చెరువును పరిశీలించిన జూలకంటి
చెరువును పరిశీలించిన జూలకంటి
Published Tue, Aug 2 2016 11:00 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM
మిర్యాలగూడ : మిషన్ కాకతీయ ద్వారా మరమ్మతులు చేపట్టిన చెరువులో ట్రాక్టర్‌తో దున్నుతున్నారని ఐలాపురం గ్రామానికి చెందిన రైతులు మంగళవారం ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనంతరం రైతులతో కలిసి సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి గ్రామంలోని చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఐలాపురం గ్రామం ఏర్పడిన నాటి నుంచి చెరువులో ఎక్స్ సర్వీస్‌మెన్‌కు ఎలా ఐదెకరాల భూమి పట్టా ఇచ్చారని అన్నారు. చెరువులో ట్రాక్టర్‌తో దున్నుతున్నారని, దాని వల్ల రైతులకు తీరని అన్యాయం జరగనున్నదని అన్నారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు ఇచ్చిన పట్టాను రద్దు చేయాలని కోరారు. చెరువును సందర్శించిన వారిలో సీపీఎం డివిజన్ కార్యదర్శి వీరేపల్లి వెంకటేశ్వర్లు, రెహమాన్‌ఖాన్, రైతులు సాయన్న, గోప్యానాయక్, భిక్షం, సైదానాయక్, దీప్లానాయక్, శ్రీను, రంగా, లచ్చ, వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement