కొల్చారం (మెదక్): మెడకు కట్టిన పలుపుతాడు ఆ మూగజీవుల పాలిట శాపమై, వాటి ప్రాణాలు తీశాయి. ఈ ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం కోనాపూర్ గ్రామ శివారులో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చక్రాల సిద్దిరాంరెడ్డి తన రెండు ఎడ్లను పొలంలోని చెట్టుకు కట్టేసి ఇంటికి వెళ్లాడు. కాగా, మేత కోసం అవి పెనుగులాడిన క్రమంలో మెడకు ఉన్న తాళ్లు బిగుసుకుని, ఊపిరాడకుండా చేశాయి. కొద్దిసేపటి తర్వాత అక్కడికి చేరుకున్న రైతు.. ఆ మూగజీవాలు రెండూ చనిపోయి కనిపించటంతో హతాశుడయ్యాడు. వాటి విలువ రూ.లక్ష వరకు ఉంటుందని తెలిపాడు.