furniture shop
-
ఫర్నిచర్ షాపులో అగ్నిప్రమాదం
-
ఐకియా క్యా కియా!.. సిబ్బందికి రూ.954 కోట్ల నజరానా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐకియా బ్రాండ్ పేరుతో ఫర్నీచర్ రంగంలో ఉన్న నెదర్లాండ్స్‌కు చెందిన ఇంగ్కా గ్రూప్ ఔదార్యం చాటుకుంది. కోవిడ్–19 మహమ్మారి కాలంలోనూ శ్రమటోడ్చిన ఉద్యోగులకు రూ.954 కోట్ల నజరానా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐకియా రిటైల్, ఇంగ్కా సెంటర్స్, ఇంగ్కా ఇన్వెస్ట్మెంట్స్ సిబ్బందికి ఈ మొత్తాన్ని నగదు రూపంలో అందించనున్నట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. 32 దేశాల్లో గ్రూప్‌నకు 1,70,000 పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. ఐకియా సంస్థ ఇండియాలో తమ తొలి స్టోర్‌ని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ముంబై, ఢిల్లీ, బెంగళూరు తదితర నగరాలకు విస్తరించింది. తాజాగా ఐకియా సంస్థ సిటీ స్టోర్ల పేరుతో మెట్రో నగరాల్లో అనేక అవుట్లెట్లను తెరిచే పనిలో ఉంది. -
నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం
-
ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్: నగరంలోని హబీబ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం వేకువజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఆగపురాలోని ఫర్నిచర్ దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అవి తీవ్రమై పక్కనే ఉన్న మరో రెండు గోదాములకు అంటుకున్నాయి. దీంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఐదు ఫైరింజన్లతో తీవ్రంగా శ్రమించిన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సుమారు రూ.10 లక్షల మేర నష్టం జరిగినట్లు భావిస్తున్నారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
ఫర్నీచర్ షాపులో మంటలు
-
ఫర్నిచర్ దుకాణంలో ప్రమాదం..భారీ నష్టం
హైదరాబాద్: పాతబస్తీ తలాబ్‌కట్టాలో ఆదివారం అర్థరాత్రి జరిగిన ప్రమాదంలో భారీ నష్టం వాటిల్లింది. స్థానిక రోడ్ నంబర్-2 జహంగీర్నగర్లోని షేక్ అన్వర్‌కు చెందిన ఫర్నిచర్ దుకాణంలో అర్థరాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు రూ.12 లక్షల మేర నష్టం వాటిల్లిందని యాజమాన్యం చెబుతోంది. ఈ మేరకు భవానీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఫర్నీచర్ షాపులో అగ్నిప్రమాదం
-
ఫర్నీచర్ షాపులో అగ్నిప్రమాదం
హైదరాబాద్ : రాయదుర్గంలోని ఓ ఫర్నీచర్ షాపులో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. స్థానికులు వెంటనే స్పందించి... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. -
ఆసిఫ్‌నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్: ఆసిఫ్‌నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం మధ్యాహ్నం ఓ ఫర్నీచర్ షాపులో ఆకస్మత్తుగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్వూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. -
హర్యానాలో భారీ అగ్నిప్రమాదం
-
8 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్
గుంటూరు(వినుకొండ): వినుకొండ పట్టణంలోని మార్కాపురం రోడ్డులో ఉన్న ఓ ఫర్నిచర్ షాపులో ఆదివారం రహస్యంగా పేకాటాడుతున్న వారిపై పోలీసులు రైడ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.3.65 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు స్పెషల్ బ్రాంచి పోలీసులు తెలిపారు. -
కుషాయిగుడలో భారీ అగ్నిప్రమాదం