క్రీడలకూ ప్రాధాన్యమివ్వాలి | sports also should give priority | Sakshi
Sakshi News home page

క్రీడలకూ ప్రాధాన్యమివ్వాలి

Published Sun, Jan 19 2014 12:11 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM

sports also should give  priority

రాయదుర్గం, న్యూస్‌లైన్: చదువుతోపాటు క్రీడలకు కూడా ప్రతీ విద్యార్థి ప్రాధాన్యత ఇవ్వాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) వైస్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ రాహుల్ బొజ్జా సూచించారు. గచ్చిబౌలిలోని నాసర్ బాయ్స్ స్కూల్‌లో శనివారం 15వ వార్షిక క్రీడోత్సవాలను ఆయన ప్రారంభించారు.
 
 విద్యార్థులను అగ్ని, ఆకాష్, పృథ్వి, సూర్య హౌజ్‌లుగా విభజించి వారి మధ్య అథ్లెటిక్స్, అబ్‌స్టాకిల్ రేస్, రిలే రేస్, జిమ్నాస్టిక్స్, కరాటే, రైడింగ్ బాస్కెట్‌బాల్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ చాటిన సూర్య హౌజ్ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది.   ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ బేగమ్ అనీస్ ఖాన్, డెరైక్టర్ కుత్బుద్దీన్‌ఖాన్, ప్రిన్సిపల్ హఫీజుద్ధీన్ అహ్మద్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement