నగరాన్ని వీడని నేపాల్ ‘భూ కంపం’
ఇంకా అక్కడే చిక్కుకుపోయిన పలువురు..
ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులు
క్షేమంగా చేరుకున్న రామంతాపూర్,
మల్కాజ్‌గిరి, కార్ఖానా వాసులు
బౌద్దనగర్/హయత్‌నగర్/మల్కాజ్‌గిరి/మారేడ్‌పల్లి: నేపాల్ భూకంపం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న నగర వాసుల్లో కొందరు ఆదివారం రాత్రి క్షేమంగా చేరుకోగా...ఇంకా పలువురి ఆచూకీ తెలియుడం లేదు. మల్కాజ్‌గిరికి చెందిన నలుగురు, రామంతాపూర్‌కు చెందిన ఎనిమిది మంది, కార్ఖానాకు చెందిన మరో ఎనిమిది మంది వూత్రమే ఆదివారం నగరానికి చేరుకున్నారు. హయుత్‌నగర్‌కు చెందిన న్యాయవాది కుటుంబ సభ్యులు, కూకట్‌పల్లికి చెందిన మరో ఐదుగురి ఆచూకీ ఇంకా తేలలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. భూకంపం వచ్చిందని మీడియా ద్వారా శనివారం మధ్యాహ్నం తెలుసుకున్నప్పటి నుంచి నేపాల్‌కు వెళ్లిన తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల యోగక్షేమాల కోసం ఆరా తీస్తూనే ఉన్నారు. కొంతమంది ఫోన్‌లు స్విచ్చాఫ్ అని రావడంతో వారిలో భయాందోళనలు పెరుగుతున్నాయి. ఇక మెహదీపట్నంకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నీలివు ఆచూకీ తేలకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
ఆచూకీ తెలియుక ఆందోళన...
హయత్‌నగర్ లెక్చరర్స్ కాలనీలో నివసించే ఎం.రమణారావు(47) కోళ్లకు వ్యాక్సినేషన్ చేస్తుంటారు. ఆయన భార్య జ్యోతి(42) రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. వారు కూతుళ్లు తన్విక(20), సాత్విక(16)లతో కలిసి నేపాల్‌ను సందర్శించేందుకు ఈ నెల 24న శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లి, అక్కడి నుంచి కఠ్మాండుకు చేరుకున్నారు. రమణారావు సోదరి సత్యవతి, బావ సాంబశివరావులు లెక్చరర్స్ కాలనీలోనే నివసిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం నేపాల్‌లో భూకంపం వచ్చినట్లు వార్త విన్న సాంబశివరావు రమణరావుకు ఫోన్ చేయగా తాము క్షేమంగా ఉన్నట్లు వాట్సాప్‌లో సమాచారం అందించారు. అనంతరం వారి ఫోన్‌లు పని చేయలేదు. వారు కఠ్మాండులోని ఓ హోటల్‌లో దిగగా...హోటల్ వారు అందర్నీ హోటల్ నుంచి పంపించినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి రమణారావు కుటుంబం ఎక్కడికి వెళ్లిందో తెలియరాలేదు. దీంతో బంధువులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ మేరకు రెవిన్యూ అధికారులు ఆదివారం సాంబశివరావు ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు.
వెంటాడుతున్న భయం!
Published Mon, Apr 27 2015 1:35 AM | Last Updated on Sat, Oct 20 2018 6:37 PM
Advertisement
Advertisement