రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం ఇంకా సమసిపోలేదు. కనీస మద్దతు ధరకు సంబంధించిన కొత్త చట్టానికి సమ్మతించని రైతులు ఢిల్లీకి పాదయాత్రగా తరలివచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
మంగళవారం నాడు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో.. ఢిల్లీకి పాదయాత్రగా వచ్చేందుకు రైతులు చేసిన ప్రయత్నం విఫలమైంది. దీంతో ఈరోజు (బుధవారం) తిరిగి ఢిల్లీలో అడుగుపెట్టేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. వారంతా ఢిల్లీకి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న శంభు సరిహద్దులో వేచిచూస్తున్నారు. దీంతో శంభు సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది
#WATCH | RAF personnel, Police personnel and Riot Control Vehicle deployed at Singhu Border in Delhi in view of farmers' protest. pic.twitter.com/ewUgw0KoSw
— ANI (@ANI) February 14, 2024
రైతుల ఆందోళనల నేపధ్యంలో హర్యానాలోని ఎనిమిది జిల్లాల్లో ఫిబ్రవరి 15 వరకు ఇంటర్నెట్ నిలిపివేశారు. మంగళవారం హర్యానా, పంజాబ్ సరిహద్దుల్లో రైతుల ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ను ప్రభుత్వం అడ్డుకుంది. ఫతేఘర్ సాహెబ్ నుంచి శంభు సరిహద్దు వరకూ గుమిగూడిన రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. సింగూ బోర్డర్, టిక్రీ బోర్డర్, ఘాజీపూర్ బోర్డర్‌లో గట్టి పోలీసు నిఘా కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment