ధర దగా | tomato farmer lost his crop | Sakshi
Sakshi News home page

ధర దగా

Published Sun, Aug 7 2016 11:06 PM | Last Updated on Mon, Oct 1 2018 4:45 PM

ధర దగా - Sakshi

ధర దగా

మార్కెట్లో సిండికేట్‌ మాయ
దగాపడుతున్న టమాటా రైతన్న
పట్టించుకోని మార్కెటింగ్‌శాఖ అధికారులు


జూలై 22వ 15 కేజీలున్న టమాటాల బాక్సు ధర రూ.300. అయితే ప్రస్తుతం రూ.30కు చేరింది.

...మార్కెట్‌లో మాత్రం కేజీ తక్కువలో తక్కువగా కిలో రూ.5 పలుకుతోంది. మరీ రైతన్న పరిస్థితి ఇలా ఎందుకు మారిందంటే..దళారీ దందా ఎక్కువైంది. రైతు శ్రమను, కష్టాన్ని దళారులు దోచుకుంటుంటే పట్టించుకోవాల్సిన మార్కెటింగ్‌ శాఖ ప్రేక్షకపాత్ర వహిస్తోంది. అందువల్లే కడుపుమండిన రైతన్నలు దళారులకు పంటను తెగనమ్మలేక పారబోసి పోతున్నారు.

రవాణా ఖర్చులు, కమీషన్‌కు సరిపోయింది
రూ.లక్ష ఖర్చు చేసి 3 ఎకరాల్లో టమోటా పంట సాగు చేశాం. ఆశాజనకంగా దిగుబడి వచ్చింది. 152 టమాట బాక్సులను మార్కెట్‌కు తీసుకువస్తే ఒక్కో బాక్సును కేవలం రూ.30 పలికింది. వచ్చిన సొమ్ము వ్యాపారి కమీషన్, రవాణా ఖర్చులకే సరిపోతోంది.
– జయచంద్రారెడ్డి, అమ్మవారిపల్లి, పెనుకొండ  



అనంతపురం రూరల్‌ :  కరువుకు చిరునామాగా మారిన జిల్లా...భూగర్భజలాలు అంతంత మాత్రం. అందువల్లే రైతన్నలుlప్రకృతిని ఎదురించి పంటలసాగుకు సిద్ధమవుతున్నారు. ఉన్న కాస్త నీటిని వాడుకుని టామాటా పండిస్తున్నారు. ఆరుగాలం శ్రమించి..అపురూపంగా చూసుకున్న పంట చేతికొచ్చాక దళారులు గద్దల్లా తన్నుకుపోతున్నారు. అడ్డగోలుగా ధరలు నిర్ణయించి రైతన్నలను నిలువునా మోసం చేస్తున్నారు.

మండీ మాయ
ఒక్కోసారి ధర అమాంతం పెరుగుతుంది.. అప్పుడు పంట దిగుబడి ఉండదు. ఎక్కడ చూసినా ఆశించిన స్థాయిలో పంట దిగుబడి ఉంటుంది.. అప్పుడు ధర ఠా..రెత్తిస్తుంది.  రైతన్నను ధర ఉన్నా.. లేకున్నా నిత్యం దళారులు ముప్పేట ముంచేది మాత్రం మార్కెట్‌. మండీ నిర్వాహకులు, మార్కెట్‌ వ్యాపారులు సిండికేట్‌గా మారడమే దీనంతటికీ కారణం.  ‘మార్కెట్‌ ’ మాయాజాలంలో అన్నదాత నిలువెల్లా మోసపోతున్నాడు.  టమాటా మార్కెట్‌లో వ్యాపారులు, మండీ నిర్వాహకులు సిండికేట్‌గా మారి తక్కువ ధరకే వేలం నిర్వహించి, రైతులను దగా చేస్తున్నారు. వ్యాపారులు నిర్దేశించిన ధరకు కొందరు రైతులు సరుకును వదులుకోవడం ఇష్టంలేక.. ఇంటికి తీసుకెళ్లలేక ..వచ్చిన నష్టం ఎట్టా వచ్చిందని నేలపాలు చేస్తున్నారు.

వారు నిర్ణయించిందే ధర
జిల్లా వ్యాప్తంగా దాదాపు ప్రస్తుత సీజన్‌లో 80 వేల ఎకరాలకు పైగా టమాటా పంటను రైతులు సాగు చేశారు. ఆశించిన మేర పంట దిగుబడి వచ్చినా.. రైతులకు ప్రయోజనం లేకుండా పోయింది. సుదూర ప్రాంతాల నుంచి సరుకును మార్కెట్‌కు తరలిస్తే గిట్టుబాటు ధరలేక కనీసం రవాణా ఖర్చులు కూడా రావడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌కు తీసుకొచ్చిన సరుకును రైతులు వెనక్కు తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొనడంతో వ్యాపారులదే దోపిడీ సాగుతోంది. గిట్టుబాటు ధర ఉన్నా..లేకపోయినా  వ్యాపారులు నిర్ణయించిన ధరకే సరుకును వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సీజన్‌లో ప్రతి రోజూ అనంతపురంలోని కక్కలపల్లి సమీపంలో ఉన్న టమాటా మార్కెట్‌కు దాదాపు 400 టన్నుల మేర టమోటా వస్తుంది.

పట్టించు కోని మార్కెటింగ్‌ శాఖ అధికారులు :
ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు మార్కెట్‌కు వస్తే ఇక్కడా రైతన్న దగా పడాల్సివస్తోంది. పండించిన పంటను గిట్టుబాటు ధరతో అమ్ముకోలేకపోతున్నారు. టమాటా మార్కెట్లో ఇంత జరుగుతున్నా మార్కెటింగ్‌శాఖ అధికారులు పట్టించుకోవడం మరిచారు. మద్దతు ధర కల్పించి, రైతున్నను ఆదుకోవాల్సిన అధికారులు  కనీసం మార్కెట్లో జరుగుతున్న వేలం పాటను సైతం పరిశీలించిన దాఖలాలు లేవు. దీంతో వ్యాపారులు మరో అడుగు ముందుకేసి ఇష్టానుసారం వేలం పాట నిర్వíß స్తూ రైతులను నిలువునా ముంచేస్తున్నారు.

గిట్టుబాటు ధర కల్పించాలి
టమాటా మార్కెట్లో సిండికేట్‌ వ్యాపారం సాగుతోంది. వారు నిర్దేశించిన ధరకు  పంటను వదులుకోవాల్సి వస్తోంది. పంటలకు గిట్టుబాటు ధర కల్పించి మార్కెట్లో జరుగుతున్న దోపిడీని అరికట్టి టమాటా మార్కెట్‌ను అధికారుల పర్యవేక్షణలో ఉండే విధంగా చర్యలు చేపట్టాలి.
– గంగాధర్‌ కురాకులపల్లి, కంబదూరు మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement