Farmer problems
-
కాంగ్రెస్ పాలనలో రైతు వంచన: మాజీ మంత్రి కేటీఆర్
-
Watch Live: రైతు కోసం పోరుబాట
-
రైతు కోసం వైఎస్ జగన్ పోరుబాట
-
వైఎస్సార్సీపీ ధర్నాల్లో స్వల్ప మార్పు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ సీపీ ధర్నాల్లో స్వల్ప మార్పు జరిగింది. ప్రజా సమస్యలపై ఉద్యమ బాటలో భాగంగా ఆ పార్టీ ఈ నెల 11న రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన రైతుల సమస్యలపై ఆందోళన కార్యక్రమాన్ని 13వ తేదీకి వాయిదా వేసింది. ఐదు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కోడ్ ఉన్నందున వాయిదా వేస్తున్నట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. 13న రైతాంగ సమస్యలపై జిల్లా కలెక్టర్లకు వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించింది. మిగతా కార్యక్రమాలు యథాతథంగా జరగనున్నాయి.కూటమి ప్రభుత్వ మోసాలను నిలదీసి, ప్రజా సమస్యలపై ఉద్యమబాటకు వైఎస్ జగన్ ఇప్పటికే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా రైతు సమస్యలపై ఈ నెల 13న, కరెంటు ఛార్జీల మోతపై 27న, విద్యార్ధులకు బాసటగా ఫీజు రీఇంబర్స్‌మెంట్‌పై జనవరి 3 న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.కూటమి ప్రభుత్వంలో వ్యవసాయ రంగం కుదేలైంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆర్బీకేలు స్థాపించి, ఈ–క్రాప్ పెట్టి పారదర్శకంగా ప్రతి రైతుకు ఆర్బీకే ద్వారా ఉచిత పంటల బీమా అందించింది. దళారుల వ్యవస్థ లేకుండా ధాన్యం నేరుగా రైతు వద్దకే వచ్చి కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టింది. చంద్రబాబు సర్కార్ వచ్చిన తర్వాత ఏ రైతుకూ ధాన్యానికి కనీస మద్దతు ధర రావడం లేదని వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: దుర్మార్గ పాలనపై పోరాటం: వైఎస్ జగన్ -
రైతులకు ప్రభుత్వం సహకరించడం లేదు
గుడ్లవల్లేరు/పామర్రు/గూడూరు(పెడన)/గుడివాడ రూరల్: ధాన్యం కొనుగోళ్లపై సమస్యలు తెలుసుకునేందుకు గురువారం పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కృష్ణాజిల్లాలోని పలు మండలాల్లో పర్యటించగా రైతులు సమస్యలను ఏకరవు పెట్టారు. తుపాను గండం నుంచి బయటపడాలని ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళితే... అక్కడ గోనె సంచులు లేవని సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని, మిల్లర్లు తేమ శాతం ఎంత చెబితే... అంతమేరకు కట్ చేసి తమకు రావాల్సిన ధాన్యం సొమ్ములో కోత విధిస్తున్నారని గుడ్లవల్లేరు మండలంలోని రైతులు ఫిర్యాదు చేశారు. ఎంటీయూ 1262 రకం ధాన్యాన్ని మిల్లర్లు తీసుకోవడం లేదని పామర్రు మండలంలోని కనుమూరు, కొండాయపాలెం, అడ్డాడ గ్రామాల్లోని రైతులు ఫిర్యాదు చేశారు. ధాన్యం విక్రయించడంలో తమకు ప్రభుత్వం సహకరించడం లేదని గూడూరు మండలం, తరకటూరు రైతులు మంత్రికి దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీకి చెందిన మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు కాట్రగడ్డ కృష్ణ మాట్లాడుతూ ధాన్యం సేకరణలో ప్రభుత్వం రైతులకు సహకరించడం లేదని, తాను కూడా బస్తా రూ.1400 చొప్పున మిల్లర్లకు విక్రయించాల్సి వచ్చిందని చెప్పారు.ప్రభుత్వం తరఫున రైతుల దగ్గరకు ఏ అధికారీ రాలేదని, తనతో పాటుగా ఇక్కడి రైతులంతా బస్తా రూ.1300 నుంచి రూ.1400కు దళారులకు అమ్ముకున్నట్టు తెలిపారు. మరో రైతు అయ్యప్ప మాట్లాడుతూ.. తనకు 20 ఎకరాల పొలం ఉందని, పంట కోశాక రైతు సేవా కేంద్రానికి తీసుకెళ్లినా ఫలితం లేదని, ఆర్ఎస్కేలో సాంకేతిక సిబ్బంది లేరంటూ పంట వెనక్కి పంపారని, గత్యంతరం లేక పది ఎకరాల్లోని పంట దళారులకు బస్తా రూ.1400 చొప్పున అమ్మినట్టు మంత్రికి వివరించారు. మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ వాతావరణంలో మార్పుల దృష్ట్యా 40 రోజుల్లో చేపట్టాల్సిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను 4 రోజుల్లో చేపట్టేలా చర్యలు తీసుకున్నామని, 24 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేలా రైస్ మిల్లరను ఆదేశించినట్లు తెలిపారు. -
ఆ రైతుల సమస్యలు పరిష్కరించండి
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ కాలేదని అనేక మంది రైతులు ఆవేదన చెందుతున్నారని, దీన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ‘ఎక్స్’వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరారు. డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని మాట తప్పారని, ఏడు నెలల తర్వాత ఆ ప్రక్రియను ప్రారంభించడం వల్ల రైతులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ముందుగా ఏడు నెలల వడ్డీ చెల్లించాకే, రుణమాఫీ చేస్తామని బ్యాంకర్లు రైతుల్ని వేధిస్తున్నారని వివరించారు. ప్రభుత్వం తక్షణం స్పందించి, డిసెంబర్ నుంచి జూలై దాకా వడ్డీని తామే భరిస్తామని, రైతుల నుంచి వసూలు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట్ మండలానికి చెందిన ఒక రైతు పంట రుణాన్ని రూ.9000 మిత్తి కట్టించుకున్నాకే క్లోజ్ చేశారని, ఉమ్మడి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలానికి చెందిన రైతులకూ ఇదే పరిస్థితి ఎదురైందని తెలిపారు. రైతులు పంపిన విజ్ఞప్తులను మీ పరిశీలనకు పంపుతున్నామని, తక్షణమే పరిష్కరించాలని హరీశ్‌రావు కోరారు. -
Farmers Protest: రెండో రోజూ అదే పరిస్థితి!
రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం ఇంకా సమసిపోలేదు. కనీస మద్దతు ధరకు సంబంధించిన కొత్త చట్టానికి సమ్మతించని రైతులు ఢిల్లీకి పాదయాత్రగా తరలివచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మంగళవారం నాడు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో.. ఢిల్లీకి పాదయాత్రగా వచ్చేందుకు రైతులు చేసిన ప్రయత్నం విఫలమైంది. దీంతో ఈరోజు (బుధవారం) తిరిగి ఢిల్లీలో అడుగుపెట్టేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. వారంతా ఢిల్లీకి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న శంభు సరిహద్దులో వేచిచూస్తున్నారు. దీంతో శంభు సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది#WATCH | RAF personnel, Police personnel and Riot Control Vehicle deployed at Singhu Border in Delhi in view of farmers' protest. pic.twitter.com/ewUgw0KoSw— ANI (@ANI) February 14, 2024 రైతుల ఆందోళనల నేపధ్యంలో హర్యానాలోని ఎనిమిది జిల్లాల్లో ఫిబ్రవరి 15 వరకు ఇంటర్నెట్ నిలిపివేశారు. మంగళవారం హర్యానా, పంజాబ్ సరిహద్దుల్లో రైతుల ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ను ప్రభుత్వం అడ్డుకుంది. ఫతేఘర్ సాహెబ్ నుంచి శంభు సరిహద్దు వరకూ గుమిగూడిన రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. సింగూ బోర్డర్, టిక్రీ బోర్డర్, ఘాజీపూర్ బోర్డర్లో గట్టి పోలీసు నిఘా కొనసాగుతోంది. -
రైతాంగం కోసం రూ.879 కోట్ల భారీ ప్రాజెక్టు
ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ లో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది జమ్ముకశ్మీర్ ప్రభుత్వం. రూ.879.75 కోట్లతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఆవిష్కరించింది. నిర్థేశిత ఉత్పత్తులకు క్లస్టర్లను అభివద్ధి చేసి అన్నదాతల ఆదాయాభివృద్ధి, పంట చేతికి వచ్చిన తర్వాత ఎదుర్కొనే నష్టాల నివారణే లక్ష్యంగా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రోగ్రామ్ చేపట్టినట్లు జమ్ముకశ్మీర్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వచ్చే ఐదేళ్లలో గుర్తించిన ఐదు ఉత్పత్తుల ధర, నాణ్యత, బ్రాండింగ్, స్థిరత్వాన్ని పెంచడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని జమ్ముకశ్మీర్ ప్రభుత్వ అధికారులు తెలిపారు. అగ్రికల్చర్, హార్టికల్చర్ ఉత్పత్తుల మార్కెటింగ్, బ్రాండింగ్, రవాణా, వాల్యూ అడిషన్లలో జమ్ముకశ్మీర్ ప్రభుత్వం పెట్టుబడులు పెడుతున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. 17 జిల్లాల్లో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ల అభివృద్ధి ప్రాజెక్టు ప్రోగ్రామ్ ను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టులో భాగంగా.. ఆయా జిల్లాల్లో మార్కెటింగ్, ప్రాసెసింగ్ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పన, స్టేక్ హోల్డర్ల అభివృద్ధి, అవకాశాల కల్పనపై దృష్టి సారించినట్లు జమ్ముకశ్మీర్ ప్రభుత్వ అధికారులు తెలిపారు. యూటీ లెవల్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రోగ్రాం కోసం జమ్ముకశ్మీర్ ప్రభుత్వం బడ్టెట్ లో రూ.879.75 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టు వల్ల 7,030 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రతియేటా రూ.1,436.04 కోట్ల ఆదాయం లభించే 34 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పనున్నట్లు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. యూటీ లెవల్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టు కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మాజీ డీజీ మంగల్ రాయ్ నేతృత్వంలో ఓ కమిటీ కూడా ఏర్పాటైంది.పంట అనంతర నష్టాలు, సవాళ్లను అధిగమించేందుకు ఈ ప్రాజెక్టు ఎంతగానో దోహదం చేస్తుందని అంటున్నారు అడిషనల్ చీఫ్ సెక్రటరీ అటల్ దుల్లోహ్. -
హస్తినలో వరి యుద్ధం
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంగా కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు టీఆర్ఎస్ సర్కారు సిద్ధమైంది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా భారీ నిరసన దీక్ష చేపట్టింది. సీఎం కేసీఆర్ ఈ దీక్షలో పాల్గొని కేంద్ర వైఖరిని ఎండగట్టనున్నారు. ఇక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు సహా రెండు వేల మందికిపైగా నిరసనలో పాల్గొననున్నారు. ఈ దీక్షకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులంతా ఆదివారం రాత్రికే ఢిల్లీకి వచ్చారు. మిగతావారు సోమవారం ఉదయం చేరుకోనున్నారు. బహుముఖ వ్యూహంతో.. రైతుల సమస్య తీర్చడంతోపాటు రాష్ట్రంలో బీజేపీకి చెక్‌పెట్టడం, జాతీయ రాజకీయాల్లోకి అరంగేట్రానికి అనుకూలతను సృష్టించుకోవడమనే బహుముఖ లక్ష్యాలతో సీఎం కేసీఆర్ చేపట్టిన ఢిల్లీ దీక్షపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీక్ష జరిగేది ఇలా.. ► ఢిల్లీలో నిర్వహిస్తున్న ఈ నిరసన కార్యక్రమానికి ‘తెలంగాణ రైతుల పక్షాన ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష’గా పేరు పెట్టారు. ► ఉదయం 10 గంటలకు మొదలై సాయంత్రం వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ► మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు సహా 2 వేల మంది వరకు దీక్షలో పాల్గొంటారని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ► ‘ఒకే దేశం.. ఒకే సేకరణ విధానం’ నినాదంతో పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు, జెండాల ఏర్పాటు చేశారు. ‘ఒకే దేశం.. ఒకే సేకరణ’తో.. తెలంగాణలో పండే యాసంగి వరి ధాన్యం కొనుగోళ్ల విషయంగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొద్దినెలలుగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. బాయిల్డ్‌రైస్ (ఉప్పుడు బియ్యం) తీసుకోబోమని.. రా రైస్ చేస్తేనే కొనుగోలు చేస్తామని కేంద్రం స్పష్టం చేయగా.. ధాన్యం కొనాల్సిందేనని టీఆర్ఎస్ సర్కారు పట్టుపడుతోంది. దీనిపై టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లోనూ డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రుల బృందం ఇటీవల కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ అయినా సానుకూల నిర్ణయం రాలేదు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ విస్తృతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. సోమవారం ఢిల్లీలో ‘తెలంగాణ రైతుల పక్షాన ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష’ పేరిట ఆందోళనకు సిద్ధమైంది. ‘ఒకే దేశం.. ఒకే సేకరణ’ డిమాండ్‌తో రాష్ట్రంలో పండే ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేయనుంది. ఢిల్లీలో దీక్షావేదిక రాజకీయ వ్యూహంతోనూ.. ఈ నిరసన దీక్ష ద్వారా అటు రైతులకు మేలు చేసే లక్ష్యంతోపాటు.. ఇటు రాజకీయ కోణంలోనూ టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ సర్కారు వివక్ష చూపుతోందని, రైతులను ఇబ్బందిపెడుతోందని జనంలోకి తీసుకెళ్లడం ద్వారా.. రాష్ట్రంలో ఆ పార్టీ దూకుడుకు అడ్డుకట్ట వేసేలా పావులు కదుపుతోంది. ధాన్యం కొనుగోలు విషయంగా కేంద్ర ప్రభుత్వం వైఖరి చెప్పాలంటూ గత ఏడాది డిసెంబర్లో స్వయంగా సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు ధర్నాకు దిగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా కేంద్రం తెలంగాణ రైతాంగాన్ని, ప్రజలను అవమానిస్తోందంటూ ఢిల్లీలోనే దీక్ష చేపడుతోంది. ఈ దీక్ష సందర్భంగా తదుపరి కార్యాచరణను కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. జాతీయ రాజకీయాల్లోకి ఆరంగేట్రానికి..! దేశ పాలనలో గుణాత్మక మార్పు రావాల్సి ఉందంటూ సీఎం కేసీఆర్ కొంతకాలంగా ప్రకటనలు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల సీఎంలు, రాజకీయ పార్టీల నేతలతో వరుసగా సమావేశమయ్యారు. తెలంగాణ సాధనకోసం దేశవ్యాప్తంగా వివిధ పార్టీల మద్దతు కూడగట్టి విజయం సాధించామని.. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీపైనా పోరు సాగించేందుకు ముందు వరుసలో ఉంటామని కూడా ప్రకటించారు. తాజాగా ఢిల్లీ దీక్ష ద్వారా దేశవ్యాప్తంగా రాజకీయపక్షాలు, ప్రజల దృష్టిని ఆకర్షించడం లక్ష్యంగా ప్రణాళిక రూపొందించారు. వారం రోజులుగా ఢిల్లీలోనే కేసీఆర్ పంటి నొప్పితో బాధపడుతున్న టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. శస్త్రచికిత్స, అనంతరం విశ్రాంతి కోసం వారం రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. ఇదే సమయంలో నిరసన దీక్ష ఏర్పాట్లపై టీఆర్ఎస్ ఎంపీలు, నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అంతా గులాబీమయం తెలంగాణ ప్రభుత్వ డిమాండ్ ఢిల్లీ అంతటా కనిపించేలా ఇండియాగేట్, తెలంగాణ భవన్ చుట్టూ దారులను హోర్డింగులు, ఫ్లెక్సీలతో నింపేశారు. ‘ధాన్యంపై కేంద్రం మొండి వైఖరి వీడాలి, మొత్తం ధాన్యాన్ని కొనాలి, రైతులను ఆదుకోవాలి’ అనే నినాదాలను వాటిపై రాశారు. ► తెలంగాణ భవన్‌లోని దీక్షావేదికను గులాబీ మయం చేశారు. కేసీఆర్, ఇతర నేతల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ధర్నా వేదిక, ప్రాంగణం ఏర్పాట్లను ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపినాథ్ పర్యవేక్షించారు. ఆదివారం ఈ ఏర్పాట్లను మంత్రులు, ఎంపీలతోపాటు ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు. ► తెలంగాణ భవన్, పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ► ఢిల్లీకి వచ్చే ప్రజా ప్రతినిధులందరికీ మధ్యాహ్నం భోజనం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేయగా, రాత్రి ఎంపీ బీబీ పాటిల్ నివాసంలో భోజన ఏర్పాట్లు చేశారు. నేతలెవరికీ ఇబ్బందులు రాకుండా ఎంపీలు సమన్వయం చేస్తున్నారు. కేంద్రం దిగి వస్తుంది కేసీఆర్ నాయకత్వంలో చేపట్టబోయే దీక్ష చరిత్రాత్మకం అవుతుంది. వాజ్‌పేయి ప్రభుత్వహయాంలోనూ ఎఫ్‌సీఐ, కేంద్ర ఆహార మంత్రి ఇలాగే ధాన్యం కొనుగోళ్లకు నిరాకరిస్తే.. పంజాబ్ ప్రభుత్వం ఆందోళనకు దిగింది. కేంద్రం ముందుకొచ్చి కొనుగోళ్లు చేపట్టింది. కష్టపడి పండించిన పంటను అమ్ముకునే విషయంలో రైతులను క్షోభ పెట్టొద్దు. కేంద్రం మొండి వైఖరి వీడాలి. – మంత్రి నిరంజన్‌రెడ్డి బీజేపీ ప్రభుత్వ విధానాలతో దేశ ఆహార భద్రతకు ముప్పు: రైతులకు ద్రోహం చేసిన ఏ ప్రభుత్వమూ మనుగడ సాధించలేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇది గుర్తుంచుకోవాలి. ఇప్పటికే రైతుల ఆందోళనతో బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంది. ధాన్యం సేకరణ విషయంలోనూ కేంద్రం మొండి వైఖరి వీడాలి. జాతీయ స్థాయిలో సమగ్ర ధాన్యం సేకరణ విధానం తేవాలి. – ఎమ్మెల్సీ కవిత -
తెలంగాణ : రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ బీజేపీ కిసాన్ మోర్చా ఆందోళన
-
వ్యవసాయ చట్టాలపై కేంద్రం వెనకంజ
సాక్షి, న్యూఢిల్లీ : రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు చట్టాలను అనేక ప్రాంతాల రైతులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్దీ నెలలుగా రైతులు చలిని, ఎండను లెక్కచేయకుండా దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు చేస్తున్నారు. వివాదాస్పద చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు. దీనికి కేంద్ర మాత్రం ససేమిరా అంటోంది. ఈ క్రమంలోనే రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య ఇప్పటి వరకు 9సార్లు చర్చలు జరిగాయి. కానీ ఎలాంటి పురోగతి లేకపోవడంతో కేంద్రం మరోసారి నేడు 10వ సారి చర్చలు జరిపింది. నేటి చర్చల్లో కేంద్రం రైతులకు ఓ ఆఫర్‌ను ప్రకటించింది. వివాదాస్పదంగా మారిన చట్టాలను ఒకటి లేదా రెండు సంవత్సరాలు పాటు నిలిపివేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించినట్లు రైతుల సంఘాల ప్రతినిధి కవిత కూరగంటి బుధవారం మీడియాకు వెల్లడించారు. ‘వ్యవసాయ చట్టాలను ఏడాది, ఏడాదిన్నర నిలుపుదల చేస్తామని కేంద్రం ప్రతిపాదించింది. తమ మాట మీద నమ్మకం లేకుండా సుప్రీంలో అండర్ టేకింగ్ ఇస్తామని చెప్పింది. రైతులు, ప్రభుత్వ ప్రతినిధులతో సంయుక్తంగా కమిటీ ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించింది. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకుందామని చెప్పింది. కేంద్రం ప్రతిపాదనపై రైతు సంఘాల నేతలు రేపు సింఘు బోర్డర్ వద్ద సమావేశమై చర్చించుకుంటాం. ప్రభుత్వ ప్రతిపాదన రైతు ప్రయోజనాలు కాపాడేలా ఉందా లేదా అన్నది చర్చిస్తాం. తదుపరి నిర్ణయాన్ని ఈనెల 22న జరిగే భేటీలో కేంద్రానికి తెలియజేస్తాం. ఈ ప్రతిపాదనతో కేంద్రం దిగొచ్చినట్టే కనిపిస్తోంది’ అని కవిత తెలియజేశారు. అయితే మరోసారి జనవరి 22న రైతులతో కేంద్రం చర్చలు జరపనున్నట్లు ప్రకటించింది. -
రైతుల నిరసనలకు కేజ్రీవాల్ మద్దతు
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకు వ్యతిరేకంగా రైతులు నిరసనలు చేస్తున్న సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓ ట్వీట్ చేశారు. ‘‘కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ బిల్లులు రైతు వ్యతిరేకమే. ఈ బిల్లులను వెనక్కి తీసుకోకుండా రైతులను శాంతియుత నిరసనలు చేయకుండా ఆపుతున్నారు. వాటికి వ్యతిరేకంగా నీటి ఫిరంగులను ఉపయోగిస్తున్నారు. ఇలా రైతులకు అన్యాయం చేస్తున్నారు. శాంతియుత నిరసన చేయడం వారి రాజ్యాంగ హక్కు, ”అని కేజ్రీవాల్ గురువారం ట్వీట్లో పేర్కొన్నారు. లోక్‌సభ, రాజ్యసభల్లో కేంద్ర ప్రభుత్వ బిల్లులకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఓటు వేసింది. వ్యవసాయ రంగాన్ని సరళీకృతం చేసే చట్టాలకు నిరసనగా వేలాది మంది రైతులు పంజాబ్, హర్యానా నుంచి ఢిల్లీ వరక కవాతులు నిర్వహిస్తున్నారు. హర్యానాలో కొంత మందిని ఆపేయడానికి నీటి ఫిరంగులను ఉపయోగించారు. మరికొంత మంది ధైర్యంగా ఢిల్లీని ఆశ్రయించాలని వారి ప్రయత్నాన్ని మానుకోలేదు. కానీ ఢిల్లీ పోలీసులు కోవిడ్ 19 నిబంధనలకు కట్టుబడి సమావేశాలకు వ్యతిరేకంగా నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా మెట్రో సౌకర్యాన్ని కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. -
'మోదీ కార్పొరేట్ అజెండాను అమలు చేస్తున్నారు'
సాక్షి, విజయవాడ: కార్మికుల సమ్మె, రైతాంగ ఆందోళనలకు మద్దతుగా ఎంబీవీకే భవన్లో వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించారు. శనివారం ఏర్పాటు చేసిన ఈ సదస్సులో సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణ, వామపక్షాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కార్మికులు, కర్షకులు ప్రజాపోరాటానికి సిద్ధమవుతున్నారు. ప్రధాని మోదీ కార్పొరేట్ అజెండాను అమలు చేస్తూ ప్రజలను గాలికొదిలేస్తున్నారు. కరోనాతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వారిని ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తున్నారు. కార్పొరేట్ వర్గాల ఆస్తులు పెరుగుతున్నాయి, కానీ సామాన్య ప్రజల వేతనాలు మాత్రం పడిపోతున్నాయి. రైతు బిల్లులు తీసుకువచ్చి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు అమ్మేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా రైతులు, కార్మికులు రొడెక్కుతున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈనెల 26, 27 తేదీల్లో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నాం' అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. ఈనెల 26, 27వ తేదీల్లో జరిగే అఖిలభారత సమ్మె కరోనా వచ్చిన తర్వాత జరిగే అతిపెద్ద ప్రజా ఉద్యమం. మోదీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్ఎస్ఎస్ అజెండాను అమలు చేస్తున్నారు. ఒకవైపు కాషాయ ఎజెండా అమలు చేస్తునే మరొకవైపు కార్పొరేట్ వర్గాలకు మేలు చేకూర్చేలా వ్యవహరిస్తున్నారు. ఇండియన్ రైల్వే, బీఎస్ఎన్ఎల్, ఎయిర్ ఇండియా వంటి సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖేష్ అంబానీ, అదానీ మాత్రమే బాగుపడ్డారు. చివరికి వ్యవసాయ రంగాన్ని కూడా వీరికి అప్పగిస్తున్నారు. కేంద్ర తీరుకు నిరసనగా అన్ని కార్మిక సంఘాలు, రైతులు పోరాటానికి సిద్ధమవుతున్నారు' అని సీపీఐ రామకృష్ణ అన్నారు. -
అపర భగీరథుడు.. సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఏలేరు, తాండవ రిజర్వాయర్లను అనుసంధానించడం ద్వారా తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేయొచ్చని ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి చెప్పారు. ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆయన సోమవారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. రెండు జిల్లాల్లోని మెట్ట ప్రాంత రైతు సమస్యల శాశ్వత పరిష్కారానికి చొరవ చూపిన అపర భగీరథుడు సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు. తూర్పుగోదావరి జిల్లా అంటే.. కోనసీమ, గోదావరి డెల్టా అని చాలామంది అనుకుంటారని.. కానీ ఆ జిల్లాతోపాటు ఉత్తరాంధ్రలో 50 శాతానికిపైగా మెట్ట ప్రాంతాలు ఉన్నాయన్నారు. దీనివల్ల ఈ ప్రాంతం నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో వలస పోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాండవ రిజర్వాయర్ నుంచి మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించాలన్న తన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించి.. వెంటనే తగిన కార్యాచరణ చేపట్టడం సీఎం చిత్తశుద్ధికి నిదర్శనమని ప్రశంసించారు. రూ.500 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అనుసంధాన ప్రాజెక్టుతో తాండవ, ఏలేరు ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు. సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం సర్వతోముఖాభివృద్ధికి దోహదపడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. -
రైతు సమస్యల పరిష్కారంతోటే జాతి భద్రత
రెండున్నర దశాబ్దాలుగా భారతదేశంలో రైతుల ఆత్మహత్యలు ఒక ప్రధాన సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యగా మారాయి. పైగా గ్రామీణ రైతు కుటుంబాలపై సామాజిక, మానసిక, ఒత్తిడితో పాటు ఆర్థిక భారం గణనీయంగా పడుతోంది. వీటి వల్ల పిల్లల చదువులు మధ్యలో ఆపివేయటం, మానసిక ఒత్తిడి వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడటం, కమతాల పరిమాణం తగ్గిపోవడం, పాడి పశువులను అమ్మివేయడం, అధిక విలువ గల పంటలలో దిగుబడి గణనీయంగా తగ్గిపోవడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రైతులను, రైతుకూలీలకు ఆదుకోవడానికి ప్రస్తుత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర ప్రభుత్వం కొంత ముందడుగు వేశాయనే చెప్పాలి. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం తన తాజా బడ్జెట్లో 28,866 కోట్ల కేటాయింపులతో (12.66 శాతం) రైతులకు పెద్దపీట వేసింది. ఇది ఇతర రాష్ట్రాల సగటు 6.5 శాతం కేటాయింపుల కన్నా గణనీయంగా ఎక్కువ. జాతీయ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో అంచనాల ప్రకారం 1995 నుండి మన దేశంలో 2,96,438 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీటిలో ప్రథమ స్థానంలో మహారాష్ట్ర ఉండగా 6వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. 2015వ సంవత్సరంలో మహారాష్ట్రలో 3,030 మంది, తెలంగాణలో 1,358 మంది, ఏపీలో 516 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 2017–18లో దేశంలో రోజూ 10 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని నమోదైంది. తెలంగాణలోని వరంగల్ జిల్లాలో, ఏపీలోని అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఎక్కువగా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తక్కువగా ఆత్మహత్యలు నమోదయ్యాయి. రైతుల ఆత్మహత్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు ఉపశమన ప్యాకేజీలు, రుణమాఫీ పథకాలు ప్రకటించాయి. రైతులను, రైతుకూలీ లను ఆదుకోవడానికి ప్రస్తుత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర ప్రభుత్వం కొంత ముందడుగు వేశాయనే చెప్పాలి. ముఖ్యంగా వైఎస్ జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం తన తాజా బడ్జెట్లో 28,866 కోట్ల కేటాయింపులతో (12.66 శాతం) రైతులకు పెద్దపీట వేసింది. కౌలు రైతులతో సహా రైతులందరికి రూ. 12,500 వ్యవసాయ పెట్టుబడి సాయం, పంటల బీమా, 9 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా, రైతులకు వడ్డీ లేని రుణాలు, ఉచితంగా వ్యవసాయ బోర్లు, ఆక్వా రైతులకు విద్యుత్తు సబ్సిడీ, గోదాములు నిర్మిం చడం, విషాదకర పరిస్థితులలో రైతులు మరణించినపుడు తగిన పరిహారం వంటివి చెప్పుకోదగ్గ చర్యలు. ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన పంట సాగుదారు హక్కుల బిల్లు 2019, ముఖ్యంగా రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ. 2 వేలకోట్లతో, ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధులు వంటి పథకాలు.. రైతులు, కౌలుదారుల ఆత్మహత్యలను తగ్గించడానికి ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక చర్యలుగా చెప్పవచ్చు. పత్తి, వరి, చెరకు, జొన్న, మొక్కజొన్న, మినుము, వేరుశనగ, ప్రొద్దుతిరుగుడు పువ్వు మొదలైన పంటల సాగుకు అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే ఖర్చు ఎక్కువని ‘వ్యవసాయ ధరల నిర్ణాయక సంఘం’ తన నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో వ్యవసాయరంగానికి రుణసదుపాయం కల్పించేందుకు బ్యాంకులు తక్షణమే స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలి. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టానికి సవరణ, ఒక పంటపోయినపుడు మరో పంట చేతికి వచ్చేంతవరకు రుణదాతలు ఎటువంటి ఒత్తిడి చేయకుండా చట్టబద్ధమైన చర్యలు చేపట్టాలి. రైతులలో ఆర్థిక స్వావలంబనకై చేపట్టవలసిన కార్యక్రమాలు, చట్టాలను చిత్తశుద్ధితో అమలు చేసినప్పుడు మాత్రమే ఆత్మహత్యలు తగ్గి గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని, గ్రామాభ్యుదయాన్ని సాధించి భారతదేశం సమగ్రంగా అభివృద్ధి చెందుతుంది. ప్రపంచ వ్యాప్తంగా రైతుల ఆత్మహత్యల ప్రమాదాల అంచనాకు శాన్త్రవేత్తలు కొలబద్దలను తయారు చేశారు. వీటిని ఉపయోగించి ఏఏ రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి అవకాశం ఉందో ముందే గుర్తించి తగు నివారణ చర్యలు తీసుకొని వారిని రక్షించవచ్చు. ప్రొ‘‘ మల్లంపాటి శ్రీనివాసరెడ్డి వ్యాసకర్త మాజీ పాలక మండలి సభ్యులు పశువైద్య విశ్వవిద్యాలయం, హైదరాబాద్ మొబైల్ : 94913 24455 -
మాది రైతు సంక్షేమ ప్రభుత్వం
సాక్షి, అమరావతి: అన్నదాతలకు ఏ కష్టం వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతు సంక్షేమ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. వ్యవసాయ రంగంలో సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ఏపీ వ్యవసాయ మిషన్ ద్వితీయ సమావేశం బుధవారం తాడేప ల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం అధ్యక్షతన జరిగింది. 19 అంశాలతో కూడిన అజెండాపై సుదీర్ఘంగా చర్చించారు. వ్యవసాయ మిషన్ చైర్మన్ హోదాలో వైఎస్ జగన్ ప్రారంభోపన్యాసం చేశారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, కల్తీ పురుగు మందులను పూర్తిగా అరిక ట్టాలని ఆదేశించారు. ‘వైఎస్సార్ రైతు భరోసా’ పథకం కింద రైతులు, కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందేలా చూడాలని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏం చెప్పారంటే... ‘‘కౌలు చట్టంపై రైతులకు, కౌలు రైతులకు గ్రామ వలంటీర్ల ద్వారా అవగాహన కల్పించాలి. విత్తనాలు, పురుగు మందులను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే రైతులకు సరఫరా చేయాలి. ప్రతి నియోజకవర్గంలో అగ్రిల్యాబ్స్ ఏర్పాటు చేయాలి. ఎరువులు, పురుగు మందులను పరీక్షించాలి. నాణ్యమైన వాటినే రైతులకు అందజేయాలి. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు మాత్రమే వాటిని సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలి. గ్రామ సచివాలయాల్లోని అగ్రికల్చర్ అసిస్టెంట్‌కు ఉత్తమ శిక్షణ ఇవ్వాలి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఆక్వా సీడ్ సరఫరా అనేది అగ్రి మిషన్ లక్ష్యాల్లో ఒకటి కావాలి. ఇది సక్రమంగా అమలు చేస్తే రైతుల సమస్యలను చాలావరకు పరిష్కరించినట్లే. చిరుధాన్యాల సాగును ప్రోత్సహించండి కరువు పీడిత ప్రాంతాల్లో చిరు ధాన్యాల సాగును ప్రోత్సహించడానికి చర్యలు చేపట్టాలి. సాగు చేసిన చిరుధాన్యాలకు గిట్టుబాటు ధరలు కల్పించేలా చూడాలి. కరువు బారిన పడ్డ రైతాంగానికి ఏ విధంగా ప్రభుత్వ సాయం అందించవచ్చన్న దానిపై ప్రతిపాదనలు రూపొందించాలి. గిట్టుబాటు కాని పంటలకు ధరల స్థిరీకరణ నిధి నుంచి సాయం అందించేలా చర్యలు తీసుకోవాలి. ఈ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం. రైతులకు నష్టం జరుగుతుందంటే చూస్తూ ఊరుకోకూడదు. ఆదుకునేందుకు సన్నద్ధం కావాలి. ప్రభుత్వం మీకు అండగా ఉందనే భరోసాను రైతన్నల్లో కల్పించాలి. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు ఇవ్వాలి. అన్ని రిజర్వాయర్లను నీటితో నింపాలి’’ అని జగన్ ఆదేశించారు. రబీకి 4.31లక్షల క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం రైతు భరోసా సహా వివిధ కార్యక్రమాల అమలుపై పలువురు అధికారులు తమ ప్రణాళికలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. రబీ కోసం రూ.128.57 కోట్లు ఖర్చు చేసి, 4.31 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది కౌలు రైతులకు మేలు చేసేలా చట్టాన్ని తీసుకొచ్చినందుకు అగ్రి మిషన్ సభ్యులు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కోనసీమలో ఈనెల 16వ తేదీ నుంచి 5 కొబ్బరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు నాఫెడ్ ముందుకొచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు వివరించారు. వ్యవసాయ మిషన్ ద్వితీయ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు కన్నబాబు, అనిల్‌కుమార్ యాదవ్, మోపిదేవి వెంకటరమణ, మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రైతుల దీక్ష; భోరున ఏడ్చిన తహసీల్దార్!
