చంద్రబాబుకు చేదు అనుభవం | chandra babu faces unexpected question | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు చేదు అనుభవం

Published Thu, Apr 20 2017 6:26 PM | Last Updated on Mon, Oct 1 2018 4:45 PM

చంద్రబాబుకు చేదు అనుభవం - Sakshi

చంద్రబాబుకు చేదు అనుభవం

అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చేదు అనుభవం ఎదురైంది. గురువారం అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లిన చంద్రబాబు.. ఇంకుడు గుంతల గురించి గొప్పలు చెప్పారు. అయితే ఇంకుడు గుంతల వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదని సభలో టీడీపీ నాయకుడే చెప్పడంతో చంద్రబాబుకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది.

టీడీపీ నాయకుడు, రైతు రామ్మోహన్‌ చౌదరి మాట్లాడుతూ.. ఇంకుడు గుంతలకు 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టానని, తమకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకుడు గుంతల గురించి చంద్రబాబు గొప్పలు చెబుతున్న సమయంలో సొంత పార్టీకి చెందిన నాయకుడే ఇలా మాట్లాడేసరికి ఆయన షాకయ్యారు. ఊహించని పరిణామంతో బిత్తరపోయిన చంద్రబాబు.. చౌదరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జవాబు దాటవేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement