దసరా, దీపావళి వచ్చిందంటే.. ఉద్యోగుల్లో ఆనందం రెట్టింపు అవుతుంది. ఎందుకంటే ఈ సమయంలో చాలా కంపెనీలు బోనస్, ఇంక్రిమెంట్స్ వంటివి అందిస్తాయి. మరికొన్ని ప్రైవేట్ సంస్థలైతే ఖరీదైన కార్లు, బైకులను శాతం గిఫ్ట్‌గా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు తాజాగా కేంద్రం రైల్వే ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.
రైల్వే ఉద్యోగులకు రూ. 2,029 కోట్ల ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది 11,72,140 మంది కార్మికులకు ప్రయోజనం చేకూర్చుతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అర్హత కలిగిన ఉద్యోగులందరికీ.. రూ. 7000 కనీస వేతనం కింద 78 రోజులకు బోనస్ అందించనున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: ఎస్‌బీఐ చైర్మన్ కీలక ప్రకటన: ఈ ఆర్థిక సంవత్సరంలో..
రైల్వే శాఖలో ట్రాక్ మెయింటెనెర్స్, స్టేషన్ మాస్టర్స్, టెక్నీషియన్స్, సూపర్ వైజర్స్, పాయింట్స్ మెన్, గార్డ్స్, లోకో పైలెట్స్, మినిస్టీరియల్ స్టాప్, గ్రూప్-సీ విభాగాలకు చెందిన ఉద్యోగులు బోనస్ పొందనున్నారు. 58,642 ఖాళీల భర్తీ ప్రక్రియ కూడా కొనసాగుతుందని, రిక్రూట్‌మెంట్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అశ్విని వైష్ణవ్ అన్నారు.
रेलवे इम्प्लॉईज़ के लिए 2 हजार 29 करोड़ रुपये का प्रोडक्टिविटी लिंक्ड बोनस माननीय प्रधानमंत्री जी की अध्यक्षता में कैबिनेट में अप्रूव हुआ है-माननीय रेल मंत्री @ashwinivaishnaw जी#ShramevJayate pic.twitter.com/15bHeQufpZ
— Ministry of Railways (@RailMinIndia) October 3, 2024
Comments
Please login to add a commentAdd a comment