సాక్షి, నిజామాబాద్ : తమకు కొత్త పట్టాపాస్ పుస్తకాలు ఇవ్వడం లేదంటూ రెంజల్ మండలంలోని కందకుర్తి రైతులు నిరసనకు దిగారు. అధికారులు సహకరించడం లేదని ఆరోపిస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. కాగా రెంజల్ మండల పరిధిలోని 309 ఎకరాలను 127 మంది రైతులు సాగు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందేందుకై కొత్త పాస్‌పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే రైతులు సాగు చేసుకుంటున్న భూమి వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్న కారణంగా పాస్ పుస్తకాలు ఇవ్వలేమని అధికారులు స్పష్టం చేశారు. దీంతో అధికారుల కఠిన వైఖరితో మనస్తాపం చెందిన రైతులు నిరాహార దీక్షకు దిగారు. ఈ పరిణామాల నేపథ్యంలో విమర్శలు వెల్లువెత్తడంతో రెంజల్ తహసీల్దార్ అసదుల్లా ఖాన్ కంటతడి పెట్టారు. -
ప్రక్షాళన 'సాగు'తోంది!
సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల క్రితం మొదలైన భూ రికార్డుల ప్రక్షాళన ఇంకా కొలిక్కిరాలేదు. ఇది నిరంతర ప్రక్రియే అయినా.. పాత సమస్యలను అధిగమించడంలో రెవెన్యూ యంత్రాంగం చతికిలపడింది. ఇప్పటికీ 94 శాతం మాత్రమే రికార్డుల నవీకరణ జరిగింది. పార్ట్–బీ కేటగిరీలో చేర్చిన ఖాతాలను పరిష్కరించేలా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయకపోవడంతో 3.73 లక్షల ఖాతాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 61,13,916 ఖాతాలుండగా.. వివాదరహిత భూములుగా గుర్తించిన 57,69,933 ఖాతాలకు సంబంధించి డిజిటల్ సంతకాలు జరిగాయి. ఇందులో ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, వరంగల్ (పట్టణ) జిల్లాలు ముందంజలో ఉన్నాయి. ఈ జిల్లాల పరిధిలో క్లియర్ ఖాతాలుగా తేల్చిన వాటిలో ఏకంగా 98% మేర డిజిటల్ సంతకాలు పూర్తయ్యాయి. రికార్డుల ప్రక్షాళనలో వికారాబాద్, ములుగు, మేడ్చల్ జిల్లాలు బాగా వెనుకబడ్డాయి. ఈ జిల్లాల్లో కేవలం 90 శాతం మాత్రమే డిజిటల్ సంతకాలయ్యాయి. దీంతో ఈ జిల్లాల్లోని రైతాంగం పట్టాదార్ పాస్ పుస్తకాల కోసం తహసీల్దార్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. ఆధార్ వివరాలివ్వని 1.74 లక్షల మంది పాస్ పుస్తకాల జారీకి తప్పనిసరిగా భావించే ఆధార్ వివరాలను సమర్పించకపోవడంతో 1.74 లక్షల పట్టాదార్లకు పాస్‌బుక్కులు జారీకాలేదు. అలాగే ఆధార్ సంఖ్యను ఇచ్చినా కూడా 1.69 లక్షల ఖాతాలకు డిజిటల్ సంతకాలు పెండింగ్‌లో ఉండడంతో ఆధార్ ఇవ్వని/ఇచ్చిన 3.43 లక్షల ఖాతాల పాస్ పుస్తకాలు పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు మ్యుటేషన్లు, పౌతీ, నోషనల్ ఖాతాలు పెండింగ్, ఖాతాల సవరణల పెండింగ్‌లో ఉండడం కూడా పాస్ పుస్తకాల జారీ ఆలస్యం కావడానికి కారణంగా రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. కొలిక్కిరాని పార్ట్–బీ వ్యవహారం.. భూ యాజమాన్య హక్కులపై స్పష్టతనివ్వకపోవడంతో లక్షలాది మంది రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పార్ట్–బీ జాబితాలో చేర్చిన భూముల వ్యవహారం తేల్చకపోవడంతో రెవెన్యూ అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ కేటగిరీ భూములపై మార్గదర్శకాలు జారీ చేయకపోవడంతో ఎడతెగని జాప్యం జరుగుతోంది. గత రెండేళ్లుగా పాస్ పుస్తకాల కోసం ఎదురుచూస్తున్న రైతాంగం పెదవి విరుస్తోంది. తొలి విడతలో వివాదరహిత భూములకు మాత్రమే పాస్ పుస్తకాలను జారీ చేసిన సర్కారు.. పార్ట్–బీ కేటగిరీలో ప్రభుత్వ భూములు/ఆస్తులు, అటవీ భూములు, దేవాదాయ తదితర భూములతోపాటు, వ్యవసాయేతర భూములను చేర్చింది. భూవిస్తీర్ణంలో తేడా, కోర్టు కేసులు, కుటుంబసభ్యుల భూపంపకాల్లో విస్తీర్ణంలో వ్యత్యాసం, అసైన్డ్ చేసిన భూమికి, క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి తేడా, ఫారెస్టు, రెవెన్యూ శాఖల మధ్య తగాదా, ఫారెస్టు, పట్టా భూముల మధ్య వివాదస్పదమైన వాటిని కూడా పార్ట్–బీలో నమోదు చేసింది. వీటిని సత్వరమే సవరించి పరిష్కారమార్గం చూపాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయకపోవడం.. పెట్టుబడి సాయం అందించాలనే తొందరలో ఈ కేటగిరీ భూముల జోలికి వెళ్లలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 3,73,051 ఖాతాలకు మోక్షం కలగలేదు. ఈ ఖాతాలకు సంబంధించిన రైతులు ప్రతిరోజు కలెక్టరేట్, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉన్నారు. -
తుంగభద్ర ఆయకట్టులో కన్నీటి సేద్యం
(సాక్షి ప్రతినిధి, కర్నూలు): తుంగభద్ర జలాల కేటాయింపుల్లో రాష్ట్రానికి ప్రతి ఏటా అన్యాయమే జరుగుతోంది. విడుదల చేసిన నీళ్లు రాష్ట్రానికి చేరే విషయంలో మరింత దారుణంగా ఉంటోంది. కర్ణాటక రైతులు అడుగడుగునా నీటి చౌర్యానికి పాల్పడుతుండడంతో రాష్ట్ర రైతులు ఎండిన కాలువలు చూస్తూ కన్నీరు పెట్టుకుంటున్నారు. కర్ణాటక జల చౌర్యం, అధికారుల నిర్లిప్తత వెరసి రాష్ట్రంలోని తుంగభద్ర ఆయకట్టు రైతులకు అన్యాయం జరుగుతోంది. తుంగభద్ర డ్యామ్ నుంచి రాష్ట్ర (ముఖ్యంగా కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాలు) రైతుల తాగు, సాగు అవసరాల కోసం 56.5 టీఎంసీల కేటాయింపులున్నాయి. ఇందులో హెచ్చెల్సీకి 32.5 టీఎంసీలు, ఎల్ఎల్సీకి 24 టీఎంసీలు కేటాయించారు. అయితే గత 20 ఏళ్లలో ఎప్పుడూ కూడా కోటా మేర నీళ్లు హెచ్చెల్సీ, ఎల్ఎల్సీకి వదల్లేదు. ఇదీ హెచ్చెల్సీ పరిస్థితి హెచ్చెల్సీ కాలువకు 32.5 టీఎంసీల నికరజలాలను తుంగభద్ర బోర్డు కేటాయించింది. ఈ నీటిపై కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాలో 2.84 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే టీబీబోర్డు మాత్రం ఏటా సగటున 18 టీఎంసీలు మాత్రమే ఇస్తామని ఐఏబీ సమావేశంలో నిర్ణయిస్తున్నారు. వాస్తవానికి ఆమేర కూడా అందించ లేకపోతున్నారు. దీంతో ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలో 2006లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కేసీ కెనాల్‌కు దక్కాల్సిన 10 టీఎంసీల నీటిని హెచ్చెల్సీకి మళ్లించేలా జీవో జారీ చేశారు. అందులో కూడా ఏటా 4 టీఎంసీలు మాత్రమే బోర్డు విడుదల చేస్తోంది. దీంతో ఏటా 20 టీఎంసీల నికరజలాలు సీమ రైతులు కోల్పోతున్నారు. తుంగభద్ర డ్యామ్ నుంచి ఏపీ సరిహద్దు వరకూ 105 కిలోమీటర్ల మేర కాలువ కర్ణాటకలో ఉంది. దీంతో ఆ ప్రాంతంలోని రైతులు ఏటా జలచౌర్యానికి పాల్పడుతున్నారు. ఎక్కడికక్కడ పైపులు వేసుకుని మోటర్ల ద్వారా వాడేసుకుంటున్నారు. హెచ్చెల్సీ నుంచి ఆలూరు బ్రాంచ్ కెనాల్ ద్వారా కర్నూలుకు, పీబీసీ (పులివెందుల బ్రాంచ్ కెనాల్), మైలవరం బ్రాంచ్ కెనాల్ ద్వారా వైఎస్సార్ జిల్లాకు తుంగభద్రజలాలు చేరాలి. ప్రధాన కాలువ ద్వారా అనంతపురంలోని పీఏబీఆర్, ఎంపీఆర్ డ్యామ్‌కు నీరు చేరుతుంది. అయితే విడుదల చేసిన జలాలు కాలువ చివరి ఆయకట్టు వరకూ వెళ్లడం లేదు. దీంతో తమ వాటా జలాలు దక్కడంలేదని రైతులు ఏటా ఆందోళనలకు దిగుతున్నారు. పీబీసీ ఆయకట్టుకు 8 ఏళ్లుగా చుక్కనీరు అందడంలేదు. విడుదలయ్యే అరకొర నీరు తాగునీటి అవసరాలకే సరిపోతోంది. ఫలితంగా పులివెందుల ప్రాంతంలో పండ్లతోటల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎల్ఎల్సీ పరిస్థితి ఇదీ ఎల్ఎల్సీ (లోలెవల్ కెనాల్)కి డ్యామ్ నుంచి 24 టీఎంసీలు కేటాయింపులున్నాయి. ఈ నీటిపై ఆధారపడి కర్నూలు జిల్లాలో 1.51లక్షల ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉంది. గత ఏడేళ్లుగా కేటాయింపులు పరిశీలిస్తే 6 టీఎంసీల నుంచి 15 టీఎంసీల లోపే ఉన్నాయి. ఇందులో కూడా 3.5 టీఎంసీలు కర్నూలు పశ్చిమ ప్రాంతంలో తాగునీటి అవసరాలకు వినియోగిస్తారు. మిగిలిన నీటినే సాగుకు వినియోగించాలి. దీంతో ఎల్ఎల్సీ కింద ఎప్పుడూ సగం మేర ఆయకట్టుకు నీరందడం లేదు. ఈ ఏడాది పరిస్థితులు మరీ దారుణం టీబీడ్యాంలో నీటి నిల్వల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గతేడాది ఈ సమయానికి 94.01 టీఎంసీలు ఉంటే, ప్రస్తుతం డ్యాంలో 24.44 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. గతేడాది డ్యాంలో ఇన్‌ఫ్లో 54,380 క్యూసెక్కులు, ఉంటే ఈ ఏడాది 14,683 క్యూసెక్కులు మాత్రమే వస్తోంది. దీంతో ఎల్ఎల్సీ ఆయకట్టు రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. దీనికి తోడు వర్షాలు కూడా లేకపోవడంతో ఈ ఏడాది పంటలు లేనట్లేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కల్తీ విత్తనం.. మార్కెట్లో పెత్తనం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత వారం ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు రైతుల్లో ఇద్దరు వాణిజ్య పంటలు వేసి చేతులు కాల్చుకున్న వారే. మరొకరు కల్తీ విత్తనం బారినపడి నష్టపోయిన వారు. కల్తీ విత్తన చావులకు ఇదో నిదర్శనం మాత్రమే. రాష్ట్రంలో కల్తీ విత్తనాల బారినపడి నష్టపోతున్న వారిలో పత్తి, మిర్చి రైతులే అధికం. అయితే, ప్రతి వంగడాన్ని ఏదోవిధంగా కల్తీ చేయడం సాగిపోతూనే ఉంది. ఒకపక్క కలిసిరాని ప్రకృతి, మరో వంక కల్తీ విత్తనాలతో రైతులు భారీగా నష్టపోతున్నారు. ఆర్థికంగా దెబ్బతిని అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వందలాది కేసులు నమోదవుతున్నా.. తనిఖీలు చేస్తున్నా కల్తీ విత్తనాల బెడద రాష్ట్రంలో ఏమాత్రం ఆగడం లేదు. కల్తీకి పలానా కంపెనీ కారణం అని తేలినా ఆ విత్తన సంస్థల నుంచి రైతులకు పరిహారం అందడం లేదు. బడా విత్తన కంపెనీలతో లాలూచీ పడిన గత ప్రభుత్వాల నిర్వాకంతో రాష్ట్రంలో ఇప్పటికీ కల్తీ విత్తనాల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలన్నట్టుగానే సాగుతోంది. కల్తీ విత్తన విక్రయ అడ్డాలు వాణిజ్య పంటలు ఎక్కడ సాగవుతుంటే.. అక్కడ కల్తీ విత్తనాలు ప్రత్యక్షమవుతున్నాయి. అయితే, గుంటూరు, కర్నూలు, నంద్యాల వీటికి ప్రధాన అడ్డాలుగా మారాయి. రాష్ట్రంలో ప్రధాన వాణిజ్య పంటలైన మిర్చి, పత్తి రైతులు కల్తీ విత్తనాలతోనే నష్టపోతున్నారు. నాసిరకం, కల్తీ విత్తనాలతో రెండేళ్ల కిందట గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మిర్చి రైతులు నష్టపోయినా.. వారికి విత్తన కంపెనీల నుంచి నయాపైసా పరిహారం అందలేదు. ఎకరానికి రూ.లక్ష, రూ.లక్షన్నర ఖర్చుపెట్టి సాగు చేసినా విత్తన వైఫల్యంతో మిర్చి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం రుతుపవనాలు ప్రారంభమైన నేపథ్యంలో మళ్లీ కల్తీ విత్తనాల బెడద మొదలైంది. గుంటూరు, కర్నూలులో జీవ వైవిధ్యం పాలిట శత్రువుగా మారిన బీజీ–3 పత్తి విత్తనాలను అధికారులు పట్టుకున్నారు. మరోపక్క, రాష్ట్రానికి చెందిన కొందరు వ్యాపారులు గుంటూరు, కర్నూలు, నంద్యాల, గుజరాత్‌లలో తక్కువ రేట్లకు కొనుగోలు చేసి రైతులకు విక్రయిస్తున్న 33 క్వింటాళ్ల పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల బోల్‌గార్డ్–111 పేరిట నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న వారి భరతం పట్టేందుకు వ్యవసాయ శాఖ, పోలీసు విభాగం సంయుక్తంగా దళాలను ఏర్పాటు చేసింది. 13 కంపెనీలను నిషేధించినా ఫలితం లేకుండా పోయింది. ఏయే సెక్షన్ల కింద కేసు పెట్టవచ్చు విత్తనాల విక్రయం నిత్యావసరాల వస్తువుల చట్టం పరిధిలోకి కూడా వస్తుంది. ఎవరైనా కల్తీ విత్తనాన్ని విక్రయిస్తే తక్షణమే కేసు నమోదు చేసి నాన్ బెయిలబుల్ కేసు పెట్టవచ్చు. భారతీయ శిక్షాస్మృతిలోని 420, 427, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేయవచ్చు. అదే పత్తి విత్తనాలకైతే కాటన్ యాక్ట్ 2009 కింద కేసులు నమోదు చేయవచ్చు. నేరం రుజువైతే 6 నెలల నుంచి మూడేళ్ల పాటు జైలు శిక్ష విధించవచ్చు. నకిలీ విత్తనాలేనని వ్యవసాయ శాఖ నిర్ధారిస్తే జిల్లా కలెక్టర్లు విత్తన కంపెనీలకు జరిమానా విధించవచ్చు. రెవెన్యూ రికవరీ చట్టం కింద ఆయా విత్తన కంపెనీల ఆస్తులు స్వాధీనం చేసుకోవచ్చు. రశీదు కచ్చితంగా తీసుకోండి మంచి విత్తనం చేలో వేస్తే కనీసం 15 నుంచి 20 శాతం వరకు ఉత్పత్తి పెరుగుతుందని అంచనా. రాష్ట్రంలో ఇప్పటికీ 30 శాతం విత్తనాలు చిన్న, పెద్ద వ్యాపారులు సరఫరా చేసేవే. రాష్ట్రంలో విత్తన ధ్రువీకరణ పద్ధతి ఉంది. ప్రభుత్వం ఉత్పత్తి చేయించే వంగడాలను ప్రయోగాత్మకంగా మొలక శాతాన్ని నిర్ధారించిన తర్వాత మార్కెట్లోకి విడుదల చేస్తారు. ప్రభుత్వ సంస్థలు సరఫరా చేసే విత్తనాలను కొనడంతోపాటు సొంతంగా తయారు చేసే ప్రైవేటు కంపెనీలు ఆ విత్తన ధ్రువీకరణ పత్రంతోనే విత్తనాలు అమ్మాలి. రైతు ఎక్కడ విత్తనాన్ని కొన్నా తాను కొంటున్న విత్తనానికి ఈ ధ్రువీకరణ పత్రం ఉందో లేదో చూడాలి. కొనుగోలు చేసిన ప్రతి వంగడానికి రశీదు తీసుకోవాలి. కల్తీ విత్తనాల వల్ల నష్టాలివీ - విత్తనాన్ని పదేపదే వేయాల్సి వస్తుంది. - ఒకటికి రెండుసార్లు కొనుక్కోవాల్సి వస్తుంది. - డబ్బుకన్నా సమయాన్ని నష్టపోవాల్సి వస్తుంది. - తెచ్చిన అప్పులు తీర్చలేక వడ్డీలు పెరిగిపోతాయి. - ఆర్థికంగా నష్టపోయి అఘాయిత్యాలకు పాల్పడాల్సి వస్తుంది. నూతన ప్రభుత్వం ఏం చేయబోతోందంటే కల్తీ విత్తనాన్ని విక్రయించే వారి భరతం పట్టేలా నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. కల్తీ మాట వినబడటానికే వీలు లేదన్నారు. అవసరమైతే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టాన్ని తీసుకు వస్తామని రైతులకు హామీ ఇచ్చారు. దీంతో అటు వ్యవసాయాధికారులు, పోలీస్ యంత్రాంగంలో చలనం వచ్చింది. ముమ్మరంగా తనిఖీలు చేపట్టి కల్తీ విత్తనాలు అమ్మే సంస్థలపై నిఘా పెరిగింది. -
సీఎం జగన్ హామీతో వేంపెంట దీక్షలకు నేటితో ముగింపు
సాక్షి, పాములపాడు(కర్నూలు) : మండలంలోని వేంపెంట గ్రామంలో అక్రమంగా నిర్మించతలపెట్టిన ర్యాంక్ మినీ హైడ్రాలిక్ పవర్ ప్లాంటు రద్దు ప్రకటనతో దీక్షలు ముగియనున్నాయి. శుక్రవారం జిల్లా కలెక్టర్ వీరపాండియన్, ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించేందుకు వేంపెంటకు రానున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ వేంపెంట వాసుల 1,566 రోజుల పోరాటానికి తగిన ఫలితాన్ని అందించారు. టీడీపీ నాయకులు అక్రమ మార్గంలో, ఫోర్జరీ సంతకాలతో, వేంపెంట గ్రామాన్ని వెలుగోడు మండలంలో ఉన్నట్లు రికార్డుల్లో చూపించి అనుమతులు తెచ్చుకున్న విషయం విధితమే. ఈ విషయాన్ని గ్రామస్థులు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వివరిస్తే.. అభివృద్ధిని అడ్డుకుంటారా.. అంటూ దురుసుగా ప్రవర్తించిన తీరు ఇప్పటికీ ఆ గ్రామస్థులకు కళ్ల ముందే కనపడుతోంది. ఇదే విషయాన్ని ప్రతిపక్ష హోదాలో ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి తెలియజేయగా దీక్షా శిబిరం వద్దకు వచ్చి తాను అధికారంలోకి రాగానే పవర్ ప్లాంటు రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని ప్రకారం నేడు పవర్‌ప్లాంట్‌ను రద్దు చేస్తూ ఆ గ్రామ ప్రజలకు ఆనందపు ఫలాలను అందించారు. -
కాల్మొక్తా.. పాసుపుస్తకం ఇప్పించండి
దుగ్గొండి: రైతుకు ఉచితంగా పట్టాదారు పాసు పుస్తకం అందిస్తామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో రైతులకు న్యాయం జరగడం లేదు. వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి తనిఖీ నిమిత్తం వచ్చిన వరంగల్ రూరల్ జిల్లా జాయింట్ కలెక్టర్ రావుల మహేందర్‌రెడ్డి కాళ్లపై పడి మైసంపల్లి గ్రామానికి చెందిన రైతు గంగారపు మొగిళి తన పాసుపుస్తకం సమస్యను మొరపెట్టుకున్నాడు. వెంటనే తనకు పట్టా పుస్తకం ఇప్పించి కేసీఆర్ సారు ఇచ్చే పైసలు వచ్చేటట్టు చేయాలని వేడుకున్నాడు. ఇలా పది గ్రామాలకు చెందిన రైతులు తమ సమస్యను జేసీకి వివరించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ సమస్యలు ఉన్న భూములకు తప్ప మిగతా రైతుల భూములన్నీంటికి పట్టాదారు పాసు పుస్తకాలు అందిస్తామని చెబుతూ భూములను సర్వే చేయాలని అక్కడికక్కడే సర్వేయర్‌ను ఆదేశించారు. అలాగే, అక్రమాలకు పాల్పడే ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో రైతులు శాంతించారు. -
రైతుల కోసం ‘ఉద్యమం’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలపై ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని కిసాన్ కాంగ్రెస్ నిర్ణయించింది. ఇందుకోసం ఉద్యమ కార్యాచరణను రూపొందించి, రైతుల భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా పోరాటానికి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు పథకం అమలుతోపాటు రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్ల చెల్లింపులు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలనే డిమాండ్‌తో ఉద్యమాలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం గాంధీభవన్‌లో జరిగిన రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ సమావేశంలో తీర్మానించారు. రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేశ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో భూరికార్డులు, పట్టాదారు పాసుపుస్తకాలతోపాటు మొత్తం 9 అంశాలపై చర్చించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి ఆరునెలలవుతున్నా ఇంతవరకు రుణమాఫీ చేయలేదని, ధాన్యం కొనుగోళ్లు చేసి ఇంతవరకు డబ్బులు చెల్లించలేదని కిసాన్ కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఈ అంశాలన్నింటిపై రైతులతో కలిసి ఉద్యమం చేయాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం ఏఐసీసీ కిసాన్‌సెల్ వైస్‌చైర్మన్ ఎం.కోదండరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, భూరికార్డుల ప్రక్షాళన అనంతరం రాష్ట్రంలోని 6 లక్షలకుపైగా రైతులకు కొత్త పాసుపుస్తకాలు అందలేదని, వీరికి రైతుబంధు కూడా అమలు కావడం లేదని, ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 35వేల మంది రైతులకు రైతుబంధు ఇవ్వడం లేదని చెప్పారు. భూరికార్డుల ప్రక్షాళనతో పాటు కొత్త పాసుపుస్తకాలను పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనందునే ఈ ఇబ్బందులు వచ్చాయని, లోపభూయిష్ట విధానాలతో ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. రైతు సమస్యలపై పోరాటాలు చేయాలని తాము నిర్ణయించామని, పటిష్ట కార్యాచరణతో ముందుకెళ్తామని చెప్పారు. రాష్ట్ర చైర్మన్ అన్వేశ్‌రెడ్డి మాట్లాడుతూ రబీ ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమయిందని, ధాన్యం కొనుగోలుకు ఎన్ని గన్నీబ్యాగులు అవసరమవుతాయో కూడా ప్రభుత్వానికి తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. 15–20 రోజులపాటు అసలు ధాన్యమే కొనుగోలు చేయలేదని, ధాన్యం కొనుగోలు చేసిన రెండు నెలల తర్వాత కూడా డబ్బులు ఇవ్వడం లేదన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావస్తున్నా రబీ కొనుగోళ్లకు రూ.2వేల కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ధాన్యం చెల్లింపులు రాకపోవడంతో రైతులకు పెట్టుబడి ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరునెలలవుతున్నా రుణమాఫీ చేయలేదని, ఈ అంశాలన్నింటిపై ఉద్యమించాలని కిసాన్ కాంగ్రెస్ నిర్ణయించిందని చెప్పారు. ప్రకృతి వైపరీత్య నిధులపై శ్వేతపత్రం: శశిధర్‌రెడ్డి కిసాన్ కాంగ్రెస్ సమావేశానికి హాజరైన జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ మాజీ వైస్‌చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ, గత ఐదేళ్లలో ప్రకృతి వైపరీత్యాల నిధుల కింద కేంద్రం రాష్ట్రానికి రూ.1,500 కోట్ల సాయం చేసిందని, ఈ మొత్తాన్ని ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఐదేళ్లలో ప్రకృతి వైపరీత్యాల కింద నష్టపోయిన రైతులకు ఎంత చెల్లింపులు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యాల నష్టాల గురించి వివరాలు చెప్పేందుకు రాష్ట్రం సహకరించడం లేదని కేంద్ర బృందం చెప్పడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన చెప్పారు. -
మహబూబ్‌నగర్ కలెక్టరేట్ వద్ద రైతు ఆత్మహత్యయత్నం
-
పసుపు రైతులకు దొరకని సీఈసీ అపాయింట్మెంట్
-
ఐదేళ్ల పాలనకు ఓ నమస్కారం!
