Kalva Srinivas
-
టీడీపీ నేత కాల్వ శ్రీనివాస్ ఓ దద్దమ్మ: కాపు రామచంద్రారెడ్డి
సాక్షి, అనంతపురం జిల్లా: టీడీపీ నేత కాల్వ శ్రీనివాస్ ఓ దద్దమ్మ అని, రాయదుర్గంను అభివృద్ధి చేయలేకపోయారంటూ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి మండిపడ్డారు. టీడీపీ పాలనలో వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని.. రామోజీరావు వద్ద కాల్వ శ్రీనివాస్ బ్రోకర్ పని చేశారంటూ దుయ్యబట్టారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘నేను చేసిన అభివృద్ధి చూపిస్తూ రోజూ ఫొటోలు పెడతా. సాగు, తాగునీటిపై టీడీపీ నేత కాల్వ శ్రీనివాస్ అబద్ధాలు చెబుతున్నారు. సీఎం జగన్ సహకారంతో రాయదుర్గం నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి కృషి చేశా. 45 గ్రామాలకు తారు రోడ్లు వేయించాను. 58 చెరువులకు నీటి సరఫరాకు చర్యలు చేపట్టామని కాపు రామచంద్రారెడ్డి అన్నారు. ఇదీ చదవండి: డబ్బు కుమ్మరిస్తేనే టీడీపీ ఎమ్మెల్యే టికెట్! -
టీడీపీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్‌కు భంగపాటు
కణేకల్లు: మండలంలోని బెణికల్లు గ్రామంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులకు భంగ పాటు ఎదురైంది. వివరాలు.. తటస్థంగా ఉన్న కొన్ని కుటుంబాలతోపాటు వైఎస్సార్సీపీ కార్యకర్తలను పార్టీలో చేర్పించేందుకు టీడీపీ నాయకులు విశ్వ ప్రయత్నాలు చేశారు. బలవంతంగా చేర్పించేందుకు యత్నించారు. కొందరికి పచ్చ చొక్కాలు కూడా కుట్టించి ఇచ్చారు. కొన్ని కుటుంబాలు చేరేందుకు సిద్ధంగా ఉన్నారని శుక్రవారం మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులను ఊరికి రప్పించారు. కాలవ చేతుల మీదుగా కండువా వేయించాలనుకొన్నారు.. టీడీపీ నాయకులు. పార్టీలో చేరేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో గతంలో టీడీపీలో ఉన్నోళ్లకే కండువాలు వేసి పార్టీలో చేరారని మాజీ మంత్రి గొప్పలు చెప్పి కార్యక్రమం ముగించేసి వెళ్లిపోయారు. కాగా మాజీ మంత్రి కాలవ శ్రీనివాసుల చేతుల మీదుగా కండువాలు వేయించుకొన్న ఎర్రిస్వామి, పోతప్ప, వన్నూరుస్వామి, సంగప్పతోపాటు మరో రెండు కుటుంబాలు టీడీపీకి చెందినవేనని బెణికల్లు గ్రామ వైఎస్సార్సీపీ నాయకులు జేజేటీ ప్రభాకర్‌రెడ్డి, జేజేటీ నగేష్ రెడ్డి, భీమిరెడ్డి తెలిపారు. ఊళ్లో కొత్త వారేవరూ పారీ్టలో చేరనందున మాజీ మంత్రి పాతోళ్లకే కండువాలు వేసి కొత్త వారు చేరినట్లు ఫోజులిచ్చారని విమర్శించారు. చదవండి: తమ్ముడి గెలుపుపై జేసీ బెంగ.. అగ్రవర్ణ పేదలకూ నవరత్నాలతో భారీ లబ్ధి -
వివాహితపై టీడీపీ నేత లైంగిక వేధింపులు
సాక్షి, అనంతపురం : రాయదుర్గం నియోజవర్గంలో టీడీపీ నేతలు బరి తెగిస్తున్నారు. డి.హీరేహల్ మండలం దొడగట్టలో వివాహితపై టీడీపీ నేత శ్రీనివాస్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అతని వేధింపులు భరించలేక వివాహిత పోలీసులను సంప్రదించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వివాహిత ఫిర్యాదు మేరకు శ్రీనివాస్‌పై 358, 534,509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, శ్రీనివాస్ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్ అనుచరుడిగా ఉన్నాడు. అధికారంలో ఉన్న సమయంలోనూ శ్రీనివాస్ పలు అరాచకాలకు, అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. -
మంత్రి కాల్వ నామినేషన్‌పై హై డ్రామా!
