GHMC Commissioner: రూలంటే .. రూలే! | GHMC Commissioner Ilambarithi Regulations In Office | Sakshi
Sakshi News home page

GHMC Commissioner: రూలంటే .. రూలే!

Published Wed, Feb 5 2025 7:11 AM | Last Updated on Wed, Feb 5 2025 7:12 AM

GHMC Commissioner Ilambarithi Regulations In  Office

సాక్షి,  హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఇలంబర్తి.. తనను కలిసేందుకు వచ్చేవారికి నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే తన పేషీలో పోలీసులు.. జీహెచ్‌ఎంసీ రెండు ప్రధాన ద్వారాల వద్ద సందర్శకుల రాకపోకలు తెలిసేలా టీవీలు ఏర్పాటు చేసిన కమిషనర్‌.. సాధారణ సందర్శకులకు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య వచ్చేవారికి అవకాశం కల్పిస్తున్నారు.  ప్రజా ప్రతినిధులకు సైతం ప్రత్యేక సమయం కేటాయించారు. 

ప్రజాప్రతినిధులు కలిసేందుకు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకని పేర్కొంటూ కమిషనర్‌ పేషీలో అంటించారు. సాధారణ ప్రజలు నేరుగా రాకుండా తొలుత పేషీలోకి వెళ్లే ముందే కౌంటర్‌లో ఉండే కంప్యూటర్‌ ఆపరేటర్‌ వద్ద తమ పేరు, వివరాలు, ఎందుకొచ్చిందీ వంటి వివరాలు వెబ్‌పోర్టల్‌లో నమోదు చేయించుకోవాలి. నమోదు కాగానే వారి ఫోన్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని చూపించి కమిషనర్‌ను కలిసేలా ఏర్పాట్లు చేశారు. నిర్ణీత సమయంలోగా వచ్చి నమోదు చేయించుకున్న వారందరికీ.. తనను క లిసేందుకు అవకాశం ఇస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ వర్గాలు చెబుతున్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement