
'విపక్షాల విమర్శలపై బహిరంగ చర్చకు సిద్ధం'
కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో పంటనష్టం, రైతు సమస్యల గురించి విపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటెల రాజేందర్ వారి విమర్శలను ఖండించారు. విపక్షాల విమర్శలపై తాము బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కే కాంగ్రెస్కు ప్రభుత్వాన్ని విమర్శించే హక్కులేదని మండిపడ్డారు. ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్కు శిక్షపడ్డా సిగ్గురాలేదని దుయ్యబట్టారు. ఎన్నికల హామీలను 70 శాతం ఇప్పటికే నెరవేర్చామని ఈటెల అన్నారు.
దీనిపై స్పందించిన కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ టీఆర్ఎస్ సర్కార్ విధానంపై బహిరంగ చర్చకు సిద్ధమని, సమయం మీరే నిర్ణయించండంటూ సవాల్ విసిరారు.