు. తమిళనాడులోని తుతుకుడి జిల్లాకు చెందిన ఎం.మీనా (23), ఎస్.రాణి (29), ఏ అంజలి (25) రైల్వే స్టేషన్లను టార్గెట్ చేస్తూ ఒక్కో రైల్వే స్టేషన్లో తిష్ట వేసి చోరీలు చేస్తారు. తర్వాత మరో రైల్వే స్టేషన్‌కు వెళ్లి మారు పేర్లతో ఇదే తంతు కొనసాగిస్తారు. వారి భర్తలు వీరున్న సమీపంలోనే కూలి పనులు చేస్తుంటారు. ఇదే సమయంలో వీరు చోరీ లకు పాల్పడుతుంటారు. ముగ్గురిపై రైల్వే పోలీసులు ఐదు కేసులు నమోదు చేశారు. చదవండి: వాళ్ళది వివాహేతర సంబంధం కాదు: మనోజ్ తండ్రి -
రూ.90 లక్షల ప్లాట్ కొని.. సొరంగం తవ్వి!
జైపూర్: దొంగతనం చేసేవాడు తన పనికి అవసరమొచ్చే వస్తువులు కొనుగోలు చేస్తాడు. కానీ ఈ దొంగలు మాత్రం ఓ డాక్టర్ ఇంట్లో దొంగతనం చేయడం కోసం ఏకంగా 90 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఓ ప్లాట్ కొనుగోలు చేశారు. ఇంత ఖర్చు పెట్టారంటే ఆ డాక్టర్ ఇంట్లో ఎంత విలువైన నిధి నిక్షేపాలు ఉన్నాయో అని భావిస్తే.. తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఇక్కడ దొంగలు అపహరించింది వెండిని. వెండి దొంగతనం చేయడం కోసం ఇంత ఖర్చు పెట్టి ప్లాట్ కొనడం ఏంటి.. అసలు ఏం జరిగింది అనే విషయాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే. రాజస్తాన్ జైపూర్ వైశాలి నగర్ ప్రాంతానికి చెందిన డాక్టర్ సునీత్ సోని ఇంటిలో రెండు రోజుల క్రితం భారీ దొంగతనం జరిగింది. తన ఇంట్లో ఓ పెట్టె నిండా ఉన్న వెండిని అపహరించారు దొంగలు. ఇంటి నిండా సీసీ కెమరాలు.. ఫుల్ సెక్యూరిటి ఉన్నప్పటికి ఈ దొంగతనం ఎలా జరిగిందో అతడికి అంతుబట్టలేదు. దాంతో ఓ సారి తన ఇంటి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తన ఇంటి బేస్మెంట్లో ఓ పెద్ద సొరంగం కనిపించింది. దాని గుండా నడుచుకుంటు వెళ్తే తన ఎదురు ప్లాట్ వచ్చింది. దాంతో తన ఇంట్లో దొంగతనం ఎలా జరిగిందో క్లియర్‌గా అర్థం అయ్యింది డాక్టర్‌కి. దొంగలు తన ఇంట్లో ఉన్న వెండిని కాజేయడానికి తన ఇంటి ఎదురుగా ఉన్న ప్లాట్ బేస్మెంట్ నుంచి తన ఇంటి వరకు సొరంగం తవ్వారు. దాని గుండా తన ఇంట్లో ప్రవేశించి.. చోరికి పాల్పడ్డారు. దీని గురించి డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం డాక్టర్ ఇంట్లో ఉన్న వెండిని కాజేయడం కోసమే దొంగలు అతడి ఇంటికి ఎదురుగా ఉన్న ప్లాట్‌ని 90 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారని తెలిసింది. మూడు నెలల క్రితం ప్లాట్ కొనుగోలు చేసిన దొంగలు నాటి నుంచి సొరంగం తవ్వడం మొదలు పెట్టారని వెల్లడించారు. ఇక డాక్టర్ ఇంట్లో ఉన్న వెండి గురించి పూర్తిగా తెలిసిన వారే ఈ దొంగతనం వెనక ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. చదవండి: పాక్ కుట్ర.. భారత్‌లోకి 150 మీటర్ల సొరంగం! ఆల్రెడీ పెళ్లైన ప్రేయసి ఇంటికి సొరంగం -
రాయదుర్గంలో దోపిడీ.. నేపాల్ గ్యాంగ్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని రాయదుర్గం కాంట్రాక్టర్ మధుసూదన్ రెడ్డి ఇంట్లో జరిగిన దోపిడీ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పనిమనుషులుగా చేరి.. భారీగా నగదు, బంగారం దోచుకెళ్లిన నేపాల్ గ్యాంగ్‌ని రాష్ట్ర పోలీసులు యూపీ సరిహద్దులో అరెస్ట్ చేశారు. వీరు రాయదుర్గంలో ఈనెల 6న మధునూదన్‌రెడ్డి భార్యకి మత్తు మందు ఇచ్చి.. 15 లక్షల రూపాయల నగదు, బంగారం చోరీ చేశారు. వీరు వాచ్మెన్, పనిమనుషులుగా ఇళ్లలోకి చేరి చోరీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు వీరి వద్ద నుంచి 5 లక్షల రూపాయల నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. ‘రాయదుర్గం పీఎస్ పరిధిలో జరిగిన చోరికి సంబంధించి నేపాల్ గ్యాంగ్‌కి చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశాం. ఇంకా ఐదురుగు పరారీలో ఉన్నారు. కాంట్రాక్టర్ మధుసూదన్ రెడ్డి ఇంట్లో పనిమనిషిగా చేరిన ఈ గ్యాంగ్ సభ్యురాలు ఇంట్లో ఉన్నవారికి ఆహారం, టీలో మత్తు మందు ఇచ్చింది. ఈ గ్యాంగ్ లీడర్ నేత్ర నేపాల్‌కి చెందిన వారందరినీ కూడగట్టుకొని దోపిడీ చేస్తున్నాడు. గతంలో బెంగుళూరు లో కూడా ఇలాగే దోపిడీ చేశాడు. రాబరీ చేశాక తలో దారిలో నేపాల్‌కి వెళ్లి అక్కడ డబ్బులు, నగలు పంచుకుంటారు. 10 టీమ్స్ ద్వారా ఈ గ్యాంగ్ ని పట్టుకున్నాం. పరారీలో ఉన్నవారిని పట్టుకోవడానికి మరిన్ని టీమ్స్ రాజస్థాన్, ఢిల్లీలోకి వెళ్లాయి. ఈ గ్యాంగ్ మెంబర్స్‌ని అరెస్ట్ చేయడానికి ఇతర రాష్ట్రాల పోలీసులు పూర్తిగా సహకరించారు. ఎవరైనా కొత్తవాళ్లను పనిలో పెట్టుకోవాలంటే వారి బ్యాగ్రౌండ్ చెక్ చేసుకోవాలి’ అని సూచించారు. (చదవండి: డిన్నర్లో మత్తు మందు ఇచ్చి.. భారీ చోరీ) రెండు రోజుల కస్టడీకి నరసిహ రెడ్డి బినామీలు మల్కాజ్గిరి మాజీ ఏసీపీ నర్సింహారెడ్డి కేసుకు సంబంధించి 8 మంది బినామీలను 2రోజులపాటు కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. రేపటి నుంచి రెండు రోజులపాటు వీరిని ఏసీబీ అధికారులు విచారించనున్నారు. అలానే నర్సింహారెడ్డి ఆస్తులు, భూ దందాలపై ఆరా తీయనున్నారు. -
అంతర్రాష్ట్ర గొలుసు దొంగల ముఠా అరెస్ట్
గణపవరం : మహిళల మెడలో బంగారు ఆభరణాలను తెంచుకుని పరారయ్యే ముగ్గురు సభ్యులు గల అంతర్రాష్ట్ర గొలుసు దొంగల ముఠాను భీమవరం పోలీసులు అరెస్టు చేసి, నిందితుల నుంచి రూ.4.13 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రెండు బైక్‌లు, రెండు నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి చెప్పారు. గణపవరం సీఐ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. రాజస్థాన్ రాష్ట్రం దౌల్పూర్ జిల్లాకు చెందిన రామ్ భరణ్ సింగ్‌పర్మార్, రమాకాంత్ సవిత, రవీంద్రసింగ్ నాలుగేళ్లుగా భీమవరంలో మార్బుల్స్ అతికించే పనిచేస్తున్నారు. వ్యసనాలకు బానిసలై సంపాదించిన సొమ్ము జల్సాలకు సరిపోకపోవడంతో దొంగతనాలకు అలవాటుపడ్డారు. ఒంటరిగా నడిచే వెళ్లే మహిళల మెడలోని బంగారు వస్తువులను దొంగిలిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి నేరాలకు ఒడిగడుతూ ఎదురు తిరిగినవారిని తుపాకీతో బెదిరిస్తున్నారు. మావూళ్లమ్మ గుడి వద్ద ఒంటరిగా ఉన్న మహిళ మెడలో ఆభరణాలను ఈ ముగ్గురూ బైక్‌పై వచ్చి తెంపుకుని వెళుతుండగా ఆమె కేకలు వేయడంతో అక్కడే ఉన్న పాలకోడేరు కానిస్టేబుల్ వై.వెంకటేశ్వరరావు వారిని వెంబడించాడు. దీంతో నిందితుల్లో ఒకరు తన దగ్గర ఉన్న తుపాకీతో కానిస్టేబుల్‌పై కాల్పులు జరిపాడు. కాల్పులనుంచి కానిస్టేబుల్ తప్పించుకుని వారిని పట్టుకునేందుకు వెంటపడ్డాడు. దీనిని చూసిన భీమవరం చైతన్య ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి హరీష్.. కానిస్టేబుల్‌తో పాటు వెంబడించి నిందితుల్లో ఒకరిని పట్టుకుని భీమవరం పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. మిగిలిన ఇద్దరిని సీఐలు జి.కెనడీ, ఆర్జీ జయసూర్యలు లూథరన్ హైస్కూల్ గ్రౌండ్లో బుధవారం అరెస్ట్ చేశామని ఎస్పీ వివరించారు. అలాగే బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన 15 మందిని, వారికి సహకరించిన ఏజెంట్లను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారి వివరాల తెలుసుకున్న అనంతరమే పనిలో పెట్టుకోవాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ధైర్యసాహసాలు ప్రదర్శించిన కానిస్టేబుల్ వై.వెంకటేశ్వరరావుకు ఎస్పీ రివార్డు అందజేశారు. కానిస్టేబుల్, విద్యార్థి హరీష్‌కు బ్రేవరీ అవార్డు కోసం ఉన్నతాధికారులకు సిఫార్సు చేశామన్నారు. ఏలూరు డీఎస్సీ కేజీవీ సరిత, భీమడోలు సీఐ ఎన్.దుర్గా ప్రసాద్, గణపవరం ఎస్సై ఎ.పైడిబాబు పాల్గొన్నారు.