
దుగ్గొండి: రైతుకు ఉచితంగా పట్టాదారు పాసు పుస్తకం అందిస్తామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో రైతులకు న్యాయం జరగడం లేదు. వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి తనిఖీ నిమిత్తం వచ్చిన వరంగల్ రూరల్ జిల్లా జాయింట్ కలెక్టర్ రావుల మహేందర్‌రెడ్డి కాళ్లపై పడి మైసంపల్లి గ్రామానికి చెందిన రైతు గంగారపు మొగిళి తన పాసుపుస్తకం సమస్యను మొరపెట్టుకున్నాడు. వెంటనే తనకు పట్టా పుస్తకం ఇప్పించి కేసీఆర్ సారు ఇచ్చే పైసలు వచ్చేటట్టు చేయాలని వేడుకున్నాడు.
ఇలా పది గ్రామాలకు చెందిన రైతులు తమ సమస్యను జేసీకి వివరించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ సమస్యలు ఉన్న భూములకు తప్ప మిగతా రైతుల భూములన్నీంటికి పట్టాదారు పాసు పుస్తకాలు అందిస్తామని చెబుతూ భూములను సర్వే చేయాలని అక్కడికక్కడే సర్వేయర్‌ను ఆదేశించారు. అలాగే, అక్రమాలకు పాల్పడే ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో రైతులు శాంతించారు.
Comments
Please login to add a commentAdd a comment