తాండూరు: రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఓ రైతు బ్యాంకు భవనం పై నుంచి దూకి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. సకాలంలో స్పందించిన తోటివారు చివరి క్షణాల్లో అతన్ని కాపాడటంతో ప్రమాదం తప్పింది. రంగారెడ్డి జిల్లా తాండూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రుణమాఫీ చేయాలని మండల కేంద్రంలో రైతులు నిర్వహించిన రాస్తారోకోతో భారీగా ట్రాఫిక్ నలిచిపోయింది.