సాక్షి, హైదరాబాద్: ‘రామంతాపూర్ చెరువు రక్షణకు సంబంధించి మీరు 2016లో రెవెన్యూ విభాగానికి ఒక లేఖ రాశారు. దాని తర్వాత కూడా గుర్తు చేశారు. ఎప్పుడు లేఖ రాశార న్నది మీకు కచ్చితమైన తేదీ తెలియదు. మరో ఇద్దరు ముగ్గురు బిల్డర్లు చెరువు పరిధిలో భవన నిర్మాణాలు చేపట్టా లని మీరు కోరుకుంటున్నారా? ఇలాంటి సమాధానా లిచ్చి మమ్మల్ని రెచ్చగొట్టొద్దు. తీవ్ర అహసనంతో చెబుతు న్నాం.. మీ చట్టబద్ధమైన విధిని నిర్వర్తించనందుకు మీపై చర్య తీసు కోవాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తాం. ఈ పిటిషన్ 2005 నుంచి పెండింగ్‌లో ఉంది.
18 ఏళ్లు గడిచినా చెరువు రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంకా ఎన్నాళ్లు సమయం కావాలి. మీ పనిని మరొకరిపై నెట్టి తప్పించుకో లేరు. భవిష్యత్ తరాలకు తాగునీటికి సంబంధించిన అంశంలోనూ ఇంత నిర్లక్ష్యమా? ఉన్న జలవనరులను రక్షించు కోలేకపోతే భవిష్యత్ తరాలు క్షమించవు’ అని జీహెచ్‌ఎంసీ కమిష నర్‌పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. రామంతాపూర్ పెద్దచెరువును రియల్టర్లు, అక్ర మార్కులు ఆక్రమించకుండా అడ్డుకునేందుకు ఏం చర్యలు తీసుకున్నారని జీహెచ్‌ఎంసీ కమిష నర్ రొనాల్డ్ రోస్‌ను ప్రశ్నించింది.
దీనిపై రెవెన్యూ ఉన్నతాధి కారులకు 2016లోనే లేఖ రాశామని, వివ రాలు ఇంకా అందలేదని ఆయన చెప్పారు. దీంతో జీహెచ్ ఎంసీ కమిషనర్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం, అసహ నం వ్యక్తం చేసింది. తదు పరి విచారణకు కూడా హాజరు కావా లని తేల్చిచెప్పింది. ఈ పిటిషన్‌లో హెచ్‌ఎండీఏ కమిష నర్ ను ఇంప్లీడ్ చేయాలని రిజిస్ట్రీని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం ఆదేశించింది.
తదుపరి విచారణలోగా వివరాలు అందజేయండి..
హైదరాబాద్‌లో 532 చెరువులు క్షీణిస్తున్నాయని, 26 ఎకరాల్లోని రామంతాపూర్ పెద్దచెరువును డంపింగ్ యార్డుగా మారుస్తున్నారని, ఈ కారణంగా నీటికాలుష్యం పెరిగి దుర్వాసన వ్యాపిస్తోందని ఉస్మానియా ప్రొఫెసర్ డాక్టర్ కెఎల్ వ్యాస్ 2005లో లేఖ రాశారు. చెరువు సమీపంలో చెత్త వేయడంతో భూగర్భజలాలు కలుషితమవుతున్నా యని, తద్వారా వాతావరణం కలుషితమై, దుర్వాసనతో, దోమలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆ ప్రదేశంలో చెత్తను వేయకుండా జీహెచ్‌ఎంసీ అధికారు లకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ లేఖను హైకోర్టు విచా రణకు స్వీకరించింది.
జీహెచ్‌ఎంసీ కమిషనర్ హాజరుకావా లని గత విచారణ సందర్భంగా సీజే ధర్మాసనం ఆదేశించింది. దీనిలో భాగంగా మంగళవారం విచారణకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ హాజరయ్యారు. అయితే ధర్మాసనం అడిగిన ప్రశ్నలకు కమిషనర్ సరిగా సమాధానాలు ఇవ్వలేకపోవడంపై ప్రభుత్వ న్యాయవాది, జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్‌పై కూడా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్‌లోని వివరాలను కమిషనర్‌కు వివరించడంలో వీరు విఫలమ య్యారని వ్యాఖ్యానించింది. ఇకపై న్యాయవాదులపై అధార పడకుండా, సబ్జెక్టుపై సిద్ధమై కోర్టుకు రావాలని ఆదేశించింది.
రామంతాపూర్ పెద్దచెరువుకు కంచె ఎప్పుడు వేస్తారు.. చెత్తరహిత నీటి వనరుగా తీర్చిదిద్దడానికి, నీటి నిల్వ పెరిగేందుకు ఏం చర్యలు తీసుకున్నారు.. ఆక్రమణలను అరికట్టేందుకు ఏం చేస్తున్నారు.. చెత్తను వేయకుండా స్థానికులకు అవగాహన కల్పించడం.. చెరువు సరిహద్దులు రూపొందించడం.. మట్టి కోతను అరికట్టేందుకు పరీవాహక ప్రాంతాల్లో చెట్ల పెంపకాన్ని చేపట్టడం.. ఎఫ్‌టీఎల్ నిర్ధారణకు నోటిఫికేషన్ ఇవ్వడం.. వీటన్నింటిపై వివరాలు తెలుసుకుని అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment