‘చంద్రబాబు ఐదేళ్ల దుర్మార్గ పాలనలో మీరు పడ్డ కష్టాలను నా పాదయాత్రతో స్వయంగా చూశాను.. మీ బాధలను విన్నాను. ఇవన్నీ వినీ మీకు ఓ మాట ఇస్తున్నాను.. నేనున్నానని. ప్రతి పేదవాడికి నేను అండగా ఉంటానని భరోసా ఇస్తున్నాను’ అని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ సమస్యల పరిష్కారానికి మనం నవరత్నాలను ప్రకటించుకున్నామని, ఈ నవరత్నాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని.. ‘చంద్రబాబు ఇచ్చే డబ్బులతో మోసపోవద్దు.. 20 రోజులు ఓపిక పట్టి అన్నకు ఒకసారి అవకాశం ఇద్దాం. అన్నను సీఎం చేసుకుందాం.. మన సమస్యలను పరిష్కరించుకుందాం’ అని ప్రతి అక్కకు.. ప్రతి అవ్వకు.. ప్రతి తాతాకు చెప్పండి’ అని వైఎస్ జగన్ కార్యకర్తలను కోరారు.