హైదరాబాద్: నగరంలోని రామంతపూర్లో దుండగులు దారుణానికి పాల్పడ్డారు. ఓ ఇంటి ముందు పార్కింగ్ చేసిన రెండు బైక్లను తగలబెట్టారు. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో బైక్ లు పూర్తిగా కాలిపోయాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బాధితులు విషయాన్ని పోలీసులకు చేరవేశారు.