సాక్షి, దర్శి (ప్రకాశం): టీడీపీ ప్రభుత్వ పాలనలోఐదేళ్లు వెనక్కు చూస్తే ప్రతి ఒక్కరికీ నష్టాలు తప్ప ఏం ఒరిగిందనే విమర్శలు మెండుగా ఉన్నాయి. 2014–15వ సంవత్సరంలో అక్రమ కేసులతో నియోజకవర్గం అట్టుడికింది. మంత్రి శిద్దారాఘవరావు అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్సార్ సీపీ నేతల పై దాడులు చేసి అక్రమ కేసుల పేరుతో నియోజకవర్గంలో భయభ్రాంతులు సృష్టించారు. ఆతరువాత రైతులకు సాగర్ జలాలు విడుదల చేశారు. రైతులు వరి నాటుకున్న తరువాత సాగర్ జలాలు పూర్తి స్థాయిలో అందజేయలేదు. దీంతో వరి పంట పూర్తి గా ఎండి పోయింది. కానీ మంత్రిగా ఉన్న శిద్దారాఘవరావు పట్టించుకోకుండా వదిలేశారు. అప్పట్లో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ గా ఉన్న బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి సాగర్ కాలువలపై పర్యటన జరిపి కొంతమేర రైతులకు సాగర్ జలాలు అందించేందుకు కృషి చేశారు. మిరప రేట్లు బాగా ఉన్నా తెగుళ్లు రావడంతో రైతులు భారీగా నష్ట పోయారు. కంది వేసిన రైతులకు కనిస మద్దతు ధర కూడా రాలేదు. 2015–16లో సాగర్ జలాలు విడుదల చేయలేదు. రైతులు కంది, మిరప వంటి పంటలు వేసుకున్నారు. కందికి కొంత గిట్టుబాటు ధర ఉన్నప్పటికీ వర్షాభావ పరిస్థితులు అనుకూలించలేదు. 2016–17లో సాగర్ జలాలు విడుదల కాలేదు. వర్షాలు కురవక వేసిన పంటలు బాగా దెబ్బతిన్నాయి. మిరప మొదట్లో మంచి గిట్టుబాటు ధరలు ఉండటంతో రైతులు ఆపంటలే అధికంగా వేశారు. దీంతో రేటు పడిపోయి నానా ఇబ్బందులు పడ్డారు. 2017–18 సాగర్ జలాలు విడుదల కాలేదు. సంవత్సరం నియోజకవర్గంలో మరణ మృదంగంలా విషజ్వరాలు విజృంభించాయి. ప్రతి రోజూ ఒకటీ రెండు మరణాలు సంభవించడం జరిగింది. సుమారు 80 మందికి పైగా మరణించారు. ఈ ఏడాది సాగర్ జలాలు రాక ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. వర్షాలు పూర్తి స్థాయిలో కురవక కురువు మేఘాలు కమ్ముకున్నాయి. కందులకు గిట్టు బాటు ధరలు రాలేదు. ఇతర రాష్ట్రాల్లో కందులు తక్కువ ధరలకు దిగుమతి చేసుకుని ఇక్కడి రైతుల పేరిట మార్క్ ఫెడ్, నాపెడ్ ద్వారా రైతులకు చెందాల్సిన గిట్టు బాటు ధరలను మంత్రి బినామీలే మింగేశారు. మిరప పంటలు వేసిన రైతులు పూర్తిగా దెబ్బతిన్నారు. కరువు దెబ్బకు రైతులు కూడా కూలి పనులకు పోవడం మొదలు పెట్టారు. 2018 –19 సంవత్సరంలో ప్రభుత్వం సాగర్ జలాలు ఇస్తామని చెప్పడంతో వేసిన కందిని చెడగొట్టి వరి నాటుకున్నారు. వరి కంకి దశలోకి వచ్చేసరికి సాగర్ జలాలు నిలిపివేశారు. దీంతో కంది పంటకు ఎకరాకు రూ.5 వేలు, వరి పంటలో రూ.25 వేలు రైతులు నష్ట పోయారు. ఈ తరుణంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ వరి రైతుల పరిస్థితి చూసి చలించి పోయారు. వరి పొలాలు సందర్శించి రైతులకు సాగర్ జలాలు విడుదల చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. అయినప్పటికీ మంత్రి శిద్దారాఘవరావు కాని , జిల్లాలో ఎమ్మెల్యేలు కానీ సాగర్ జలాలు తీసుకు రావడానికి కనీస ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో వేలాదిఎకరాలు ఎండి రైతులు నష్ట పోయారు. ఐదేళ్లుగా గొంతెండుతోంది.. ఎన్ఏపీ రిజర్వాయర్ ద్వారా ప్రతిరోజు దిగు నీరు అందిస్తున్నట్లు అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై బిల్లులు చేసుకుని ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు బొక్కుతున్నారు. ఇలా ప్రజలకు అందించాల్సిన తాగునీటిలో కూడా అవినీతిని పారించారు. నీరు చెట్టు పేరుతో భారీగా దోచుకున్నారు. ప్రతి పథకానికి జన్మభూమి కమిటీలు పెట్టి సామాన్యులకు పింఛన్లు , కార్పొరేషన్ లోన్లు రాకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వ స్థలాల పంపిణీ పేరుతో అనాదీనం భూములను సాగు దారులనుంచి అతి తక్కువ ధరలకు కొనుగోనుగోలు చేసి ప్లాట్లుగా వేసి వాటిని అధిక లాభాలకు అమ్మకాలు చేసి వారికి ప్రభుత్వ పట్టాలు ఇప్పిస్తామని నమ్మబలికారు. ఈ ముసుగులో ఈ పట్టాలన్నీ మంత్రి శిద్దా రాఘవరావు ఉచితంగా ఇచ్చినట్లు ప్రచారం చేసి పట్టాల ముసుగులో పక్కా దోపిడీకి పాల్పడ్డారు. ఎస్సీ, ఎస్టీలకు తీరని అన్యాయం నియోజకవర్గంలో 12 విద్యుత్ సబ్స్టేషన్లలో 48 మంది నూతన సిబ్బందిని తీసుకున్నారు. వారిలో ఎస్సీల కోటాలో 15 శాతం, ఎస్టీలకు 7 శాతం రిజర్వేషన్.. రోష్టర్ పాటించాలి. అయితే కేటాయించాల్సిన ఉద్యోగావకాశాలను కూడా ఇతర కులాలకు ఒక్కో ఉద్యోగానికి రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు అమ్ముకుని ఎస్సీ, ఎస్టీలకు తీరని అన్యాయం చేశారు. ఈ తతంగంలో మంత్రి శిద్దా హస్తం ఉన్నట్లు సమాచారం. దీంతో ఎస్సీ, ఎస్టీ సంఘ నాయకులు ఆయనకు దూరమయ్యారు. ఈకారణంతోనే టీడీపీకి చెందిన ప్రధాన ఎస్సీ, ఎస్టీ నాయకుతు గాలిమూటి దేవప్రసాద్, ఉప్పల పాటి కిరణ్ ప్రసాద్, జి. వరప్రసాద్, కవలకుంట్ల గోవింద్ ప్రసాద్, కే సన్నీబాబు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మూరి రవిచంద్ర వంటి మంత్రికి ముఖ్య అనుచరులుగా ఉన్న ప్రధాన ఎస్సీ , ఎస్టీ నాయకులు మంత్రికి దూరమయ్యారు. హామీలు గాలికొదిలారు దొనకొండలో ఇండస్ట్రియల్ కారిడార్, విమానాశ్రయం అభివృద్ధి, హెలికాప్టర్ల కంపెనీ, కార్ల విడిభాగాల కంపెనీలంటూ మంత్ర చెప్పారు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే పిచ్చిచెట్లు దర్శిన మిస్తున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్న హామీ నెరవేరక పోవడంతో వారంతా నిరాశలో ఉన్నారు. దర్శిలో డిగ్రీకళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్, మినీ స్టేడియం, జీప్లస్ త్రీ కాంప్లెక్స్‌లు, శిలాఫలకాలకే పరిమితమయ్యాయి. దర్శిలో ఆర్టీఓ కార్యాలయం ఏర్పాటు చేస్తామని చెప్పి కనీసం ఆ ఊసే ఎత్తలేదు. చందవరం సమీపంలోని గుండ్లకమ్మపై ఏర్పాటు చేసిన బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకుండానే ఇదే నా.. అభివృద్ది అంటూ మంత్రి ప్రారంభించారు. ప్రస్తుతం ఆబ్రిడ్జిపై కనీసం ఆపార్టీ గుర్తు అయిన సైకిల్ కూడా తిరగడం లేదు. ఈసారి ఓటర్లు చూపు ఎటువైపు ఉంటుందో వేచి చూడాల్సిందే. -
కొందరికే ‘సుఖీభవ’
సాక్షి,విజయవాడ: ఎన్నికలకు రెండునెలల ముందు తెలుగుదేశం ప్రభుత్వం రైతులపై ప్రేమ నటిస్తూ ప్రకటించిన ‘అన్నదాత సుఖీభవ’ పథకం అర్హులందరికీ అందడం లేదు. రైతులకు రెండు విడతలు రుణమాఫీ, మూడేళ్లుగా ఇన్పుట్ సబ్సిడీలు, బీమాలు ఇవ్వకుండా.. ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకం ప్రవేశపెట్టడం..దాన్ని సమర్థంగా అమలు చేయకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ పథకం అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాలో నేరుగా విడతలవారీగా రూ.9వేల జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మొదటి విడత రూ.1000, రెండో విడత రూ.2వేలు.. మిగిలిన సొమ్ము రబీలో జమ చేస్తామని చెప్పారు. అయితే చాలా మంది ఖాతాల్లో తొలి విడత రూ.1000 కూడా జమ కాలేదు. జిల్లాలో భూ కమతాలు.. జిల్లాలో 6.14లక్షలు మంది చిన్న, సన్నకారు రైతులు ఉన్నారని వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి. అయితే అన్నదాత సుఖీభవకు 3.99 లక్షల కుటుంబాలే ఎంపికయ్యాయి. ఈ విధంగా ఎంపికైన వారిలో 61,938 మందికి ఇప్పటి వరకు కనీసం రూ.1000 జమ కాలేదు. ఆధార్ నంబర్లు వారి వెబ్‌ల్యాండ్‌కు అనుసంధానం చేయకపోవడం వల్లనే డబ్బులు పడటం లేదని అధికారులు చెబుతున్నారు. అనర్హులకు డబ్బులు అయితే సెంటు భూమి లేని వారి బ్యాంకు ఖాతాలకు రూ.1000 జమ అవుతోంది. గుడివాడ, పెనమలూరులలో ఈ విధంగా డబ్బులు జమ అయ్యాయి. కాగా కొన్ని చోట్ల చనిపోయిన వారి బ్యాంకు ఖాతాల్లోనూ డబ్బులు జమయ్యాయని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. లబ్ధిదారుల పరిశీలన నిల్.. అన్నదాత సుఖీభవకు అర్హులైన వారి వివరాలను వ్యవసాయశాఖాధికారుల నుంచి తీసుకోలేదు. వెబ్‌ల్యాండ్‌ను అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం లబ్ధిదారులను ఎంపిక రియల్ టైమ్ గవర్నెన్స్ అధికారులు చేశారు. దీంతో అనేక వేల మంది ఈ పథకానికి అర్హత పొందలేకపోయారు. రియల్ టైమ్ గవర్నెర్స్ మాయ.. రియల్ టైమ్ గవర్నర్స్ నుంచి ఆయా వసాయశాఖాధికారులకు లిస్టులు వస్తున్నాయి. ఆధార్‌కార్డు అనుసంధానం కాని వారి ఫోన్లు నంబర్లు పంపుతున్నారు. ఆ ఫోన్లకు అను సంధానం చేసే బాధ్యత అధికారులకు అప్పగించారు. ఈ విధంగా అనుసంధానం చేసిన తర్వాత కూడా వారి ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయో లేదో అధికారులకు తెలియదు. అధికారులు చుట్టూ రైతులు ప్రదక్షిణలు.. పథకంలో కొంతమందికి డబ్బులు వచ్చి మరికొంతమందికి డబ్బులు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో వీరు మండల వ్యవసాయశాఖాధికారులు చుట్టూ తిరుగుతున్నారు. అయితే తాము ఏమీ చేయలేమని, అన్ని అర్హతలు ఉంటే వారి పేరు ఆర్టీజీఎస్కు పంపుతామని చెబుతున్నారు. -
ఏ ఒక్క రైతుకు పరిహారం అందలేదు
సాక్షి, పామర్రు : మండల పరిధిలోని రిమ్మనపూడి శివారు ప్రాంతమైన అంకామ్మగుంట వద్ద గల బాడవాలోని 70 ఎకరాల పోలంలో ఒక్క ఎకరానికి కూడా పంట నష్ట పరిహారం రాలేదని ఆ గ్రామానికి చెందిన రైతు నేతల సతీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తుఫాను కారణంగా కురిసిన వర్షాలకు పంట నష్ట పోయిన రైతులకు నష్ట పరిహారం ఇస్తున్నారని తెలిపి వ్యవసాయశాఖ కార్యాలయం వద్దకు వచ్చాడు. అక్కడ ఉన్న లిస్టులో అంకామ్మగుంట బాడవా పొలం సుమారు 70 ఎకరాలను 15 మంది రైతులు సాగు చేయడం జరుగుతోంది. ఈ పొలాలకు సంబంధించిన ఏ ఒక్క రైతుకు పంట నష్టం నమోదు రాలేదన్నారు . బడా రైతులకు ఎలా వచ్చాయి.. ? గ్రామంలోని బడా రైతుల పేర్లు మాత్రమేలిస్టులో వచ్చాయని, సన్నా చిన్న కారు రైతుల పేర్లు మాత్రం ఒక్కటీ కూడా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి వచ్చిన పంట నష్ట నమోదు అధికారులైన వీఆర్ఏ, ఎంపీఈవోలను ప్రసన్నం చేసు కున్న వారి పొలాలకు మాత్రమే నష్టం రాయడం జరిగిందని, ప్రసన్నం చేసుకోలేని వారి పోలాలు రాయలేదని తెలిపారు. అందువల్ల నిరుపేదలైన అంకామ్మగుంటలోని బాడవా పోలాలకు నష్టం నమోదు చేయలేదని తెలిపారు. ఈ విషయమై పామర్రు ఏడీఏ పద్మజకు ఫిర్యాదు చేయడంజరిగిందన్నారు. స్పందించిన ఏడీఏ అంకామ్మగుంట వద్ద గల బాడవా పొలంలో పంట నష్ట పోయిన రైతుల వివరాలను సంబంధించిన పత్రాలను తీసుకుని అర్జీని ఆన్లైన్లో పెట్టాలని ఆదేశించారు. రైతులకు న్యాయంజరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. -
ఆందోళనలో అన్నదాతలు
కరీంనగర్‌రూరల్: రైతులకు పెట్టుబడి సాయం అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం రైతులందరికీ అందడం లేదు. అర్హులైన రైతులకు సకాలంలో సాయం రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. సీఎం కేసీఆర్ రైతులకు ఎకరానికి పెట్టుబడిసాయం కింద రూ.8వేలను రెండు విడతలుగా అందిస్తున్నారు. మొదటి విడతలో రూ.4వేల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమైనప్పటికీ రెండో విడత రబీసీజన్ ఆరంభంలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో కొంతమంది రైతులకు అందలేదు. పలువురు రైతులకు సాంకేతిక కారణాలతో డబ్బులు రాలేదు. రబీసీజన్ ప్రారంభమై మూడు నెలలవుతున్నప్పటికీ కొంతమందికి పెట్టుబడిసాయం రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. రెండో విడతలో జాప్యం.. కరీంనగర్ మండలంలోని 14 రెవెన్యూ గ్రామాల పరిధిలో 7495 వేల మంది రైతులను రైతుబంధు పథకం కింద ఎంపిక చేసి వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. వీరిలో 7436 మంది రైతుల వివరాలను ట్రెజరీకి పంపించగా 6694 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమయ్యాయి. ఇంకా మిగిలిన 286 మంది రైతులకు పలు సాంకేతిక కారణాలతో ఇంతవరకు డబ్బులు జమకాలేదు. అయితే శాసనసభ ఎన్నికలకు ముందు ప్రభుత్వం రైతుబంధు బడ్జెట్‌ను విడుదల చేయడంతో కొంతమంది రైతులకు మాత్రమే ఆర్థికసాయం మంజూరైంది. అనంతరం పంచాయతీ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిధుల విడుదలలో జాప్యం కావడంతో రైతుల బ్యాంకుఖాతాల్లోకి డబ్బులు జమకాలేని పరిస్థితి నెలకొంది. డబ్బుల కోసం వ్యవసాయాధికారులు, బ్యాం కుల చుట్టు రైతులు ప్రతిరోజూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రెండో విడత డబ్బులు రాలేదు.. నాకు 5 ఎకరాల పొలముంది. రైతుబంధు పధకం మొదటి విడతలో రూ. 20వేల చెక్కు ఇచ్చారు. రెండో విడత డబ్బులు ఇంకా రాలేదు. అధికారులను అడిగితే వస్తాయంటున్నారు. అప్పులు తెచ్చి పంటలకు పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. – గొంకటి రాజిరెడ్డి, రైతు, గోపాల్పూర్ బ్యాంకు ఖాతాల్లో జమ రబీ సీజన్‌కు సంబంధించి రెండో విడత రైతుబంధు పథకం డబ్బులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమవుతాయి. కొందరు రైతులు సకాలంలో పట్టా దారు పాసుపుస్తకాలివ్వకపోవడం, స్థానికంగా లేకపోవడంతో ఆన్లైన్ చేయడంలో జాప్యం ఏర్పడింది. - బి.సత్యం, మండల వ్యవసాయాధికారి గ్రామాల వారీగా రైతుల వివరాలు ... గ్రామం ఆన్లైన్ నమోదు ట్రెజరీ ఖాతాల్లో జమ అందని రైతులు చామన్‌పల్లి 862 858 791 23 ఎలబోతారం 377 373 338 11 ఫకీర్‌పేట 108 107 102 02 జూబ్లీనగర్ 363 360 332 14 కొండాపూర్ 215 215 182 24 బొమ్మకల్ 824 821 778 14 చేగుర్తి 443 435 418 11 దుర్శేడ్ 893 893 833 29 చెర్లభూత్కూర్ 597 596 531 16 ఇరుకుల్ల 425 423 381 14 మొగ్ధుంపూర్ 644 640 569 21 ఆరెపల్లి 375 365 278 21 నగునూరు 1089 1080 920 72 వల్లంపహాడ్ 280 270 241 14 -
ఎక్కువ మాట్లాడకు.. లోపలేసి బొక్కలూడదీస్తా!
సాక్షి, అమరావతి బ్యూరో/తాడేపల్లి రూరల్: ఎక్కువ మాట్లాడకు.. తాటతీస్తా.. లోపలేసి బొక్కలూడదీస్తా.. రిమాండ్‌కు తరలించి మీ అంతు చూస్తా.. ఇదీ రాజధానిలో రైతులపై పోలీసుల తిట్లదండకం. తాడేపల్లి, కొలనుకొండ, కుంచనపల్లి, వడ్డేశ్వరంలోని తమ 170 ఎకరాల భూములను యూ–1 రిజర్వ్ జోన్ నుంచి తొలగించి న్యాయం చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు వినతిపత్రం అందజేసేందుకు వెళ్లిన రైతులపై గుంటూరు నార్త్‌జోన్ డీఎస్పీ రామకృష్ణ, తాడేపల్లి సీఐ శ్రీనివాసరావు తీవ్ర పదజాలంతో దుర్భాషలాడుతూ హెచ్చరించారు. దీంతో రైతులు, అఖిలపక్షం నేతలు రోడ్డుపైనే బైఠాయించడంతో సోమవారం ప్రకాశం బ్యారేజి, ఉండవల్లి వద్ద ఉద్రిక్తత నెలకొంది. బహుళ పంటలు పండే, కోట్ల విలువ చేసే తమ పంట పొలాలను కాపాడుకునేందుకు రాజధానిలోని 4 గ్రామాలకు చెందిన 200మంది రైతులు సోమవారం ఉదయం తాడేపల్లి పట్టణంలోని వైఎస్సార్ సెంటర్ నుంచి పాదయాత్ర చేపట్టారు. తమ భూములను యు–1 జోన్‌గా ప్రకటించడం దారుణమని, వెంటనే దాన్ని ఎత్తివేయాలంటూ డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న తాడేపల్లి సీఐ శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి వెళ్లి ఎన్నికల కోడ్ ఉంది, ర్యాలీ చేయడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. దీంతో రైతులు.. అరెస్టుచేస్తే చేయండి అంటూ ముందుకు సాగారు. ఉండవల్లి సెంటర్లో పోలీసులు మరోసారి అడ్డుకునేందుకు ప్రయత్నం చేయగా, రైతులు ముందుకెళ్లారు. అక్కడి నుంచి కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం నుంచి కరకట్ట మీదుగా సీఎం ఇంటి వైపునకు బయల్దేరారు. కానీ, ప్రకాశం బ్యారేజీ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అనుమతించక రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగి బైఠాయించారు. దీంతో ప్రకాశం బ్యారేజీ–మంగళగిరి రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. రైతులంతా అడ్డం తిరగడంతో వెనక్కితగ్గిన పోలీసులు ఆరుగురిని వాహనంలో సచివాలయానికి తీసుకెళ్లారు. పలువురు రైతులు, అఖిల పక్ష నేతలు మాట్లాడుతూ.. గత సోమవారం కూడా పోలీసులు, ప్రభుత్వం ఇలాగే మభ్యపెట్టి తమను వెనక్కి పంపించారని, ఈసారీ అదే జరుగుతోందన్నారు. యు–1 జోన్ ఎత్తివేయకపోతే సీఎం ఇంటిముందు ఆత్మహత్య చేసుకుంటామని రైతులు హెచ్చరించారు. రైతు సంఘం నేతలు జొన్నా శివశంకరరావు, దొంతిరెడ్డి వెంకటరెడ్డి, సీపీఐ నేతలు కంచర్ల కాశయ్య, వెంకటయ్య, వైఎస్సార్సీపీ పట్టణ గౌరవాధ్యక్షుడు కేళీ వెంకటేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి యం.డి.గోరె, సీపీఎం పట్టణ అధ్యక్షులు బూరగ వెంకటేశ్వర్లు, వివిధ రైతు సంఘాల నాయకులు, తాడేపల్లి, కొలనుకొండ, వడ్డేశ్వరం, కుంచనపల్లికి చెందిన రైతులు పాల్గొన్నారు. 5 నిమిషాలు కూడా సమయమివ్వని సీఎం ఇదిలా ఉంటే.. సచివాలయానికి చేరుకున్న రైతులను మ.2 గంటల నుంచి మూడున్నర గంటల పాటు కూర్చోబెట్టారు. సా.5.30 గంటల సమయంలో సీఎంతో మాట్లాడేందుకు అధికారులు అనుమతిచ్చారు. తాడేపల్లి అనగానే ‘హా... నేను చూస్తా’ నని చంద్రబాబు చెప్పి.. తమను అక్కడి నుంచి వెంటనే పంపించేశారని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. అదే సమయంలో కుప్పం నుంచి వచ్చిన సుమారు 30 మందితో సెల్ఫీలు తీసుకున్న సీఎంకు తమతో 5 నిమిషాలు మాట్లాడ్డానికి కూడా సమయం ఇవ్వకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే సర్వే నంబర్లో నిరాకరణ, అనుమతులు రైతుల భూములను యు–1 జోన్‌లోను, టీడీపీ ఎంపీ భూములను కమర్షియల్ జోన్లో ఉంచడం దారుణం. ఓ పక్క మురళీమోహన్ 9 అంతస్తుల మేడలు కడుతూ జేబులు నింపుకుంటుంటే, అన్నదాతలు మాత్రం తమ భూములను కోల్పోవాల్సిన పరిస్థితి. జోన్ ఎత్తివేయకపోతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తాం. – జొన్నా శివశంకరరావు, రైతు సంఘం నేత ఉన్న 25 సెంట్ల భూమిని తీసుకుంటే ఏం చేయాలి? యు–1 జోన్లో ప్రకటించిన 170 ఎకరాల్లో దాదాపుగా 350 మంది చిన్న రైతులున్నారు. అలాంటి భూములను ప్రభుత్వం లాక్కుంటే మేం ఏం చేయాలో పోలీసులు చెప్పాలి. తెలుగుదేశం వారు ర్యాలీలు, సభలు నిర్వహిస్తుంటే కాపలా కాస్తూ, రైతులను ఇబ్బందులకు గురిచేస్తారా? ఇదెక్కడి న్యాయం? – వెంకట్రామిరెడ్డి, రైతు మా బిడ్డలకు ఏం ఇవ్వాలి? ఉన్న పాతిక సెంట్లు ధారాదత్తం చేసి, మా బిడ్డలకు ఏం ఇవ్వాలి? ఇక్కడ సెంటు ప్రస్తుతం రూ.25 లక్షలు ఉంది. ఇలాంటివి ప్రభుత్వం తీసుకుంటే ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో గత్యంతరం లేదు. – సత్యనారాయణరెడ్డి, రైతు -
రోడ్డెక్కిన రైతన్నలు
ఆర్మూర్ / పెర్కిట్ : రాష్ట్ర ప్రభుత్వమే ఎర్రజొన్నలు, పసుపు పంటను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ ప్రాంత రైతులు మంగళవారం రోడ్డెక్కి నిరసన చేపట్టారు. నాలుగు గంటల పాటు ధర్నాలు, జాతీయ రహదారులపై రాస్తారోకోలు నిర్వహించారు. అయితే రైతుల ధర్నా కారణంగా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఆర్మూర్ డివిజన్ పరిధిలోని వివిధ మండలాల్లో ఉన్న రైతు నాయకులను సోమవారం అర్ధరాత్రి వారి ఇళ్లలోనే పోలీసులు అరెస్టులు చేశారు. సమీపంలోని ఇతర మండలాల పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీంతో రైతులు మరింత ఆగ్రహానికి లోనై రాస్తారోకోలు చేశారు. కాగా గత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులతో వ్యవహరించిన తీరును తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం అనుసరించకుండా ఫ్రెండ్లీ పోలీస్‌గా వ్యహరించాలని ఆదేశాలు జారీ చేయడంతో దీక్ష శాంతి యుతంగా కొనసాగింది. ఆర్మూర్ మండలం మామిడిపల్లి చౌరస్తాలో 63వ నంబర్ జాతీయ రహదారిపైకి ఉదయం నుంచే రైతులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. రైతుల ఉద్యమాన్ని నియంత్రించడానికి పోలీసులు విధిం చిన 144 సెక్షన్‌ను లెక్క చేయకుండా రైతులు గ్రామాల నుంచి కార్లు, మోటార్ సైకిళ్లపై వచ్చారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వ ర్యంలో సుమారు వెయ్యి మందికి పైగా జాతీయ రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ ఎర్రజొన్న పం టకు క్వింటాలుకు రూ. 3,500, పసుపునకు క్విం టాలుకు రూ. 15 వేల గిట్టుబాటు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేసారు. తమ దీక్షను భగ్నం చేయడానికి పోలీసులు అరెస్టు చేసిన రైతు నాయకులను విడుదల చేయాలన్నా రు. డిమాండ్లు సాధించుకునే వరకు దీక్షను విరమించేది లేదని స్పష్టం చేశారు. సుమారు నాలుగు గంటల పాటు రైతులు జాతీయ రహదారులపైనే ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. అయితే మామిడిపల్లి చౌరస్తాలో రోడ్డుపై వెళ్లే వాహనాలను పోలీ సులు వన్‌వే చేసి దారి మళ్లించారు. ఒక దశలో రైతులు ఆగ్రహానికిలోనై చౌరస్తాలో 63వ నెంబర్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేసారు. దీంతో పోలీసులు ఆ మార్గంలో వచ్చే వాహనాలను ఇతర మార్గాల గుండా మళ్లించి ప్రయాణికులకు అసౌ కర్యం కలగకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో రైతులు రాస్తారోకోతో వాహనాలు నిలిచిపోతేనే తమ నిరసన తీవ్రత ప్రభుత్వం దృష్టికి వెళ్తుందంటూ ర్యాలీగా మామిడిపల్లి శివారులోని 44వ నెంబర్ జాతీయ రహదారి కూడలికి వచ్చారు. అక్కడ నాలుగు లేన్ల జాతీయ రహదారిపై ఇరువైపుల బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ మార్గం గుం డా వచ్చే వాహనాలను మళ్లించి ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్త పడ్డారు. రాజకీయాలకు అతీతంగా సాగిన ఈ ధర్నా, రాస్తారోకోలో రైతుల డిమాండ్లను తెలియజేస్తూ రైతు నాయకులు ఉపన్యసించారు. కాగా ఈనెల 7న ఆర్మూర్ మండలం మామిడిపల్లి చౌరస్తాలో 63వ నంబర్ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించిన రైతులు ఆర్డీవో శ్రీనివాస్, జిల్లా వ్యవసాయాధికారి గోవిందు, ఉద్యానవన శాఖ జిల్లా అధికారి నర్సింగ్‌దాస్, మార్కెటింగ్ ఏడీ రియాజ్‌లకు తమ డిమాండ్లను తెలియజేస్తూ విన తి పత్రాలు సమర్పించారు. ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన కోసం ఐదు రోజులు వేచి చూసిన రైతులు, తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో అధికారులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ వచ్చి తమకు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ధర్నాను కొనసాగిస్తామని భీష్మించుకుని కూర్చున్నారు. ముందస్తు అరెస్టులు చేసిన రైతు నాయకులను విడుదల చేయాలని సాయంత్రం వరకు ధర్నా నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. తమ డిమాండ్ల సాధనకు ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఆర్మూర్ డివిజన్ పరిధిలో నాలుగు ప్రాంతాల్లో ఏక కాలంలో నిరసన కార్యక్రమాలను కొనసాగించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈ నెల 16న బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని ముప్కాల్, వేల్పూర్ మండల కేంద్రాలలో, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని జక్రాన్‌పల్లిలో, ఆర్మూ ర్ నియోజకవర్గం పరిధిలోని మామిడిపల్లిలో పెద్ద ఎత్తున్న ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించారు. అనం తరం ధర్నాను విరమించారు. రాస్తారోకో చేస్తున్న సమయంలో బస్సుప్రయాణికులు తమకు దారి ఇవ్వాల్సిందిగా వాగ్వాదానికి దిగినా పట్టించుకోని రైతులు ఆర్మూర్ వైపు వస్తున్న అంబులెన్స్‌కు మాత్రం దారి ఇచ్చి వెళ్లనిచ్చారు. సంయమనం పాటించిన పోలీసులు.. 2008లో పోలీస్ శాఖ వైఫల్యం కారణంగా ఎర్ర జొన్న రైతుల ఉద్యమం హింసాయుతంగా మా రింది. మంగళవారం ఆర్మూర్‌లో జరిగిన రైతు ఉద్యమంలో అడుగడుగునా పోలీసుల తీరు ప్ర శంసనీయంగా కనిపించింది. ఉదయం నుంచే పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించా రు. సీపీ కార్తికేయ ఆధ్వర్యంలో అడిషనల్ డీసీపీ శ్రీధర్‌రెడ్డి, ట్రెయిన్ ఐపీఎస్ గౌస్ ఆలం, ఆర్మూ ర్ ఏసీపీ రాములు, సీఐలు, ఆర్ ఎస్సైలు, సివి ల్ ఎస్సైలు నిజామాబాద్, బోధన్, ఆర్మూర్‌కు చెందిన ఏఆర్, సివిల్ కానిస్టేబుల్ బలగాలతో భారీ బందోబస్తు నిర్వహించారు. 144 సెక్షన్‌ను లెక్క చేయకుండా తరలి వచ్చిన రైతులను ఇ బ్బంది పెట్టకుండా పోలీసులు సంయమనాన్ని పాటించారు. దీక్ష చేస్తున్న రైతులు సహనం కో ల్పోయిన ప్రతిసారి పోలీసులు వారిని బుజ్జగి స్తూ శాంతి యుతంగా దీక్ష చేయడానికి సహకరించారు. పోలీసు బలగాలు లాఠీలను గాని ఆ యుధాలను గాని తీసుకుని రాకుండా ఫ్రెండ్లీ పోలీస్‌లా వ్యవహరించడం పలువురి ప్రశంసల కు కారణమైంది. మరో వైపు 63వ నెంబర్ జాతీ య రహదారి, 44వ నెంబర్ జాతీయ రహదారులపై రైతులు రాస్తారోకో నిర్వహిస్తున్న సమయంలో ట్రాఫిక్ జామ్ జరగకుండా పోలీసులు ట్రాఫిక్‌ను డైవర్ట్ చేయడానికి వ్యవహరించిన తీరును పలువురు అభినందించారు. -
ఉద్యమ బాట!
