
సాక్షి, లక్నో : పైకి హుందాగా కనిపించే బ్యాంకు లోను రికవరీ ఏజెంట్లు ఎంత దుర్మార్గంగా ఉంటారో మరోసారి స్పష్టమైంది. వారి ప్రవర్తన ఎంత హీనంగా ఉంటుందో తెలిసింది. తమకు లోన్ వడ్డీ తిరిగి చెల్లించలేదనే కారణంతో దారుణంగా ఓ రైతును కొట్టడంతోపాటు అతడి ట్రాక్టర్‌తోనే అతడిని చంపేశారు. తీవ్రంగా గాయపరిచి కిందపడేసి ట్రాక్టర్‌తో తొక్కించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పుడు విచారణ ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్‌లో గ్యాన్ చంద్ర(45) అనే ఓ రైతు ఓ బ్యాంకు నుంచి ట్రాక్టర్ కొనుగోలు చేసేందుకు రుణం తీసుకున్నాడు. మొత్తం రూ.99వేలు అతడు తీసుకోగా తొమ్మిది వేలు చెల్లించి మిగితా డబ్బు చెల్లింపు కోసం కొంత సమయం అడిగాడు. అయితే, అందుకు అనుమతించని లోన్ రికవరీ ఏజెంట్లు అతడితో పొలంలోనే గొడవకు దిగారు. అనంతరం చేయి కూడా చేసుకున్నారు. అంతటితో ఆకకుండా కిందపడేసి అతడి ట్రాక్టర్‌తోనే తొక్కించి చంపేశారు. ఈ ఘటనపై అక్కడి రైతు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment