
సాక్షి,హైదరాబాద్: రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై సోమవారం(జులై 15) హిట్ అండ్ రన్ ఘటన చోటు చేసున్నట్లు తెలుస్తోంది. టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఫ్లైఓవర్ పైనుంచి కింద పడి ఎక్సెల్ వాహనంపై ఉన్న వ్యక్తి మృతి చెందాడు.
మృతుడు కాకినాడకు చెందిన సోము సుబ్బు (35) గా పోలీసులు గుర్తించారు. సుబ్బు టీవీఎస్ ఎక్స్ఎల్‌పై టిఫిన్స్ అమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఉదయం 5:30గంటలకు ఇంటి నుంచి బయలు దేరిన సుబ్బు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అతడి కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది.
ప్రమాదం జరిగిన ప్రదేశంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో ప్రమాదం జరిగిన తీరుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిజంగానే ఏదైనా వాహనం ఢీ కొట్టిందా లేదంటే సెల్ఫ్ స్కిడ్ అయి పడ్డాడా అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment