రోడ్డెక్కిన రైతన్నలు | Farmers Protest Of Minimum Price Nizamabad | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కిన రైతన్నలు

Published Wed, Feb 13 2019 10:42 AM | Last Updated on Wed, Feb 13 2019 10:42 AM

Farmers Protest Of Minimum Price Nizamabad - Sakshi

ఆర్మూర్‌లోని జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తున్న రైతులు 

ఆర్మూర్‌ / పెర్కిట్‌ :  రాష్ట్ర ప్రభుత్వమే ఎర్రజొన్నలు, పసుపు పంటను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆర్మూర్‌ ప్రాంత రైతులు మంగళవారం రోడ్డెక్కి నిరసన చేపట్టారు. నాలుగు గంటల పాటు ధర్నాలు, జాతీయ రహదారులపై రాస్తారోకోలు నిర్వహించారు. అయితే రైతుల ధర్నా కారణంగా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఆర్మూర్‌ డివిజన్‌ పరిధిలోని వివిధ మండలాల్లో ఉన్న రైతు నాయకులను సోమవారం అర్ధరాత్రి వారి ఇళ్లలోనే పోలీసులు అరెస్టులు చేశారు. సమీపంలోని ఇతర మండలాల పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. దీంతో రైతులు మరింత ఆగ్రహానికి లోనై రాస్తారోకోలు చేశారు. కాగా గత కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులతో వ్యవహరించిన తీరును తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం అనుసరించకుండా ఫ్రెండ్లీ పోలీస్‌గా వ్యహరించాలని ఆదేశాలు జారీ చేయడంతో దీక్ష శాంతి యుతంగా కొనసాగింది.
 
ఆర్మూర్‌ మండలం మామిడిపల్లి చౌరస్తాలో 63వ నంబర్‌ జాతీయ రహదారిపైకి  ఉదయం నుంచే రైతులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. రైతుల ఉద్యమాన్ని నియంత్రించడానికి పోలీసులు విధిం చిన 144 సెక్షన్‌ను లెక్క చేయకుండా రైతులు గ్రామాల నుంచి కార్లు, మోటార్‌ సైకిళ్లపై వచ్చారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వ ర్యంలో సుమారు వెయ్యి మందికి పైగా జాతీయ రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ ఎర్రజొన్న పం టకు క్వింటాలుకు రూ. 3,500, పసుపునకు క్విం టాలుకు రూ. 15 వేల గిట్టుబాటు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేసారు. తమ దీక్షను భగ్నం చేయడానికి పోలీసులు అరెస్టు చేసిన రైతు నాయకులను విడుదల చేయాలన్నా రు. డిమాండ్లు సాధించుకునే వరకు దీక్షను విరమించేది లేదని స్పష్టం చేశారు. సుమారు నాలుగు గంటల పాటు రైతులు జాతీయ రహదారులపైనే ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. అయితే మామిడిపల్లి చౌరస్తాలో రోడ్డుపై వెళ్లే వాహనాలను పోలీ సులు వన్‌వే చేసి దారి మళ్లించారు.

ఒక దశలో రైతులు ఆగ్రహానికిలోనై చౌరస్తాలో 63వ నెంబర్‌ జాతీయ రహదారిపై రాస్తారోకో చేసారు. దీంతో పోలీసులు ఆ మార్గంలో వచ్చే వాహనాలను ఇతర మార్గాల గుండా మళ్లించి ప్రయాణికులకు అసౌ కర్యం కలగకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో రైతులు రాస్తారోకోతో వాహనాలు నిలిచిపోతేనే తమ నిరసన తీవ్రత ప్రభుత్వం దృష్టికి వెళ్తుందంటూ ర్యాలీగా మామిడిపల్లి శివారులోని 44వ నెంబర్‌ జాతీయ రహదారి కూడలికి వచ్చారు. అక్కడ నాలుగు లేన్ల జాతీయ రహదారిపై ఇరువైపుల బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ మార్గం గుం డా వచ్చే వాహనాలను మళ్లించి ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్త పడ్డారు.

రాజకీయాలకు అతీతంగా సాగిన ఈ ధర్నా, రాస్తారోకోలో రైతుల డిమాండ్లను తెలియజేస్తూ రైతు నాయకులు ఉపన్యసించారు. కాగా ఈనెల 7న ఆర్మూర్‌ మండలం మామిడిపల్లి చౌరస్తాలో 63వ నంబర్‌ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించిన రైతులు ఆర్డీవో శ్రీనివాస్, జిల్లా వ్యవసాయాధికారి గోవిందు, ఉద్యానవన శాఖ జిల్లా అధికారి నర్సింగ్‌దాస్, మార్కెటింగ్‌ ఏడీ రియాజ్‌లకు తమ డిమాండ్లను తెలియజేస్తూ విన తి పత్రాలు సమర్పించారు.

ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన కోసం ఐదు రోజులు వేచి చూసిన  రైతులు, తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో అధికారులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌ వచ్చి తమకు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ధర్నాను కొనసాగిస్తామని భీష్మించుకుని కూర్చున్నారు. ముందస్తు అరెస్టులు చేసిన రైతు నాయకులను విడుదల చేయాలని సాయంత్రం వరకు ధర్నా నిర్వహించి పలు అంశాలపై చర్చించారు.

తమ డిమాండ్ల సాధనకు ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఆర్మూర్‌ డివిజన్‌ పరిధిలో నాలుగు ప్రాంతాల్లో ఏక కాలంలో నిరసన కార్యక్రమాలను కొనసాగించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈ నెల 16న బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని ముప్కాల్, వేల్పూర్‌ మండల కేంద్రాలలో, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం పరిధిలోని జక్రాన్‌పల్లిలో, ఆర్మూ ర్‌ నియోజకవర్గం పరిధిలోని మామిడిపల్లిలో పెద్ద ఎత్తున్న ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించారు. అనం తరం ధర్నాను విరమించారు. రాస్తారోకో చేస్తున్న సమయంలో బస్సుప్రయాణికులు తమకు దారి ఇవ్వాల్సిందిగా  వాగ్వాదానికి దిగినా పట్టించుకోని రైతులు ఆర్మూర్‌ వైపు వస్తున్న అంబులెన్స్‌కు మాత్రం దారి ఇచ్చి వెళ్లనిచ్చారు. 

సంయమనం పాటించిన పోలీసులు.. 

2008లో పోలీస్‌ శాఖ వైఫల్యం కారణంగా ఎర్ర జొన్న రైతుల ఉద్యమం హింసాయుతంగా మా రింది. మంగళవారం ఆర్మూర్‌లో జరిగిన రైతు ఉద్యమంలో అడుగడుగునా పోలీసుల తీరు ప్ర శంసనీయంగా కనిపించింది. ఉదయం నుంచే పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించా రు. సీపీ కార్తికేయ ఆధ్వర్యంలో అడిషనల్‌ డీసీపీ శ్రీధర్‌రెడ్డి, ట్రెయిన్‌ ఐపీఎస్‌ గౌస్‌ ఆలం, ఆర్మూ ర్‌ ఏసీపీ రాములు, సీఐలు, ఆర్‌ ఎస్సైలు, సివి ల్‌ ఎస్సైలు నిజామాబాద్, బోధన్, ఆర్మూర్‌కు చెందిన ఏఆర్, సివిల్‌ కానిస్టేబుల్‌ బలగాలతో భారీ బందోబస్తు నిర్వహించారు.

144 సెక్షన్‌ను లెక్క చేయకుండా తరలి వచ్చిన రైతులను ఇ బ్బంది పెట్టకుండా పోలీసులు సంయమనాన్ని పాటించారు. దీక్ష చేస్తున్న రైతులు సహనం కో ల్పోయిన ప్రతిసారి పోలీసులు వారిని బుజ్జగి స్తూ శాంతి యుతంగా దీక్ష చేయడానికి సహకరించారు. పోలీసు బలగాలు లాఠీలను గాని ఆ యుధాలను గాని తీసుకుని రాకుండా ఫ్రెండ్లీ పోలీస్‌లా వ్యవహరించడం పలువురి ప్రశంసల కు కారణమైంది. మరో వైపు 63వ నెంబర్‌ జాతీ య రహదారి, 44వ నెంబర్‌ జాతీయ రహదారులపై రైతులు రాస్తారోకో నిర్వహిస్తున్న సమయంలో ట్రాఫిక్‌ జామ్‌ జరగకుండా పోలీసులు ట్రాఫిక్‌ను డైవర్ట్‌ చేయడానికి వ్యవహరించిన తీరును పలువురు అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement