ఆదిలాబాద్ అర్బన్ : రైతు సమస్యల పరిష్కారానికి వైఎస్సార్ సీపీ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టింది. సమస్యలు పరిష్కరించాలని, కరువు మండలాలను ప్రకటించాలని, ఆత్మహత్య చేసుకున్నరైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా రూ.5 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేసింది. అనంతరం కలెక్టరేట్‌లోకి వెళ్లి ఏవో రాజేశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బి.అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. కరువు మండలాలు ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని, రైతులకు ఒకేసారి రుణమాఫీ చేయాలని, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా తక్షణమే అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కరువుతో ఇబ్బుందులు పడుతున్న రైతులకు రూ.5 వేల చొప్పున పింఛన్ అందించాలని, పశువులకు పశుగ్రాసాన్ని, పాడి పశువులకు దానాను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర రూ.6 వేలు ప్రకటించాలన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రైతుల కళ్లలో ఆనందం చూడాలనుకున్నారని, రైతు సంతోషంగా ఉంటేనే దేశం ఆనందంగా ఉంటుందనే వారని, కానీ ఈ ప్రభుత్వాలు రైతులను పట్టించుకున్నా పాపన పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎం.గంగన్న, ఆదిలాబాద్ పట్టణ అధ్యక్షుడు సలావుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.
రైతులకు పింఛన్ అందించాలి: వైఎస్ఆర్ సీపీ
Published Fri, Sep 18 2015 6:52 PM | Last Updated on Thu, Mar 28 2019 5:12 PM
Advertisement
Advertisement