ramantapur
-
ప్రవీణ్ రెడ్డి, పోలీసుల చొరవతో తల్లి ఒడికి బాలుడు
సాక్షి, హైదరాబాద్: సాక్షి టీవీ అవుట్ పుట్ ఎడిటర్ దంపతులు, పోలీసుల చొరవతో ఏడాది వయస్సున్న బాలుడు తల్లి ఒడికి చేరాడు. గంట వ్యవధిలోనే సదరు బాలుడు తమ వద్దకు చేరడంతో పేరెంట్స్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రవీణ్ రెడ్డి దంపతులకు, పోలీసులకు బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఇక, ఈ ఘటన రామంతపూర్‌లో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. నగరంలోని చాంద్రాయణగుట్టకు చెందిన మర్యం బేగం, మజీద్ దంపతులు. వీరికి ఐదుగురు సంతానం. ఏడాది వయస్సున్న బాలుడు, ఆరు నెలల పాప, భర్త, తమ్ముడితో కలిసి మర్యం రామంతాపూర్‌లోని కేసీఆర్ నగర్‌కు ఆటోలో వచ్చింది. కేసీఆర్ నగర్ సమీపంలో టీ కోసమని ఆటోను ఆపి.. భర్త, తమ్ముడు వెళ్లాడు. చంటిపాపకు పాలుపట్టిస్తూ ఉండగా.. ఏడాది వయస్సున్న బాలుడు ఆటో దిగి ఎటో వెళ్లిపోయాడు. టీ తాగి ఆటో దగ్గరకు వచ్చిన మర్యం పిల్లవాడి గురించి ఆరా తీయగా.. ఆటో దిగి ఉంటాడని చెప్పింది. చుట్టుపక్కల వెతకడంతో బాలుడి ఆచూకీ లభించలేదు.దీంతో.. మర్యం ఆమె బంధువులు ఉప్పల్ పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో బాలుడిని ఎవరైనా కిడ్నాప్ చేశారా? అన్న కోణంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే.. రెండు బృందాలను ఏర్పాటు చేసిన ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డి దర్యాప్తు చేపట్టారు. సరిగ్గా.. ఇదే టైంలో.. విధులు ముగించుకుని.. తమ కూతురిని ఇంటికి తీసుకెళ్లటానికి స్కూల్ దగ్గరకు వెళ్లిన సాక్షి టీవీ అవుట్ పుట్ ఎడిటర్ ప్రవీణ్ రెడ్డి దంపతులకు స్కూల్ దగ్గర ఏడాది వయస్సున్న బాలుడు కన్పించాడు. దీంతో, బాలుడి వివరాలు గురించి వాకబ్ చేస్తే ఎలాంటి సమాచారం రాలేదు.ఈ క్రమంలో ప్రవీణ్‌రెడ్డి.. బాలుడి ఫోటోను తీసి ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డికి వాట్సాప్ చేశారు. బాలుడి బంధువులు ఎవరైనా వస్తారని.. తనకు తెలిసిన వారి ఇంటి దగ్గర ఉంచారు. అప్పటికే మర్యం కుటుంబ సభ్యులు బాలుడు కన్పించటం లేదని ఫిర్యాదు చేయటంతో వాళ్లకు ప్రవీణ్ రెడ్డి పంపిన ఫోటోను చూపించారు. వెంటనే ఆ బాలుడు తమ కుమారుడని గుర్తుపట్టారు. వెంటనే సీఐ.. మర్యం కుటుంబ సభ్యులను బాలుడు ఉన్న చోటుకు తీసుకువచ్చారు. ప్రవీణ్ రెడ్డి దంపతులు, స్థానికుల సమక్షంలో బాలుడిని మర్యం కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. బాలుడు తప్పిపోయిన గంట వ్యవధిలోనే తల్లిదండ్రుల చెంతకు చేర్చటంలో సాయం చేసిన ప్రవీణ్ రెడ్డి దంపతులకు పోలీసులు, మర్యం కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
చెరువు రక్షణకు 18 ఏళ్లు సరిపోలేదా?