ఎర్రజొన్న పంట మరో 15 రోజుల్లో కోతకు రానుండడంతో వ్యాపారులు రైతులను మోసగించేందుకు పావులు కదుపుతున్నారు. బైబ్యాక్ ధర ఒప్పందాన్ని తుంగలో తొక్కాలని చూస్తున్నారు. పంట అధికంగా సాగవడంతో బైబ్యాక్ ధర చెల్లించలేమని, తక్కువ ధర అయితేనే కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. ధర తగ్గితే నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కోతకు సమయం ఆసన్నమైనా రాష్ట్ర ప్రభుత్వం ఎర్రజొన్నల కొనుగోలుపై ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. గతేడాదిలాగే రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరుతూ ఉద్యమ బాటపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. ఆర్మూర్: ఆర్మూర్ ప్రాంత రైతాంగం వ్యయ ప్రయాసలకోర్చి పండించిన ఎర్రజొన్న పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకోవడానికి ప్రతియేటా ఉద్యమాలు చేపట్టాల్సిన పరిస్థితి పునరావృతం అవుతూనే ఉంది. నిజామాబాద్ జిల్లాను సీడ్‌బౌల్ ఆఫ్ తెలంగాణగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినా పాలకుల అడుగులు అందుకు అనుగుణంగా పడకపోవడంతో మరోమారు జిల్లాలో ఎర్రజొన్నలు పండించే రైతాంగం వ్యాపారుల చేతుల్లో మోసపోయే పరిస్థితులు నెలకొన్నాయి. గతేడాది మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌ల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వమే క్వింటాలుకు రూ. 2,300 గిట్టుబాటు ధర ప్రకటించడమే కాకుండా రూ. వంద కోట్లు కేటాయించి ఎర్రజొన్నలను కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన ఎర్రజొన్నలను విత్తనశుద్ధి చేసి ఉత్తర భారతదేశంలోని వ్యాపారులకు, రైతులకు అమ్మడంలో విఫలమై నష్టాల పాలైంది. దీంతో ఈ ఏడాది 15 రోజుల్లో పంట కోతకు వస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంట కొనుగోలుపై స్పష్టమైన ఆదేశాలు వెలువడలేదు. దీంతో ఆర్మూర్ ప్రాంతంలోని ఎర్రజొన్న రైతులు మరోమారు ఉద్యమం చేసైనా సరే తమ పంటకు గిట్టుబాటు ధర రాబట్టుకోవాలని ఉద్యమాలకు సన్నద్ధమవుతున్నారు. గత వానాకాలంలో వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాలు అడుగంటడం కారణంగా రబీలో వరికి బదులు ఆరుతడి పంటలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సూచించింది. దీంతో జిల్లాలోని రైతులు వరి స్థానంలో ఆరుతడి పంట అయిన ఎర్రజొన్న పంటను పండించడానికి ఆసక్తి చూపించారు. ఈ పరిస్థితిని ఎర్రజొన్న విత్తన వ్యాపారులు తమకు అనువుగా మార్చుకోవడానికి పావులు కదుపుతున్నారు. జిల్లాలో మూడు దశాబ్దాలుగా ఎర్రజొన్న విత్తనాలను రైతులు పండిస్తున్నారు. ఆర్మూర్ ప్రాంతంలోని అంకాపూర్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో సుమారు 40కి పైగా సీడ్ కంపెనీలు వెలిశాయి. ఈ సీడ్ వ్యాపారులు ప్రతియేటా అక్టోబర్, నవంబర్ మాసాల్లో రైతులతో ముందస్తుగా కొనుగోలు ఒప్పందం చేసుకొని ఎర్రజొన్నల ఫౌండేషన్ సీడ్‌ను సరఫరా చేస్తుంటారు. పంట ఫిబ్రవరి మాసంలో చేతికి రాగానే ఫౌండేషన్ సీడ్ ఇచ్చిన వ్యాపారే తిరిగి రైతుల నుంచి కొనుగోలు చేస్తాడు. ఇలా కొనుగోలు చేసిన విత్తనాలను శుద్ధిచేసి, ప్యాకింగ్ చేసి ఉత్తర భారతదేశంతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా తదితర దేశాల్లో అధిక ధరకు విత్తనాలు అమ్ముతుంటారు. రైతుల ఉద్యమాల ఫలితంగా బైబాక్ ఒప్పందాలు తగ్గిపోయి రైతులు నేరుగానే విత్తనం కొనుగోలు చేసి పంటను పండించి సీడ్ వ్యాపారులకు అమ్ముతున్నారు. ఈ ఎర్రజొన్న విత్తనాలతో ఉత్తర భారత దేశంలో పశువుల దాణా కోసం ఉపయోగించే గడ్డిని పెంచుతుంటారు. అయితే భారతదేశం మొత్తంలో తెలంగాణ రాష్ట్రంలో అందులోనూ నిజామాబాద్ జిల్లాలోని వ్యవసాయ భూములు మాత్రమే ఈ ఎర్రజొన్న విత్తనాలు పండించడానికి అనువుగా ఉన్నాయి. కర్ణాటకలోని బళ్లారి ప్రాంతంలో 15 శాతం ఎర్రజొన్న విత్తనాలు పండించగా నిజామాబాద్ జిల్లాతో పాటు కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో కలిపి మిగిలిన 85 శాతం ఎర్రజొన్న విత్తనాలను పండిస్తుంటారు. అందులో కేవలం నిజామాబాద్ జిల్లాలోనే సుమారు 45 వేల ఎకరాలకు పైగా ఎర్రజొన్న పంటను రైతులు పండిస్తున్నారు. దీంతో ప్రతిఏటా సీడ్ వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతుల నుంచి తక్కువ ధరకు పంటను కొనుగోలు చేసి ఉత్తర భారతదేశంలో అధిక ధరకు అమ్ముకొని లాభపడడం జరుగుతోంది. బైబ్యాక్ ఒప్పందాన్ని విస్మరించిన వ్యాపారస్తులు ఈ ఏడాది ఎర్రజొన్నల వివాదం తలెత్తొద్దనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్ సీడ్ వ్యాపారులు, రైతు నాయకులతో సమావేశాలు నిర్వహించి రైతుకు ఫౌండేషన్ సీడ్ ఇచ్చే సమయంలోనే బైబాక్ ఒప్పందానికి రాతపూర్వకంగా ఒప్పందం చేసుకోవాలని సూచించారు. దీంతో కొందరు రైతులు క్వింటాలు ఎర్రజొన్నలను 1,500 రూపాయలు చెల్లించి తిరిగి రైతుల నుంచి కొనుగోలు చేస్తామని ఒప్పందాలు చేసుకున్నారు. మరికొందరు ప్రతిసారిలాగే ఈ సారి కూడా రైతులను మోసం చేసి లాభపడవచ్చనే ఆలోచనతో బైబ్యాక్ ఒప్పందాలు చేసుకోలేదు. మోసాలకు తెరలేపిన వ్యాపారులు సీడ్ వ్యాపారులు తమ ఏజెంట్ల ద్వారా గ్రామాల్లో ఈ ఏడాది అధిక విస్తీర్ణంలో పంట విత్తడం ద్వారా దిగుబడి గణనీయంగా పెరిగిపోయిందని, రైతులు ఆశించిన ధర రాదంటూ ప్రచారం చేయడం ప్రారంభించారు. బైబ్యాక్ ఒప్పందం కంటే తక్కువ ధర చెల్లిస్తామంటూ మంతనాలు చేస్తున్నారు. తాము పండించిన పంటను నిల్వ చేసుకొని అమ్ముకోవడానికి ఇష్టపడని రైతాంగం సీడ్ వ్యాపారులు సూచించిన అతి తక్కువ ధరకే పంటను అమ్ముకొనే విధంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ ఎత్తుగడలో సీడ్ వ్యాపారులు విజయం సాధిస్తే రైతులు కోట్ల రూపాయలు నష్టపోయే పరిస్థితి ఎదురు కానుంది. గతేడాది.. ఆర్మూర్‌లో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో గతేడాది రైతులు చేపట్టిన ఆమరణ దీక్షకు రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చింది. ఎర్రజొన్నలను క్వింటాలుకు రూ. 2,300 గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తామంటూ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి ప్రకటన చేసిన 24 గంటల్లోనే ఎర్రజొన్నల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం జీవోను జారీ చేసింది. నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లోని 33 మండలాల పరిధిలో 27 వేల 506 మంది రైతులు 51 వేల 234 ఎకరాల్లో పండించిన ఎర్రజొన్న పంట నుంచి వచ్చిన 87 వేల 99 మెట్రిక్ టన్నుల ఎర్రజొన్నలను రాష్ట్ర మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలను సైతం జారీ చేశారు. నిజామాబాద్ జిల్లాలోని 27 మండలాల పరిధిలో 27 వేల 103 మంది రైతులు 50 వేల 427 ఎకరాల్లో పండించిన ఎర్రజొన్నపై వచ్చిన దిగుబడి 85 వేల 726 మెట్రిక్ టన్నుల ఎర్రజొన్నలతో పాటు జగిత్యాల్, నిర్మల్ జిల్లాల్లో సాగయిన ఎర్రజొన్నలను కొనుగోలు చేయాలని ఈ జీవోలో పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 2018 ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ఈ కొనుగోలు ప్రారంభించారు. రైతులకు గిట్టుబాటు ధర చెల్లించారు. కానీ ఈ ఏడాది మాత్రం ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎర్రజొన్నల కొనుగోలుకు ఎలాంటి ఆదేశాలు వెలువడలేదు. రాష్ట్ర ప్రభుత్వ గుత్తాధిపత్యమే మార్గం రాష్ట్ర ప్రభుత్వం ఎర్రజొన్నల వ్యాపారంపై గుత్తాధిపత్యం సాధిస్తేనే సాధ్యమవుతుందని పలువురు రైతు నాయకులు అభిప్రాయపడుతున్నారు. రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వమే ఎర్రజొన్న విత్తనాలను కొనుగోలు చేసి, విత్తనశుద్ధి చేసి ఉత్తర భారతదేశంలో అమ్మకాలు సాగిస్తే రైతులు పంటకు ఆశించిన మద్దతు ధర పొందమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సైతం లాభపడే పరిస్థితులు ఉంటాయి. లేనిపక్షంలో రైతులు మరోసారి సీడ్ వ్యాపారుల చేతుల్లో మోసపోయే పరిస్థితి నెలకొంది. -
‘ఆయన ప్రవర్తనతో విసిగిపోయాం.. ఇటలీకి వెళ్లిపోవాలి’
లక్నో : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సొంత నియోజకవర్గం అమేథీలో చేదు అనుభవం ఎదురైంది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ బుధవారం అమేథీలో పర్యటించారు. ఈ క్రమంలో.. ‘రాహుల్ గో బ్యాక్ టు ఇటలీ’ అంటూ రైతులు నిరసన చేపట్టారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కోసం తీసుకున్న తమ భూములను వెనక్కి ఇచ్చేయాలి లేదా భూసేకరణకు బదులుగా ఉద్యోగం కల్పించాలంటూ ఆందోళనకు దిగారు. ఈ విషయం గురించి సంజయ్ సింగ్ అనే నిరసనకారుడు మీడియాతో మాట్లాడుతూ.. ‘రాహుల్ గాంధీ విధానాలతో విసిగిపోయాం. ఆయన ఇటలీకి వెళ్లిపోవాల్సిందే. భారత్‌లో ఉండటానికి ఆయన అర్హులు కారు. మా భూములు లాక్కుని ఇబ్బందులకు గురిచేస్తున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా 1980లో సామ్రాట్ సైకిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు నిమిత్తం వ్యాపారవేత్తలు కౌసర్ సమీపంలో గల 65.57 ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఈ ఫ్యాక్టరీని ప్రారంభించారు. అయితే నిర్వాహకులు అప్పుల పాలైన నేపథ్యంలో లీజు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో 20.10 కోట్ల రూపాయల బాకీని వసూలు చేసేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ(యూపీఎస్ఐడీసీ) 2014లో ఈ భూమిని వేలం వేసింది. కాగా రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్టు 1,50,000 రూపాయల స్టాంపు డ్యూటీ చెల్లించి ఈ భూమిని కొనుగోలు చేసింది. అయితే ఈ విషయంలో యూపీఎస్ఐడీసీ, రాజీవ్ గాంధీ ట్రస్టు తీరును తప్పుబట్టిన గౌరీగంజ్ కోర్టు భూమిని సామ్రాట్ సైకిల్ ఫ్యాక్టరీకి అప్పగించాలంటూ ఆదేశించింది. దీంతో ఈ వేలాన్ని రద్దు చేస్తున్నట్లు యూపీఎస్ఐడీసీ ప్రకటించింది. కానీ ఆ భూమి ఇప్పటికీ రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్టు చేతిలోనే ఉంది. ఈ నేపథ్యంలోనే రైతులు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
నా పొలం కాజేశారు
సాక్షి, అమరావతి/సచివాలయం(తుళ్లూరురూరల్): తమ భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి వేరొకరికి కట్టబెట్టిన తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఓ రైతు శుక్రవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం ఎదుట ఆందోళనకు దిగాడు. కృష్ణా జిల్లా తుళ్లూరు మండలం హరిశ్చంద్రపురం గ్రామానికి చెందిన కొమ్మినేని శివకోటేశ్వరరావుకు వీర్లుపాడు మండలం జుజ్జూరు గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 245లో 0.56 ఎకరాలు, సర్వే నంబర్ 246లో 2.06 ఎకరాల భూమి ఉంది. శివకోటేశ్వరరావు భార్య కొమ్మినేని పద్మావతికి ఆమె తండ్రి కాపా సీతారామయ్య పసుపు, కుంకుమ కింద ఈ భూమి ఇచ్చారు. 1980 నుంచి ఆ భూమిపై అడంగళ్, 1బీ, పట్టాదారు పాస్ పుస్తకాల్లో సర్వ హక్కులు ఆమె పేరు మీదనే ఉన్నాయి. అప్పటి తహసీల్దార్ భూమిపై హక్కుదారునిగా ధ్రువీకరించిన పత్రాలు కూడా రైతు వద్ద ఉన్నాయి. దీనిపై సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరగా.. పద్మావతి పేరు మీద భూమి ఉన్నట్లు నివేదిక ఇచ్చారు. గతేడాది అడంగళ్, 1బీ రికార్డుల్లో పద్మావతి పేరు మీద ఉన్న రికార్డులు దిద్ది.. మరొకరికి సదరు భూమిని బదలాయించారు. దీనిపై ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని రైతు శివకోటేశ్వరరావు వాపోయాడు. కలెక్టర్ ఆదేశించినా.. స్థానిక రెవెన్యూ అధికారులు తప్పుడు నివేదికలు పంపారని రైతు ఆరోపిస్తున్నాడు. సచివాలయం ఎదుటే ఆత్మహత్య రెవెన్యూ సమస్యలు పరిష్కరించడానికి నూతన విధానాలు తీసుకొచ్చామని మంత్రులు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇది సామాన్య ప్రజలకు మాత్రం ఉపయోగపడటం లేదు. రెండు సంవత్సరాలుగా నా భూమి కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. రికార్డుల తారుమారుకు బాధ్యురాలైన తహసీల్దార్ రాజకుమారిపై చర్యలు తీసుకోవాలి. నా సమస్యను వారం రోజుల్లో పరిష్కరించకుంటే సచివాలయం ఎదుట ఆత్మహత్య చేసుకుంటాను. –కొమ్మినేని శివకోటేశ్వరరావు, రైతు -
బంద్‌లో పాల్గొన్న సీపీఐ,సీపీఎం రాష్ట్రకార్యదర్శులు
-
రాయలసీమలో కొనసాగుతున్న వామపక్షాల బంద్
సాక్షి, అమరావతి: కరువు రైతులను ఆదుకోవాలంటూ వామపక్షాల చేపట్టిన రాయలసీమ బంద్ కొనసాగుతుంది. కరువు రైతులకు సంబంధించి సహాయక చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా వామపక్షాలు శుక్రవారం రాయలసీమ జిల్లాల బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. బంద్‌లో భాగంగా సీపీఎం, సీపీఐ నేతలు ఉదయం నుంచే రోడ్లపైకి వచ్చి తమ నిరసన తెలుపుతున్నారు. వామపక్షాలు తలపెట్టిన బంద్‌ను భగ్నం చేయడానికి పోలీసులు శత విధాల ప్రయత్నిస్తున్నారు. నిరసన తెలుపుతున్న నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సౌత్ బైపాస్‌లో రాస్తారోకో నిర్వహిస్తున్న సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మధు, రామకృష్ణలు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరువు తాండవిస్తుంటే సీఎం చంద్రబాబు నాయుడు రైతులు బాగున్నారని డబ్బాకొట్టుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. చంద్రబాబు విడుదల చేసే శ్వేత పత్రాలన్ని ఓ బోగస్ అని వారు అభివర్ణించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే టీడీపీ ప్రభుత్వం శ్వేతపత్రాల పేరిట నాటాకాలు ఆడుతోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బద్వేలు పీఎస్ వద్ద బైఠాయించిన మహిళలు.. వైఎస్సార్ జిల్లాలో కడప బస్టాండ్ వద్ద వామపక్ష నేతలు బస్సులను అడ్డుకున్నారు. కరువు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బద్వేల్లో బంద్ నిర్వహిస్తున్న వామపక్ష నాయకులను పోలీసులు అడ్డుకుని.. వారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన సీపీఎం, సీపీఐ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తు మహిళలు బద్వేలు పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. కరువు నివారణ చర్యలు వెంటనే చేపట్టాలని రైల్వేకోడూరులో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించగా.. పోలీసులు 12 మందిని అరెస్ట్ చేశారు. అనంతపురంలో ముందస్తు అరెస్ట్‌లు.. అనంతపురం జిల్లాలో వామపక్షాలు చేపట్టిన బంద్ కొనసాగుతుంది. బంద్‌ను భగ్నం చేసేందుకు పోలీసులు శత విధాల ప్రయత్నిస్తున్నారు. అనంతపురం, శింగనమల, రాప్తాడులలో పలువురు వామపక్ష నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. అనంతపురం ఆర్టీసీ డిపో వద్ద వామపక్షాలు ధర్నా చేపట్టడంతో కొద్ది సేపు బస్సులు నిలిచిపోయాయి. పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. రైతులకు పంట నష్టపరిహారం, రుణమాఫీ తక్షణమై విడుదల చేయాలని కోరుతూ వామపక్ష నేతలు గుత్తి, పామిడి, మడకశిరలలో షాపులు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను బంద్ చేసి రాస్తారోకో నిర్వహించారు. ఈ నిరసనల్లో సీపీఎం, సీపీఐ నేతలతో పాటు ఎమ్మార్పీఎస్ నాయకులు కూడా పాల్గొన్నారు. ఆంధ్రా-కర్ణాటకల మధ్య నిలిచిపోయిన రాకపోకలు.. వామపక్షాలు చేపట్టిన బంద్ కర్నూలులో ప్రశాంతంగా కొనసాగుతుంది. కర్నూలులో ఆర్టీసీ బస్సులను అడ్డుకున్న ఆందోళనకారులు.. బస్టాండ్ వద్ద బైఠాయించారు. ఆదోని, డోన్, కోడుమురులలో కూడా వామపక్ష నేతలు రాస్తారోకో నిర్వహించారు. ఆలురులో వామపక్షాలు సంపూర్ణంగా బంద్ చేపట్టాయి. దీంతో ఆంధ్రా-కర్ణాటక మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు వామపక్ష నేతలను అరెస్ట్ చేశారు. తిరుపతిలో భారీగా పోలీసుల మెహరింపు.. రాయలసీమలో కరువు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరికి నిరసగా వామపక్ష నేతలు చిత్తూరు జిల్లా తిరుపతిలో ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ ఎదుట భారీగా పోలీసులను మోహరించారు. శ్రీకాళహస్తిలో ఆందోళన చేస్తున్న పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. -
ధాన్యం..దైన్యం
నేలకొండపల్లి: రైతుల నుంచి ధాన్యం సేకరించేందుకు ఏర్పాటు చేసిన ఇందిరాక్రాంతి పథం (ఐకేపీ), వ్యవసాయ సహకార పరపతి సంఘాల (సొసైటీ) కొనుగోలు కేంద్రాల్లో నిబంధనలు ఇబ్బందిగా మారాయి. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో 70,500 హెక్టార్లలో వరి సాగు చేశారు. దోమపోటుతో చాలావరకు వడ్లు తాలుగా మారాయి. ఎకరానికి 30క్వింటాళ్ల దిగుబడి కూడా రావట్లేదు. జిల్లాలో 83 ధాన్యం కేంద్రాలను ఏర్పాటు చేశారు. చేతికొచ్చిన పంట విక్రయించే సమయంలో కేంద్రాల వద్ద నిబంధనల కొర్రీలతో రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా 67, ఐకేపీ సంఘాల ద్వారా 16 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏ–గ్రేడ్ రకం ధాన్యానికి క్వింటాకు రూ.1770, బీ–గ్రేడ్‌కు రూ.1750 చెల్లించాలి. అయితే ఈ మద్దతు ధర అందరికీ అందట్లేదు. గింజ రంగు మారిందని, తేమ ఎక్కువగా ఉందని, ధాన్యం ఆరబెట్టాలని..కేంద్రాల్లో కాంటాలు పెట్టకపోవడంతో రైతులు గత్యంతరం లేక వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఐకేపీ, సొసైటీల కొనుగోలు కేంద్రాల వద్ద సౌకర్యాలు లేవు. ఇక్కడ టార్పాలిన్లు ఉంచలేదు. వడ్లను ఆరబోసేందుకు స్థలం లేదు. రైతులు రోడ్ల వెంట ధాన్యం ఆరబెట్టుకుంటున్నారు. రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. కనీసం పట్టాలు కూడా సరఫరా చేయకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో వరిసాగు పెట్టుబడి పెరిగింది. ఎకరానికి రూ.25వేల నుంచి రూ.30 వేల వరకు వెచ్చించారు. దిగుబడి చూస్తే 30క్వింటాళ్లు కూడా రాలేదు. విక్రయించేందుకు ధాన్యాన్ని తీసుకొస్తే నిబంధనల పేర ఆపేస్తున్నారని అంటున్నారు. పైగా రూ.1770 మద్దతు ధర సరిపోదని చెబుతున్నారు. నిల్వ ఉంచితే మరింత ధర పెరిగిన తర్వాత అమ్ముకోవచ్చని కొందరు ఇళ్లకు తరలిస్తున్నారు. కనీసం క్వింటాకు రూ.2 వేలు వచ్చే వరకు ఆపేస్తామని పలువురు రైతులు చెబుతున్నారు. -
అకాల నష్టం..
జంగారెడ్డిగూడెం : రాకాసి గాలులు విరుచుకుపడ్డాయి. పంటలకు తీవ్రనష్టం కలిగించాయి. ఉరుము, మెరుపు లేకుండా రాత్రివేళలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం జిల్లాలోని మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది. చేతికందిన పంట నేలనంటడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పంటను చూసి పోలవరం మండలంలో ఓ రైతు గుండె ఆగింది. మొక్కజొన్న, వరి, అరటి, నిమ్మ పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు దెబ్బతినడంతో పలు ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. భారీ ఈదురుగాలులతో కూడిన వర్షంతో జంగారెడ్డిగూడెం వ్యవసాయ, ఉద్యాన, విద్యుత్ శాఖల పరిధిలో పెద్దెత్తున నష్టం సంభవించింది. శనివారం రాత్రి వేళలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. సుమారు 12,500 ఎకరాల్లో వివిధ రకాల పంటలకు నష్టం వాటిల్లింది. ఈదురుగాలులు, అకాల వర్షంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. చేతికి వచ్చే దశలో పంటలు నేలపాలవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రధానంగా జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోనే ఎక్కువ నష్టం సంభవించింది. మొక్కజొన్న రైతు విలవిల వ్యవసాయశాఖ పరిధిలోని మొక్కజొన్న, వరి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. కేఆర్ పురం వ్యవసాయశాఖ డివిజన్ పరిధిలో సుమారు 10 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 1,500 ఎకరాల్లో వరి పంట నేలవాలింది. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక అంచనాలు సిద్ధం చేస్తున్నట్టు వ్యవసాయ శాఖాధికారి చెన్నకేశవులు తెలిపారు. నష్టాలేనిమ్మ.. ఉద్యాన శాఖ పంటలకు తీవ్ర నష్టం సంభవించింది. అరటి, నిమ్మ, మామిడి తదితర పంటలకు తీవ్ర నష్టం జరిగింది. జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో సుమారు 300 ఎకరాల్లో అరటి పంట నేలకూలింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అరటి తోటలన్నీ నేలరాలడంతో ఎందుకు పనికిరాకుండా పూర్తిగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 200 ఎకరాల్లోని నిమ్మతోటల్లో కాయలు నేలరాలాయి. ఈదురుగాలుల ధాటికి మామిడి పంటకు కూడా తీవ్రంగా నష్టం జరిగింది. సుమారు 500 ఎకరాల్లో మామిడికాయలు నేలరాలాయి. ఉద్యాన శాఖకు జరిగిన పంట నష్టాన్ని అంచనా వేస్తున్నామని ఏడీ ఎ.దుర్గేష్ తెలిపారు. విద్యుత్ శాఖకు నష్టం విద్యుత్ శాఖకు తీవ్ర నష్టం జరిగింది. భారీ ఈదురుగాలులకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో 20 విద్యుత్ స్తం భాలు దెబ్బతినగా వీటిలో 33 కేవీ విద్యుత్ స్తంభాలు 10, 11 కేవీ విద్యుత్ స్తంభాలు 11 దెబ్బతిన్నట్టు విద్యుత్ శాఖ డీఈ ఎ.రవికుమార్ తెలిపారు. మరో 10 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దెబ్బతిన్నాయన్నారు. సుమారు రూ.10 లక్షల వరకు నష్టం జరిగినట్లు చె ప్పారు. వీటన్నింటిని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నామన్నారు. పంటను చూసి ఆగిన గుండె పోలవరం: చేతికందిన పంట నేలనంటడంతో చూసి తట్టుకోలేక ఓ రైతు పొలం వద్దే కు ప్పకూలి మృతిచెందిన ఘటన పోలవరం మండలంలోని పాతపట్టిసీమ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. పాతపట్టిసీమకు చెందిన పందిటి వెంకట్రాజు (65) గ్రామంలో తన సొంత పొలం ఎకరంతో పాటు కౌలుకు తీసుకుని మరో మూడు ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశాడు. పంట బాగా పండి చేతికందే దశకి వచ్చింది. శనివారం రాత్రి బలమైన ఈదురుగాలులు వేయడంతో పంట అంతా నేలకొరిగింది. ఆదివారం ఉదయం చేలోకి వెళ్లిన వెంకట్రాజు పంటను చూసి కుప్పకూలి మృతిచెందాడని కుటుంబసభ్యులు తెలిపారు. నాలుగు ఎకరాలకు సుమారు రూ.50 వేల వరకూ పెట్టుబడి పెట్టాడు. మూడు ఎకరాలను ఎకరాకు రూ.20 వేలు చొప్పున కౌలుకు తీసుకున్నాడు. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన వెంకట్రాజు పంట చేతికి వస్తే అప్పులు తీర్చవచ్చని భావించాడు. అతడికి దాదాపు రూ.5.50 లక్షల వరకు అప్పులు ఉన్నాయి. దొండపూడి ఆంధ్రాబ్యాంకులో రూ.లక్ష, సహకార సంఘంలో రూ.1.50 లక్షలు, పొలం మీద రూ.1.50 లక్షలు, బంగారంపై రూ.50 వేలు, ప్రైవేట్ అప్పు రూ.లక్ష వరకు ఉన్నట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పట్టిసీమ వీఆర్వో కె.రమేష్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం కాగా కుమారుడు మానసికంగా అనారోగ్యంతో ఉండటంతో చికిత్స చేయిస్తున్నారు. -
రైతు సమస్యలపై కాంగ్రెస్‌తో పనిచేస్తాం
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ పార్టీతో కలసి పనిచేస్తానని స్వాభిమాన్ షేత్కారీ సంఘటన చీఫ్, లోక్‌సభ సభ్యుడు రాజు శెట్టి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సోమవారం నాడిక్కడ భేటీ అనంతరం శెట్టి మీడియాతో మాట్లాడారు. రైతుల సమస్యలపై దృష్టి సారించనున్నట్లు రాహుల్ కాంగ్రెస్ ప్లీనరీలో ప్రకటించిన మరుసటి రోజే ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మార్చి 29న మహారాష్ట్రలో నిర్వహించనున్న రైతు సదస్సుకు హాజరు కావాల్సిందిగా రాహుల్‌ను ఆయన ఆహ్వానించారు. గతేడాది ఆగస్టులో ఎన్డీఏ నుంచి శెట్టి బయటికొచ్చిన సంగతి తెలిసిందే. -
రైతుల సమస్యల పరిష్కారానికి కృషి
భైంసారూరల్: రైతు సమస్యలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి వాటిని పరిష్కరించేందుకు కృషిచేస్తామని టీజేఏసీ నిర్మల్ జిల్లా చైర్మన్ ఆరెపల్లి విజయ్‌కుమార్ అన్నారు. గురువారం టీజేఏసీ జిల్లా కన్వీనర్ డా.ముష్కం రామకృష్ణాగౌడ్తో కలిసి తిమ్మాపూర్ గ్రామంలో రైతుల వద్దకు వెళ్లారు. రైతులు పడుతున్న ఇబ్బందులు, బాధలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం సాధించాక కూడా రైతుల సమస్యలు తీరడం లేదన్నారు. రైతుల సమస్యలు పరిష్కారం చేసేందుకు క్షేత్రస్థాయిలో వెళ్లి వారితో కలిసి సాదక బాధకాలు అడిగి తెలుసుకుంటున్నామన్నారు. ఈనెల 21న రైతు సదస్సు ఏర్పాటు చేస్తున్నామని, సదస్సులో నియోజకవర్గ రైతులంతా పాల్గొని సమస్యలపై చర్చించాలన్నారు. ప్రధాన సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీవీవీ జిల్లా కార్యదర్శి చాకెటి లస్మన్న, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసరాజు, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు జే.రాజు, జేఏసీ నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు. -
ముంబై చేరుకున్న అన్నదాతల మహాపాదయాత్ర
-
బ్యాంక్‌లోన్ కోసం రైతును ట్రాక్టర్‌తో తొక్కించారు
సాక్షి, లక్నో : పైకి హుందాగా కనిపించే బ్యాంకు లోను రికవరీ ఏజెంట్లు ఎంత దుర్మార్గంగా ఉంటారో మరోసారి స్పష్టమైంది. వారి ప్రవర్తన ఎంత హీనంగా ఉంటుందో తెలిసింది. తమకు లోన్ వడ్డీ తిరిగి చెల్లించలేదనే కారణంతో దారుణంగా ఓ రైతును కొట్టడంతోపాటు అతడి ట్రాక్టర్‌తోనే అతడిని చంపేశారు. తీవ్రంగా గాయపరిచి కిందపడేసి ట్రాక్టర్‌తో తొక్కించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పుడు విచారణ ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లో గ్యాన్ చంద్ర(45) అనే ఓ రైతు ఓ బ్యాంకు నుంచి ట్రాక్టర్ కొనుగోలు చేసేందుకు రుణం తీసుకున్నాడు. మొత్తం రూ.99వేలు అతడు తీసుకోగా తొమ్మిది వేలు చెల్లించి మిగితా డబ్బు చెల్లింపు కోసం కొంత సమయం అడిగాడు. అయితే, అందుకు అనుమతించని లోన్ రికవరీ ఏజెంట్లు అతడితో పొలంలోనే గొడవకు దిగారు. అనంతరం చేయి కూడా చేసుకున్నారు. అంతటితో ఆకకుండా కిందపడేసి అతడి ట్రాక్టర్‌తోనే తొక్కించి చంపేశారు. ఈ ఘటనపై అక్కడి రైతు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
రికవరీ ఏజెంట్ల దాష్టీకం
సీతాపూర్ : ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. లోన్ కట్టలేదని ఓ రైతును రికవరీ ఏజెంట్లు దాష్టీకానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో తన ట్రాక్టర్ కిందే ఆ రైతన్న ప్రాణాలు కోల్పోయాడు. లక్నోకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీతాపూర్ గ్రామానికి చెందిన గ్యాన్ చంద్ర(45) కొన్నేళ్ల క్రితం ఓ ప్రైవేట్ ఫైనాన్షియర్ నుంచి లోన్ తీసుకున్నాడు. ఆ డబ్బుతో ఓ ట్రాక్టర్ కొనుక్కుని వినియోగించుకుంటున్నాడు. వడ్డీతో కలిపి ఆ ఫైనాన్షియర్‌కు లక్షా 25వేలు కట్టాల్సి ఉంది. అయితే ఇప్పటికే గ్యాన్ 35,000 రూపాయలను చెల్లించాడు. మిగిలిన డబ్బు కట్టడానికి కాస్త గడువు కోరాడు. కానీ, రెండు రోజుల క్రితం అతని ఇంటికి వచ్చిన ఐదుగురు లోన్ రికవరీ ఏజెంట్లు ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకునేందుకు యత్నించారు. బలవంతంగా అతని నుంచి తాళాలు లాక్కుని ట్రాక్టర్‌ను ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఓ ఏజెంట్.. గ్యాన్‌ను బలంగా నెట్టేశాడు. దీంతో అతను కిందపడిపోగా.. ట్రాక్టర్ నడుపుతున్న వ్యక్తి అతని మీద నుంచి ఎక్కించేశాడు. గ్యాన్ అక్కడికక్కడే ప్రాణాలు వదలగా.. ఏజెంట్లు అక్కడి నుంచి పారిపోయారు. కళ్ల ముందే తమ సోదరుడి దారుణంగా హతమార్చారని గ్యాన్ చంద్ర సోదరుడు ఓమ్ ప్రకాశ్ చెబుతున్నాడు. బాధితుడి కుటుంబ సభ్యుల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీఫుటేజీ ద్వారా నిందితులను గుర్తించి.. వారి కోసం గాలింపు చేపట్టారు. చంద్రకు రెండున్నర ఎకరాల పొలం ఉంది. అతనికి ఐదుగురు కూతుళ్లు ఉన్నారు. గతేడాది చిన్న, సన్నకారు రైతులకు రుణ మాఫీ పథకం ప్రకటించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్.. 87 లక్షల రైతులకు లబ్ధి చేకూరుతుందని ప్రకటించారు. అయితే ఆ లోన్‌ను కేవలం కేవలం లక్ష రూపాయలకే పరిమితం చేయటంతో.. రైతులంతా ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చింది. సాలీనా రాష్ట్ర గ్రామీణ ఆదాయంలో ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తులకు వాటా పెరుగుతూ వస్తోంది. గతేడాది అది 28.2 శాతంగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. -
ప్రజల హక్కుల్ని హరిస్తే ఎలా సారూ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిర్బంధ పరిస్థితులు నెలకొన్నాయని, అవి ప్రజలకు ఆందోళనకరంగా ఉన్నాయని మానవ హక్కుల వేదిక పేర్కొంది. ప్రత్యామ్నాయ ఆలోచనల పట్ల, ప్రజల అభిప్రాయాల వ్యక్తీకరణపట్ల ప్రభుత్వం తీవ్ర అసహనంతో వ్యవహరిస్తోందని వేదిక అధ్యక్షుడు గొర్రెపాటి మాధవరావు, ప్రధానకార్యదర్శి జి.మోహన్ ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వతీరుపై మానవ హక్కుల వేదిక సీఎం కేసీఆర్‌కు బుధవారం బహిరంగ లేఖ రాసింది. ప్రివెంటివ్ డిటెన్షన్, బహిరంగసభలు, ఊరేగింపులను క్రమబద్ధీకరించే చట్టాలైన సెక్షన్ 30, సెక్షన్ 144ను పోలీసులు విచక్షణారహితంగా అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడా మీటింగులకు అనుమతినివ్వడం లేదని, రైతు సమస్యలపై నిరసన తెలిపినా అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
రైతు సమస్యలు పట్టని ప్రభుత్వం
వీణవంక(హుజూరాబాద్): రైతు సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మండలంలోని చల్లూరు గ్రామంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. బేతిగల్ గ్రామానికి చెందిన దాసరి జయప్రకాశ్ మృతిచెంది ఆరు నెలలు గడిచినా.. ఇంతవరకు చర్యలు చేపట్టలేదని అన్నారు. జయప్రకాశ్‌ను హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చొప్పదండిలోని ఓ సర్పంచ్ సమస్యలపై నిలదీస్తే రౌడీషీట్ ఓపెన్ చేశారని, సమస్యలను కూడా అడిగే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేకుండాపోయిందని అన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇప్పటివరకు ప్రారంభించలేదని, కొందరు గత్యంతరం లేక దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. జిల్లా నాయకుడు చెన్నమాదవుని నరసింహారాజు, మండల అధ్యక్షుడు బత్తిని నరేశ్‌గౌడ్, యువ మోర్చా మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, జిల్లా నాయకులు సాగర్‌రెడ్డి, ఆదిరెడ్డి, దామోదర్ పాల్గొన్నారు. -
దగా ధర!
టమాట రైతు కుదేలు - గిట్టుబాటు ధర లభించక అవస్థలు - మార్కెట్లో మండి నిర్వాహకులు, వ్యాపారుల సిండికేట్ - వందల నుంచి పదులకు పడిపోయిన ధర - పట్టనట్లు వ్యవహరిస్తున్న మార్కెటింగ్ శాఖ ఆరుగాలం శ్రమించి పండించిన పంటను రైతులు మద్దతు ధరతో అమ్ముకోలేని పరిస్థితి. వ్యాపారుల చేతుల్లో టమాట రైతు దగా పడుతున్నాడు. మద్దతు ధర కల్పించి రైతులకు చెదోడువాదోడుగా నిలవాల్సిన మార్కెటింగ్ శాఖ అధికారులు ఆ విషయమే మరిచారు. ఇదే అదునుగా భావించిన టమాట వ్యాపారస్తులు మండి యజమానులతో కుమ్మకై సిండికేట్ అవతారమెత్తారు. నిన్న మొన్నటి వరకు 15కిలోల టమాట బాక్స్ రూ.300 ధర పలికింది. ప్రస్తుతం ఒక్కసారిగా రూ.30లకు పడిపోవడం గమనార్హం. అనంతపురం రూరల్: జిల్లా వ్యాప్తంగా దాదాపు 8వేల హెక్టార్లలో టమాట పంట సాగయింది. ఆశించిన పంట దిగుబడి వచ్చినా రైతులకు ప్రయోజనం లేకుండా పోతోంది. సుదూర ప్రాంతాల నుంచి సరుకును మార్కెట్‌కు తరలిస్తే గిట్టుబాటు ధరలేక కనీసం రవాణా ఖర్చులకూ సరిపోవట్లేదని రైతులు వాపోతున్నారు. మార్కెట్‌కు తీసుకొచ్చిన సరుకును రైతులు వెనక్కు తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొనడంతో వ్యాపారుల దోపిడీ అధికమైంది. గిట్టుబాటు ధర ఉన్నా.. లేకపోయినా సరుకును వ్యాపారులు నిర్ణయించిన రేటుకే వదులుకోవాల్సి వస్తోంది. ప్రతి రోజూ అనంతపురం కక్కలపల్లి గ్రామ సమీపంలోని టమాట మార్కెట్‌కు దాదాపు 250 టన్నుల దిగుబడి వస్తోంది. 15 కేజీల టమాట బాక్స్ ఆగస్టు నెల మొదలుకొని సెప్టెంబర్ మొదటి వారం వరకు దాదాపు రూ.200 నుంచి రూ.300 పైనే ధర పలికింది. కేవలం 10రోజుల వ్యవధిలోనే బాక్స్ ధర ఏకంగా 80శాతం మేర తగ్గించేశారు. 15కేజీల బాక్స్ కేవలం రూ.30, రూ.40, రూ.50 లకే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. టమాట మార్కెట్లో వ్యాపారులు, మండి నిర్వహకులు సిండికేట్‌గా మారి తక్కువ ధరకే వేలం పాట నిర్వహించి రైతులను కొల్లగొడుతున్నారు. వ్యాపారులు నిర్దేశించిన ధరకు సరుకును వదులుకోవడం ఇష్టంలేని కొందరు రైతులు వచ్చిన నష్టం ఎట్లా వచ్చిందంటూ టమాట దిగుబడులను రోడ్డు పక్కన పడేసి వెళ్తున్నారు. పట్టించుకోని మార్కెటింగ్ శాఖ అధికారులు: టమాట మార్కెట్లో దోపిడీ రాజ్యం సాగుతున్నా మార్కెటింగ్ శాఖ అధికారులు మేల్కొని పరిస్థితి ఉంది. కనీసం మార్కెట్లో జరుగుతున్న వేలం పాటను సైతం పరిశీలించే పరిస్థితిలో లేకపోవడం దారుణం. దీంతో వ్యాపారులు మరో అడుగు ముందుకేసి ఇష్టానుసారం వేలం పాట నిర్వహిస్తూ రైతులను నిలువున ముంచేస్తున్నారు. మార్కెట్లో కనిపించని ధరల బోర్డు టమాట మార్కెట్లో దాదాపు 15 మండిలు ఉన్నాయి. ఇతర ప్రాంతాల్లోని మార్కెట్లలో(కోలార్, మదనపల్లి, చెన్నై) ధరల బోర్డును ప్రతి మండిలోను ఏర్పాటు చేయాలని మార్కెటింగ్ శాఖ అధికారులు ఆదేశాలను జారీ చేసినా ఏ ఒక్క మండి నిర్వాహకుడు పాటించడం లేదు. ఇతర ప్రాంతాల్లో ఏ మేరకు టమాట ధర ఉందో తెలుసుకోలేక వ్యాపారుల చేతుల్లో రైతులు నిలువునా మోసపోతున్నారు. మార్కెటింగ్ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ధరల బోర్డు సైతం మార్కెట్లో పని చేయకపోవడం గమనార్హం. రవాణ ఖర్చులు, కమీషన్‌కే సరిపోయింది దాదాపు లక్ష ఖర్చు చేసి మూడు ఎకరాల్లో టమాట పంట సాగు చేశాం. ఆశాజనకంగా దిగుబడి వచ్చింది. 152 టమాట బాక్సులను మార్కెట్‌కు తీసుకొస్తే గిట్టుబాటు ధర లేక ఒక్కో బాక్స్‌ను కేవలం రూ.40లకే వదులుకోవాల్సి వచ్చింది. వచ్చిన సొమ్ము కాస్తా రవాణా ఖర్చులకు, మండి కమీషన్‌కే సరిపోతోంది. కూలీలకు చేతి నుంచి పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. – చంద్రయ్య, కొండపల్లి, కనగానిపల్లి మండలం టమాటకు గిట్టుబాటు ధర కల్పించాలి టమాట మార్కెట్లో సిండికేట్ వ్యాపారం సాగుతోంది. వ్యాపారులు నిర్దేశించిన ధరకు పంటను వదులు కొవాల్సి వస్తోంది. పంటకు గిట్టుబాటు ధర కల్పించి మార్కెట్లో జరుగుతున్న దోపిడీని అరికట్టాలి. నిన్నమొన్నటి వరకు రూ.200 పలికిన బాక్స్ ధర ఒక్కసారిగా రూ.30లకు పడిపోవడం ఏంటి. వెంటనే టమాట మార్కెట్‌ను అధికారుల పర్యవేక్షణలో ఉండేలా చర్యలు చేపట్టండి. – చినపరెడ్డి, యర్రాయపల్లె, కంబదూరు మండలం టమాట మార్కెట్లను సీజ్ చేస్తాం మార్కెటింగ్ శాఖ నిబంధనలు పాటించకుండా సిండికేట్ అయితే మండీలను సీజ్ చేస్తాం. ప్రతి మండిలో ఇతర ప్రాంతాల్లోని టమాట ధరల బోర్డులను కచ్చితంగా ఏర్పాటు చేయాల్సిందే. లేని పక్షంలో చర్యలు తీసుకుంటాం. - హిమశైల, మార్కెటింగ్ శాఖ ఏడీ -
బీమా కరువు!
కనికరించని ప్రభుత్వం - బీమా ప్రీమియం చెల్లింపునకు ముగిసిన గడువు - ఇప్పటి వరకు పొడిగింపునకు ససేమిరా - జిల్లాలో 50వేల మంది రైతుల నిరీక్షణ - చిన్న, సన్నకారు రైతులే అధికం - నోరు మెదపని అధికార పార్టీ నేతలు 5.50 లక్షలు : జిల్లాలో వేరుశనగ రైతులు రూ.4,246 కోట్లు : పంట రుణాల రెన్యూవల్స్ లక్ష్యం రూ.3,800 కోట్లు : పూర్తయిన రెన్యూవల్స్ 4.60 లక్షలు : వాతావరణ బీమా పరిధిలోని రైతులు 50వేలు : బీమా కోల్పోతున్న రైతులు జూలై 15 : ముగిసిన రెన్యూవల్స్ గడువు అనంతపురం అగ్రికల్చర్: పంట రుణాల రెన్యూవల్స్ ముందస్తుగానే ప్రారంభించినా ఫలితం లేకుండా పోతోంది. వాతావరణ బీమా పథకం వర్తింపునకు జూలై 15 ఆఖరు కావడంతో.. సుమారు 50వేల మంది రైతులు బీమాకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. బ్యాంకుల్లో మౌలిక వసతులు లేకపోవడం.. సిబ్బంది కొరత.. సర్వర్‌తో సాంకేతిక సమస్యలు.. నగదు కొరత.. ఇన్పుట్ సబ్సిడీ పంపిణీతో పాటు సరైన ప్రణాళిక లేకపోవడంతో రెన్యూవల్స్, కొత్త రుణాల పంపిణీ మందగించింది. ఈ ఖరీఫ్‌లో అన్ని బ్యాంకుల ద్వారా రూ.4,245 కోట్ల పంట రుణాలు రెన్యూవల్ చేయాలనేది బ్యాంకులకు నిర్దేశించిన లక్ష్యం. పంట రుణ పరిమితి(స్కేల్ ఆఫ్ ఫైనాన్స్) ఆధారంగా రైతుల వాటా 2 శాతం ప్రీమియం చెల్లిస్తే.. మిగతా 8 శాతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీమా కంపెనీకి ప్రీమియం జమ చేస్తాయి. 2 శాతమే అయినా.. జిల్లా రైతులపై రూ.40 కోట్ల నుంచి రూ.60 కోట్ల వరకు భారం పడుతుంది. మే మొదటి వారం నుంచి రెన్యూవల్స్ ప్రారంభం కావడంతో గడువులోగా ముగిసే అవకాశం ఉంటుందని భావించారు. అయితే వివిధ కారణాలతో కటాఫ్ తేదీ జూలై 15 నాటికి రూ.3,800 కోట్ల రెన్యూవల్స్ పూర్తి కాగా.. 4.60 లక్షల మంది రైతులు బీమా పరిధిలోకి వచ్చారు. చివరి రోజు సర్వర్ సక్రమంగా పనిచేయకపోవడంతో రెన్యూవల్స్ తక్కువయ్యాయి. ఇప్పటికీ వేలాది మంది రైతులు రెన్యూవల్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో ఎక్కువగా చిన్న, సన్నకారు రైతులతో పాటు ఎస్సీ, ఎస్టీలే ఉండటం గమనార్హం. గతేడాది 5.10 లక్షల మంది రెన్యూవల్స్ గతేడాది జూలై 15 నాటికి 5.10 లక్షల మంది రైతులు రెన్యూవల్స్ చేయించుకోవడంతో బీమా పరిధిలోకి రావడంతో.. 5.07 లక్షల మంది రైతులకు రూ.419 కోట్ల వాతావరణ బీమా కింద పరిహారం విడుదలయింది. రేపోమాపో రైతుల ఖాతాల్లోకి బీమా పరిహారం జమ చేయనున్నట్లు లీడ్ బ్యాంకు వర్గాలు తెలిపాయి. ఈ లెక్కలు పరిగణనలోకి తీసుకుంటే ఈ సారి ఎంతలేదన్నా 50వేల మంది రైతులకు వాతావరణ బీమా పథకం వర్తించే పరిస్థితి లేదు. ఆందోళనలు చేసినా.. వర్షాలు లేకపోవడం, పంటల సాగు పడకేయడం, బ్యాంకుల్లో నెలకొన్న సమస్యల కారణంగా ఈ సారి ప్రీమియం చెల్లింపు గడువు పొడిగించే అవకాశం ఉంటుందని ఊహించారు. ఆగస్టు 15వ తేదీ వరకు పొడిగించాలని, కనీసం జూలై నెలాఖరు వరకైన సమయం ఇవ్వాలని రైతులు, రైతు సంఘాలు, విపక్షాలు వ్యవసాయశాఖ, బ్యాంకు అధికారులపై ఒత్తిడి తేవడంతో పాటు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆందోళన చేశారు. ఈ క్రమంలో పొడిగించాలంటూ కలెక్టర్, జేడీఏ, ఎల్డీఎం కార్యాలయాల నుంచి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ(ఎస్ఎల్బీసీ), బీమా పథకం అమలు చేస్తున్న హెచ్డీఎఫ్సీ ఇన్సూరెన్స్ కంపెనీతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే ఇప్పటి వరకు ఉత్తర్వులు రాకపోవడంతో రైతులు నిరాశకు లోనవుతున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులకు అండగా నిలిచి సీఎంపై ఒత్తిడి తీసుకురావాల్సిన జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నోరు మెదపకపోవడం విమర్శలకు తావిస్తోంది. అవకాశం లేనట్లే.. గడువు పొడిగించాలని కోరినా.. ఇప్పటికి అవకాశం కనిపించట్లేదు. జూలై 15 వరకు నిర్వహించిన రెనూవల్స్, ప్రీమియం, ఎన్ని హెక్టార్లు, ఎంత మంది రైతులు అనే వివరాలు అప్లోడ్ చేసి ఈ నెలాఖరు లోగా పంపాలనే ఆదేశాలు ఉండటంతో ఆ పనిలో ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ప్రీమియం చెల్లింపు గడువు పొడిగిస్తారా లేదా అనేది సందేహమే. నాలుగైదు బ్యాంకులు మినహా మిగతా వాటిలో 15 నుంచి 20 శాతం మంది రైతులు బీమా పరిధిలోకి రాని పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. కచ్చితమైన వివరాలు అందాల్సి ఉంది. - ఎల్.జయశంకర్, లీడ్ బ్యాంకు మేనేజర్ -
కన్నీటి సేద్యం
నల్లమాడ: ప్రస్తుత ఖరీఫ్‌లో సాగు చేసిన వేరుశనగ, కంది పంటలు వర్షాభావంతో ఎండుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో పంటలను కాపాడుకోవడానికి రైతులు నీరు కొనుగోలు చేసి ట్యాంకర్ల ద్వారా పంటలకు అందిస్తున్నారు. ఎకరా పంటకు ట్యాంకర్ నీరు అవసరం. ట్యాంకు నీరు రూ.600 వెచ్చించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కనీసం 15 రోజులకు ఓసారైనా పంటలను తడపాల్సి ఉందని రైతులు చెబుతున్నారు. ఈ లెక్కన ఐదారు ఎకరాలు పంట సాగు చేసిన రైతులు నీటి కొనుగోలుకు డబ్బు ఖర్చు పెట్టలేని పరిస్థితి నెలకొంది. అధికారులు, నాయకులు స్పందించి వేరుశనగ, కంది పంటలకు రక్షక తడులు అందించాలని రైతులు కోరుతున్నారు. అయితే వర్షాభావంతో పంటలు ఎండిపోతాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. రక్షక తడుల ద్వారా పంటలను కాపాడుతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. -
మేఘమా.. కురవవే!
ఊరిస్తున్న నైరుతి - నిరాశాజనకంగా ఖరీఫ్ సీజన్ - నెల రోజులుగా ప్రభావం చూపని రుతు పవనాలు - ఇప్పటి వరకు పదునైన వర్షం కరువు - 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో గాలులు - వరుణుడి కరుణ కోసం నిరీక్షణ జూన్ నెల సాధారణ వర్షపాతం : 63.9 మి.మీ., నమోదైన వర్షపాతం : 59.2 మి.మీ., ఖరీఫ్ సాధారణ సాగు : 8.01 లక్షల హెక్టార్లు ఇప్పటి వరకు చేపట్టిన సాగు : 32వేల హెక్టార్లు అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా వ్యవసాయానికి నైరుతి రుతు పవనాలే కీలకం. వీటి ప్రభావంతోనే లక్షలాది ఎకరాల్లో ఖరీఫ్ పంట సాగవుతుంది. లేదంటే.. అరకొర తేమలో విత్తనం వేసి రైతాంగం నష్టపోతోంది. ఏటా జూన్ 10 నుంచి 15 తేదీల మధ్య నైరుతి పవనాలు జిల్లాలోకి ప్రవేశిస్తాయి. అయితే ఈసారి కాస్త ముందుగా.. అంటే ఈనెల 8న రాత్రి జిల్లాను తాకినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. నైరుతి ముందస్తుగా ఊరించినా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోవడంతో రైతుల పరిస్థితి దారుణంగా మారుతోంది. ప్రస్తుతం జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉష్ణోగ్రతలు 42-44 డిగ్రీల నుంచి 35-37 డిగ్రీలకు పడిపోయాయి. రాత్రి ఉష్ణోగ్రత కూడా బాగా తగ్గుముఖం పట్టింది. ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో గాలిలో తేమ శాతం పెరిగింది. ఆకాశం మేఘావృతమై వర్షం కురిసే వాతావరణం కనిపిస్తున్నా చినుకు రాలని పరిస్థితి ఉంది. శాస్త్రవేత్తలు వర్ష సూచన చేస్తున్నా ఫలితం లేకపోతోంది. అక్కడక్కడ తేలికపాటి వర్షం, మరికొన్ని ప్రాంతాల్లో తుంపర్లు మినహా చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షం పడటం లేదు. మరోపక్క విత్తనానికి అదను కావడంతో పదును కాక రైతులు దిక్కులు చూస్తున్నారు. ఆషాడం గాలులతో మేఘాలు చెల్లాచెదురు ఆషాఢమాసంలో వీస్తున్న బలమైన గాలులతో మేఘాలు చెల్లాచెదురవుతున్నాయి. సాధారణ రోజుల్లో గాలివేగం 6 నుంచి 12 కిలోమీటర్లుగా ఉంటుంది. అయితే ప్రస్తుతం 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో ఆవరించిన మేఘాలు చెదిరిపోతున్నాయి. అక్కడక్కడ తుంపర్లు కురిపించి కనుమరుగవుతున్నాయి. బ్రహ్మసముద్రం, గుమ్మగట్ట, పామిడి, డి.హిరేహాల్, తాడిపత్రి, అనంతపురం, బుక్కరాయసముద్రం, నార్పల, పుట్లూరు, యల్లనూరు, తాడిమర్రి, కనగానపల్లి, రామగిరి, కంబదూరు, బత్తలపల్లి, రాప్తాడు, గార్లదిన్నె, పెద్దపప్పూరు, కదిరి, కొత్తచెరువు.. ఇలా దాదాపు 35 మండలాల్లో 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో గాలులు హోరెత్తిస్తున్నాయి. నైరుతి రాకమునుపే మంచి వర్షాలు జూన్ 8న రాత్రి జిల్లాలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని రైతులు ఆనందపడ్డారు. ఇక ఏరువాక జోరందుకునే పరిస్థితి ఉందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. కానీ.. జూన్ 1 నుంచి 8వ తేదీ మధ్య 38 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. జూన్ 9 నుంచి 30వ తేదీ మధ్య 21.2 మి.మీ వర్షం మాత్రమే పడటం గమనార్హం. 32 మండలాల్లో సాధారణంకన్నా తక్కువ వర్షం కురిసింది. ఇందులోనూ జూన్ నెలలో ఎస్పీకుంట మండలంలో 8.8 మిల్లీమీటర్లు, శెట్టూరు 13.8, గమ్మగట్ట 14.7, గోరంట్ల 19.3 మిల్లీమటర్లు.. ఇలా చాలా మండలాల్లో కనీసం పదునుకు సరిపడా వర్షం కూడా కురవలేదు. గతేడాది 1.35 లక్షల హెక్టార్లలో పంటలు 2016 ఖరీఫ్‌లో జూన్ నెల ముగిసే నాటికి 1.35 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. అందులో వేరుశనగ 1.18 లక్షల హెక్టార్లు, మిగతా విస్తీర్ణంలో ఇతరత్రా పంటలు వేశారు. గతేడాది జూన్‌లో వర్షపాతం 63.9 మిల్లీమీటర్లకు గాను 94.5 మిల్లమీటర్ల వర్షం కురవడంతో ఖరీఫ్ సాగు ఆశాజనకంగా సాగింది. అయితే ఈ జూన్‌లో వర్షపాతం 59.2 మిల్లీమీటర్లకే పరిమితం కావడం, అందులోనూ జూన్ మొదటి వారంలోనే బాగా కురవడం.. విత్తుకు అనుకూలమైన జూన్ 15 తర్వాత వర్షాలు లేకపోవడంతో సాగు మందగించింది. వ్యవసాయశాఖ అందించిన సమాచారం ప్రకారం ఇప్పటి వరకు జిల్లాలో 35వేల హెక్టార్ల విస్తీర్ణంలో మాత్రమే పంటలు సాగయ్యాయి. ఇందులో 32వేల హెక్టార్లలో వేరుశనగ, ఇతర పంటలు మరో 3వేల హెక్టార్లలో వేసినట్లు చెబుతున్నారు. వేసిన పంటలు కూడా గాలివేగానికి వాడుతుండటం గమనార్హం. జూలైపైనే ఆశలు దాదాపు అన్ని రకాల పంటల సాగుకు జూలై నెల కీలకమని శాస్త్రవేత్తలు ప్రకటించారు. వేరుశనగతో పాటు మిగతా అన్ని పంటలు వేసుకోవచ్చంటున్నారు. జూలైలో సాధారణ వర్షపాతం 67.4 మిల్లీమీటర్లు. ఖరీఫ్ సాధారణ సాగులో 10 శాతం పంటలు కూడా సాగు కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులు జూలై మాసంపై ఆశలు పెట్టుకుని వరుణుడి కరుణ కోసం ఆకాశానికేసి ఆశగా ఎదురుచూస్తున్నారు. -
మొన్న గలగల.. నేడు విలవిల
- అమాంతం పడిపోయిన రేట్లు - పండ్లలో నాణ్యతా లోపం - కష్టాల్లో దానిమ్మ రైతులు మొన్నటి వరకు సిరులు కురిపించిన దానిమ్మ.. నేడు రైతుల కంట కన్నీళ్లు తెప్పిస్తోంది. పండ్లలో నాణ్యత లోపించడం, అమాంతం ధర పడిపోవడం రైతుల పాలిట శాపంగా మారింది. పెట్టుబడులు కూడా తిరిగిరాకపోవడంతో రైతులు డీలా పడిపోయారు. పెద్దపప్పూరు : తాడిపత్రి నియోజకవర్గంలో నెలక్రితం వరకు వీచిన వేడిగాలులు, ఎండలు దానిమ్మ రైతులపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. వేడిగాలులు, ఎండల కారణంగా దానిమ్మ దిగుబడులు సగానికి పైగా తగ్గడం తో పాటు చాలా వరకు నాణ్యత లోపించాయి. దీంతో రైతులు పండ్లను మార్కెట్ చేయలేకపోతున్నారు. ఎండలకు దానిమ్మ పండు లోపల ఎర్రగా ఉండాల్సిన విత్తనాలు నల్లగా మారడంతో రైతులు పండ్లను మార్కెట్లకు తీసుకెళ్లలేని పరిస్థితి. చేసేది లేక నాణ్యతలేని పండ్లను మేకలు, గొర్రెలకు మేతగా వదిలేస్తున్నారు. వెనక్కిరాని పెట్టుబడులు దానిమ్మ సాగు చేసిన రైతులకు కనీసం పెట్టుబడులు కూడా వెనక్కి రావడం లేదు. మండలంలోని అమ్మలదిన్నె, జె.కొత్తపల్లి, నారాపురం, నామనాంకపల్లి తదితర గ్రామాల్లో దాదాపు 200 ఎకరాల్లో రైతులు మృదులా, భగవ రకాలను సాగు చేశారు. ఎకరా దానిమ్మ పంటను సాగు చేయడానికి లక్ష వరకు పెట్టుబడులు పెట్టారు. దానిమ్మను ఒక్కసారి సాగుచేస్తే దాదాపు 20 సంవత్సరాల వరకు దిగుబడులు అందుతాయి. మొక్కలు నాటిని రెండో సంవత్సరం నుండి దిగుబడులు తీసుకొవచ్చు. ఎకరా తోటలో దాదాపు 15 నుండి 20 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. అయితే వేడిగాలుల దెబ్బకు ఈసారి కేవలం 6 నుండి 8 టన్నులకు పడిపోయింది. నాణ్యత లోపించడంతో మార్కెట్ రేట్లు తీవ్ర వ్యత్యాసం ఉంది. గత రెండు మూడు సంవత్సరాలు ఇదే సమయంలో టన్ను దానిమ్మ ధర రూ.50 వేల వరకు పలికింది. అయితే ప్రస్తుతం టన్ను రూ.20 వేలకు మించి పలుకకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన డిసెంబర్, జనవరి నెలలో టన్ను రూ. 90 వేలు పలకడం విశేషం. ప్రభుత్వమే ఆదుకొవాలి గత వేసవిలో వీచిన వేడిగాలులు, ఎండ వేడికి దానిమ్మ దిగుబడి సగానికి పైగా తగ్గింది. నాణ్యత లోపించింది. దీంతో మార్కెట్లో దానిమ్మకు గిరాకీ తగ్గింది. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టినా తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే చాలా నష్టపోయాం. ప్రభుత్వమే మమల్ని ఆదుకొవాలి. - వెంకటనారాయణ, దానిమ్మ రైతు, జె.కొత్తపల్లి బోర్లు వేసినా నీరు పడలేదు నాలుగు ఎకరాల్లో దానిమ్మ పంటను సాగు చేశాను. గత ఏడాది బోరులో నీరు రాకపోవడంతో వరుసగా నాలుగు బోర్లు వేశాను. చుక్కనీరు రాలేదు. దీంతో అప్పులు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో దానిమ్మకు గిరాకీ తగ్గింది. నష్టపోతున్నాం. ప్రభుత్వమే రైతులను ఆదుకొవాలి. - నారాయణ, దానిమ్మ రైతు జె.కొత్తపల్లి -
ధాన్యం కుప్పలపైనే రైతు కన్నుమూత
ఐదు రోజులుగా ధాన్యానికి కాపలా... దోమకొండ(కామారెడ్డి): ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించి, ధాన్యం కుప్ప కు కాపలాగా ఉన్న ఓ రైతు అక్కడే మృతిచెందాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన ఆకుల పోచయ్య (62) ఈనెల 11న 30 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాడు. అక్కడ రవాణా సమస్యతో ధాన్యం తూకాలు వేగంగా సాగడం లేదు. దీంతో రైతులు రోజుల తరబడి కాంటా కోసం నిరీక్షించాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఆకుల పోచయ్య ఐదు రోజులుగా తన ధాన్యానికి కాపలా ఉంటున్నాడు. సోమవారం సాయంత్రం వరకు పొలం వద్ద పనులు చేసిన పోచయ్య.. రాత్రి భోజనం చేసి వెళ్లి.. ధాన్యం వద్ద కాపలాగా పడుకున్నాడు. మంగళవారం వేకువజామున తోటి రైతులు లేపడానికి ప్రయత్నించగా, అప్పటికే చనిపోయి ఉన్నాడు. దీంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఎండలో పనిచేయడం వల్ల వడదెబ్బకు గురై మరణించి ఉంటాడని భావిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
చంద్రబాబుకు చేదు అనుభవం
-
చంద్రబాబుకు చేదు అనుభవం
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చేదు అనుభవం ఎదురైంది. గురువారం అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లిన చంద్రబాబు.. ఇంకుడు గుంతల గురించి గొప్పలు చెప్పారు. అయితే ఇంకుడు గుంతల వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదని సభలో టీడీపీ నాయకుడే చెప్పడంతో చంద్రబాబుకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. టీడీపీ నాయకుడు, రైతు రామ్మోహన్ చౌదరి మాట్లాడుతూ.. ఇంకుడు గుంతలకు 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టానని, తమకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకుడు గుంతల గురించి చంద్రబాబు గొప్పలు చెబుతున్న సమయంలో సొంత పార్టీకి చెందిన నాయకుడే ఇలా మాట్లాడేసరికి ఆయన షాకయ్యారు. ఊహించని పరిణామంతో బిత్తరపోయిన చంద్రబాబు.. చౌదరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జవాబు దాటవేశారు. -
మినప రైతు గోడు పట్టని పాలకులు
విజయవాడ : రైతు సమస్యలు పట్టించుకోకుండా ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు కొలుసు పార్థసారథి విమర్శించారు. మినప రైతులను ఆదుకోవాలని కోరుతూ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్–కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి జిల్లాలో పర్యటించి, తెగుళ్ల బారినపడి మినుము పంట కోల్పోయిన రైతుతో మాట్లాడే వరకు ప్రభుత్వానికి ఈ సమస్య తెలియదన్నారు. ఆ తరువాత మినప పంట కోల్పోయిన రైతులకు సీఎం చంద్రబాబు హెక్టార్‌కు రూ. 10వేలు వంతున ఇవ్వాలని నిర్ణయించారని టీడీపీ నేతలు ప్రకటించారన్నారు. మొవ్వ తెగులు, తలమాడు వైరస్ సోకి ఇప్పటికే పంట పూర్తిగా దెబ్బతిందన్నారు. మరో 10 రోజుల్లో పంట కాలం పూర్తవుతుందన్నారు. ఈ క్రమంలో దెబ్బతిన్న పంట చేలలో రైతులు రూ. 500, రూ. 1000 చెల్లించి గొర్రెల మేతకు వదిలేస్తున్నారని తెలిపారు. గతఏడాది మినుముకు అధిక ధర రావటం, ఈ ఏడాది సాగునీరు సరిగా సరఫరా చేయని కారణంగా జిల్లాలో రైతులు మినుము పంటను అధికంగా వేశారని ఆయన చెప్పారు. ఒక్కో రైతు ఎకరాకు రూ.25 వేల నుంచి రూ. 30 వేల వరకు ఖర్చుచేశారని వివరించారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించాలి... తెగుళ్ల కారణంగా మినుము పంట పూర్తిగా దెబ్బతిందని వివరించారు. రైతు ప్రభుత్వమని డబ్బాలు కొట్టుకుంటున్న టీడీపీ నేతలు రైతుల ఇబ్బందులను పట్టించుకోవటం లేదన్నారు. కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితమయ్యారని తెలిపారు. ఇప్పటివరకు పంటనష్టం అంచనా వేయకుండా పరిహారం ఎలా చెల్లిస్తారని ఆయన ప్రశ్నించారు. తక్షణమే వ్యవసాయ అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయించి పంట నష్టం అంచనా వేయించాలని సూచించారు. ఏ రైతు పొలంలో ఎంత నష్టం జరిగిందో లెక్కతేల్చి జాబితాలు తయారు చేయాలన్నారు. ఎకరాకు రూ. 15వేలు పరిహారంగా ఇవ్వాలని పార్థసారథి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ, పామర్రు, కైకలూరు, విజయవాడ తూర్పు నియోజకవర్గాల సమన్వయకర్తలు సింహాద్రి రమేష్, కైలే అనిల్ కుమార్, దూలం నాగేశ్వరరావు, బొప్పన భవకుమార్, జిల్లా రైతు అధ్యక్షుడు కొల్లి రాజశేఖర్, పార్టీ నాయకులు కాసర్నేని గోపాలరావు, అడపా శేషు కుమార్, నెర్సు సతీష్, కంకిపాడు మండల పార్టీ అధ్యక్షుడు మద్దాలి రామచంద్రరావు, పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి మాదు వసంతరావు, నగర స్టూడెంట్ విభాగం అధ్యక్షుడు డి. అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పరిటాల పేరుతో హల్చల్
- రైతు పొలాన్ని దౌర్జన్యంగా దున్నేసిన వైనం - పోలీసులు పట్టించుకోవడం లేదంటున్న బాధితుడు కళ్యాణదుర్గం రూరల్ : పరిటాల రవి అనుచరుల పేరుతో ఓ రైతు వేసుకున్న పొలాన్ని దున్నేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే... మండల పరిధిలోని బాలవెంకటాపురం గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి, మాదవయ్యలకు 725 – 1 సర్వేలో నాలుగు ఎకరాలు ఉంది. 15 ఏళ్లు వారు అందులో పంటలు పండిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈసారి 3 ఎకరాలను నీటి తడి కింద వేరుశనగ సాగు చేశారు. అయితే వారం రోజుల క్రితం ఓ వ్యక్తి ఆ భూమి మాది మీకు దిక్కున్న చోట చెప్పుకోవాలంటూ సాగు చేసిన వేరుశనగను దున్నేసినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వేరుశనగ సాగు కోసం ఇప్పటికే రూ.50 వేలు ఖర్చు చేశానని ఇప్పుడు ఇలా దున్నేయడంతో తనకు నష్టం జరిగిందని వాపోయారు. ఇదేవిషయాన్ని పోలీసులకు చెప్పినా వారు కూడా పట్టించుకోలేదని చెప్పారు. పరిటాల వారి పేరు చెప్పిన వెంటనే తమకు పోలీసులు కూడ రక్షణ ఇవ్వలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబీకులతో భూ సమస్య ఏర్పడితే తాము కోర్టులో కూడా వస్తే తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. అయితే తమ భూమిని ఎలాగైనా లాక్కోవాలనే పరిటాల అనుచరుడినంటూ తమ పొలాన్ని భానుకోటకు చెందిన యువరాజు అనే వ్యక్తి దున్నేశారని చెప్పారు. ఇప్పటికైన పోలీసులు తనకు పోలీసులు రక్షణ కల్పించి న్యాయం చేయాలన్నారు. ఇదే విషయంపై ఎస్ఐ నబీరసూల్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా... పొలాన్ని దున్నేసినట్లు తనకు ఫిర్యాదు అందిందని, ఈ విషయంపై విచారణ ఇంకా పూర్తి కాలేదనీ, త్వరలో సమస్య పరిష్కారమయ్యేలా చూఽస్తామన్నారు. -
నందిగామలో రైతు అదృశ్యం కలకలం
నందిగామ: కృష్ణా జిల్లా నందిగామ మండలం రామిరెడ్డిపల్లిలో పొలానికి వెళ్లిన రైతు కనిపించకుండా పోవటంతో కలకలం రేపింది. గ్రామానికి చెందిన తుమ్మల ప్రసాద్(38) రెండెకరాల పొలం కౌలుకు తీసుకుని పంటలు సాగు చేశాడు. వ్యవసాయానికి రోజూ తెల్లవారుజామున త్రీఫేజ్ కరెంట్ వస్తుంది. దీంతో మంగళవారం వేకువజామున ప్రసాద్ తన బైక్‌పై పొలానికి బయలుదేరాడు. పొలానికి కొద్ది దూరంలో గుర్తు తెలియని వ్యక్తులు అతడిని అటకాయించి ఎత్తుకుపోయారు. ఆ ప్రదేశంలో అతని చెప్పులు, దుప్పటి, కండువా పడి ఉన్నాయి. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు అతని జాడ కోసం గాలించినా ఫలితం లేకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, అక్కడికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరు వద్ద రైలు పట్టాలపై గుర్తు తెలియని మృతదేహం పడి ఉన్న విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. అయితే, మృతదేహం ఛిద్రమై గుర్తుపట్టే వీలు లేకుండా ఉంది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, ప్రసాద్‌ను ఎవరు తీసుకెళ్లారు అనేది తేలాల్చి ఉంది. -
ఉల్లి.. తల్లడిల్లి
- గిట్టుబాటు ధర లేక నష్టాల బాట - రైతన్నను పట్టించుకోని ప్రభుత్వం - రోడ్డున పడిన ఉల్లి రైతు ‘ఉల్లి’పంట.. ఈ సారి రైతన్న కంట కన్నీరు తెప్పిస్తోంది. గతేడాదిలాగే ఈసారి రెండు, మూడు నెలల వరకు ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర ఉన్నా..ఆ తర్వాత పతనమైంది. దీంతో రైతుల ఆశలన్నీ అడియాశలయ్యాయి. దిగుబడి వస్తుంది.. ధర దక్కుతుంది..ఈ సారి అప్పుల ఊభిలోంచి గట్టెక్కొచ్చని ఎన్నో ఆశలతో రైతులు ‘ఉల్లి’ సాగు చేస్తే.. తెగుళ్లు దిగుబడిపై ప్రభావం చూపగా, చేతికందిన పంటకూ గిట్టుబాటు ధర లేక రైతన్న తల్లడిల్లుతున్నాడు. కనీసం పెట్టుబడి కూడా చేతికి దక్కక దిక్కుతోచని స్థితిలో అల్లాడిపోతున్నాడు. రోడ్డున పడిన ఉల్లి రైతులు ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 14 వేల మందికి పైగా రైతులు 6,200 హెక్టార్ల విస్తీర్ణంలో ఉల్లి సాగు చేశారు. రాయదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, తాడిపత్రి డివిజన్లలో ఎక్కువగానూ.. మిగిలిన డివిజన్లలో అక్కడక్కడ ఈ పంట సాగు చేశారు. ఎకరా ఉల్లి పంటకు రూ.50 నుంచి రూ.60 వేలు పెట్టుబడి పెట్టారు. పంట బాగుంటే ఎకరాకు 10 టన్నులు (100 క్వింటాళ్లు) పండాలి. టన్ను కనీసం రూ.8 వేలు పలికితే ఎకరాకు రూ.15 నుంచి రూ.20 లాభం వస్తుంది. కానీ ఈ ఏడాది పరిస్థితి దారుణంగా ఉంది. వర్షాభావం..తెగుళ్ల ప్రభావం : వర్షాభావ పరిస్థితులు, భూగర్భజలాలు అడుగంటిపోవడం వల్ల పంట కాలంలో రైతులు నానా అవస్థలు పడ్డారు. ఉన్న నీటి వనరులు సద్వినియోగం చేసుకున్నారు. కానీ. మజ్జిగ తెగులు, వెర్రి తెగులు ఆశించడంతో చాలా ప్రాంతాల్లో పురుగు మందుల పిచికారీకి ఎక్కువ ఖర్చు చేశారు. అలాగే కూలీల ఖర్చు అధికంగానే పెట్టినట్లు తెలిపారు. ఎకరాకు ఆరు టన్నులు (60 క్వింటాళ్లు) కూడా దిగుబడి రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరేలే మంచి ధరలైనా పలికితే గట్టెక్కవచ్చని ఆశించిన రైతులకు పుండు మీద కారం చల్లినట్లు ధరలు పతనం కావడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. టన్ను రూ.4 నుంచి రూ.5 వేల మధ్య పలుకుతుండటం, దాన్ని కూడా కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. పెట్టిన పెట్టుబడిలో సగం కూడా చేతికి రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. పట్టించుకోని సర్కారు నాలుగైదేళ్లుగా ధర ఆశించిన స్థాయిలో ఉంటూ వచ్చింది. గతేడాది కూడా ధర బాగుంది. అయితే రెండు, మూడు నెలల నుంచి తగ్గుతూ వచ్చింది. పంటను రైతన్న విడిగా విక్రయించినా ప్యాకెట్ (40 కిలోలు) ధర ప్రస్తుతం రూ.200 నుంచి 250 వరకు పలుకుతోంది. రెండు నెలల క్రితం అదే ప్యాకెట్ ధర రూ.500 నుంచి రూ.600 వరకు పలికింది. గతేడాది అయితే ప్యాకెట్ ధర రూ.1000 వరకు పలికింది. బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి ధర అయితే రూ.10 వరకు పలుకుతుండడంతో గిట్టుబాటు కాలేదు. ఈ పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన సర్కార్ ఆ మేరకు చర్యలు తీసుకోవడం లేదు. జిల్లా మంత్రులు, అధికార పార్టీ నేతలు కానీ, మార్కెటింగ్‌శాఖ, ఉద్యానశాఖ తరఫున కూడా ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడంతో ఉల్లి రైతు లబోదిబోమంటున్నాడు. ధరలు లేనప్పుడు ప్రభుత్వమే కొనుగోలు చేస్తే కొంత వెసులుబాటు లభిస్తుందని రైతులు భావిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ సారి ఉల్లి దిగుబడి ఆశించిన స్థాయిలో రావడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు ఉద్యానశాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. సాగు విస్తీర్ణం పెరిగింది ఉల్లి సాగు విస్తీర్ణం పెరిగింది. దిగుబడి కూడా పెరిగింది. జిల్లాలో మామూలుగా 3 వేల హెక్టార్లలోపు ఉల్లి సాగయ్యేది. నాలుగైదేళ్లుగా ధరలు బాగానే ఉంటుండడంతో ఈ ఏడాది సాగు విస్తీర్ణం రెట్టింపయ్యింది. పొరుగు ఉన్న కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లోనూ అదే పరిస్థితి. ఇవి కాకుండా మహారాష్ట్ర, కర్ణాటకలో సాగు విస్తీర్ణం మరింతగా పెరిగింది. దిగుబడి కూడా బాగా రావడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. జనవరి 15 తర్వాత కానీ ఫిబ్రవరి నెలలో ధరలు పెరిగే అవకాశం ఉంది. – బీఎస్ సుబ్బరాయుడు, ఉద్యానశాఖ డీడీ -
ధర ఢమాల్.. రైతు కుదేలు
- నష్టాల బాటలో టమాట రైతులు - కూలిఖర్చులు కూడా గిట్టుబాటు కాని వైనం - పొలాల్లోనే వదిలేస్తున్న రైతులు అనంతపురం రూరల్ : మార్కెట్లో టమాట ధర ఒక్కసారిగా పడిపోయింది. ప్రస్తుతం కిలో రూ.2 మాత్రమే పలుకుతోంది. దీంతో 90రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన రైతు కంట కన్నీరు ఉబుకుతోంది. ఎకరా పంట సాగుకు రైతులు రూ.40వేలు పెట్టుబడి పెడుతున్నారు. దీనికి తోడు కూలీ, రవాణ ఖర్చులు అదనంగా రూ.15వేలు కలిపి మొత్తం రూ. 55వేలు వెచ్చిస్తున్నారు. పంట ఆశాజనకంగా ఉంటే 25టన్నుల మేర ఎకరాకు దిగుబడి వస్తుంది. ప్రస్తుతం టమాట కేజీ రూ.2 ధర పలుకుతోంది. ఈలెక్కన 25టన్నుల టమాటను రైతు అమ్మితే ఆయనకు వచ్చేది రూ.50వేలు కాగా అన్నీ పోనూ రూ.ఐదువేల నష్టం వాటిల్లుతోంది. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత రబీలో 15వేల ఎకరాల్లో రూ.83 కోట్లు వెచ్చించి బోరు బావులున్న 10వేల మంది రైతులు టమాట పంటను సాగు చేస్తున్నారు. చీడ పీడల నుంచి పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. తీరా పంటను విక్రయించుకోవడానికి మార్కెట్‌కు తీసుకువస్తే గిట్టుబాటు ధరలేక కుదేలవుతున్నారు. కనీస గిట్టుబాటు ధర కూడా లభించకపోవడంతో వ్యవసాయమే దండగా అనే పరిస్థితికి వచ్చారు. మద్దతు ధర కల్పించి రైతులకు చేదోడు వాదోడుగా ఉండాల్సిన మార్కెటింగ్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో టమాట రైతులు నిలువునా నష్టపోతున్నారు. వెంటనే అధికారులు, పాలకులు స్పందించి రైతుకు గిట్టుబాటయ్యేలా మద్దతు ధర కల్పించాలని కోరుతున్నారు. రవాణ, కూలీ ఖర్చులకే సరి .. రూ.2లక్షలు పెట్టుబడి పెట్టి నాలుగెకరాల్లో టమాట పంట సాగు చేశా. ఆశాజనకంగా దిగుబడి వచ్చింది. ప్రస్తుతం 152 టమాట బాక్సులను మార్కెట్‌కు తీసుకొచ్చా. గిట్టుబాటు ధర లేక ఒక్కో బాక్స్‌ను కేవలం రూ.30కే వదులుకోవాల్సి వచ్చింది. వచ్చిన సొమ్ము కాస్తా రవాణ ఖర్చులు కమీషన్‌కే సరిపోయింది. – నారాయణ, పిల్లలపల్లి, బ్రహ్మసముద్రం మండలం టమాటకు గిట్టుబాటు ధర కల్పించాలి టమాటకు గిట్టుబాటు ధరలేక కిలో రూ.2 నుంచి 3కే అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతం ఈ సీజన్లోనే ఎక్కువ మంది రైతులు టమాట పంట సాగు చేస్తారు. రైతుకు గిట్టుబాటు అయ్యేలా ధరను మార్కెటింగ్ శాఖ అధికారులు నిర్ణయించి టమాట రైతును ఆదుకోవాలి. –రామకృష్ణా, హంపాపురం వచ్చిన కాటికి ముకోవాల్సిందే మార్కెట్‌కు తీసుకువచ్చిన టమాట పంటను గిట్టుబాటు ధర ఉన్న లేకపోయిన పంటను మాత్రం అమ్ముకోవాల్సిందే. గిట్టుబాటు ధరలేదని వెనుక్కు తీసుకెళ్లే పరిస్థితి లేదు. – శ్రీనివాసులు, గంగంపల్లి, రామిగిరి మండలం -
పల్లె బతుకుపై నగదు పిడుగు