సాక్షి, అనంతపురం : మంత్రి కాల్వ శ్రీనివాస్ నామినేషన్‌పై హై డ్రామా నెలకొంది. రాయదుర్గం టీడీపీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన కాలువ శ్రీనివాస్.. ఒక పేజీలో కొట్టివేతలతోపాటు అసంపూర్తిగా సమాచారం ఇచ్చారు. దీంతో కాలువ శ్రీనివాస్ నామినేషన్‌ను తిరస్కరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాపు రామచంద్రా రెడ్డి ఎన్నికల అధికారిని కోరారు. ఈ సందర్భంగా తీవ్ర అసహనానికి గురైన మంత్రి కాలువ రాయదుర్గం రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో హల్చల్ చేశారు. వైఎస్సార్సీపీ అభ్యర్థిపైకి దౌర్జన్యానికి దిగారు. అభ్యంతరాలపై సమాధానం దాటవేస్తూ సాక్షి మీడియాపై అక్కసును వెళ్లగక్కారు. నామినేషన్ పరీశీలన కేంద్రం నుంచి బయటకు వచ్చిన ఆయన.. నామినేషన్ ఆమోదించేలా ఉన్నతాధికారులపై ఒత్తిళ్లకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక జిల్లాలోని వైఎస్సార్సీపీ అభ్యర్థులను నామినేషన్లను ఎన్నికల అధికారులు ఆమోదించారు. గుంతకల్లు వైఎస్సార్సీపీ అభ్యర్థి వై.వెంకట్రామి రెడ్డి , కళ్యాణ దుర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి శ్రీమతి ఉష శ్రీచరణ్, మడకశిర అభ్యర్థి తిప్పేస్వామి, తాడిపత్రి అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి, హిందూపురం అభ్యర్థి మహ్మద్ ఇక్బాల్‌ల నామినేషన్లు ఆమోదం పొందాయి. -
మరోసారి బయటిపడిన టీడీపీ డొల్లతనం
-
‘ఇంటింటా తెలుగుదేశం’లో మంత్రి కాల్వకు చుక్కెదురు
సాక్షి, రాయదుర్గం : అనంతపురం జిల్లా రాయదుర్గంలో మంత్రి కాల్వ శ్రీనివాస్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఏ ప్రభుత్వమూ చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశామని, అభివృద్ధి పనులు చేపట్టామని, తమను ఆశీర్వదించాలని రాయదుర్గంలో సోమవారం చేపట్టిన ‘ఇంటింటా తెలుగుదేశం’లో ఆయనకు చుక్కెదురు అయింది. ఏ ఇంటికెళ్లినా ప్రజలు సమస్యలను ఏకరువు పెట్టి మంత్రిని నిలదీశారు. మునిసిపల్ చైర్పర్సన్ ముదిగల్లు జ్యోతి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎనిమిదో వార్డులోని కృష్ణాశ్రమం వద్ద ‘ఇంటింటా తెలుగుదేశం’ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. సమావేశం ముగియగానే మహిళలు శాంతమ్మ, లక్ష్మీదేవి లేచి ‘వార్డులో పర్యటించండి, అభివృద్ధి గురించి తెలుస్తుంది’ అని మంత్రితో అన్నారు. డ్రెయినేజీలపై ఆక్రమణల తొలగింపు నిబంధనలు సాధారణ ప్రజలకేనా.. టీడీపీ వారికి వర్తించవా అంటూ శాంతమ్మ ప్రశ్నించారు. రోడ్లు , డ్రైనేజీలు లేక ఎక్కడికక్కడ ఆగిన మురుగు నీరు, అందులో పందుల స్వైర విహారం, దీంతో దుర్వాసనలో బతుకీడ్చుతున్నాం ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మంత్రి ఏ ఇంటికెళ్లినా అర్హత వున్నా పింఛన్ రాలేదని, ప్రభుత్వ ఇళ్లు, మరుగుదొడ్లు మంజూరు కాలేదని అర్హులైన నిరుపేదలు మొరపెట్టుకున్నారు. ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించకపోవడంతో పస్తులతో బతుకుబండి లాక్కొస్తున్నామని చేనేతలు వాపోయారు. అలాగే 20 ఏళ్లుగా టీడీపీ కార్యకర్తగా పనిచేస్తున్నా సరైన గుర్తింపు లేదని రాజు అనే కార్యకర్త మంత్రిపై మండిపడ్డాడు. ‘సార్, నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుండి టీడీపీకే ఓటు వేశాను, అదే పార్టీలోనే వున్నాను. పూరి గుడిశెలో వుంటున్నా, మగ్గం ద్వారా కుటుంబాన్ని పోషించుకుంటున్నా. అయినా ఒక ఇల్లు మంజూరు కాలేదు, ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ, సహకారాలు లేవు. వార్డులోని ప్రజల సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకెళితే ఆమె పట్టించుకోవడం లేదు. కనీసం బాడుగ వున్న ఇంటికి మరుగుదొడ్డి అయినా మంజూరు చేయమన్నా చేయలేదు. ఇన్ని రోజులు పార్టీ కార్యకర్తగా వున్నందుకు ఈ మేలు చాలు సార్ అంటూ’ దండం పెట్టాడు. ఇప్పుడు నీకేం కావాలి చెప్పు అని మంత్రి అడిగినా నాకు ఏమి వద్దు సార్ , ఇప్పటి వరకు పార్టీలో ఇచ్చిన మర్యాద చాలు అంటూ నిర్మొహమాటంగా చెప్పాడు.