సాక్షి, హైదరాబాద్: ‘రామంతాపూర్ చెరువు రక్షణకు సంబంధించి మీరు 2016లో రెవెన్యూ విభాగానికి ఒక లేఖ రాశారు. దాని తర్వాత కూడా గుర్తు చేశారు. ఎప్పుడు లేఖ రాశార న్నది మీకు కచ్చితమైన తేదీ తెలియదు. మరో ఇద్దరు ముగ్గురు బిల్డర్లు చెరువు పరిధిలో భవన నిర్మాణాలు చేపట్టా లని మీరు కోరుకుంటున్నారా? ఇలాంటి సమాధానా లిచ్చి మమ్మల్ని రెచ్చగొట్టొద్దు. తీవ్ర అహసనంతో చెబుతు న్నాం.. మీ చట్టబద్ధమైన విధిని నిర్వర్తించనందుకు మీపై చర్య తీసు కోవాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తాం. ఈ పిటిషన్ 2005 నుంచి పెండింగ్‌లో ఉంది. 18 ఏళ్లు గడిచినా చెరువు రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంకా ఎన్నాళ్లు సమయం కావాలి. మీ పనిని మరొకరిపై నెట్టి తప్పించుకో లేరు. భవిష్యత్ తరాలకు తాగునీటికి సంబంధించిన అంశంలోనూ ఇంత నిర్లక్ష్యమా? ఉన్న జలవనరులను రక్షించు కోలేకపోతే భవిష్యత్ తరాలు క్షమించవు’ అని జీహెచ్ఎంసీ కమిష నర్‌పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. రామంతాపూర్ పెద్దచెరువును రియల్టర్లు, అక్ర మార్కులు ఆక్రమించకుండా అడ్డుకునేందుకు ఏం చర్యలు తీసుకున్నారని జీహెచ్ఎంసీ కమిష నర్ రొనాల్డ్ రోస్‌ను ప్రశ్నించింది. దీనిపై రెవెన్యూ ఉన్నతాధి కారులకు 2016లోనే లేఖ రాశామని, వివ రాలు ఇంకా అందలేదని ఆయన చెప్పారు. దీంతో జీహెచ్ ఎంసీ కమిషనర్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం, అసహ నం వ్యక్తం చేసింది. తదు పరి విచారణకు కూడా హాజరు కావా లని తేల్చిచెప్పింది. ఈ పిటిషన్లో హెచ్ఎండీఏ కమిష నర్ ను ఇంప్లీడ్ చేయాలని రిజిస్ట్రీని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణలోగా వివరాలు అందజేయండి.. హైదరాబాద్‌లో 532 చెరువులు క్షీణిస్తున్నాయని, 26 ఎకరాల్లోని రామంతాపూర్ పెద్దచెరువును డంపింగ్ యార్డుగా మారుస్తున్నారని, ఈ కారణంగా నీటికాలుష్యం పెరిగి దుర్వాసన వ్యాపిస్తోందని ఉస్మానియా ప్రొఫెసర్ డాక్టర్ కెఎల్ వ్యాస్ 2005లో లేఖ రాశారు. చెరువు సమీపంలో చెత్త వేయడంతో భూగర్భజలాలు కలుషితమవుతున్నా యని, తద్వారా వాతావరణం కలుషితమై, దుర్వాసనతో, దోమలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆ ప్రదేశంలో చెత్తను వేయకుండా జీహెచ్ఎంసీ అధికారు లకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ లేఖను హైకోర్టు విచా రణకు స్వీకరించింది. జీహెచ్ఎంసీ కమిషనర్ హాజరుకావా లని గత విచారణ సందర్భంగా సీజే ధర్మాసనం ఆదేశించింది. దీనిలో భాగంగా మంగళవారం విచారణకు జీహెచ్ఎంసీ కమిషనర్ హాజరయ్యారు. అయితే ధర్మాసనం అడిగిన ప్రశ్నలకు కమిషనర్ సరిగా సమాధానాలు ఇవ్వలేకపోవడంపై ప్రభుత్వ న్యాయవాది, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్‌పై కూడా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్‌లోని వివరాలను కమిషనర్‌కు వివరించడంలో వీరు విఫలమ య్యారని వ్యాఖ్యానించింది. ఇకపై న్యాయవాదులపై అధార పడకుండా, సబ్జెక్టుపై సిద్ధమై కోర్టుకు రావాలని ఆదేశించింది. రామంతాపూర్ పెద్దచెరువుకు కంచె ఎప్పుడు వేస్తారు.. చెత్తరహిత నీటి వనరుగా తీర్చిదిద్దడానికి, నీటి నిల్వ పెరిగేందుకు ఏం చర్యలు తీసుకున్నారు.. ఆక్రమణలను అరికట్టేందుకు ఏం చేస్తున్నారు.. చెత్తను వేయకుండా స్థానికులకు అవగాహన కల్పించడం.. చెరువు సరిహద్దులు రూపొందించడం.. మట్టి కోతను అరికట్టేందుకు పరీవాహక ప్రాంతాల్లో చెట్ల పెంపకాన్ని చేపట్టడం.. ఎఫ్టీఎల్ నిర్ధారణకు నోటిఫికేషన్ ఇవ్వడం.. వీటన్నింటిపై వివరాలు తెలుసుకుని అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. -
ప్రిన్సిపాల్ గదిలో జరిగింది ఇదే.. క్లారిటీ ఇచ్చిన ఈస్ట్ జోన్ డీసీపీ
-
‘ఫీజు విషయంలోనే వివాదం.. ప్రిన్సిపాల్ వెనక్కి తగ్గకపోవడంతో’..
సాక్షి,హైదరాబాద్: రామాంతాపూర్ నారాయణ కాలేజీలో జరిగిన ఘటనపై అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. విద్యార్థి నాయకుడు సందీప్ పెట్రోల్ బాటిల్‌తో కాలేజీకి వచ్చినట్లు తెలిపారు. ప్రిన్సిపాల్‌పై పోసేందుకే పెట్రోల్ తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. సాయి ఫీజు, టీసీ విషయంలో నారాయణ అనే విద్యార్థికి ప్రిన్సిపాల్‌తో వివాదం జరిగిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని తెలిపారు. సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నామన్నారు. ‘విద్యార్థి సాయి నారాయణ ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి చేసుకున్నాడు. సాయి తన తండ్రి, విద్యార్థి సంఘం నాయకుడు సందీప్‌తో కలిసి కాలేజ్‌కు వచ్చాడు. టీసీ ఇవ్వాలంటే డ్యూ ఉన్న రూ. 16 వేల ఫీజు చెల్లించాలని ప్రిన్సిపాల్ సుధాకర్ చెప్పాడు. ఈ క్రమంలో విద్యార్థి నేత నారాయణ , ప్రిన్సిపాల్ మధ్య వాగ్వాదం తలెత్తింది. ఫీజు విషయంలో ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి వెనక్కి తగ్గకపోవడంతో విద్యార్థి నేత సందీప్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. సందీప్ వెనకాల దీపం ఉండటంతో క్షణాల్లో మంటలు అంటుకున్నాయి. సందీప్‌ను అడ్డుకునే క్రమంలో ఏవో అశోక్ రెడ్డి, ప్రిన్సిపాల్ సుధాకర్‌కు గాయాలయ్యాయి. కాలేజీ సిబ్బందికి కూడా మంటలు అంటుకున్నాయి. వీరిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రి నుంచి ఇద్దరిని యశోద ఆసుపత్రి పోలీసులు తరలించారు. విద్యార్థినేత సందీప్ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది’ అని అడిషనల్ డీసీపీ తెలిపారు. చదవండి: నారాయణ కాలేజీ వద్ద టెన్షన్.. విద్యార్థి ఆత్మహత్యాయత్నం -
వైట్నర్ మత్తులో రోడ్డుపై కొట్టుకున్న యువకులు
-
కరోనా: గాంధీకి బయల్దేరుతుండగా దారుణం!
