ఎస్‌బీఐ చైర్మన్ కీలక ప్రకటన: ఈ ఆర్థిక సంవత్సరంలో.. | SBI To Add 600 New Branches in FY25 | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ చైర్మన్ కీలక ప్రకటన: ఈ ఆర్థిక సంవత్సరంలో..

Published Thu, Oct 3 2024 9:23 AM | Last Updated on Thu, Oct 3 2024 11:49 AM

SBI To Add 600 New Branches in FY25

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి సీఎస్ శెట్టి.. ఎస్‌బీఐ అభివృద్ధికి పలు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగానే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి మరో 600 బ్రాంచ్‌లు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

ఎస్‌బీఐ కొత్త శాఖలను పెద్ద రెసిడెన్షియల్ టౌన్‌షిప్‌లతో సహా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. దిగ్గజ ప్రభుత్వ బ్యాంక్ ఎస్‌బీఐ గత ఆర్ధిక సంవత్సరంలో 137 కొత్త బ్రాంచ్‌లను ప్రారంభించింది. ఇందులో 59 గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.

2024 మార్చి నాటికి ఎస్‌బీఐ దేశంలో 22,542 శాఖలను, 65,000 ఏటీఎంలను, 85,000 బిజినెస్ కరస్పాండెంట్లను కలిగి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి అనుకున్న విధంగా అన్నీ సక్రమంగా జరిగితే ఎస్‌బీఐ శాఖల సంఖ్య 23,142కు చేరుతుంది. ఎస్‌బీఐకు ప్రస్తుతం 50 కోట్ల కంటే ఎక్కువ ఖాతాదారులు ఉన్నట్లు సీఎస్ శెట్టి పేర్కొన్నారు. ప్రతి భారతీయ కుటుంబానికి మేము బ్యాంకర్ అని చెప్పడానికి మేము గర్విస్తున్నామని ఆయన అన్నారు.

ఇదీ చదవండి: భారత్‌ అప్రమత్తంగా ఉండాలి: జీటీఆర్‌ఐ

డిపాజిటర్ల కోసం కొత్త ప్లాన్స్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) డిపాజిటర్ల కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్స్, రికవరింగ్ డిపాజిట్స్, సిప్ పెట్టుబడుల కాంబోతో ఓ కొత్త సర్వీస్ తీసుకురావాలనే ఆలోచనలో ఎస్‌బీఐ ఉన్నట్లు సీఎస్ శెట్టి వెల్లడించారు. ఈ ఆవిష్కరణలు మొత్తం యువ కస్టమర్లను, ముఖ్యంగా Gen Z తరాన్ని ఆకర్షించడానికి ఉద్దేశించినట్లు ఇటీవల పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement