Furniture Chain IKEA Announced Rs 954 Crores Bonus To Its Employees
Sakshi News home page

ఐకియా క్యా కియా!.. సిబ్బందికి రూ.954 కోట్ల నజరానా!

Published Tue, Nov 2 2021 7:45 AM | Last Updated on Tue, Nov 2 2021 5:44 PM

Furniture Chain IKEA Announced Rs 954 Crores Bonus To Its Employees - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఐకియా బ్రాండ్‌ పేరుతో ఫర్నీచర్‌ రంగంలో ఉన్న నెదర్లాండ్స్‌కు చెందిన ఇంగ్‌కా గ్రూప్‌ ఔదార్యం చాటుకుంది. కోవిడ్‌–19 మహమ్మారి కాలంలోనూ శ్రమటోడ్చిన ఉద్యోగులకు రూ.954 కోట్ల నజరానా ప్రకటించింది. 

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐకియా రిటైల్, ఇంగ్‌కా సెంటర్స్, ఇంగ్‌కా ఇన్వెస్ట్‌మెంట్స్‌ సిబ్బందికి ఈ మొత్తాన్ని నగదు రూపంలో అందించనున్నట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. 32 దేశాల్లో గ్రూప్‌నకు 1,70,000 పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు.  

ఐకియా సంస్థ ఇండియాలో తమ తొలి స్టోర్‌ని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ముంబై, ఢిల్లీ, బెంగళూరు తదితర నగరాలకు విస్తరించింది. తాజాగా ఐకియా సంస్థ సిటీ స్టోర్ల పేరుతో మెట్రో నగరాల్లో అనేక అవుట్‌లెట్లను తెరిచే పనిలో ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement