పైడాల(కర్నూలు జిల్లా): కర్నూలు జిల్లా పైడాల మండలం కేంద్రంలో ఓ రైతు ఇంట్లో చోరీ జరిగింది. మండల కేంద్రంలోని సాధు అనే రైతు ఇంట్లో గుర్తుతెలియని దుండుగులు గురువారం చోరబడ్డారు. వారు రైతు ఇంట్లో నుంచి రూ. 10 వేల నగదు, 3 బియ్యం బస్తాలను ఎత్తుకెళ్లారని రైతు తెలిపాడు. చోరీ ఘటనపై రైతు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.