
సాక్షి, హైదరాబాద్: కరోనా సోకిందన్న భయంతో మానసిక ఆందోళన గురైన ఓ వ్యక్తి బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన రామంతాపూర్‌లో శనివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. వీఎస్ అపార్టుమెంటులోని (ప్లాట్ నంబర్ 303)లో వాసిరాజు కృష్ణమూర్తి (60) అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. గతకొంత కాలంగా ఆయన ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో తరుచూ ఆయాసం రావడంతో తనకు కరోనా సోకిందేమోనని కలత చెందాడు.
(చదవండి: ఆకలి ఓడగా.. ఆమె నవ్వగా!)
దీంతో కుటుంబ సభ్యులు అతన్ని కింగ్ కోఠి ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. కరోనా లక్షణాలు లేవని వైద్యులు చెప్పడంతో ఇంటికి తిరిగొచ్చారు. అయినప్పటికీ వాసిరాజు ఆందోళన చెందుతుండటంతో.. గాంధీ ఆస్పత్రికి వెళ్లేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. అయితే, శనివారం ఉదయం గాంధీకి బయల్దేరుతున్న తరుణంలో వాసిరాజు.. తమ ఫ్లాట్ బాల్కనీ నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
(చదవండి: హతవిధీ! ఫాలోఅప్ రోగులకు తప్పని పరేషాన్)
Comments
Please login to add a commentAdd a comment