సాక్షి, హైదరాబాద్: కరోనా సోకిందన్న భయంతో మానసిక ఆందోళన గురైన ఓ వ్యక్తి బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన రామంతాపూర్‌లో శనివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. వీఎస్ అపార్టుమెంటులోని (ప్లాట్ నంబర్ 303)లో వాసిరాజు కృష్ణమూర్తి (60) అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. గతకొంత కాలంగా ఆయన ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో తరుచూ ఆయాసం రావడంతో తనకు కరోనా సోకిందేమోనని కలత చెందాడు. (చదవండి: ఆకలి ఓడగా.. ఆమె నవ్వగా!) దీంతో కుటుంబ సభ్యులు అతన్ని కింగ్ కోఠి ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. కరోనా లక్షణాలు లేవని వైద్యులు చెప్పడంతో ఇంటికి తిరిగొచ్చారు. అయినప్పటికీ వాసిరాజు ఆందోళన చెందుతుండటంతో.. గాంధీ ఆస్పత్రికి వెళ్లేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. అయితే, శనివారం ఉదయం గాంధీకి బయల్దేరుతున్న తరుణంలో వాసిరాజు.. తమ ఫ్లాట్ బాల్కనీ నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. (చదవండి: హతవిధీ! ఫాలోఅప్ రోగులకు తప్పని పరేషాన్) -
బిడ్డా.. ఈ అడ్డాలు డేంజర్
మియాపూర్‌లోని 100, 101 సర్వే నంబర్లలోని భూమి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. పూర్తి నిర్మానుష్యంగా పొదలు, బండరాళ్లతో ఉన్న ఈ ప్రాంతంలో హత్యలు కూడా జరిగాయి. రెండేళ్ల క్రితం చాందిని జైన్ అనే యువతి స్నేహితుడితో కలిసి పీజేఆర్ ఎన్క్లేవ్ పక్కనే ఉండే 100 సర్వే నంబర్ ప్రాంతానికి వెళ్లింది. అక్కడ వారి మధ్య గొడవ జరగడంతో స్నేహితుడు చాందిని జైన్‌ను హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అమీన్‌పూర్‌కు చెందిన ఆటో డ్రైవర్ గడ్డం ప్రవీణ్‌ను అతడి స్నేహితులు శ్రీకాంత్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్ పాత కక్షల నేపథ్యంలో పథకం ప్రకారం దీప్తిశ్రీనగర్ వద్దనున్న 101 సర్వే నంబర్లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొచ్చి దారుణంగా హత్య చేశారు. కవాడిగూడలో 10 నెలల క్రితం ఓ యువతిని నిర్మానుష్యంగా ఉన్న డీబీఆర్ మిల్లు పరిసరాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశారు. డీబీఆర్ వెనక భాగంలో అర కిలోమీటర్ వరకు నిర్మానుష్యంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఏం జరిగినా ఎవరికీ తెలియని పరిస్థితి. సాక్షి, హైదరాబాద్ : కొద్దిగా చీకటయితే చాలు అసాంఘిక శక్తులు వళ్లు విరుచుకుంటున్నాయి. జనసంచారం తగ్గుముఖం పట్టగానే జంతువులై స్వైరవిహారం చేస్తున్నాయి. ఒంటరిగా వెళ్లే మహిళలను అనుసరిస్తూ.. మంచిగా నటిస్తూ అవకాశం దొరకబుచ్చుకుని సామూహిక అత్యాచారాలకు పాల్పడుతున్నాయి. నిర్దాక్షిణ్యంగా నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. కంటపడిన వాళ్లు ‘ఆడ’వాళ్లయితే చాలు.. వయసుతో నిమిత్తం లేదు. పసికూనల నుంచి వయోధికుల వరకు ఈ మృగాలు వెంటబడి వేటాడుతున్నాయి. ఎంతోమంది యువతులు మృగాళ్ల పశువాంఛకు సమిధలవుతున్నారు. ఇదంతా సాధారణ జనజీవనానికి దూరంగా ఉండే అడవుల్లో కాదు.. కొండలు, గుట్టల్లో కాదు.. నాలుగువందల ఏళ్ల మహోన్నతమైన చరిత్ర గల హైదరాబాద్ మహానగరంలోనే. అంతర్జాతీయ నగరంగా విల్లసిల్లే రాజధాని నగరంలో అనేక ప్రాంతాలు ఆటవికుల అడ్డాలుగా మారాయి. ఫ్లైఓవర్ క్రీనీడ, కాలనీ అంచుల్లోని కాలిబాట, మెట్రో మలుపులు, రైల్వేస్టేషన్ పరిసరాలు, నివాస సముదాయాలకు కూత వేటు దూరాలు, ఎక్కడితేనేం మనుషుల అలికిడి తగ్గితే చాలు అరాచక శక్తులు నిద్ర లేస్తున్నాయి. ప్రతి రోజు ఎక్కడో ఒక చోట నేరాలు, దారుణాలు చోటుచేసుకుంటున్నప్పటికీ భద్రత కరవవుతోంది. ఫిర్యాదు చేస్తే గంటకు తప్ప స్పందించని పోలీసు యంత్రాంగం అనేకానేక విషాదాంతాలకు మౌనసాక్షిగా నిలుస్తోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా, వేలాది మంది పోలీసులతో కూడిన కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ ఉన్న హైదరాబాద్‌లో మృగాళ్లు పంజా విసురుతున్నారంటే.. అత్యాధునిక పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందన్న ప్రశ్నలు మనసున్న వారికి శరాలై తగులుతున్నాయి. నగరంలో విస్తరించిన అసాంఘిక శక్తుల అడ్డాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. చదవండి : 28 నిమిషాల్లోనే చంపేశారు! ప్రమాదకర కొన్ని ప్రదేశాలు ► పంజాగుట్ట సమీపంలోని సాహెబ్‌నగర్‌లో వివాదాస్పదమైన హుడా లేఅవుట్లో అసాంఘిక పనులు నిత్యకృత్యం. అక్కడ మద్యం, వ్యభిచారం పరిపాటిగా మారింది. ► డివిజన్ మూసీ పరివాహిక ప్రాంతం కూడా అసాంఘిక శక్తులకు నెలవు. ► లింగోజిగూడలోని అధికారినగర్, కామేశ్వర్రావుకాలనీ, అమ్మవారి టెంపుల్ ఏరియా, సరూర్‌నగర్ గాంధీ విగ్రహం ప్రాంతం రాత్రి వేళల్లో అసాంఘిక పనులు సాగుతున్నా పోలీసులు చర్యలు తీసుకున్నది లేదు. ► విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న కొత్తపేట చౌరస్తాలోని వీఎంహోమ్ అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. రాత్రిళ్లు మందుబాబులు తప్పతాగి చిందులేస్తుంటారు. ప్రహరి కూలిపోవడంతో వెనుక నుంచి గ్రౌండ్‌లోని చెట్ల మధ్య కూర్చుని తాగుతూ పేకాడుతుంటారు. ► హెచ్ఎంటీ ప్రదేశం సుమారు 700 ఎకరాలకు పైగా విస్తరించి ఉంది. ఇందులో హత్యలు, దోపిడీలు, ఆత్యాచార సంఘటనలు అనేకం జరిగాయి. ఒక వైపు జీడిమెట్ల, మరోవైపు జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్నప్పటికీ రాత్రిపూట ఇటు నుంచి ఒంటరిగా వెళ్లాలంటే సామాన్యులు సాహసించలేరు. ► కొంపల్లి కేటీఆర్ పార్కు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కొన్ని జంటలు ప్రేమ పేరుతో తిష్ట వేస్తున్నారు. వీరిని అనుసరించే వచ్చే అల్లరిమూకలు మిగతా యువతులు, మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఇబ్బంది పెడుతుంటారు. ఇక రాత్రి వేళల్లో ఈ ప్రాంతం వ్యభిచార కేంద్రంగా మారిపోతుంది. ఇక తాగుబోతుల ఆగడాలు ఎన్నో చెప్పడం కష్టం. ► వెన్సాయి సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ వెంచర్ ఖాళీగా ఉండడంతో రాత్రిళ్లు కొందరు మద్యం తాగి రెచ్చిపోతున్నారు. కార్టన్ల కొద్ది బీరు బాటిళ్లను తీసుకొచ్చి తాగాక వాటిని రోడ్ల మీదనే పగులగొడుతున్నారు. చర్లపల్లి, మధుసూదన్నగర్సమీపంలోని నిర్మానుష్య ప్రదేశం ► బస్ భవన్ వెనక సైతం గల్లీల్లో ప్రమాదకమైన పరిస్థితులే ఉన్నాయి. అడిక్‌మెట్ ప్లైఓవర్ బ్రిడ్జి కింద పట్టాలపై పోకిరీలు అర్ధరాత్రి వరకు తమ చీకటి కార్యకలాపాల్లో మునిగి తేలుతుంటారు. ► రహమత్‌నగర్ చుట్టుపక్కల ప్రాంతాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలు. ఇక్కడ మద్యం, గంజాయి తాగడం నిత్యకృత్యం. చుట్టూ చెట్లు, గుట్టలతో నిర్మానుష్యంగా ఉండడంతో వారికి అనువుగా మారింది. ► బ్రహ్మశంకర్ ఫేజ్–2 బస్తీకి వెళ్లే దారిలో వీధి దీపాలు లేక మహిళలు రాత్రి వేళల్లో తమ నివాసాలకు వెళ్లలంటే భయపడుతున్నారు. చుట్టూ గుట్టలు నిర్మానుష్య ప్రాంతం కావడంతో కొందరు యువకులు మద్యం, గంజాయి తాగుతూ హంగామా సృష్టిస్తున్నారు. ► రామంతాపూర్‌లో కొన్ని ప్రాంతాల్లో చీకటి పడగానే పోకిరీలు రెచ్చిపోతున్నారు. ఇక్కడి చిన్న చెరువు, నెహ్రూనగర్ కమ్యూనిటీహాల్, రాజేంద్రనగర్ చౌరస్తా, చిన్న జెండా బస్తీ, బైపాస్ రోడ్డు, భగాయత్ మూసీ పరివాహక ప్రాంతాలు రాత్రి అవుతుండగానే పోకిరీల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. ఆ సమయంలో వారిదే ఇష్టారాజ్యం. మద్యం తాగి పార్టీల పేరుతో చేసే హంగామాతో స్థానికులు అందోళన చెందుతున్నారు. ► రామంతాపూర్‌లోని కొన్ని బస్తీలలో బెల్టు షాపులు యథేచ్ఛగా నడుస్తున్నాయి. రామంతాపూర్ ప్రధాన రహదారిలోని చర్చి స్కూల్ నుంచి దూరదర్శన్ కేంద్రం వరకు ఆరు వైన్ షాపులు, ఆరు బార్లు ఉండటంతో రోడ్ల మీదే మందు బాబులు చెలరేగిపోతున్నారు. ఈ ప్రాంతంలో సామాన్యులు నడిచి