సమకాలీనం పెద్ద నోట్ల రద్దు ముందస్తు కసరత్తు లేకుండా చేపట్టినదనడానికి సాక్ష్యం ఎప్పటికప్పుడు మారుతున్న ప్రభుత్వ నిర్దేశనలే. డిపాజిట్లు పెరిగి డబ్బు పోగవుతున్నా నగదు ఇవ్వలేని స్థితిలో బ్యాకులున్నాయి. లావాదేవీలన్నీ నిలిచిపోయాయి. గ్రామీణ జన జీవనం కుంటు పడింది. ప్రస్తుత గండం గట్టెక్కితే ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమౌతుందని, గ్రామాలు బాగుపడ తాయని అంటున్నారు. కానీ పరిమితంగా ఉన్న రైతాంగపు బ్యాంకు ఖాతాలు, క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగం వంటివి చూస్తుంటే అది అంత తేలిక కాదనిపిస్తుంది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న చందంగా మారింది ఇప్పుడు దేశ గ్రామీణార్థిక వ్యవస్థ స్థితి. నగదు కొరత దాని నడ్డినే విరిచింది. స్థూలంగా చూస్తే తమ ప్రమేయం లేని నల్ల డబ్బును నిర్మూలించే క్రతువు గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై మెరుపులు లేని పిడుగులా విరుచుకు పడింది. నగదు కొరతైపై గగ్గోలు పెడుతున్నది సంఘటిత రంగమే అయినా, బాగా కుదేలయింది అసంఘటిత రంగం. ముఖ్యంగా వ్యవసాయం, చిన్న, కుటీర పరిశ్రమలు, చిన్న వ్యాపారాలు, చేతివృత్తులు, సేవలు తదితర రంగాలకూ చేష్టలుడిగినట్ట యింది. రెండేళ్ల వరుస కరువు తర్వాత ఈ ఏడు మంచి వర్షాలు కురిసినా కూడా రైతు కంట కన్నీరుబుకుతోంది. ఖరీఫ్ పంట అమ్మితే డబ్బుల్లేవు. రబీ పంటకు పెట్టుబడి లేదు. పాలు, పళ్లు, కూరగాయలు, కోళ్ల పెంపకం, చేపలు తదితర ఆహారోత్పత్తి రంగం అప్రకటిత సెలవుతో కకావికలమైంది. దినసరి కూలీ, ఉపాధి అవకాశాలపై నేరుగా దెబ్బపడింది. నల్ల సంపదపై పోరులో భాగంగా పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వ లక్ష్యం ఏ మేరకు నెర వేరుతుందో తెలియదు. కానీ సగటు జీవితం దుర్భరమైంది. పాత నోట్లు చెల్లకుండా, కొత్త నోట్లు అందుబాటులోకి రాక ఈ పక్షం రోజుల చేదు అను భవం వర్తమానాన్ని కష్టాల కొలిమిలో కాలుస్తోంది. భవిష్యత్తుపై మరింత ఆందోళన కలిగిస్తోంది. దేశంలో దాదాపు 60% జనాభా వ్యవసాయ, అను బంధ రంగాలపై ఆధారపడ్డారు. మనది 80%కుపైగా బ్యాంకేతర సంప్ర దాయ ఆర్థిక వ్యవస్థ కావడంతో ఈ సమస్య మరింత జటిలమైంది. నగదు కొరత సమస్యను సత్వరం పరిష్కరించకుంటే స్వల్ప, మధ్య కాలిక ఆర్థిక మాంద్యానికి దారితీసే పెను ప్రమాదం ఉన్నదని ఆర్థికవేత్తలు హెచ్చరి స్తున్నారు. ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతింటాయని, వృద్ధి మందగిస్తుందని పెట్టుబడుల సేవా సంస్థ ‘మూడీస్’ తన తాజా నివేదికలో పేర్కొంది. అదే జరిగితే, ప్రధానంగా ప్రభావితమయ్యేది మళ్లీ గ్రామీణార్థిక వ్యవస్థే అనడం నిస్సందేహం. ఈ చర్య తగు ముందస్తు కసరత్తు లేకుండా చేపట్టినదనడానికి సాక్ష్యం గురువారం రాత్రి వరకూ ఎప్పటికప్పుడు మారుతూనే ఉన్న ప్రభుత్వ నిర్దేశనలే. డిపాజిట్లు పెరిగి బ్యాంకు రికార్డుల్లో డబ్బులు పోగవుతున్నా... నగదు ఇవ్వలేని స్థితిలో అవి ఉన్నాయి. దీంతో లావాదేవీలన్నీ నిలిచిపో యాయి. మొత్తం గ్రామీణ జన జీవనమే కుంటి నడకన సాగుతోంది. కోలు కునేదెన్నడో అంతుబట్టడం లేదు. కష్టం ఒక్క తీరున లేదు ప్రపంచంలో ఏ దేశం నగదు రద్దు చర్యలు తీసుకున్నా, పకడ్బందీ ప్రత్యా మ్నాయ ఏర్పాట్లు చేసుకుంటుంది. కొత్త నోట్లు, చెల్లుబాటయ్యే నోట్లతో రద్దయిన నోట్లు మార్చుకునే సదుపాయం కల్పిస్తుంది. పైగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయాలు, గతంలోని ఆయా సందర్భాల్లో ఆర్థిక వ్యవస్థను ఇంతగా కుదపక పోవడానికి కారణం రద్దయిన నోట్ల నిష్పత్తి తక్కువగా ఉండటమే! నేడు రద్దయిన నోట్లు 85% కావడంతో ప్రభావ తీవ్రత పెరిగి, అంత మేరకు ద్రవ్య వ్యవస్థ స్తంభించినట్టయింది. గడువు తర్వాత చెల్లవనడంతో పాత నోట్లన్నీ క్రమంగా డిపాజిట్ అవుతున్నాయి. పలు పరిమితుల నడుమ పాత, కొత్త నోట్లు మార్చుకునే సదుపాయం కల్పించినా అది పెద్దగా అవసరాలు తీర్చ లేదు. కొత్త, చెల్లుబాటయ్యే నోట్లు బ్యాంకుల్లోకి రాలేదు. దాంతో తెరిచిన ఒకటి, రెండు గంటల్లోనే డబ్బు లేదని బ్యాంకులు, ఏటీఎమ్‌లు చేతులెత్తు తున్నాయి. జరుగుబాటుకు డబ్బు దొరక్క జనం... పేద, ఎగువ, దిగువ మధ్య తరగతి వారంతా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మొదట్లో ప్రధాని, ఆర్థిక మంత్రి చెప్పినట్టు రెండు, మూడు రోజులో, వారమో ఉంటుం దనుకున్న ఈ సమస్య పక్షం రోజులైనా తగ్గలేదు. పైగా ముదురుతోంది. ఖర్చులు బాగా తగ్గించుకొని పౌరులు సంపూర్ణ సహకారం అందిస్తున్నా... నగదు తరిగిపోతుండటంతో దినసరి వ్యవహారాలను రద్దు చేసుకోవాల్సి వస్తోంది. వ్యాపారాలు, వ్యాపకాలు, అమ్మకాలు, కొనుగోళ్లు అన్నీ నిలిచి పోయాయి. ఈ మేర ఉత్పత్తి రంగంపైన, ముఖ్యంగా నిలువ ఉండని పాలు, పూలు, కూరగాయలు, పండ్లు వంటి వ్యవసాయోత్పత్తుల విక్రయాలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఇతర ఉత్పత్తులదీ ఇదే గతి! ఉపాధి అవకాశాలూ దెబ్బతింటున్నాయి. దేశవ్యాప్తంగా ప్రత్యక్షంగా కొన్ని లక్షలల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచి వర్షాలు కురిసినా... సమయానికి ఎరువులు, విత్తనాలు కొనేందుకో, కూలీ లకిచ్చేందుకో చేతిలో డబ్బుల్లేక నానా పాట్లు పడుతున్నారు. ప్రయివేటు, ప్రభుత్వ ఉద్యోగులకూ కష్టంగానే ఉంది. ఐదారు రోజుల్లో డిసెంబరు వస్తుంది. నెల మొదలైన తొలి వారంలో ఉండే అవసరాలకు నగదెట్ల? అంతు బట్టకుండా ఉంది. నల్లడబ్బును నలిపేసే సంగతి సరే, మా డబ్బు మేం తీసు కోలేని ఈ దురవస్థ ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారాన్నంతటినీ వ్యవస్థీకృత, చట్టబద్ధ లూటీగా మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ గురువారం రాజ్యసభలో అభివర్ణించారు. ‘బ్యాంకులో దాచుకున్న తమ డబ్బును ఖాతా దారులే పొందలేని దుస్థితి, ఇప్పుడిక్కడ తప్ప... ప్రపంచంలో ఏ దేశంలోనూ ఉండదు’ అన్నారు. ఈ పులి మీద స్వారీ....కడదాకా సాగేనా? గమ్యం మాత్రమే కాదు, అందుకు నిర్ణయించుకున్న మార్గమూ అంతే ముఖ్యమని గాంధీజీ ఊరకే అనలేదు. కుటుంబ నియంత్రణను అందరూ సమర్థిస్తారు. కానీ, ఎమర్జెన్సీ కాలంలో దాన్ని అమలుపరచిన తీరు పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నేటి ‘నల్ల ధనంపై పోరు’ను అమలుచేస్తున్న తీరు కూడా అలాంటిదే! ప్రజల కష్టాలు చూసి దీన్ని విమర్శించిన వారిపై మొదట్లో ఒంటి కాలిపై లేచిన ‘అధికారిక దేశభక్తులు’ సైతం సామాజిక మాధ్యమాల నుంచి మెల్లగా తోక ముడుస్తున్నారు. నిర్వహణ వైఫల్యాల వేడి తమకూ తాకేసరికి కాస్త మెత్తబడ్డారు. ఫేస్బుక్, వాట్సాప్‌లలో నోట్ల రద్దు అనుకూల పోస్టింగ్‌లు తగ్గాయి. ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక చర్యలు తీసుకోవాలనే డిమాండు విపక్షాల నుంచి, పౌర సమాజం నుంచి పెరుగుతోంది. నగదు అందుబాటు ప్రక్రియను వేగవంతం చేసి, తక్షణమే నగదు కొరతను తీర్చ కపోతే అన్ని రంగాల్లో అశాంతికి దారి తీస్తుందని ఆర్థిక నిపుణులంటున్నారు. ఫలితం, ఆర్థిక వ్యవస్థ మందగించడమే కాదు, దీర్ఘకాలికంగా ఇది దేశ ఆర్థిక, రాజకీయ భవితవ్యాన్నే శాసిస్తుంది. బీజేపీ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధాని చేసిన ప్రసంగాన్ని బట్టి దేశంలో నల్లసంపదను తొలగించే సుదీర్ఘ ప్రక్రియలో పెద్ద నోట్ల రద్దు ఆరంభం మాత్రమే! గొలుసు కట్టు చర్యలుంటాయని సంకేలించారు. ప్రస్తుతానికి బంగారం క్రయ, విక్రయాలపై నిఘా, హవాలా నియంత్రణ, బినామీ ఆస్తులు, రియల్ ఎస్టేట్ల అదుపు, సమగ్ర పన్ను వసూళ్లు, అధికార అవినీతి నిర్మూలన. రాజకీయ-ఎన్నికల సంస్కరణల అమలు ఈ క్రమంలో రావాల్సిన తదుపరి చర్యలు. నల్లధనంపై తమ చర్యలకు 90% ప్రజల మద్దతుందని ప్రధాని పేర్కొనడంపై బయటి వారి సంగతెలా ఉన్నా, స్వపక్షీయులే కొందరు సందేహాలు వ్యక్తం చేస్తు న్నారు. ప్రధాని ‘యాప్’కు వచ్చిన ప్రజాభిప్రాయాన్ని ఆయన కార్యాలయం ఎలాగైనా చెప్పుకోవచ్చన్నది ఈ సందేహం వెనుక సహేతుకత! ‘80% తాగు బోతులున్న రాష్ట్రంలోనూ, తాగుడు గురించి జనాభిప్రాయ సేకరణ చేయండి, తాగడం మంచిది కాదనే అభిప్రాయమే వస్తుంది’ అని ఓ సామాజిక విశ్లేషకుడు చెప్పిన మాట ఇందుకు సరిపోతుంది. ఎమర్జెన్సీ కాలంలోనూ ప్రభుత్వం సరైన నిర్ణయమే తీసుకుందని అత్యధిక దేశ ప్రజలు అభిప్రాయ పడుతున్నట్టు నాటి ప్రధాని ఇందిరా గాంధీకి అధికారిక సర్వేలు అందాయి. నల్ల డబ్బును లేకుండా చేస్తామంటే ఎవరూ వ్యతిరేకించరు. కానీ ఆ అంశంపై తీసుకున్న విధాన నిర్ణయం అమలులోని నిర్వహణా లోపాలు, వైఫల్యాలు పౌరులను సుదీర్ఘంగా కష్టపెడితే వారు సహించరనేది చరిత్ర చెప్పిన సత్యం. వారి అభిప్రాయం అందుకు సరిగ్గా వ్యతిరేకంగా మారే ఆస్కారం ఉంటుంది. అదే జరిగితే, ఈ సమస్య ఆర్థిక వ్యవస్థకు విఘాతం కలిగించి, వృద్ధి రేటును మందగిపజేయడంతోనే ఆగదు. ఏడాదిలో జరగాల్సి ఉన్న ఐదు రాష్ట్రాల ఎన్ని కల్లో పాలకపక్షం ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుంది. అది నల్ల సంపదపై యుద్ధానికి భవిష్యత్తులో తలపెట్టనున్నామంటున్న ఆరంచెల సంస్కరణల అమలూ ఎన్డీఏ ప్రభుత్వానికి కష్టమౌతుంది. నిబద్ధత చూపకుంటే... ఆచరణపై అనుమానాలు ప్రస్తుత గండం గట్టెక్కితే ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమౌతుందని, వడ్డీరేట్లు- ద్రవ్యోల్బణం తగ్గి గ్రామాలు బాగుపడతాయని ప్రభుత్వం చెబుతోంది. గ్రామీణ బ్యాంకింగ్ వ్యవస్థ, రైతాంగపు పరిమితమైన బ్యాంకు ఖాతాలు, క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగం, నగదు రహిత బ్యాంకింగ్ వ్యవహారాలు సాగించే కుటుంబాల నిష్పత్తి... ఇవన్నీ చూస్తుంటే లక్ష్య సాధన అంత తేలిక కాదనిపిస్తుంది. ఆర్థిక సంస్కరణలను చిత్తశుద్ధితో అమలు చేపట్టినా మార్పు లకు సమయం పడుతుంది. నగదు రహిత బ్యాంకింగ్ పద్ధతుల్ని ప్రోత్స హించడాన్ని ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడే ప్రారంభించాయి. ‘మీరు రక్తం చిందించండి, నేను మీకు స్వాతంత్య్రం సాధించిపెడ్తాను’ అని సుభాష్ చంద్రబోస్ అన్నట్టు... ‘50 రోజులు కష్టాలు భరించండి, మీకు అవినీతి రహిత భారత్‌ను అందిస్తాను’ అని ప్రధాని అన్నారు. దీంతో ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అంచనాలు బాగా పెరిగాయి. కానీ, జరుగుతున్న పరిణామాలు కొత్త సందేహాలను రేకెత్తిస్తున్నాయి. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో, నగదు మార్పిళ్లలో జరుగుతున్న అవకతవకలే అందుకు నిదర్శనం. ఆర్బీఐ నుంచి బ్యాంకుల దాకా చాలా తప్పుడు వ్యవహారాలు నిరాటంకంగా సాగుతు న్నాయి. కోట్ల రూపాయల కొత్త నోట్లు దారి మళ్లుతున్నాయి. లైన్లలో గంటలు, రోజుల తరబడి నిరీక్షించిన వారిని ‘నో క్యాష్’ బోర్డులు వెక్కిరి స్తున్నాయి. పలుకుబడి కలిగిన, కమిషన్ శాతాలు చెల్లించగలిగిన వారి నోట్ల కట్టలే అక్రమంగా మారుతున్నాయి. అక్కడక్కడ కేసులు కూడా నమోదవు తున్నాయి. 10, 20, 30 శాతం కమీషన్‌తో పాత-కొత్త నోట్ల మార్పిళ్ల మార్కెట్ రహస్యంగా సాగుతూనే ఉంది. వీటిని అడ్డుకొని కొత్త విశ్వాసాన్ని కలిగించాలి. ప్రభుత్వం కుహనా ప్రతిష్టకు పాకులాడక విపక్షాల విమర్శల్ని నిర్మాణాత్మక సూచనలుగా తీసు కోవాలి. ఈ పరిణామాలపై లోతుగా దర్యాప్తు జరిపించాలి. లోపాలు సరిదిద్ది పౌరుల కష్టాలు తొలగించడానికి, భవిష్యత్ విధానాల రూపకల్పనకు నేతలు, నిపుణులు, మేధావులతో కమిటీ వేయాలి. చిత్తశుద్ధితో కృషి చేసి, ప్రజల కొనుగోలు శక్తిని పెంచాలే తప్ప, పొదుపు ముసుగు కప్పి నిర్బంధపు వ్యయ పరిమితులు విధించడం సరికాదు. ఇదే ప్రజల ‘వ్యయ సంస్కృతి మార్పు’ అని గప్పాలు కొట్టడం సమంజసం కాదు. బాపూజీ అన్నట్టు ‘భారతదేశం గ్రామాల్లో ఉన్నద’ని గ్రహించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బతికించాలే తప్ప చంపరాదు. దిలీప్ రెడ్డి ఈమెయిల్: dileepreddy@sakshi.com -
రైతు సమస్యలు పరిష్కరించాలి
మండ్య: బెళగావిలో సోమవారం నుంచి ప్రారంభమైన శీతాకాల సమావేశాల్లో రుణమాఫీ, పంటనష్ట పరిహారం తదితర రైతు సమస్యలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం వివిధ రైతుపోరాట సంఘాల కార్యకర్తలు పట్టణంలోని జయచామరాజేంద్ర ఒడయార్ సర్కిల్లో నిరసనలు తెలిపారు. రుణమాఫీ, పంటనష్ట పరిహారంతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని డిమాండ్ చేసారు. రాష్ట్రంలో నెలకొన్న అతివృష్టి, అనావృష్టి కారణంగా జరిగిన పంట నష్టానికి పరిహారంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.4,656కోట్ల నిధులను కోరినట్లుగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. కేంద్ర ప్రభుత్వం నుండి కేవలం రూ.4,656కోట్ల పంటనష్ట పరిహాన్ని కోరి రూ.11,344కోట్ల నష్టాన్ని రాష్ట్ర రైతులే భరించాలన్నట్లు ముఖ్యమంత్రి వ్యవహారశైలిగా ఉందన్నారు. -
8 ఎకరాలు..20 కిలోలు!
సీఎం చంద్రబాబు రక్షకతడులు ఇచ్చిన పొలంలో దిగుబడి ఇది పెట్టుబడి రాక అప్పులపాలైన వేరుశనగ రైతు శివన్న తొలకరి వర్షాలతో రైతుల్లో ఆశలు రేకెత్తించిన ఖరీప్ పంట కాలం... విత్తు తర్వాత చినుకు నేలకు రాలకపోవడంతో అన్నదాతలను కోలుకోలేని దెబ్బతీసింది. అప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయి.. నానా కష్టాలు పడుతున్న రైతులను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి విషమించే వరకూ మీనమేషాలు లెక్కిస్తూ వచ్చింది. పంట ఎండిపోతుండగా అంటే రెండున్నర నెలల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు హఠాత్తుగా తెరపైకి వచ్చారు. జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తన దృష్టికి తీసురాలేదని తప్పంతా అధికారులపై నెట్టేశారు. నాలుగు రోజుల పాటు ఇక్కడే ఉంటూ ఏ ఒక్క ఎకరా పొలం కూడా ఎండిపోనివ్వబోనని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే రెయిన్గన్లతో రక్షకతడులు అంటూ హడావుడి చేశారు. సాక్షాత్తు సీఎం చంద్రబాబునే వచ్చి తన పొలంలో రక్షక తడులు ప్రారంభించడంతో ఆ బడుగు రైతు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక తన పంట పండుతుందని, ఇంటిల్లిపాదీ సుఖసంతోషాలతో బతకవచ్చునని ఆశించాడు. పంట దిగుబడి వచ్చిన తర్వాత చూస్తే... బతుకు బజారు పాలైంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో అమడగూరు మండలం గుండువారిపల్లికి చెందిన రైతు శివన్న తనకున్న ఎనిమిది ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేపట్టారు. పంట పెట్టుబడి కింద రూ.1.20 లక్షలు అప్పు చేశారు. వర్షాభావ పరిస్థితులతో పంట ఎండు ముఖం పట్టింది. ఈ నేపథ్యంలోనే రెండున్నర నెలల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అమడగూరులో పర్యటించి శివన్న పొలంలో రెయిన్గన్లతో రక్షక తడుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆర్భాటానికే పరిమితమైన తడులు ముఖ్యమంత్రి మెప్పు పొందడం కోసం అధికార పార్టీ నాయకులు, అధికారులు ఆడిన చదరంగంలో శివన్న ఓ పావుగా మిగిలాడు. ప్రారంభోత్సవ సమయంలో ఇచ్చిన తడితో పంట మొత్తం జీవం పోసుకుంటుంది. ఇక పంట పండుతుంది అని నమ్మించారు. ఆ తర్వాత మరొక్క తడిని ఇవ్వలేకపోయారు. పంట మొత్తం ఎండిపోయింది. ట్రాక్టర్‌తో ఎనిమిది ఎకరాల పొలంలో వేరుశనగ పంట తొలగిస్తే... 20 కిలోల కాయలు మాత్రమే వచ్చాయి! స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే పర్యటించి రక్షకతడులు ప్రారంభించిన పొలం రైతు పరిస్థితే ఇలా ఉంటే మరి మిగిలిన రైతుల బతుకులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. కుటుంబాన్ని పస్తులు ఉంచలేక.. ఎనిమిది ఎకరాల్లో పంట సాగుకు అయిన రూ.1.20 లక్షల అప్పు ఎలా తీర్చాలో అర్థం కాక మదన పడుతున్న శివన్న.. మరో కొత్త సమస్య మరింత చిక్కుల్లో నెట్టేసింది. కరువు నేపథ్యంలో జీవనోపాధులు కరువవ్వడంతో భార్య, కుమారుడు, కోడలు, ఇద్దరు మనవరాళ్లు అర్ధాకలితో అలమటించాల్సి వచ్చింది. విషయాన్ని గుర్తించిన శివన్న... తనకు తెలిసిన వారి నుంచి ఆర్థిక సాయాన్ని పొంది గ్రామాల్లో తిరుగుతూ బురకల (స్నాక్స్) వ్యాపారం చేపట్టాడు. మండలంలోని గ్రామీణ ప్రాంతాలతో పాటు కర్ణాటకలోని బాగేపల్లి, గూళ్లురు, బిళ్లూరు, చేళూరు తదితర ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి బురకలు అమ్ముకుని వస్తున్నాడు. ఈ వ్యాపారం ద్వారా వచ్చిన సొమ్ముతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. నమ్మి ఓటేస్తే నట్టేట ముంచారు బుధవారం అమడగూరులో బురకలు అమ్ముకుంటున్న శివన్నను సాక్షి పలకరించగా.. ఏం చెప్పమంటావులే అంటూ, తన గోడును వెళ్లబోసుకుని, కన్నీటి పర్యంతమయ్యాడు. 2014లో ఎన్నికలకు ముందు రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు మాటలు నమ్మి కుటుంబ సభ్యులంతా టీడీపీకి ఓట్లేసినట్లు తెలిపారు. బ్యాంక్‌లో తనకున్న రూ. 54 వేల అప్పు మాఫీ కాలేదని, 70 ఏళ్ల వయసు మీద పడుతున్నా పింఛన్ కూడా అందడం లేదని వాపోయాడు. ప్రస్తుతం ఇంటిల్లిపాదీ కూలికెళ్తే గానీ పూటగడవని పరిస్థితి దాపురించిందన్నాడు. ఈ ఏడాది ఆగస్టు 28న సీఎం చంద్రబాబు తన పొలానికి వచ్చి రక్షకతడులు ఇచ్చాడని, తన పంట పండిస్తాడులే అనుకుంటే ఇలా బజారుపాలు చేస్తాడనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచారుని వాపోయాడు. -
సీఆర్డీఏ ఆఫీసు వద్ద రైతు ఆత్మహత్యాయత్నం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం తుళ్లురు సీఆర్డీఏ కార్యాలయం ఎదుట గురువారం ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పెట్రోలు పోసుకుని రాంబాబు అనే రైతు ఆత్మహత్యాయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఏపీ రాజధాని నిర్మిస్తే తుళ్లురు ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పి తమ వద్ద నుంచి భూములను లాక్కున్నారని రైతు రాంబాబు వాపోయాడు. రాజధానికి 47 సెంట్లు భూమిస్తే.. ఇప్పుడేమో 44 సెంట్ల కౌలు ఇస్తామంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఏడాది నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని, దాంతో విసిగిపోయి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్టు రైతు రాంబాబు వాపోయాడు. -
నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్న కేసీఆర్
బిజినేపల్లి: రాష్ట్రంలో కరువుతో రైతన్న అల్లాడుతుంటే సీఎం కేసీఆర్ నీరో చక్రవర్తిలా పిడేలు వాయిస్తూ అంబారీపై ఊరేగుతున్నారని బీజేపీ సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డి విమర్శించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో గురువారం ఆయన పర్యటించారు. బిజినేపల్లి మండలంలోని వట్టెం, శాయిన్‌పల్లి, బిజినేపల్లి గ్రామాల్లో ఎండిన మొక్కజొన్న, పత్తి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... రెండున్నర ఏళ్లలో కేఎల్ఐ ప్రాజెక్టుపై శ్రద్ధ పెట్టకపోవడంతో సాగునీరందక ఈ ప్రాంతంలో ప్రజలు కరువుతో అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగాన్ని ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వెంటనే రెండవ లిప్టు ద్వారా నీరు తెచ్చి ఈ ప్రాంతంలోని చెరువులు, కుంటల్ని నింపి రైతులను ఆదుకోవాలని నాగం డిమాండ్ చేశారు. -
ధర దగా
మార్కెట్లో సిండికేట్ మాయ దగాపడుతున్న టమాటా రైతన్న పట్టించుకోని మార్కెటింగ్‌శాఖ అధికారులు జూలై 22వ 15 కేజీలున్న టమాటాల బాక్సు ధర రూ.300. అయితే ప్రస్తుతం రూ.30కు చేరింది. ...మార్కెట్లో మాత్రం కేజీ తక్కువలో తక్కువగా కిలో రూ.5 పలుకుతోంది. మరీ రైతన్న పరిస్థితి ఇలా ఎందుకు మారిందంటే..దళారీ దందా ఎక్కువైంది. రైతు శ్రమను, కష్టాన్ని దళారులు దోచుకుంటుంటే పట్టించుకోవాల్సిన మార్కెటింగ్ శాఖ ప్రేక్షకపాత్ర వహిస్తోంది. అందువల్లే కడుపుమండిన రైతన్నలు దళారులకు పంటను తెగనమ్మలేక పారబోసి పోతున్నారు. రవాణా ఖర్చులు, కమీషన్‌కు సరిపోయింది రూ.లక్ష ఖర్చు చేసి 3 ఎకరాల్లో టమోటా పంట సాగు చేశాం. ఆశాజనకంగా దిగుబడి వచ్చింది. 152 టమాట బాక్సులను మార్కెట్‌కు తీసుకువస్తే ఒక్కో బాక్సును కేవలం రూ.30 పలికింది. వచ్చిన సొమ్ము వ్యాపారి కమీషన్, రవాణా ఖర్చులకే సరిపోతోంది. – జయచంద్రారెడ్డి, అమ్మవారిపల్లి, పెనుకొండ అనంతపురం రూరల్ : కరువుకు చిరునామాగా మారిన జిల్లా...భూగర్భజలాలు అంతంత మాత్రం. అందువల్లే రైతన్నలుlప్రకృతిని ఎదురించి పంటలసాగుకు సిద్ధమవుతున్నారు. ఉన్న కాస్త నీటిని వాడుకుని టామాటా పండిస్తున్నారు. ఆరుగాలం శ్రమించి..అపురూపంగా చూసుకున్న పంట చేతికొచ్చాక దళారులు గద్దల్లా తన్నుకుపోతున్నారు. అడ్డగోలుగా ధరలు నిర్ణయించి రైతన్నలను నిలువునా మోసం చేస్తున్నారు. మండీ మాయ ఒక్కోసారి ధర అమాంతం పెరుగుతుంది.. అప్పుడు పంట దిగుబడి ఉండదు. ఎక్కడ చూసినా ఆశించిన స్థాయిలో పంట దిగుబడి ఉంటుంది.. అప్పుడు ధర ఠా..రెత్తిస్తుంది. రైతన్నను ధర ఉన్నా.. లేకున్నా నిత్యం దళారులు ముప్పేట ముంచేది మాత్రం మార్కెట్. మండీ నిర్వాహకులు, మార్కెట్ వ్యాపారులు సిండికేట్‌గా మారడమే దీనంతటికీ కారణం. ‘మార్కెట్ ’ మాయాజాలంలో అన్నదాత నిలువెల్లా మోసపోతున్నాడు. టమాటా మార్కెట్లో వ్యాపారులు, మండీ నిర్వాహకులు సిండికేట్‌గా మారి తక్కువ ధరకే వేలం నిర్వహించి, రైతులను దగా చేస్తున్నారు. వ్యాపారులు నిర్దేశించిన ధరకు కొందరు రైతులు సరుకును వదులుకోవడం ఇష్టంలేక.. ఇంటికి తీసుకెళ్లలేక ..వచ్చిన నష్టం ఎట్టా వచ్చిందని నేలపాలు చేస్తున్నారు. వారు నిర్ణయించిందే ధర జిల్లా వ్యాప్తంగా దాదాపు ప్రస్తుత సీజన్లో 80 వేల ఎకరాలకు పైగా టమాటా పంటను రైతులు సాగు చేశారు. ఆశించిన మేర పంట దిగుబడి వచ్చినా.. రైతులకు ప్రయోజనం లేకుండా పోయింది. సుదూర ప్రాంతాల నుంచి సరుకును మార్కెట్‌కు తరలిస్తే గిట్టుబాటు ధరలేక కనీసం రవాణా ఖర్చులు కూడా రావడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌కు తీసుకొచ్చిన సరుకును రైతులు వెనక్కు తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొనడంతో వ్యాపారులదే దోపిడీ సాగుతోంది. గిట్టుబాటు ధర ఉన్నా..లేకపోయినా వ్యాపారులు నిర్ణయించిన ధరకే సరుకును వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సీజన్లో ప్రతి రోజూ అనంతపురంలోని కక్కలపల్లి సమీపంలో ఉన్న టమాటా మార్కెట్‌కు దాదాపు 400 టన్నుల మేర టమోటా వస్తుంది. పట్టించు కోని మార్కెటింగ్ శాఖ అధికారులు : ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు మార్కెట్‌కు వస్తే ఇక్కడా రైతన్న దగా పడాల్సివస్తోంది. పండించిన పంటను గిట్టుబాటు ధరతో అమ్ముకోలేకపోతున్నారు. టమాటా మార్కెట్లో ఇంత జరుగుతున్నా మార్కెటింగ్‌శాఖ అధికారులు పట్టించుకోవడం మరిచారు. మద్దతు ధర కల్పించి, రైతున్నను ఆదుకోవాల్సిన అధికారులు కనీసం మార్కెట్లో జరుగుతున్న వేలం పాటను సైతం పరిశీలించిన దాఖలాలు లేవు. దీంతో వ్యాపారులు మరో అడుగు ముందుకేసి ఇష్టానుసారం వేలం పాట నిర్వíß స్తూ రైతులను నిలువునా ముంచేస్తున్నారు. గిట్టుబాటు ధర కల్పించాలి టమాటా మార్కెట్లో సిండికేట్ వ్యాపారం సాగుతోంది. వారు నిర్దేశించిన ధరకు పంటను వదులుకోవాల్సి వస్తోంది. పంటలకు గిట్టుబాటు ధర కల్పించి మార్కెట్లో జరుగుతున్న దోపిడీని అరికట్టి టమాటా మార్కెట్‌ను అధికారుల పర్యవేక్షణలో ఉండే విధంగా చర్యలు చేపట్టాలి. – గంగాధర్ కురాకులపల్లి, కంబదూరు మండలం -
గ్యాంగ్ రేప్ బాధితురాలిని పెళ్లాడిన రైతు
చండీగఢ్: సామూహిక అత్యాచారాలు, పరువు హత్యలు, లింగ నిష్పత్తిలో భారీ వ్యత్యాసం వంటి ప్రతికూల అంశాలతో వార్తల్లో ఉండే హర్యానాలో ఓ సానుకూల కథనం వెలుగు చూసింది. జింద్ జిల్లాకు చెందిన యువరైతు ఒకరు గ్యాంగ్ రేప్ బాధితురాలికి కొత్త జీవితం ఇచ్చాడు. ఆమెను పెళ్లి చేసుకోవడమే కాకుండా న్యాయపోరాటానికి దన్నుగా నిలిచాడు. లాయర్ కావాలన్న ఆమె ఆకాంక్షను నెరవేర్చేందుకు తనవంతు మద్దతు అందించాడు. జింద్ జిల్లాలోని ఛాతర్ గ్రామానికి చెందిన జితేందర్(29) గతేడాది డిసెంబర్ 4న సామూహిక అత్యాచార బాధితురాలిని పెళ్లాడాడు. తన భార్య చేస్తున్న న్యాయపోరాటానికి అండగా నిలిచాడు. తన భార్యపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుల్లో తప్పించుకుని తిరుగుతున్న ఒక దుండగుడి అరెస్ట్ కోసం సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ జోక్యం చేసుకోవాలని అతడు కోరుతున్నాడు. తన భార్యకు నైతిక మద్దతు అందిస్తూనే ఆమె చదువుకోవడానికి సాయమందిస్తున్నాడు. 'నా భార్య న్యాయవిద్య చదవాలనుకుంటోంది. లాయర్ కావాలన్నది తన లక్ష్యం. అత్యాచార బాధితులకు అండగా నిలవాలనుకుంటోంది. లైంగిక వేధింపుల బాధితుల తరపున పోరాటానికి ఇప్పటికే యూత్ ఎగెనెస్ట్ రేప్ అనే సంస్థను ఏర్పాటు చేశామ'ని జితేందర్ తెలిపాడు. తన భర్త అందిస్తున్న సహాయంతో తన లక్ష్యాలను సాధించగలనన్న విశ్వాసాన్ని జితేందర్ భార్య వ్యక్తం చేసింది. అత్యాచార బాధితురాలిని పెళ్లి చేసుకోవడమే కాకుండా ఆమె లక్ష్యాలకు అండదండలు అందిస్తున్న జితేందర్ ను ఆదర్శప్రాయుడిగా జనమంతా కొనియాడుతున్నారు. -
రుణమాఫీ చేయాలని..
