సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇళ్లు నలుగురి నియోజకవర్గా ల్లో మినహా ముందుకు సాగట్లేదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో ఈటల నిజాలు చెప్పారన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో ఉన్న వాళ్లను టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పశువులతో పోల్చడం తగదన్నారు. సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్న పెద్దపెద్ద కాంట్రాక్టర్లే డబుల్ బెడ్రూం ఇళ్లు కడుతున్నారని, దీని వెనుక చీకటి ఒప్పందం ఉందని తాము నిరూపిస్తామని సవాల్ చేశారు.