సాక్షి, హైదరాబాద్: పరిశ్రమను మూసేయాలని నోటీసులిచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నాలు చేయొద్దని.. ఎందుకు మూసేయాలో నోటీసుల్లో జీహెచ్‌ఎంసీ పేర్కొనకపోవడం సరికాదని హైకోర్టు తప్పుపట్టింది. షోకాజ్ నోటీసే చట్ట ప్రకారం లేకపోతే ఎలా అంటూ ప్రశ్నిం చింది. ఏవిధంగా చట్టాన్ని ఉల్లంఘించిందీ నోటీసుల్లో పేర్కొనకపోతే ఎలా అని నిలదీసిం ది. హైదరాబాద్‌లోని శాస్త్రిపురంలో ఒక పరిశ్రమను మూసివేతకు ఇచ్చిన నోటీసులో పేర్కొ న్న విషయానికి తమ ఎదుట చేస్తున్న వాదనలకు పొంతన లేదని వ్యాఖ్యానించింది. ఈ గందరగోళాన్ని నివృత్తి చేసేందుకు ఈ నెల 15న జరిగే విచారణకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ వ్యక్తిగతంగా హాజరై వివరించాలని ఆదేశించిం ది. శాస్త్రిపురంలోని తన గోదాంను మూసేయాలని జీహెచ్‌ఎంసీ మార్చి 5న ఇచ్చిన నోటీసును రద్దు చేయాలని కోరుతూ మహమ్మద్ తౌఫీక్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం శుక్రవారం విచారించింది. నివాస ప్రాంతాల్లో పరిశ్రమల్ని ఏర్పాటు చేసి చట్టాన్ని ఉల్లంఘించారా లేక మాస్టర్‌ప్లాన్‌ను వ్యతిరేకించారా.. కాలుష్యానికి కారణం అవ్వడం వల్ల నోటీసు ఇచ్చారా.. ఏ చట్ట ప్రకారం నోటీసు ఇచ్చారో స్వయంగా విచారణకు హాజరై తెలియజేయాలని ఆదేశించింది. నోటీసులోనే తప్పుందని అభిప్రాయపడింది. లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేస్తే నోటీసు ఇచ్చే అధికారం ఉన్న కమిషనర్ నోటీసు జారీకి ముందు చట్టాలను చదవాలని సూచించింది.
మాస్టర్‌ప్లాన్ స్పష్టం చేస్తోంది..
ఇంతకు శాస్త్రిపురం నివాస ప్రాంతమా లేక పారిశ్రామిక, వాణిజ్య ప్రాంతమా? నిబంధనల ప్రకారం భవనంలో పాత ఇనుము నిల్వ చేయకూడదు కదా.. మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా చేయకూడదని తెలియదా..? అని పిటిషనర్‌ను ఉద్దేశించి ధర్మాసనం ప్రశ్నిం చింది. దీనిపై పిటిషనర్ న్యాయవాది పవన్‌కుమార్ అగర్వాల్ స్పందిస్తూ..ట్రేడింగ్ బిజినెస్ మాత్ర మే చేస్తున్నామని జవాబు చెప్పారు. ఇలా చేయకూడదని మాస్టర్ ప్లాన్ స్పష్టం చేస్తోందని, మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా చేయకూడదని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని ధర్మాసనం గుర్తు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment