bank loan recovery
-
అఖిలమ్మా... అప్పు కట్టమ్మా! మాజీ మంత్రి ఇంటి ముందు నిరసన
ఆళ్లగడ్డ: అప్పు చెల్లించాలని మాజీ మంత్రి అఖిలప్రియ ఇంటి ముందు బ్యాంకు అధికారులు బుధవారం వినూత్నంగా నిరసన తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు దివంగత భూమా నాగిరెడ్డి ఆళ్లగడ్డలో జగత్ డెయిరీ కోసం నంద్యాల ఆంధ్రా బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారు. ఆయన మృతి చెందినప్పటి నుంచి వాయిదాలు సకాలంలో చెల్లించకపోవడంతో వారసులకు పలు దఫాలు నోటీసులు ఇచ్చారు. అయినా స్పందించకపోవడంతో యూనియన్ బ్యాంకు (ప్రస్తుతం ఆంధ్రా బ్యాంక్ విలీనమైంది) లోన్ రికవరీ అధికారులు ఆళ్లగడ్డ చేరుకుని అఖిలప్రియ ఇంటి ముందు అప్పు చెల్లించాలని ప్ల కార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఆ సమయంలో ఆమె ఇంట్లో లేరని తెలిసింది. అనంతరం ఈ అప్పునకు ష్యూరిటీ పెట్టిన ఏవీ సుబ్బారెడ్డికి చెందిన హోట్‌ల్ ముందు కూడా ‘బ్యాంక్ మనీ పబ్లిక్ మనీ, మా బకాయిలు చెల్లించండి–సగర్వంగా జీవించండి’ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ విషయంపై అఖిలప్రియ ఫోన్లో బ్యాంకు అధికారులతో మాట్లాడి కొంత గడువు ఇస్తే డబ్బు చెల్లిస్తామని చెప్పడంతో వారు వెళ్లిపోయారు. -
బ్యాంక్‌లోన్ కోసం రైతును ట్రాక్టర్‌తో తొక్కించారు
సాక్షి, లక్నో : పైకి హుందాగా కనిపించే బ్యాంకు లోను రికవరీ ఏజెంట్లు ఎంత దుర్మార్గంగా ఉంటారో మరోసారి స్పష్టమైంది. వారి ప్రవర్తన ఎంత హీనంగా ఉంటుందో తెలిసింది. తమకు లోన్ వడ్డీ తిరిగి చెల్లించలేదనే కారణంతో దారుణంగా ఓ రైతును కొట్టడంతోపాటు అతడి ట్రాక్టర్‌తోనే అతడిని చంపేశారు. తీవ్రంగా గాయపరిచి కిందపడేసి ట్రాక్టర్‌తో తొక్కించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పుడు విచారణ ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లో గ్యాన్ చంద్ర(45) అనే ఓ రైతు ఓ బ్యాంకు నుంచి ట్రాక్టర్ కొనుగోలు చేసేందుకు రుణం తీసుకున్నాడు. మొత్తం రూ.99వేలు అతడు తీసుకోగా తొమ్మిది వేలు చెల్లించి మిగితా డబ్బు చెల్లింపు కోసం కొంత సమయం అడిగాడు. అయితే, అందుకు అనుమతించని లోన్ రికవరీ ఏజెంట్లు అతడితో పొలంలోనే గొడవకు దిగారు. అనంతరం చేయి కూడా చేసుకున్నారు. అంతటితో ఆకకుండా కిందపడేసి అతడి ట్రాక్టర్‌తోనే తొక్కించి చంపేశారు. ఈ ఘటనపై అక్కడి రైతు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
'ఆ ఎంపీ బ్యాంకు రుణాలను రికవరీ చేయాలి'
విశాఖపట్నం: అరకు ఎంపీ కొత్తపల్లి గీత బ్యాంకుకు రుణపడిన మొత్తాన్ని ఆమె నుంచి రికవరీ చేయాలని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ అన్నారు. పట్టణంలో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ గీతను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆమెను పదవీ నుంచి తొలగించాలని పేర్కొన్నారు. నామినేషన్, కులధృవీకరణ పత్రాన్ని రద్దు చేయాలని ఎమ్మెల్యే ఈశ్వరీ కోరారు. కొత్తపల్లి గీత బ్యాంకు రుణాలు తిరిగి చెల్లించలేదని ఆరోపణలు వచ్చిన విషయం విదితమే.