సాక్షి, నిజామాబాద్ : తమకు కొత్త పట్టాపాస్ పుస్తకాలు ఇవ్వడం లేదంటూ రెంజల్ మండలంలోని కందకుర్తి రైతులు నిరసనకు దిగారు. అధికారులు సహకరించడం లేదని ఆరోపిస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. కాగా రెంజల్ మండల పరిధిలోని 309 ఎకరాలను 127 మంది రైతులు సాగు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందేందుకై కొత్త పాస్‌పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే రైతులు సాగు చేసుకుంటున్న భూమి వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్న కారణంగా పాస్ పుస్తకాలు ఇవ్వలేమని అధికారులు స్పష్టం చేశారు. దీంతో అధికారుల కఠిన వైఖరితో మనస్తాపం చెందిన రైతులు నిరాహార దీక్షకు దిగారు. ఈ పరిణామాల నేపథ్యంలో విమర్శలు వెల్లువెత్తడంతో రెంజల్ తహసీల్దార్ అసదుల్లా ఖాన్ కంటతడి పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment