సాక్షి, సిటీబ్యూరో: సాంకేతిక సమస్యలు నగర మెట్రో రైళ్లకు తరచూ బ్రేకులు వేస్తున్నాయి. మంగళవారం ఉదయం అమీర్‌పేట్– రాయదుర్గం రూట్లో సాంకేతిక సమస్యల కారణంగా ఓ రైలు పట్టాలపై నిలిచిపోయింది. దీంతో ఒకేవైపు మార్గంలోనే రైళ్ల రాకపోకలను కొనసాగించారు. రైళ్లు ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు అవస్థలకు గురయ్యారు. సమయానికి గమ్యం చేరుకోలేకపోయారు.
మెట్రో అధికారులు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో రద్దీ భారీగా పెరగడంతో సుమారు రెండు గంటల పాటు గందరగోళం నెలకొంది. అనంతరం అధికారులు సాంకేతిక సమస్యను పరిష్కరించడంతో అమీర్‌పేట్–రాయదుర్గం మార్గంలో రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి.
Comments
Please login to add a commentAdd a comment