ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ని మద్యం అమ్మకాల్లో, రైతుల అత్మహత్యల్లో నెంబర్‌వన్‌గా నిలిపారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. అబద్ధాల ద్వారా ప్రజలను మోసం చేసి, గిరిజనులను, దళితులను అన్యాయానికి గురిచేసిన చంద్రబాబుకు దేశంలో నెంబర్‌వన్ సీఎం స్థానం ఇవ్వచ్చని ఎద్దేవా చేశారు. ఐదేళ్ల తన పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పకుండా.. మీ భవిష్యత్తు తన చేతిలోనే ఉందని మరోసారి మోసానికి దిగే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.