వెళ్లేందుకు భయపడుతుంటారు. ఇక్కడి పరిస్థితి పోలీసులకు తెలిసినా మౌనంగా ఉంటారు. ► ఎస్పీఆర్హిల్స్ రిజర్వాయర్ ఆవరణలోనూ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆవరణలో ఏపుగా పెరిగిన చెట్లు ఉండటంతో పేకాట, మద్యపానం సర్వసాధారణం. ► నాచారం బాబానగర్, దుర్గానగర్, ఎర్రకుంట చెరువు కట్ట, సీడీఎస్ బిల్డింగ్ వెనుకభాగం, దుర్గానగర్, బాబానగర్, పాతబడిన కెమికల్ కంపెనీలు తాగుబోతులకు, పోకిరీలకు అడ్డాలుగా ఉన్నాయి. ► నాగర్జుననగర్, హెచ్‌బీకాలనీ లక్ష్మీనగర్ కాలనీవాసులకు ఇక్కడి వైన్స్ షాపులతో సమ్యలు వస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. ► కూకట్‌పల్లిలోని బాలానగర్ పారిశ్రామిక ప్రాంతంలో పనిచేసే మహిళా కార్మికులపైనా వేధింపులు కానసాగుతున్నాయి. ఇక్కడ గతంలో ప్రేమ పేరుతో ఓ యువతిని యువకుడు గొంతుకోసి చంపాడు. ► గూడ్స్‌షెడ్ రోడ్డులో మద్యం తాగిన లారీ డ్రైవర్లు, హమాలీలు ఒంటరిగా వెళ్లే మహిళలను వేధించడం నిత్యకృత్యమైంది. ఆలయ ఆవరణలో మద్యం బాటిళ్లు.. ► అడవిని తలపించేలా ఉండే నిమ్మ్మే మైదానంలో నిత్యం మద్యం, గంజాయి సేవిస్తుంటారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్మికనగర్ బస్టాప్ పక్కన ఉన్న నిమ్స్‌మే మైదానంలో ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు పరిపాటిగా మారాయి. ► కూకట్పల్లి హౌసింగ్ బోర్డు, భాగ్యనగర్‌కాలనీ, నిజాంపేట ప్రాంతంలో రాత్రి 10 దాటాక వ్యభిచారులు రోడ్లపైకి రావటంతో ప్రతిరోజూ ఏదో ఒక దుర్ఘటన జరుగుతోంది. ► చంపాపేట పరిధిలోని డీఎంఆర్ఎల్ చౌరస్తా నుంచి 2 కి.మీ పొడవున గాయత్రినగర్ చౌరస్తా వరకు అర్ధరాత్రి 12 నుంచి వందలాది ఇసుక లారీలు అక్రమంగా పార్క్ చేస్తారు. వీటి డ్రైవర్లు ఇక్కడే మద్యం తాగుతూ చిదులేస్తుంటారు. ► మల్లాపూర్, మల్లికార్జున్‌నగర్, జేఎన్యూఆర్ఎం కాలనీ, భవానీనగర్‌లో సాయంత్రం విద్యార్థులు ట్యూషన్ విడిచిపెట్టే సమయంలో కొంతమంది పోకిరీలు ద్విచక్ర వాహనాలపై వారిని భయపెడుతుంటారు. ఇక్కడి బెల్టుషాపుల కారణంగా తెల్లవారుజామున 5 గంటలకే మున్సిపల్ గ్రౌండ్ వద్ద తాగి తందానాలాడుతున్నారు. ► చర్లపల్లి, మధుసూదన్‌నగర్, వెంకట్రెడ్డినగర్కాలనీల సమీపంలోని నిర్మానుష్య ప్రదేశం పోకిరీలకు అడ్డాగా మారింది. చీకటి పడగానే కాలనీకి సంబంధం లేని వ్యక్తులు ఇక్కడికి రావడం, మద్యం, గంజాయి తాగడం.. కొందరు అమ్మాయిలతో కలిసి విచ్చలవిడిగా ప్రవర్తించడం పరిపాటి. ఈ క్రమంలో దారి వెంట వెళ్లేవారితో ఘర్షణ పడటం, సమీప కాలనీల్లో ఇళ్లల్లో చోరీలు చేస్తున్నారు. ► చిలుకానగర్ చౌరస్తా వైన్‌షాపుల వద్ద పోకిరీల ఆగడాలపై పోలీసులకు, ఎక్సైజ్ అధికారులకు కాలనీవాసులు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు. నాగోల్ నుంచి శిల్పారామం వెళ్లే రోడ్డుపై వ్యభిచారుల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. చీకటి పడితే నిర్మానుష్యమయ్యే యాకుత్‌పురా రైల్వే ట్రాక్ రోడ్డు ► మన్సూరాబాద్ డివిజన్ పెద్దచెరువు, చిన్న చెరువు ప్రాంతాల్లో చీకటి పడగానే మందు బాబులదే రాజ్యం. నాగోలు పరిధి బండ్లగూడ చెరువు ప్రాంతం అసాంఘిక కార్యకలపాలకు అడ్డా. హయత్‌నగర్ ఆటోనగర్‌లో ఇసుక లారీల అడ్డా వెనుక ఖాళీ ప్రదేశం కూడా అంతే. ఇక్కడ రాత్రిపూట లారీ డ్రైవర్లు, కూలీలు మద్యం తాగుతూ అసాంఘిక పనులకు పాల్పడుతున్నారు. ► ఉప్పల్ బస్టాండ్ కమాన్ వద్ద ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై నిత్యం వ్యభిచారులు విటులను ఆకర్షిస్తుంటారు. వీరి చర్యలకు స్కూల్ పిల్లలు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ► యాకుత్‌పురా రైల్వే స్టేషన్, రైల్వే ట్రాక్ రోడ్డు, తలాబ్‌కట్ట రైల్వే ట్రాక్ రోడ్డు, గౌలిపురా మేకలమండి రోడ్లు చీకటి పడగానే నేరగాళ్లకు స్థావరాలవుతున్నాయి. తలాబ్‌కట్ట, యాకుత్‌పురా రైల్వే ట్రాక్ రోడ్డులో తరచు నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు జనసంచారం