Published
Mon, Aug 1 2016 10:42 PM
| Last Updated on Mon, Aug 13 2018 8:12 PM
ప్రజాసమస్యలపై అలుపెరుగని పోరాటం
మిర్యాలగూడ : నిత్యం ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటాలను నిర్వహించిన వ్యక్తి నకిరేకంటి అంజయ్య అని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని 18వ వార్డు బాపూజీనగర్‌లో నకిరేకంటి అంజయ్య వీధిని వారు ప్రారంభించారు. అనంతరం జరిగిన ప్రథమ వర్ధంతి సభలో ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. అంజయ్య 30 ఏళ్లుగా వివిధ రంగాల్లో పని చేయడంతో పాటు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీలేని పోరాటాలను నిర్వహించారని గుర్తు చేసుకున్నారు. క్యాన్సర్ వ్యాధితో ఆకాల మరణం చెందడం పార్టీకి తీరనిలోటన్నారు.అంజయ్య ఆశయ సాధన కోసం పార్టీ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డబ్బీకార్ మల్లేష్, డివిజన్, పట్టణ కార్యదర్శులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, జగదీష్‌చంద్ర, నాయకులు మల్లు గౌతమ్‌రెడ్డి, మహ్మద్‌బిన్ సయ్యద్, గొర్ల ఇంద్రారెడ్డి, శ్రీనివాస్, వెంకయ్య, రమేష్, పద్మయ్య, పాండు, రవినాయక్, పిచ్చయ్య, రామచంద్రు, లింగమయ్య, రహమన్‌ఖాన్ తదితరులున్నారు.