ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ రైతుల్లో మరో రైతు బుధవారం ఉదయం మృతిచెందాడు.
అమృతలూరు : ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ రైతుల్లో మరో రైతు బుధవారం ఉదయం మృతిచెందాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా అమృతలూరు మండలం కోరుతాడిపర్రులో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. భూములను దేవాదాయశాఖ భూములుగా నిర్ణయించడంతో ఆరుగురు రైతులు భూములు కోల్పోయారు.
దేవాదాయశాఖ నిర్ణయంతో మనస్తాపానికి గురైన ఆరుగురు రైతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం సత్తయ్య అనే ఓ రైతు మృతిచెందాడు. ఇదిలాఉండగా, ఈ విషయంలో చికిత్స పొందుతూ ఇప్పటికే ఇద్దరు రైతులు మృతిచెందిన విషయం తెలిసిందే.