తాండూరు: రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఓ రైతు బ్యాంకు భవనం పై నుంచి దూకి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. సకాలంలో స్పందించిన తోటివారు చివరి క్షణాల్లో అతన్ని కాపాడటంతో ప్రమాదం తప్పింది. రంగారెడ్డి జిల్లా తాండూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రుణమాఫీ చేయాలని మండల కేంద్రంలో రైతులు నిర్వహించిన రాస్తారోకోతో భారీగా ట్రాఫిక్ నలిచిపోయింది. -
బంద్ ప్రశాంతం
-
బంద్ ప్రశాంతం
* సీఎం కేసీఆర్ తీరుపై నిరసన * హోరెత్తిన నినాదాలు * సుమారు 5వేల మంది అరెస్టు సాక్షి, సిటీబ్యూరో: రైతు సమస్యల పరిష్కారం కోరుతూ కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ, వైఎస్ఆర్ సీపీ, వామపక్షాలు, వివిధప్రజా సంఘాల ఆధ్వర్యంలో శనివారం నగరంలో నిర్వహించిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. పోలీసుల సాయంతో ఆర్టీసీ బస్సులు నడిచాయి. షాపులు, వ్యాపార కేంద్రాలు, పెట్రోల్ బంకులు ఉదయం కొంతసేపు మూసివేశారు. ఆ తరువాత యధావిధిగా తెరచుకున్నాయి. ఒకటి, రెండు మినహా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. ఉదయం నుంచే బస్ డిపోలు, బస్ స్టేషన్లకు చేరుకున్న విపక్షాల నేతలు సీఎం కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిర సన వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్లు, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, ముషీరాబాద్, తదితర ప్రాంతాలు నినాదాలతో హోరెత్తాయి. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో విరసం నేత వరవరరావు, సీపీఎం కార్యదర్శి తమ్మినేని, అరుణోదయ విమల, పీవోడబ్ల్యూ నేత సంధ్య, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నేత గోవర్ధన్ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పలుమార్లు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జేబీస్, ఎంజీబీఎస్‌లలో అఖిలపక్ష నాయకుల అరెస్టుల పర్వం కొనసాగింది. సుమారు 5వేల మంది నేతలు, కార్యకర్తలు అరెస్టయ్యారు. 80 శాతం తిరిగిన బస్సులు.. ఉదయం ఒకటి, రెండు గంటల అంతరాయం మినహా నగరంలోని అన్ని డిపోల నుంచి శనివారం 80 శాతం వరకు బస్సులు రోడ్డెక్కినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. అవసరమైన చోట పోలీసుల సాయంతో నడిపినట్లు పేర్కొన్నారు. వివిధ చోట్ల ఆందోళనకారులు 4 బస్సుల అద్దాలు పగులగొట్టారు. ఆటోలు యధావిధిగా నడిచాయి. -
పెద్దేరులో రైతు గల్లంతు
లభ్యం కానీ ఆచూకీ చోడవరం : పెద్దేరులో ప్రమాదవశాత్తూ పడి భోగాపురంనకు చెందిన రైతు రాపేట గణేష్(33) గల్లంతయ్యారు. తన పొలం సమీపంలో ఉన్న పెద్దేరులో స్నానం చేసేందుకు బుధవారం దిగిన కొద్ది సేపటికే ఆయన కనిపించకపోవడంతో భోగాపురంలో తీవ్ర విషాదం అలముకుంది. చోడవరం మండలం భోగాపురంనకు చెందిన రైతుల పొలాలన్నీ శారదా నది అవతల, పెద్దేరు నదికి ఆనుకొని ఉన్నాయి. మూడు నదులు ఇదే గ్రామం వద్ద శారదాలో కలుస్తాయి. ఇక్కడే ఉన్న తన పొలంలో రోజూ లాగే బుధవారం ఉదయం గణేష్ వెళ్లారు. అక్కడ కాలకృత్యాలు తీర్చుకొని స్నానానికి నదిలోకి దిగగా.. అప్పటికే నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ప్రమాదవశాత్తు కొట్టుకుపోయాడు. ఇది గమనించిన తోటి రైతులు వెంటనే వెతికే ప్రయత్నం చేసినా.. ఫలితం లేకపోవడంతో చోడవరం అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి.. పొద్దుపోయే వరకు ఇటు పెద్దేరు, అటు దిగువన ఉన్న శారదా నదుల్లో విస్తృతంగా గాలింపు చేపట్టారు. అయినా ఆచూకీ లభ్యంకాలేదు. విషయం తెలుసుకున్న తహశీల్దార్ రామునాయుడు, ఎస్ఐ రమణయ్య ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. గణేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త గల్లంతయ్యాడన్న విషయం తెలుసుకొని భార్య,పిల్లలు, బంధువులు బోరున విలపించారు. గ్రామమంతా శోకసంద్రమైంది. గుర్తు తెలియని బాలిక గల్లంతు బుచ్చెయ్యపేట : మేజర్ పంచాయతీ వడ్డాది వద్ద పెద్దేరులో కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన ఎనిమిదేళ్ల గుర్తు తెలియని బాలిక నీటి ఉధృతికి కొట్టుకుపోయింది. చెత్తకాగితాలు ఎరుకుంటూ జీవనం సాగిస్తున్న ఆమె కుటుంబ సభ్యులు ఇటీవల వడ్డాది వచ్చారు. పగలు ఇక్కడ కాగితాలు ఎరుకుంటూ.. రాత్రి సంతబయల్లో తలదాచుకుంటున్నట్లు సమాచారం. దీనిపై పోలీసులకు సమాచారం అందలేదు. -
రైతులకు పింఛన్ అందించాలి: వైఎస్ఆర్ సీపీ
ఆదిలాబాద్ అర్బన్ : రైతు సమస్యల పరిష్కారానికి వైఎస్సార్ సీపీ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టింది. సమస్యలు పరిష్కరించాలని, కరువు మండలాలను ప్రకటించాలని, ఆత్మహత్య చేసుకున్నరైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా రూ.5 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేసింది. అనంతరం కలెక్టరేట్‌లోకి వెళ్లి ఏవో రాజేశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బి.అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. కరువు మండలాలు ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని, రైతులకు ఒకేసారి రుణమాఫీ చేయాలని, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా తక్షణమే అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కరువుతో ఇబ్బుందులు పడుతున్న రైతులకు రూ.5 వేల చొప్పున పింఛన్ అందించాలని, పశువులకు పశుగ్రాసాన్ని, పాడి పశువులకు దానాను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర రూ.6 వేలు ప్రకటించాలన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రైతుల కళ్లలో ఆనందం చూడాలనుకున్నారని, రైతు సంతోషంగా ఉంటేనే దేశం ఆనందంగా ఉంటుందనే వారని, కానీ ఈ ప్రభుత్వాలు రైతులను పట్టించుకున్నా పాపన పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎం.గంగన్న, ఆదిలాబాద్ పట్టణ అధ్యక్షుడు సలావుద్దీన్, తదితరులు పాల్గొన్నారు. -
వాటర్‌గ్రిడ్ అవసరం లేదు..
రైతు మహాధర్నాలో భట్టి విక్రమార్క నిజామాబాద్ సిటీ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వాటర్ గ్రిడ్ పథకం అవసరం లేదని, ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు పూర్తి చేస్తే చాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క అన్నారు. నిజామాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ కిసాన్ కేత్ మజ్దూర్ ఆధ్వర్యంలో బుధవారం రైతు మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో ఆయన రైతులనుద్దేశించి మాట్లాడారు. తెలంగాణలోని ఆరు జిల్లాలో సాగు, తాగునీటి కోసం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభించిందన్నారు. సీఎం కేసీఆర్ కుమారుడు, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్.. పైపుల కంపెనీల వారితో లాలూచీపడి డిజైన్ మార్చారని ధ్వజమెత్తారు. ప్రాణహిత-చేవెళ్ల పథకం డిజైన్ మార్చితే.. పథకం పనులను కచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. తుమ్మిడిహెట్టి వద్దకు వెళ్లి అక్కడి నుంచి ప్రాణహిత డిజైన్ మార్పు, అందులోని అవకతవకలపై రాష్ట్ర ప్రజలకు వివరిస్తామన్నారు. ఇప్పటికే ప్రాణహిత పనులకు రూ.10 వేల కోట్లు ఖర్చయిందని, ఈ పనుల కోసం పెట్టిన ఖర్చులు ఏం కావాలని ప్రశ్నించారు. తెలంగాణపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వారు ఇప్పుడు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ ఎక్కడ? : కోదండరెడ్డి ఎన్నికలకు ముందు, తర్వాత చేసిన వాగ్దానాలు నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాష్ట్ర కిసాన్ కేత్ మజ్దూర్ అధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. -
చేతులెత్తి మొక్కుతం
రైతాంగ సమస్యల్ని పరిష్కరించండి: ఎర్రబెల్లి గజ్వేల్: ‘రెండేళ్లుగా తెలంగాణలో కరువు తాండవిస్తున్నది.. కేంద్రానికి నివేదిక పంపి రైతులను ఆదుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం అసమర్థతను చాటుకుంది.. చేతులెత్తి మొక్కుతం.. ఇప్పటికైనా వ్యవసాయరంగాన్ని గట్టెక్కించే మార్గం ఆలోచించాలె.. ’అంటూ టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడలో టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, సీనియర్ నేతలు పెద్దిరెడ్డి, బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు శశికళతో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రానికి కరువు సాయం అందటం లేదన్నారు. పంట వేసింది మొదలు అమ్ముకునే దశ వరకు రైతులకు ప్రభుత్వ సహకారం లభించడం లేదని విమర్శించారు. మూడేళ్ల క్రితం క్వింటాలుకు రూ.4,500 పలికిన పత్తి ధర నేడు రూ.3,500కు పడిపోయిందన్నారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌లో అసహనం పెరిగిపోయి అన్నివర్గాల వ్యక్తులపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. బిల్లులు చెల్లించపోతే పోరాటం.. పెండింగ్‌లో ఉన్న ‘ఇందిరమ్మ’ బిల్లులను చెల్లించకపోతే పోరాటాలు ముమ్మరం చేస్తామని ఎర్రబెల్లి హెచ్చరించారు. రిమ్మనగూడంలో బిల్లులు అందని భీమొల్ల ఎల్లమ్మ, పోషి లక్ష్మీ తదితరుల ఇబ్బందులను ఆయన తెలుసుకున్నారు. ‘ఇందిరమ్మ’ అనర్హులను ఏరివేసే పేరిట ప్రభుత్వం అర్హులకు అన్యాయం తలపెడుతున్నదని విమర్శించారు. -
రైతు ఇంట్లో చోరీ, నగదు అపహరణ
పైడాల(కర్నూలు జిల్లా): కర్నూలు జిల్లా పైడాల మండలం కేంద్రంలో ఓ రైతు ఇంట్లో చోరీ జరిగింది. మండల కేంద్రంలోని సాధు అనే రైతు ఇంట్లో గుర్తుతెలియని దుండుగులు గురువారం చోరబడ్డారు. వారు రైతు ఇంట్లో నుంచి రూ. 10 వేల నగదు, 3 బియ్యం బస్తాలను ఎత్తుకెళ్లారని రైతు తెలిపాడు. చోరీ ఘటనపై రైతు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
ఎలుగుబంటి దాడిలో రైతు మృతి
అర్ధవీడు (ప్రకాశం జిల్లా): కుంటలో నీరు తాగేందుకు వెళ్లిన రైతుపై ఎలుగుబండి దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం బోమిలింగం గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన రామాంజనేయులు(30) పొలంలో అరక దున్నేందుకు వెళ్లాడు. కాగా, సాయంత్రం దప్పిక కావడంతో పక్కనే ఉన్న కుంటలో నీరు తాగేందుకు వెళ్లాడు. అయితే, అక్కడే ఉన్న ఎలుగుబంటి రైతుపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన గ్రామస్తులు పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఏజెన్సీ ప్రాంతం కావడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడానికి సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
తొక్కిసలాటలో పుష్కర యూత్రికుడు మృతి
♦ గోదావరి రైల్వేస్టేషన్లో ఘటన ♦ మృతుడి స్వగ్రామం దువ్వ కంబాలచెరువు (రాజమండ్రి)/తణుకు టౌన్ : గోదావరి రైల్వేస్టేషన్లో ఆదివారం జరిగిన తొక్కిసలాటలో ఒక ప్రయాణికుడు మరణించాడు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వకు చెందిన రైతు మేడిశెట్టి తాతారావు(45), భార్య రాఘవ, తల్లితో కలసి ఆదివారం వేకువ జామున గోదావరి రైల్వే స్టేషన్లో దిగారు. పుష్కర స్నానం ముగించుకుని ఉదయం 11 గంటలకు తిరిగి దువ్వ వెళ్లేందుకు గోదావరి రైల్వే స్టేషన్‌కు చేరారు. భీమవరం ప్యాసింజర్ రెండో నంబర్ ప్లాట్‌ఫాంపైకి వచ్చింది. రైలు ఎక్కేందుకు ప్రయూణికులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. తాతారావు కిందపడిపోయాడు. ప్రయాణికులు అతడిని పక్కకు లాగి చూసేసరికి అపస్మారకస్థితికి వెళ్లిపోయాడు. వెంటనే రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం మార్చురీకి తరలించారు. అతనికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
భూములు కోల్పోయిన మరో రైతు మృతి
అమృతలూరు : ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ రైతుల్లో మరో రైతు బుధవారం ఉదయం మృతిచెందాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా అమృతలూరు మండలం కోరుతాడిపర్రులో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. భూములను దేవాదాయశాఖ భూములుగా నిర్ణయించడంతో ఆరుగురు రైతులు భూములు కోల్పోయారు. దేవాదాయశాఖ నిర్ణయంతో మనస్తాపానికి గురైన ఆరుగురు రైతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం సత్తయ్య అనే ఓ రైతు మృతిచెందాడు. ఇదిలాఉండగా, ఈ విషయంలో చికిత్స పొందుతూ ఇప్పటికే ఇద్దరు రైతులు మృతిచెందిన విషయం తెలిసిందే. -
ప్రభుత్వానికే కరెంటును అమ్మాడు
సౌర విద్యుత్ గుజరాత్ రైతులకు పంటల సాగుకే కాకుండా అదనపు ఆదాయం పొందే వనరుగా మారింది. సౌర విద్యుత్ పంపు ద్వారా బోరు నీటిని పంటలకు పారిస్తున్న ఈ చిన్నకారు రైతు పేరు రమణ్ భాయ్. గోధుమ, అరటి పంటలను సాగు చేసే ఆయన పొలంలో బోరు నుంచి నీటిని తోడేందుకు సౌరశక్తితో నడిచే మోటార్‌ను ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ నీటి యాజమాన్య సంస్థ(ఐడబ్ల్యూఎంఐ) పైలట్ ప్రాజెక్టులో భాగంగా దక్కిన సౌర విద్యుత్ పంపు సదుపాయం వల్ల పంటకు సకాలంలో నీరంది రమణ్ భాయ్‌కి మంచి ఫలసాయం వచ్చింది. అంతేకాదు.. ఆ నాలుగు నెలల పంట కాలంలో పొలానికి నీటి అవసరం లేనప్పుడు ఉత్పత్తి చేసిన సౌర విద్యుత్‌ను ప్రభుత్వానికి అమ్మాడు. 1500 యూనిట్ల విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేయగా, యూనిట్‌కు రూ. 5 చొప్పున రూ.7500 అదనపు ఆదాయం వచ్చింది. ఇలా ప్రభుత్వానికి సౌర విద్యుత్ అమ్మిన తొలి రైతుగా రమణ్ భాయ్ ఇటీవల వార్తల్లోకెక్కాడు. బోర్లకు సౌర విద్యుత్తు సదుపాయం కల్పిస్తే నీటి వినియోగంపై నియంత్రణ పోయి భూగర్భ నీటి వాడకం విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉందన్న అభిప్రాయం ఉంది. అయితే రైతుల నుంచి మిగులు సౌర విద్యుత్‌ను ప్రభుత్వం కొనుగోలు చే స్తే.. నీటిని పొదుపుగా వాడేందుకు వీలవుతుందన్నది భావన. ఆ విధంగా.. అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంటే సౌర విద్యుత్ సదుపాయం గల రైతులు భూగర్భ జలాలను పొదుపుగా వాడతారనడానికి రమణ్ భాయ్ చక్కని ఉదాహరణగా మారాడు. -
మెట్ట వరికి మేలైన గొర్రు!
నేరుగా పొడి దుక్కిలోనే సులువుగా విత్తనాలేయొచ్చు ఒక్క మనిషే గంటకో ఎకరంలో వెద పెట్టవచ్చు ఎకరానికి రూ. 5 వేలు ఆదా పొడి దుక్కిలోనే వరి విత్తనం అరకతో వెదపెట్టే గొర్రుతో ఆరు తడి వరి సాగును సులభతరంగా మార్చాడు మేడిపల్లి రమేష్ అనే యువ రైతు. ఆయన స్వస్థలం వరంగల్ జిల్లా గోవిందరావుపేట మండలంలోని చల్వాయి గ్రామం. పదో తరగతి చదివిన రమేష్ తన తొమ్మిదెకరాల పొలంలో సేద్యం చేస్తున్నాడు. మెట్ట పైర్లలో విత్తనాలు వెద బెట్టేందుకు వాడే గొర్రుకు తగిన మార్పులు చేర్పులు చేసి వరి విత్తనాలు వెదబెట్టే గొర్రును రూపొందించాడు. దీనికి జడిగంను అమర్చి పైన ఐదు కేజీల విత్తనాలు పోసుకునేలా డ్రమ్మును ఏర్పాటు చేశాడు. దీంతో అరక వెంట ఉండి విత్తనం వెదపెట్టేందుకు మరో మనిషి అవసరం లేకుండా పోయింది. గొర్రు ఎక్కువ లోతుకు దిగకుండా రెండు వైపులా కర్ర చక్రాలను అమర్చాడు. గొర్రుకు ఉండే ఐదు చెక్కల వద్ద.. ప్రతి రంధ్రంలో నుంచి జారే ధాన్యం గింజలు అంగుళం లోతులో పడేలా పైపులను అమర్చాడు. సాళ్ల మధ్య 9 అంగుళాలు, మొక్కల మధ్య రెండు అంగుళాల దూరం ఉంటుంది. పాదుల్లో పడే విత్తనాల సంఖ్యను పెంచుకు నేందుకు, తగ్గించు కునేందుకు లివర్‌ను ఏర్పాటు చేశాడు. చేలో చెత్తా చెదారం లేకుండా దుక్కి మెత్తగా చేసుకొంటే చాలు. రైతు ఒంటరిగానే రోజుకు నాలుగెకరాల్లో విత్తనాలు వెద పెట్టవచ్చు. దీని తయారీకి రమేష్‌కు రూ. 6 వేలు ఖర్చయింది. నాట్లు వేసే పద్ధతితో పోల్చితే ఈ విధానంలో ఎకరాకు రూ. 5 వేల వరకు ఖర్చు త గ్గుతుంది. నారు పోయడం మొదలుకొని నాట్లు వేసేందుకు, దారులు తీసేందుకయ్యే కూలి ఖర్చు తగ్గుతుంది. ట్రాక్టర్‌తో దమ్ము చేసే ఖర్చు కలిసి వస్తుంది. ఎకరాకు 10-12 కిలోల విత్తనాలు చాలు. సాళ్ల విధానంతో మొక్కల మధ్య దూరం ఉండి.. గాలి వెలుతురు పుష్కలంగా లభిస్తాయి. పురుగుల బెడద, పురుగుమందుల ఖర్చు తగ్గుతుంది. సాగునీటి కొరత ఉన్న సందర్భాల్లో రమేష్ ఆరుతడులు అందిస్తున్నారు. మెట్ట వరిలో ఎకరానికి 35 బస్తాలకు పైగా దిగుబడి సాధించడం ఈ ప్రాంతంలో విశేషమే. - ఆళ్ల కిషోర్ కుమార్, గోవిందరావుపేట, వరంగల్ జిల్లా ఇతరుల పొలాల్లోనూ వరి విత్తనాలు వెద పెడుతున్నా.. ఈ గొర్రు వాడకం ద్వారా ఖర్చులు తగ్గి, రైతుకు నికర లాభం పెరుగుతుంది. నా పొలంతో పాటు ఇతర రైతుల పొలాల్లోనూ ఈ గొర్రుతో విత్తనాలు వేస్తున్నా. అందరికీ మంచి దిగుబడులే వచ్చాయి. రైతులడిగితే గొర్రును తయారుచేసిస్తా. దమ్ము చేసిన పొలాల్లోనూ వెదపెట్టేందుకు పనికొచ్చేలా ఈ గొర్రులో మార్పులు చేస్తున్నా. - మేడిపల్లి రమేష్ (84669 33668), చల్వాయి గ్రామం, గోవిందరావు పేట మండలం, వరంగల్ జిల్లా -
జన్మభూమి సభలో రైతు ఆత్మహత్యాయత్నం
తొట్టెంబేడు: చిత్తూరు జిల్లా తొట్టెంబేడు మండలం చిడత్తూరులో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో రసాభాస జరిగింది. టీడీపీకి చెందిన వ్యక్తి తన భూమిని కబ్జా చేశారని రామకృష్ణయ్య అనే రైతు ఆరోపించాడు. అనంతరం రామకృష్ణయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే స్పందించిన అధికారులు ఆ రైతును చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. -
రైతు సమస్యలపై పట్టింపేది?
- రాష్ట్ర ప్రభుత్వానిది మొసలి కన్నీరు - రాహుల్ రాజకీయం చేస్తున్నాడు - బీజేపీ జిల్లా ఇన్చార్జి మురళీధర్‌గౌడ్ - కలెక్టరేట్ ఎదుట ధర్నా ఆదిలాబాద్ రిమ్స్ : రైతు సమస్యలపై టీఆర్ఎస్ ప్రభుత్వం మొసలి కన్నీరు కారుస్తోందని, రైతాంగాన్ని పట్టించుకోవడం లేదని బీజేపీ జిల్లా ఇన్చార్జి మురళీధర్‌గౌడ్ విమర్శించారు. బీజేపీ కిసాన్‌మోర్చ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మాటమార్చిందని దుయ్యబట్టారు. ఓ వైపు అప్పులు చెల్లించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే రుణాలు విడతల వారీ గా మాఫీ చేయడం సరికాదని అన్నారు. బ్యాంకు బకాయిలను ఒకేసారి మాఫీ చేసి ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది జిల్లాలో కరువు ఏర్పడినా కేంద్రానికి కరువు నివేదిక పంపకపోవడంతో రైతులకు కరువు సహాయం కూడా అందలేదని పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. ఇప్పటివరకు అధికార పార్టీ నాయకులు ఒక్కరు కూడా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించలేదని ఎద్దేవా చేశారు. వాతావరణం అనుకూలించక పం టలు సరిగా పండలేదని, ఆదుకోవాల్సిన ప్రభుత్వం కూడా గిట్టుబాటు ధర కల్పించలేదని తెలిపారు. ఈ ఏడాది కనీసం విత్తనాలు కొనుగోలు చేసే పరిస్థితిలో రైతులు లేనందున 90 శాతం సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేయాలని కోరారు. జిల్లాలో రైతుయాత్ర చేపడుతున్న రాహుల్‌గాంధీ రైతు రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వేల ఎకరాలు కార్పొరేట్ వ్యాపారులకు అప్పగించిన కాంగ్రెస్ పార్టీకి బీజేపీని విమర్శించే హక్కు లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ల పాలన లో వ్యవసాయ అభివృద్ధి కుంటుపడిందని ఎద్దేవా చేశా రు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రధాన మం త్రి నరేంద్రమోగీ కృషి చేస్తున్నారని తెలిపారు. బీజేపీ కిసాన్ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాయల శంకర్, ఉపాధ్యక్షురాలు సుహాసిని, కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షుడు దీపక్‌సింగ్ షెకావత్, ఉపాధ్యక్షుడు మడావి రాజు, నాయకులు రఘుపతి, జోగు రవి పాల్గొన్నారు.