సాక్షి, అనంతపురం : మంత్రి కాల్వ శ్రీనివాస్ నామినేషన్‌పై హై డ్రామా నెలకొంది. రాయదుర్గం టీడీపీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన కాలువ శ్రీనివాస్.. ఒక పేజీలో కొట్టివేతలతోపాటు అసంపూర్తిగా సమాచారం ఇచ్చారు. దీంతో కాలువ శ్రీనివాస్ నామినేషన్‌ను తిరస్కరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాపు రామచంద్రా రెడ్డి ఎన్నికల అధికారిని కోరారు. ఈ సందర్భంగా తీవ్ర అసహనానికి గురైన మంత్రి కాలువ రాయదుర్గం రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో హల్‌చల్ చేశారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిపైకి దౌర్జన్యానికి దిగారు. అభ్యంతరాలపై సమాధానం దాటవేస్తూ సాక్షి మీడియాపై అక్కసును వెళ్లగక్కారు. నామినేషన్ పరీశీలన కేంద్రం నుంచి బయటకు వచ్చిన ఆయన.. నామినేషన్ ఆమోదించేలా ఉన్నతాధికారులపై ఒత్తిళ్లకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఇక జిల్లాలోని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్‌లను ఎన్నికల అధికారులు ఆమోదించారు. గుంతకల్లు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వై.వెంకట్రామి రెడ్డి , కళ్యాణ దుర్గం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శ్రీమతి ఉష శ్రీచరణ్, మడకశిర అభ్యర్థి తిప్పేస్వామి, తాడిపత్రి అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి, హిందూపురం అభ్యర్థి మహ్మద్ ఇక్బాల్‌ల నామినేషన్‌లు ఆమోదం పొందాయి.
Comments
Please login to add a commentAdd a comment