ఉండే ఈ ప్రాంతంలో చీకటి పడగానే ద్విచక్ర వాహనదారులు మాత్రమే రాకపోకలు సాగిస్తుంటారు. వీధి దీపాలు సైతం సరిగా వెలగకపోవడంతో అసాంఘిక శక్తులకు చెలరేగుతున్నాయి. కొందరు మందుబాబులు ఈ ప్రాంతాల్లో తిష్టవేసి వెక్కిలి చేష్టలతో రాత్రి వేళల్లో స్థానికులను ఇబ్బంది పెట్టడం పరిపాటిగా మారింది. ఉప్పుగూడ రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రాంతంలో సైతం రాత్రి వేళల్లో ఇబ్బందికరంగా ఉటోంది. పోకిరీలు రైల్వే స్టేషన్ సమీపంలో తిష్టవేసి ప్రయాణికుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ► ఫలక్‌నుమా రైల్వేస్టేషన్ నుంచి చాంద్రాయణగుట్టకు వెళ్లే రహదారి పేరు చెబితే ఈ ప్రాంత ప్రజలు భయపడతారు. పూర్తిగా చెట్లతో, నిర్మానుష్యంగా ఉన్న ఈ దారిలో ఇప్పటికే ఎన్నో దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. దారి దోపిడీలు, దాడులు, హత్యలు జరిగాయి. ఈ రూట్లో రాత్రి పూట పోలీస్ గస్తీ పెంచాల్సి ఉన్నా.. ఆ దిశగా చర్యలు లేవు. అసాంఘిక శక్తులకు అడ్డా ఫలక్‌నుమా రైల్వే స్టేషన్ రహదారి ► జీడిమెట్ల పారిశ్రామికవాడలోని నల్లగుట్ట లక్ష్మీ నరసింహ ఆలయ సమీపంలో తాగుబోతుల ఆగడాలు అరికట్టేవారు లేదు. ఆహ్లాదకర వాతావరణం, కూర్చోవడానికి గద్దెలు, ఎవరూ రారన్న ధీమాతో మందుబాబులు ఇక్కడే తాగి గొడవలు పడుతుంటారు. ఈ రోడ్డు గుండానే మహిళ కార్మికులు రాకపోకలు సాగిస్తుంటారు. పోలీస్ ఫెయిల్! సాక్షి,సిటీబ్యూరో: మహానగరంలో మహిళ భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. మళ్లీ పోలీసు వ్యవస్థ తీరుపై విమర్శనలు వెల్లువెత్తుతున్నాయి. నేర నివారణ అంశాన్ని పక్కనబెట్టి నేర పరిశోధనకే ప్రాధాన్యత ఇస్తుండటంపై విమర్శలకు దారి తీసింది. శంషాబాద్ సమీపంలో డాక్టర్ ప్రియాంకారెడ్డి బంధువులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినప్పుడు తమ పరిధి కాదని తిప్పిపంపడం, వేగంగా కార్యాచరణలో దిగడంలో విఫలమయ్యారని మహిళా, విద్యార్థి సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. పోలీసుల బాధ్యత లేకనే.. డాక్టర్ ప్రియాంకరెడ్డి దారుణ హత్యకు గురవడం పోలీస్ వ్యవస్థ విఫలమవ్వడంగానే భావించాలి. బంధువులు ఫిర్యాదు చేసిన వెంటనే సరైన రీతిలో స్పందించి ఉంటే కనీసం ప్రియాంక ప్రాణాలతోనైనా దొరికేది. ప్రభుత్వం చెబుతున్న మాటలకు, వాస్తవానికి పొంతన లేదని చెప్పడానికి ఈ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. – డాక్టర్ శ్వేతాశెట్టి, నేషనల్ విమెన్స్ పార్టీ ప్రెసిడెంట్ మద్యం వల్లే నేరాలు.. స్మార్ట్ ఫోన్లలో క్లిక్ దూరంలో ఉండే అశ్లీల వెబ్సైట్లు, ఎక్కడపడితే అక్కడ లభించే మద్యంతో సమాజంలో నేరాలను పెంచతున్నాయి. ఈ రెండింటి విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉండాలి. అదేవిధంగా మహిళలు సైతం తమ చుట్టూ ఉండే మప్పు నుంచి తప్పించుకునేందుకు జాగ్రత్తగా వ్యవహరించాలి. – అనూప్రసాద్, ఫిట్నెస్ ట్రైనర్ అప్రమత్తంగా ఉండాలి ఓ తల్లిగా చెప్పుతున్నా.. నాక్కూడా ఓ కూతురు ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ ఆడ పిల్లలకు మాత్రం రక్షణ దొరకడం లేదు. ప్రస్తుతం చాలా మంది అమ్మాయిలు తమ తల్లిదండ్రులకు చెప్పకుండా అర్ధరాత్రి తర్వాత కూడా బయట తిరుగుతున్నారు. జనసమూహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తిరగడం వల్ల పెద్ద నష్టమేమీ ఉండదు. కానీ లేట్‌నైట్‌లో నిర్మానుష్య ప్రాంతాల్లోకి వెళ్లడం చాలా ప్రమాదం. నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వెంటనే అత్యవసర ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలి. – డాక్టర్ చిరంజీవి, ఆర్థోపెడిక్ సర్జన్, సన్‌షైన్ ఆస్పత్రి ఫిర్యాదులకు ఒకే నెంబర్ ఉండాలి తల్లిదండ్రులు తమ పిల్లలకు కేవలం చదువు మాత్రమే చెప్పించడం కాదు.. చదువుతో పాటు కొంత సంస్కారం కూడా నేర్పించాలి. మానవ సంబంధాలు, సమాజంపై అవగాహన కల్పించాలి. ఏ చిన్న తప్పు చేసినా ఇట్టే దొరికి పోతామనే భయం కల్పించినప్పుడే అత్యాచారాలు తగ్గుతాయి. అంతే కాదు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు తమ రక్షణ కోసం ఏ ఫోన్ నెంబర్‌కు సమాచారం ఇవ్వాలో కూడా చాలా మంది మహిళలకు తెలియదు. ఒక్కో సమస్యకు ఒక్కో నెంబర్ ఏర్పాటు చేయడమే ఇందుకు కారణం. అనివార్యమైన పరిస్థితుల్లో కుటుంబ సభ్యులకు ఫోన్ చేస్తున్నారు. ఆ సమయంలో వారు కూడా ఏమీ చేయలేక పోతున్నారు. అన్ని రకాల ఫిర్యాదులకు ఒకే నెంబర్ కేటాయించి, ఆ నెంబర్‌పై పనితీరుపై పిల్లలకు అవగాహన పెంచితే రక్షణ సులువవుతుంది. – డాక్టర్ మంజుల అనగాని, గైనకాలజిస్ట్ చదవండి : శంషాబాద్‌లో మరో ఘోరం అందుకే ఆలస్యం: సీపీ సజ్జనార్ ప్రియాంకను హత్య చేసింది ఆ నలుగురే మరో ఘోరం : కిడ్నాప్, గ్యాంగ్‌రేప్ -
డబ్బులు డిమాండ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా..
హైద్రాబాద్ : విద్యార్థి సంఘ నాయకులం అని చెప్పి రామంతపూర్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాన్ని డబ్బులు డిమాండ్ చేసిన యువకులు కటకటాలపాలయ్యారు. వటపల్లి రాజేష్, అజరుద్దీన్, ప్రసాద్ అనే వ్యక్తులు కళాశాల యాజమాన్యాన్ని రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమాచారం అందుకున్న అంబర్పేట్ పోలీసులు ఈ ముగ్గురిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
‘ఉక్కు మనిషి’ విగ్రహావిష్కరణ
ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని రామంతాపూర్ ప్రధాన రహదారిలో కేంద్రమంత్రి దత్తాత్రేయ ఆవిష్కరిస్తారని ఎమ్మెల్యే ప్రభాకర్ తెలిపారు. శనివారం ఉదయం 6.30 గంటలకు విగ్రహావిష్కరణ అనంతరం 5000 మందితో తిరంగా యాత్రను మంత్రి ప్రారంభిస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు, నాయకులు పాల్గొంటున్నారని ఆయన పేర్కొన్నారు. -
గ్రేటర్ లో కొనసాగుతున్న షర్మిల పర్యటన
దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్సార్ అకాల మరణాన్ని తట్టుకోలేక అసువులు బాసిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైఎస్సార్ తనయ, వైఎస్సార్సీపీ అధినైత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర బుధవారం నగరంలో కొనసాగింది. పరామర్శ యాత్రలో భాగంగా షర్మిల బుధవారం ఉదయం చిలకలగూడ గాంధీ చౌక్‌కు చేరుకున్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దూద్‌బావి పెంతికోస్థు చర్చి ఫాదర్ డేవిడ్‌రాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. అక్కడి నుంచి సీతాఫల్మండి మీదుగా మాణికేశ్వరినగర్‌కు వెళ్లారు. డా. వైఎస్సార్ అకాల మరణాన్ని తట్టుకోలేక 2009లో మాణికేశ్వర్‌నగర్‌లో బొంత సత్తయ్య(35), బోదాసు నర్సమ్మ(65) గుండె పోటుతో మృతి చెందారు. వీరి కుటుంబాలను షర్మిల ఓదార్చారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. షర్మిల పరామర్శతో బాధిత కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. కాగా, బుధవారం సాయంత్రం ఎల్బీనగర్ కామినేని చౌరస్తాకు చేరుకున్న షర్మిలకు స్థానికులు, మహిళలు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. చౌరస్తాలో వైఎస్సార్ విగ్రాహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం చింతల్‌కుంటలో షాపూర్ శంకర్ కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. శంకర్ భార్య లలితకు ధైర్యం చెప్పారు. తర్వాత దిల్‌షుక్‌నగర్‌లో రోడ్డు షో నిర్వహించారు. -
గ్రేటర్ లో కొనసాగుతున్న షర్మిల పర్యటన
-
రామంతపూర్ లో దుండగుల దారుణం
హైదరాబాద్: నగరంలోని రామంతపూర్‌లో దుండగులు దారుణానికి పాల్పడ్డారు. ఓ ఇంటి ముందు పార్కింగ్ చేసిన రెండు బైక్‌లను తగలబెట్టారు. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో బైక్ లు పూర్తిగా కాలిపోయాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బాధితులు విషయాన్ని పోలీసులకు చేరవేశారు. -
వెంటాడుతున్న భయం!
