రైతు సమస్యలు పరిష్కరించాలి | Solve farmer problems demand union activists | Sakshi
Sakshi News home page

రైతు సమస్యలు పరిష్కరించాలి

Published Tue, Nov 22 2016 3:28 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 PM

Solve farmer problems demand union activists

మండ్య: బెళగావిలో సోమవారం నుంచి ప్రారంభమైన శీతాకాల సమావేశాల్లో రుణమాఫీ, పంటనష్ట పరిహారం తదితర రైతు సమస్యలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం వివిధ రైతుపోరాట సంఘాల కార్యకర్తలు పట్టణంలోని జయచామరాజేంద్ర ఒడయార్ సర్కిల్‌లో నిరసనలు తెలిపారు. రుణమాఫీ, పంటనష్ట పరిహారంతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని డిమాండ్ చేసారు.
 
  రాష్ట్రంలో నెలకొన్న అతివృష్టి,  అనావృష్టి కారణంగా జరిగిన పంట నష్టానికి పరిహారంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.4,656కోట్ల నిధులను కోరినట్లుగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. కేంద్ర ప్రభుత్వం నుండి కేవలం రూ.4,656కోట్ల పంటనష్ట పరిహాన్ని కోరి రూ.11,344కోట్ల నష్టాన్ని రాష్ట్ర రైతులే భరించాలన్నట్లు ముఖ్యమంత్రి వ్యవహారశైలిగా ఉందన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement