ఏ ఒక్క రైతుకు పరిహారం అందలేదు | No Single Farmer Has Received Compensation | Sakshi
Sakshi News home page

ఏ ఒక్క రైతుకు పరిహారం అందలేదు

Published Wed, Mar 13 2019 3:10 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

No Single Farmer Has Received Compensation - Sakshi

వ్యవసాయశాఖ అధికారితో మాట్లాడుతున్న రైతు సతీష్‌ 

సాక్షి, పామర్రు : మండల పరిధిలోని రిమ్మనపూడి శివారు ప్రాంతమైన అంకామ్మగుంట వద్ద గల బాడవాలోని 70 ఎకరాల పోలంలో ఒక్క ఎకరానికి కూడా పంట నష్ట పరిహారం రాలేదని ఆ గ్రామానికి చెందిన రైతు నేతల సతీష్‌  ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తుఫాను కారణంగా కురిసిన వర్షాలకు పంట నష్ట పోయిన రైతులకు నష్ట పరిహారం ఇస్తున్నారని తెలిపి  వ్యవసాయశాఖ కార్యాలయం వద్దకు వచ్చాడు.

అక్కడ ఉన్న లిస్టులో అంకామ్మగుంట  బాడవా పొలం సుమారు 70 ఎకరాలను 15 మంది రైతులు సాగు చేయడం జరుగుతోంది. ఈ పొలాలకు  సంబంధించిన ఏ ఒక్క రైతుకు పంట నష్టం నమోదు రాలేదన్నారు

.  
బడా రైతులకు ఎలా వచ్చాయి.. ?
గ్రామంలోని బడా రైతుల పేర్లు మాత్రమేలిస్టులో వచ్చాయని,  సన్నా చిన్న కారు రైతుల పేర్లు మాత్రం ఒక్కటీ కూడా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి  వచ్చిన పంట నష్ట నమోదు అధికారులైన వీఆర్‌ఏ, ఎంపీఈవోలను ప్రసన్నం చేసు కున్న వారి పొలాలకు మాత్రమే నష్టం రాయడం జరిగిందని, ప్రసన్నం చేసుకోలేని వారి పోలాలు రాయలేదని  తెలిపారు.

అందువల్ల నిరుపేదలైన అంకామ్మగుంటలోని బాడవా పోలాలకు నష్టం నమోదు చేయలేదని తెలిపారు. ఈ విషయమై పామర్రు ఏడీఏ పద్మజకు ఫిర్యాదు చేయడంజరిగిందన్నారు. స్పందించిన ఏడీఏ అంకామ్మగుంట వద్ద గల బాడవా పొలంలో పంట నష్ట పోయిన రైతుల వివరాలను  సంబంధించిన పత్రాలను తీసుకుని అర్జీని ఆన్‌లైన్‌లో పెట్టాలని ఆదేశించారు. రైతులకు న్యాయంజరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement