హైదరాబాద్ : రాయదుర్గంలోని ఓ ఫర్నీచర్ షాపులో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. స్థానికులు వెంటనే స్పందించి... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.