endowment ministry
-
త్వరలోనే పాసుపుస్తకాలు
సాక్షి, హైదరాబాద్: దేవాలయ భూములకు పాసుపుస్తకాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. దేవాదాయ శాఖ అధికారులు గుర్తించిన భూములకు ఆయా దేవాలయాల మీదే పాసుపుస్తకాలివ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ మేరకు సమీకృత భూరికార్డుల నిర్వహణ (ఐఎల్‌ఎంఆర్‌ఎస్) వెబ్సైట్లో ఆ భూములకు డిజిటల్ సంతకాలు చేసే అధికారాన్ని తహసీల్దార్లకు అప్పగించింది. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్లు మ్యాపింగ్ చేసిన సర్వే నంబర్లకు తహసీల్దార్ల లాగిన్ల ద్వారా డిజిటల్ సంతకాలు చేయాలని, ఈ సంతకాలు పూర్తయిన భూములకు పట్టాదారు పాసుపుస్తకం కమ్ టైటిల్‌డీడ్ ఇస్తామని సీసీఎల్ఏ ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయం క్షేత్రస్థాయి రెవెన్యూ వర్గాలకు సమాచారం పంపింది. దేవాదాయ భూములకు పాసు పుస్తకాలివ్వడంతో పాటు ప్రక్షాళనలో భాగంగా పెండింగ్‌లో ఉన్న పలు అంశాలను కూడా పరిష్కరించే విధంగా అదనపు ఆప్షన్లు ఇచి్చంది. దీంతో పెండింగ్ సమస్యలకు పరిష్కా రం లభిస్తుందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. -
హడావుడిగా మార్పు వెనుక..
సాక్షి, అమరావతి: దేవదాయ ధర్మధాయ శాఖ బాధ్యతలను ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి అదనంగా అప్పగించారు. బీజేపీకి చెందిన మంత్రులు మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్‌లు ఈ నెల 8వ తేదీన తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాత దేవదాయ శాఖతో పాటు వైద్య ఆరోగ్య శాఖలు రెండింటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దనే ఉంచుకున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వద్ద ఉన్న పదవుల్లో దేవదాయ శాఖను మాత్రం కేఈ కృష్ణమూర్తికి అదనంగా అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, దేవదాయ శాఖ హడావుడిగా మరొకరి అప్పగించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం వెనుక రాజకీయ వర్గాల్లో అసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచీ దేవదాయ శాఖ బాధ్యతలు చేపట్టిన నాయకులు పలువురు కొద్ది కాలానికే పదవీచ్యుతులు అవుతారన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ పదవిని తన వద్ద ఉంచుకోవడానికి ఏ మాత్రం ఆసక్తి చూపలేదని తెలుగుదేశం పార్టీ వర్గాలే అంటున్నాయి. -
భూములు కోల్పోయిన మరో రైతు మృతి
అమృతలూరు : ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ రైతుల్లో మరో రైతు బుధవారం ఉదయం మృతిచెందాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా అమృతలూరు మండలం కోరుతాడిపర్రులో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. భూములను దేవాదాయశాఖ భూములుగా నిర్ణయించడంతో ఆరుగురు రైతులు భూములు కోల్పోయారు. దేవాదాయశాఖ నిర్ణయంతో మనస్తాపానికి గురైన ఆరుగురు రైతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం సత్తయ్య అనే ఓ రైతు మృతిచెందాడు. ఇదిలాఉండగా, ఈ విషయంలో చికిత్స పొందుతూ ఇప్పటికే ఇద్దరు రైతులు మృతిచెందిన విషయం తెలిసిందే.