నగరాన్ని వీడని నేపాల్ ‘భూ కంపం’ ఇంకా అక్కడే చిక్కుకుపోయిన పలువురు.. ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులు క్షేమంగా చేరుకున్న రామంతాపూర్, మల్కాజ్గిరి, కార్ఖానా వాసులు బౌద్దనగర్/హయత్‌నగర్/మల్కాజ్గిరి/మారేడ్‌పల్లి: నేపాల్ భూకంపం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న నగర వాసుల్లో కొందరు ఆదివారం రాత్రి క్షేమంగా చేరుకోగా...ఇంకా పలువురి ఆచూకీ తెలియుడం లేదు. మల్కాజ్‌గిరికి చెందిన నలుగురు, రామంతాపూర్‌కు చెందిన ఎనిమిది మంది, కార్ఖానాకు చెందిన మరో ఎనిమిది మంది వూత్రమే ఆదివారం నగరానికి చేరుకున్నారు. హయుత్నగర్కు చెందిన న్యాయవాది కుటుంబ సభ్యులు, కూకట్‌పల్లికి చెందిన మరో ఐదుగురి ఆచూకీ ఇంకా తేలలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. భూకంపం వచ్చిందని మీడియా ద్వారా శనివారం మధ్యాహ్నం తెలుసుకున్నప్పటి నుంచి నేపాల్‌కు వెళ్లిన తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల యోగక్షేమాల కోసం ఆరా తీస్తూనే ఉన్నారు. కొంతమంది ఫోన్లు స్విచ్చాఫ్ అని రావడంతో వారిలో భయాందోళనలు పెరుగుతున్నాయి. ఇక మెహదీపట్నంకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ నీలివు ఆచూకీ తేలకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆచూకీ తెలియుక ఆందోళన... హయత్‌నగర్ లెక్చరర్స్ కాలనీలో నివసించే ఎం.రమణారావు(47) కోళ్లకు వ్యాక్సినేషన్ చేస్తుంటారు. ఆయన భార్య జ్యోతి(42) రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. వారు కూతుళ్లు తన్విక(20), సాత్విక(16)లతో కలిసి నేపాల్‌ను సందర్శించేందుకు ఈ నెల 24న శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లి, అక్కడి నుంచి కఠ్మాండుకు చేరుకున్నారు. రమణారావు సోదరి సత్యవతి, బావ సాంబశివరావులు లెక్చరర్స్ కాలనీలోనే నివసిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం నేపాల్‌లో భూకంపం వచ్చినట్లు వార్త విన్న సాంబశివరావు రమణరావుకు ఫోన్ చేయగా తాము క్షేమంగా ఉన్నట్లు వాట్సాప్‌లో సమాచారం అందించారు. అనంతరం వారి ఫోన్లు పని చేయలేదు. వారు కఠ్మాండులోని ఓ హోటల్లో దిగగా...హోటల్ వారు అందర్నీ హోటల్ నుంచి పంపించినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి రమణారావు కుటుంబం ఎక్కడికి వెళ్లిందో తెలియరాలేదు. దీంతో బంధువులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ మేరకు రెవిన్యూ అధికారులు ఆదివారం సాంబశివరావు ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. -
రామంతపూర్‌లో భారీ చోరీ
హైదరాబాద్ రామాంతపూర్ ప్రాంతంలో భారీ చోరీ జరిగింది. ఇక్కడి శ్రీనివాసపురంలో ఉన్న ఓ ఇంట్లోకి దొంగలు చొరబడి దాదాపు 25 తులాల బంగారం, నాలుగు కేజీల వెండి, ఓ కారు, భూమి పత్రాలను ఎత్తుకెళ్లారు. తాళం వేసిన ఇంటి తాళాలను పగులగొట్టి ఈ దొంగతనానికి పాల్పడ్డారు. ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారును కూడా తీసుకెళ్లారు. దొంగిలించిన సొత్తు మొత్తాన్ని అదే కారులో వేసుకుని వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఇంటి యజమాని బుచ్చిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలను సేకరించారు.